ఋణం తీరేలా

-చందలూరి నారాయణరావు

కాస్త చూడు
కళ్ళను తలుపు తట్టి
లోపలికి..

రోజూ కలలో
నీ గొంతు గుర్తులే
నీ చూపు స్పర్శలే…

ఎక్కడికి వెళ్ళినా
ఏ దూరంలో ఉన్నా
రాత్రి ఒడికి చేరక తప్పదు

ఏదో కల
చిటికిన వ్రేలితో
వేకువ దాకా నీతోనేగా

మనసు కలవరింత
ఒక్కో కవిత రూపంలో
ఋణం తీరేలా

*****

Please follow and like us:

One thought on “ఋణం తీరేలా (కవిత)”

  1. కళ్ళను తలుపు తట్టి ,చాల బాగా రాసారు , కాను రెప్పలను తలుపు లాగా ఉపయోగించారా

Leave a Reply

Your email address will not be published.