ప్రమద- జిలానీ బాను

ప్రమద జిలానీ బాను -నీరజ వింజామరం  అక్షరాల ద్వారా మాట్లాడిన మౌన విప్లవం జిలానీ బాను ఇక లేరు. ఈ వాక్యం చదివిన క్షణంలోనే మనకు ఒక లోటు తెలుస్తుంది — అది కేవలం ఒక రచయిత్రి మరణం కాదు; ఒక సున్నితమైన స్వరం మౌనమైందన్న భావన. కానీ ఆమె అక్షరాలు మాత్రం మౌనమవ్వలేదు. అవి ఇంకా మనలో మాట్లాడుతూనే ఉన్నాయి — మెల్లగా, లోతుగా, ప్రశ్నలతో. ఈ నెల ఆమె జ్ఞాపకార్థం ఈ స్మారక వ్యాసం. […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-78

కనక నారాయణీయం -78 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మగారు పడసాలలోనే ఉన్నారు. వల్లంపాటిని చూస్తూనే నవ్వుతూ అడిగారు,’వచ్చిన పని ఏమైందప్పా?’ అని! ముఖం వేలాడేసుకుని ఉన్న వల్లంపాటిని చూస్తూనే అర్థమైపోయిందామెకు. పనికాలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు వల్లంపాటి. ‘ఇంతకూ, నువ్వు తెచ్చిన ఆ వ్రాత ప్రతి ఎక్కడ?’ అడిగారు శ్రీమతి పుట్టపర్తి. వెంకట సుబ్బయ్య బ్యాగ్ లో నుంచీ పుస్తకం తీస్తూ ఉంటే ఇంతలో తులజ లోపలికి వచ్చింది. వెంకట సుబ్బయ్యను చూడగానే,’బాగున్నారా అన్నా?’ అంది. ‘బాగున్నానమ్మా! ఇంతకూ […]

Continue Reading

చిత్రం-72

చిత్రం-72 -గణేశ్వరరావు ప్రముఖ చిత్రకారుడు చంద్రను తెలియనివాళ్ళు వానలో తడవని వాళ్ళు ఉండరు. చంద్ర కథకుడు కూడా. అతని కథలు చదవడం, అతని బొమ్మలు చూడటం వేరు.. వేరు; చంద్రను ప్రముఖుల దృక్కోణంనుంచి చూడటం వేరు. స్థూలంగా వాళ్ళందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఒకటే – చంద్ర గొప్ప చిత్రకారుడు, కానీ ఆ విషయాన్నే ఒక్కొక్కరు ఒక్కక్క రీతిలో వాటిని వెలిబుచ్చుతారు. ఒకే ఇతివృత్తాన్ని తీసుకొని పదిమంది రాసినప్పుడు కథా శిల్పం ఒకేలా ఉండదు కదా! అందరూ చంద్ర […]

Continue Reading
Posted On :

ప్రమద- ఇందిరా ధనరాజ్ గిర్

ప్రమద ఇందిరా ధనరాజ్ గిర్ -నీరజ వింజామరం  ఆమె ఒక సంపన్నమైన రాజకుటుంబంలో పుట్టింది. ఒక విప్లవ కవిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. బహుభాషా కోవిదురాలు. కవిత్వం చెప్పడంలో అందె వేసిన చేయి. ఒకే  ఇంట్లో ఇద్దరు కవులు ఉండకూడదని తనకు ప్రాణమైన కవిత్వాన్ని వదిలేసింది. ఇలా పరస్పర భిన్నాలను తన వ్యక్తిత్వంలో ఇమడ్చుకున్న అద్భుత మహిళ శ్రీమతి ఇందిరా దేవి ధనరాజ్ గిర్. శ్రీమతి ఇందిరా దేవి ధనరాజ్ గిర్ భారతీయ సాహిత్య రంగంలో, ముఖ్యంగా […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-22 డా||కె.గీత కాలమ్స్ “అనగనగా అమెరికా”

ఈ తరం నడక – 22 డా||కె.గీత కాలమ్స్ “అనగనగా అమెరికా” -రూపరుక్మిణి అందరికీ రాబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! సప్త సముద్రాల ఆవలికి చేసే ప్రయాణంలో ఎన్నో ఆశలతో భవిష్యత్తుని అందంగా నిర్మించుకోవాలన్న సంకల్పంతో ప్రయాణించే వారే ఎక్కువ. అమెరికా జనాభాలో తెలుగువారి లోగిళ్ళు ఎక్కువే. తెలుగు ప్రాంతం నుంచి అమెరికా వలస వెళ్లిన అనేక కుటుంబాలు వున్నాయి. అర్థ శతాబ్దం నుండి ఈ ప్రయాణం, ఈ వలస ఎక్కువగానే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 23 (సురటి రాగం)

రాగసౌరభాలు-23 (సురటి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులారా! నమస్తే. గత రెండు సంవత్సరాలుగా ఏకాధాటిగా సాగుతున్న రాగ సౌరభాలు వ్యాస పరంపరని ఆదరిస్తున్న అందరికి అనేక ధన్యవాదములు.  మంగళకరమైన సురటి రాగ వైభవంతో ఈ వ్యాసావళికి మంగళం పలుకుతున్నాను. రాగాలు అనంతాలు. లక్షల సంఖ్యలో ఉన్న రాగాలలో కొన్నింటిని నా శక్తి మేరకు పరిచయాన్ని అందించాను. ఈ నెలతో ఈ పరిచయాలకు స్వస్తి. సురటి రాగం పురాతనమైనదే. కొన్ని సంప్రదాయ కీర్తనలు, మంగళ హారతులు […]

Continue Reading

కనక నారాయణీయం-77

కనక నారాయణీయం -77 –పుట్టపర్తి నాగపద్మిని బైట వల్లంపాటి వెంకట సుబ్బయ్య నిలుచుని ఉన్నాడు. ‘నువ్వా నాయనా!రా రా! ఇంట్లో అంతా బాగున్నారా?’ ఆప్యాయంగా అడిగిందామె. ‘బాగున్నారమ్మా! అయ్యగారు ఉన్నారామ్మా ఇంట్లో?’ ‘లేరయ్యా, రామకృష్ణ సమాజంలో ఉన్నారేమో!’ ‘సరేనమ్మా! నేనక్కడికే  పోతాను.’ ‘ఊరికేనా, ఏమైనా పనుందా?’ యధాలాపంగా అడిగిందామె. తాను తెచ్చిన అరటి పళ్ళ సంచీని అమ్మకు అందిస్తుంటే ‘ఎందుకయ్యా ఇవన్నీ?’ అన్నదా తల్లి. ‘పెద్దవాళ్ళ దగ్గరికి వట్టి చేతులతో పోకూడదంట, మా అమ్మ అంటూ ఉంటుంది. […]

Continue Reading

బొమ్మల్కతలు-37

బొమ్మల్కతలు-37 -గిరిధర్ పొట్టేపాళెం జీవితం ఒంటరి ప్రయాణమే. ఒంటరిగా రావటం, ఒంటరిగానే వెళ్ళి పోవటం. రాకపోకల మధ్య నీ ఊపిరి నీదే, నీ అడుగులు నీవే, నీ నడక నీదే, నీ పయనం నీ గమ్యం రెండూ నీవే. నువ్వేసే అడుగులూ, నువు నడిచే దార్లూ ఒంటరివే. తెలియని గమ్యం వైపు నువ్వేసే నీ అడుగులే నీ దిశ నిర్దేశ మార్గాలు. నీ పయనంలో నువు నడిచే బాటలు, ఆ బాటల్లో నీకెదురయ్యే ప్రదేశాలూ, నువు కలిసే […]

Continue Reading

చిత్రం-71

చిత్రం-71 -గణేశ్వరరావు క్రిస్టియన్ మత సంప్రదాయంలో ‘ ఐకన్ ‘ చిత్రకళకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మతాధికారులు బైబిల్ కు సంబంధించిన కథల చిత్రాలను, దైవ రూపాలను చిత్రించమని చిత్రకారులని కోరేవారు. చిత్రకారులకు లొంగని వస్తువంటూ వేరే లేదు. వారు రూప చిత్రాలను అద్భుతంగా చిత్రించే వారు. ఆ ‘ ఐకన్ ‘ లలో కేవలం ముఖాలను మాత్రం చిత్రించే వారు. వాటిని చర్చీలు, జనం ఆదరించే వారు. అవి ప్రజల్లో భక్తి భావాన్ని కలగజేసేవి. […]

Continue Reading
Posted On :

ప్రమద- రాజమాత గాయత్రీ దేవి

ప్రమద అందం, హుందాతనం కలబోత – రాజమాత గాయత్రీ దేవి -నీరజ వింజామరం  జీవితంలో ఒక్కసారి ఆయనను చూస్తే చాలనుకునే కోట్లాది అభిమానులు గల నటుడు అమితాబ్ బచ్చన్ . అలాంటి వ్యక్తి తన విద్యార్థి దశలో, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో జైపూర్ పోలో గ్రౌండ్‌కు దొంగచాటుగా వెళ్లేవారట. అది పోలో మ్యాచ్ చూడటం కోసం కాదు, ,  కేవలం ఆమెను చూడడం కోసమే. ఆమె మరెవరో కాదు మహారాణి గాయత్రీ దేవి . జైపూర్ […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-21- వసంత నెల్లుట్ల

ఈ తరం నడక – 21 వసంత మనో పతాకం -రూపరుక్మిణి కాలంతో అన్వేషణ చేస్తూ నడచి వచ్చిన దారిని పురాస్మృతులుగా చేసుకుంటూ అలుముకున్న చీకట్ల మధ్య పున్నమి, వేకువల అస్తిత్వపు వెలుగుల్ని విరజిమ్ముతూ… ముఖంపై  ఏర్పడ్డ ముడతల్లో గాయాల చెమ్మని తోడుకుంటూ చేసే కవిత్వ ప్రయాణమే ఈ చివరాఖరిజవాబు. వసంత గారు జీవిత ప్రయాణంలో ఓ ఆడపిల్లగా ఎదిగిన దగ్గర నుండి కవిత్వం తన ఇంటిలో  కలాన్ని ఆయుధంగా చేసుకున్న((వి.వి)(వసంత గారి మామయ్య))విప్లవ గీతమై ప్రవహిస్తుంటే […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 22 (వసంత రాగం)

రాగసౌరభాలు-22 (వసంత రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు. అందరు నూతన ప్రణాళికలతో క్రొంగొత్త ఆశల తోరణాలు అల్లే ఉంటారుగా! వసంత ఋతువు కన్నా ముందే వసంత శోభలను మీ ముంగిళ్లకు తెచ్చే ఉంటారు. అందుకే ఈ మాసం ఆశావహ దృక్పధాన్ని పెంచి, ఉత్సాహాన్ని నింపే వసంత రాగం గురించి తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం? ఇది పురాతన రాగమే. సుమారు 1000 సంవత్సరాల ముందుదే. సంగీత రత్నాకరం, సంగీత సమయసారం […]

Continue Reading

గజల్ సౌందర్యం-7

గజల్ సౌందర్యం- 7 -డా||పి.విజయలక్ష్మిపండిట్ విశ్వపుత్రిక గజల్ నా మనోరథ సారధివి నీవేలే ఓమార్మిక! నా యదలయ వారధివి నీవేలే ఓమార్మిక! కామక్రోధమధ మాఛ్చర్యాల పుట్ట మనసు అదుపు చేసే వీరుడివి నీవేలే ఓమార్మిక! పాపపుణ్యం సుఖం దుఃఖం నీటిమూటలు మా కర్మల నిర్ణయ కర్తవి నీవేలే ఓమార్మిక! బుద్బుదప్రాయ జీవితాన న్యాయాన్యాయాల గెలుపు ఓటముల నిర్ణేతవి నీవేలే ఓమార్మిక! చావుపుట్టుక లేని ఆరని వెలుగుల విశ్వమా ఈ అనంత కాలాతీతుడవి నీవేలే ఓమార్మిక! భువిపై విధిచేతి […]

Continue Reading

కనక నారాయణీయం-76

కనక నారాయణీయం -76 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మ నీళ్ళు పట్టుకొచ్చి పుట్టపర్తి దగ్గరున్న టెబుల్ మీద పెట్టి, కాస్త దూరాన నిలుచుని అంది. ‘శంఖవరం సంపద్రాఘవాచార్యుల వారి భార్య వచ్చి పోయిందిప్పుడే! వాళ్ళమ్మాయి బెంగుళూరులో పెద్ద చదువుకోసం పోతూ ఉందంట! మీ దంపతులొచ్చి ఆశీర్వదించాలమ్మా! అనింది. వచ్చే శుక్రవారం సాయంత్రం రమ్మని చెప్పిందామె! చాలా కలుపుగోలు మనిషి. భేషజమేమాత్రమూ లేదు పాపం!’ ఆమె మాటలకు తల పంకిస్తూ అంగీకారం తెలిపారు పుట్టపర్తి. దూరపు చుట్టం యీ శంఖవరం సంపద్రాఘవాచార్యులు. […]

Continue Reading

బొమ్మల్కతలు-36

బొమ్మల్కతలు-36 -గిరిధర్ పొట్టేపాళెం విలువిద్య నేర్చుకోవటానికి ‘గాండీవం’ అవసరం లేదు. రెండు వెదురు పుల్లలు, కొంచెం నార దొరికితే చాలు. విల్లు తయారు చేసుకుని ఆ విల్లు చేపట్టిన విలుకాడి చేతిలోని నేర్పు, అకుంఠిత దీక్ష, పట్టుదలతో చేసే విద్యా సాధన చాలు. విలువిద్య నేర్పు సాధనతో వస్తుంది తప్ప, ఎక్కుపెట్టే బాణంతో రాదు. విద్య నేర్పించే గురువుంటే మెళకువలు నేర్చుకోవడం సులువవుతుంది, లేదంటే ఏకలవ్య విద్యాభ్యాస సాధనే నేర్చుకోవాలన్న పట్టుదలకి గురువు. నా రంగుల బొమ్మల విద్యాభ్యాసానికి ఊతగా నాకు దొరికిన నాసిరకం ఆరు […]

Continue Reading

చిత్రం-70

చిత్రం-70 -గణేశ్వరరావు అజంతా గుహల్లో అద్భుతమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి. వాటిలో “మహారాణీ అలంకరణ దృశ్యం” చెప్పుకోదగ్గ చిత్రం, ఇది చిత్ర కళకు వేగుచుక్క లాంటిది. ఇందులో రూప నిర్మాణం అద్భుతంగా కుదిరింది, ఈ చిత్రంలోని వాతావరణం ఎవరినైనా సమ్మోహితులను చేస్తుంది. చిత్రం మధ్యలో కనిపిస్తున్న మహారాణి (శాతవాహన, బాదామి చాళుక్యుల రాణీలలో ఎవరైనా కావచ్చు) రూపం, నిల్చున్న భంగిమ ముందుగా అందర్నీ ఆకర్షిస్తుంది. అజంతా చిత్రకారులకు అలవాటు అయిన ప్రత్యేక శైలిలో ఇది చిత్రించబడింది. అందుకే […]

Continue Reading
Posted On :

ప్రమద- బచేంద్రి పాల్

ప్రమద సాహస వనిత బచేంద్రి పాల్: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శమూర్తి -నీరజ వింజామరం  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నబచేంద్రి పాల్ జీవితం అకుంఠిత దీక్షకు, తిరుగులేని ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. హిమాలయాల ఒడిలో పుట్టి, పెరిగి, ఆ పర్వతాలనే తన జీవిత లక్ష్యంగా మలచుకున్న ఆమె ప్రయాణం, ప్రతి భారతీయ మహిళకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. బచేంద్రి పాల్ 1954 మే 24న […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-20- షేక్ సలీమా

ఈ తరం నడక – 20 స్ఫూర్తి -రూపరుక్మిణి స్ఫూర్తి ఎక్కడో దొరకదు. మనకు మన చుట్టూ ఉన్న జీవితాలే అద్ధంలా అర్థవంతమైన ఆలోచనను కలిగిస్తాయి. అనడానికి ఉదాహరణగా ఉంటాయి షేక్.సలీమా కథలు. సాధారణంగా స్త్రీ అణిచివేతల్లోనే ఉంటుంది. పురుషాధిక్య ప్రపంచం నుండి వేరుపడలేక అమ్మగా, ఆడపిల్లగా అణగారిన పక్షం చేరిపోతుంది. సర్వసాధారణమైన స్త్రీ జీవితంలో కొన్ని వెలుగులు కావాలి, ఆ వెలుగు విద్యతోటే వస్తుందని బలంగా నమ్మి, తన చుట్టూ ఉన్న జీవితాల్లో నుండి తన […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 21 (ఖమాస్ రాగం)

రాగసౌరభాలు-21 (ఖమాస్ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ అభివందనం. ప్రతి రాగము ఏదో ఒక రసాన్ని పోషిస్తుంది. నవరసాలలో ఒక రసం శృంగార రసము. ఈ రసాన్ని అద్భుతంగా పోషించగల రాగం ఖమాస్. అందుకే మన వాగ్గేయకారులు జావళీలకు ఈ రాగాన్ని ఎక్కువగా ఎంచుకున్నారు. ఈ ఖమాస్ రాగ విశేషాలు ఈ మాసం ప్రత్యేకం. ఖమాస్, ఖమాజ్, కమాచి ఇత్యాది పేర్లతో పిలువబడే ఈ 72 మేళకర్త పథకం కన్నా పురాతనమైనది. పూర్వం కమాచి […]

Continue Reading

కనక నారాయణీయం-75

కనక నారాయణీయం -75 –పుట్టపర్తి నాగపద్మిని చిలుక ద్వాదశి రోజు. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టి, శాస్త్రోక్తంగా పూజ, శ్రీ సూక్త, పురుష సూక్తాలు చెప్పుకుని, తులసి చెట్టు మొదల్లో పెట్టిన లక్ష్మీనారాయణ విగ్రహాల మీద పూలు, అక్షతలూ వేసి, పాటందుకుంది కనకమ్మ.         బృందావనమే మందిరమైన ఇందిర శ్రీ తులసీ!        నందనందనుని ప్రియ సతివై అందముగా మా ఇంటను నెలకొన్న….బృందావనమే… గృహమునకందము బృందావనమూ  దేహమునకు   తులసిదళమూ        నీవున్నదె […]

Continue Reading

బొమ్మల్కతలు-35

బొమ్మల్కతలు-35 -గిరిధర్ పొట్టేపాళెం నూతనం ఎప్పుడూ ఉత్సాహమే. కొత్త సంవత్సరం సమీపిస్తుందంటే ఏదో తెలీని నూతనోత్సాహం ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవిస్తుంది. రోజూ ఉదయించే సూర్యుని లేత కిరణాలే ప్రతి జీవిలోనూ నింపే ఊపిరి ఉత్సాహాలు. ప్రతి సంవత్సరం నూతనంగా చిగురిస్తూ చెట్లు సంతరించుకునే పచ్చని వసంతం కోయిల గానంకి ఇచ్చే జీవనోత్సాహం. జడి వాన చినుకులతో వచ్చి చేరే కొత్త నీరే నిశ్చల నదినీ ఉత్సాహంగా పరవళ్ళు తొక్కించే ప్రవాహ శక్తి. పాత కొత్తల కలయికే జీవన […]

Continue Reading

చిత్రం-69

చిత్రం-69 -గణేశ్వరరావు ఆఫ్రోడైట్ గ్రీకు పౌరాణిక ప్రేమ దేవత, రోమన్లు ఈమెను వీనస్ పేరుతో పిలుస్తారు. మనకూ ఉన్నారు శృంగార దేవతలు మన్మధుడు, రతీదేవి! పౌరాణిక ఇతివృత్తాలను తీసుకొని ఆధునికంగా వాళ్ళ రూపాలను చిత్రించిన వారిలో ముఖ్యడు 19 వ శతాబ్దపు అడాల్ఫ్ విలియం బూగేరో. వీనస్ దేవతను ఆయన ఇలా చిత్రించాడని అంటారు, అయితే నేను పోస్ట్ చేసిన చిత్రం ఆయన చిత్రానికి డిజిటల్ రూపం. చిత్రంలో గొప్పతనం వివరించడం అసాధ్యం. మాటల్లో చెప్పలేని ఆకర్షణ […]

Continue Reading
Posted On :

ప్రమద- శకుంతలా దేవి

ప్రమద మ్యాథ్స్ తో మ్యాజిక్ చేసిన మానవ కంప్యూటర్ – శకుంతలా దేవి -నీరజ వింజామరం            సర్కస్ లో పని చేసే ఒక  వ్యక్తి తన మూడేళ్ల కూతురితో కార్డ్స్ ఆడుతున్నాడు. ప్రపంచాన్నే తన గారడీలతో మెప్పించ గల ఆ వ్యక్తి , మాటలు కూడా సరిగ్గా రాని తన చిన్నారి కూతురిచేతిలో ఓడిపోతున్నాడు. ఆ క్షణంలో కన్న ప్రేమతో పొంగిపోయి నప్పటికీ, తన కూతురు ఒక అద్భుతమని అతను […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-19- మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం”

ఈ తరం నడక – 19 మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం” -రూపరుక్మిణి వర్తమానమంతా యుద్ధ గీతాల్ని ఆలపిస్తూ, ఆలకిస్తూ బ్రతకాల్సి రావడం నేటి దుర్భరమైన పరిస్థితి. ఎటు చూసినా యుద్ధ విద్వంసమే. అధికారం కోసం ఒకడు పన్నిన కుట్రలో అనేక మందిని ఈ భూమి పొరల్లో కప్పి వేయబడుతున్నారన్న వాస్తవాన్ని గొంతెత్తి పలికేందుకు కూడా ఈ అధికారం అవకాశాన్ని లేకుండా చేస్తోన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. యుద్ధాన్ని కోరుకున్న వాడు,  ప్రకటించిన వాడు యుద్ధభూమికి రాడు. […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 20 (శ్రీ రంజని రాగం)

రాగసౌరభాలు-20 (శ్రీ రంజని రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సన్మిత్రులందరికి శుభాభినందనలు. క్రిందటి నెల మనమందరం ఘనంగా ధనలక్ష్మీ దేవిని ఆహ్వానించి,  పూజించి, రంగు రంగుల దివ్వెల కాంతులలో దీపావళి పర్వదినం చేసుకున్నాము. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాస పూజలకు శ్రీకారం చుట్టాము కదా? లక్ష్మీ అమ్మవారిని రంజింపజేసే మరియొక రాగం, శ్రీరంజని రాగ విశేషాలు ఈ నెల మీకోసం. ఈ రాగం మరీ పురాతనమైనది కాదు. 72 మేళకర్తలని ఏర్పరచి, ఒక్కొక్క రాగంలో జన్యరాగాలను […]

Continue Reading

గజల్ సౌందర్యం-6

గజల్ సౌందర్యం- 6 -డా||పి.విజయలక్ష్మిపండిట్ తెలుగు గజల్ రచనలో భావాలు, భాష, చమత్కారం వంటి అంశాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇది తెలుగు గజల్‌కు ఒక ఆధునిక రూపాన్ని ఇస్తోంది. ప్రస్తుతం చాలామంది కవులు తమ గజళ్లను వారు స్వయంగా లేదా గాయకులతో పాడించి, వాటిని YouTube , ఇతర సామాజిక మాధ్యమాల్లో వీడియోలుగా పెడుతున్నారు. ఇది విస్తృతంగా తెలుగు గజళ్లను దృశ్య, శ్రవణ రూపంలో అందించే ఒక కొత్త మార్పు. తెలుగు గజళ్లను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తుంది. మేము స్థాపించిన […]

Continue Reading

కనక నారాయణీయం-74

కనక నారాయణీయం -74 –పుట్టపర్తి నాగపద్మిని           గట్టిగా స్వచ్చంగా నవ్వుతున్న పుట్టపర్తి నిర్మల వదనంలో ఏదో తెలియని ఆకర్షణ, వల్లంపాటిని నిరుత్తరుణ్ణి చేసింది.           నాన్నెప్పుడూ అంటూ ఉంటారు. సౌందర్య లహరిలో ‘శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం.. ‘ అనే శ్లోకం నిరంతర పారాయణం చేస్తూ ఉంటే, వాక్ శక్తినిస్తుందట ఆ తల్లి! ఆ కరుణ పుట్టపర్తి పై నిండుగా వర్షిస్తున్నదా జగన్మాత!’ […]

Continue Reading

బొమ్మల్కతలు-34

బొమ్మల్కతలు-34 -గిరిధర్ పొట్టేపాళెం            ఆట పాటలతో, బామ్మ బొమ్మల కథలతో హాయిగా సంతోషంగా గడిచి పోయే కాలం బాల్యం. జీవితంలో ఏ చీకూ చింతా లేని అందమైన, ఆనందమైన, అమరమైన అతి చిన్నదైన భాగం. ఎప్పుడు పెద్దవుతామా అనుకునేలోపే పెరిగి పెద్దయిపోతాం. ఆటలు పాటలు తగ్గుతూ, చదువు సంధ్యలు పెరుగుతూ, బడి, పుస్తకాలు, హోమ్ వర్కులు, పరీక్షలు ఇలా ఒక్కో క్లాస్ పైకెళ్ళే కొద్దీ చదువు బాధ్యతలే రోజులో ఎక్కువ […]

Continue Reading

చిత్రం-68

చిత్రం-68 -గణేశ్వరరావు ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరి యన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-18- మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి)

ఈ తరం నడక – 18 మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి) -రూపరుక్మిణి  చీకటిని చీల్చిన దివ్వెలు చీకటి మాటున వెలుగు ఎప్పుడూ ఉంటుంది. అనుమానమే లేదనడానికి నిదర్శనాలు నాకు చాలా ఎదురవుతూనే వున్నాయి. అటువంటి మరో నిదర్శనమే ఈసారి నే పరిచయం చేయబోతున్న పుస్తకం. కొన్ని పుస్తకాలు మనం ఎంచుకుంటాం. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన కోసమే మనల్ని చేరుతాయి. అటువంటి అరుదైన పుస్తకం అందుకోవడానికి నేను చాలా దూరమే ప్రయాణం చేయాల్సి […]

Continue Reading
Posted On :

ప్రమద- సుధా చంద్రన్

ప్రమద సుధా చంద్రన్ -నీరజ వింజామరం  నటరాజ పాదాల నాట్య మయూరి… రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఒక  17 ఏళ్ల అమ్మాయి, ‘జైపూర్ ఫూట్’ అనే కృత్రిమ పాదంతో మళ్లీ నృత్యం చేయగలనని ప్రపంచానికి నిరూపించింది. ఈ సాహసమే ఆమెను దేశానికి స్ఫూర్తి చిహ్నంగా నిలబెట్టింది. ఆమె కథ కేవలం వ్యక్తిగత విజయం కాదు, పట్టుదల ఉంటే వైకల్యం అనేది ఒక అడ్డంకి కాదని నిరూపించిన గొప్ప సామాజిక సందేశం. ఆమె మరెవరో కాదు, నాట్య […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 19 (చారుకేశి రాగం)

రాగసౌరభాలు-19 (చారుకేశి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై అపారంగా కురవాలని కోరుకుంటున్నాను. అందమైన కేశ సంపద కలిగిన అమ్మవారి ప్రతిరూపంగా ఈ నెల మనము చారుకేశి రాగం గురించిన విశేషాలు తెలుసుకుందాము. నేడు ఉపయోగించే గోవిందాచార్యుల వారి 72 మేళకర్తల పథకంలో ఈ చారుకేశి రాగం 26వ మేళకర్త. వెంకటమఖీ సాంప్రదాయ పథకంలో ఈ రాగం పేరు తరంగిణి. ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా ఈ […]

Continue Reading

గజల్ సౌందర్యం-5

గజల్ సౌందర్య – 5 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్స్ అందం వాటి సాహిత్య లోతులో ఉంటుంది. గజల్ నిర్మాణాత్మక కవితా రూపంలో ప్రేమ, విరహం, నిరీక్షణ , అస్తిత్వ ఆందోళన అనే సామాజిక ఇతివృత్తాలపై గజల్ కవుల యొక్క భావోద్వేగాల భావ రూప చిత్రాలు ,శబ్దాలంకారాల శ్రావ్యమైన లయ లో గజల్ అందం కనిపిస్తుంది, “ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆవిలువ కరువైతే అది కంట శోష “ అన్నారు సి. నా. రే. ఒక గజల్ లో. […]

Continue Reading

కనక నారాయణీయం-73

కనక నారాయణీయం -73 –పుట్టపర్తి నాగపద్మిని           ఇంటిలో ఆఖరి బిడ్డ చిన్నారి రాధ, మొట్టమొదటి దౌహిత్రుడు చి.బాణగిరి కృష్ణప్రసాద్ కేరింతల మధ్య రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. అల్లుడు రాఘవ నామకరణం తరువాత కర్నూల్ వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల ప్రవేశించింది.           రెండవ బిడ్డ తరులతకు కూడా హంపీ కమలాపురంలో సీమంతోత్సవం తరువాత, పుట్టింటికి రాక, పుట్టింటిలోనే సులభంగా కుమారుడు జన్మించటం, అల్లుడు రామానుజా చార్యులు […]

Continue Reading

బొమ్మల్కతలు-33

బొమ్మల్కతలు-33 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ అనంత విశ్వంలో మన ప్రమేయం లేకుండా సాగిపోయే ఒక అద్భుతం – కాలం. ఇందులో “మారనిది ఇది” అంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ ఇందులో ఇమిడి పోవాల్సిందే. ముందుకి పోతూ వెనకటితో పోలిస్తే ఎంతో కొంత మారి తీరాల్సిందే. అది జీవమైనా, సజీవమైనా, నిర్జీవమైనా. చెక్కు చెదరవు అనిపించే మనిషి జ్ఞాపకాలైనా, కాలంతో ఎంతో కొంత మారుతూ ముందుకి పోవాల్సిందే.         […]

Continue Reading

చిత్రం-67

చిత్రం-67 -గణేశ్వరరావు మోలీ క్రేబ్ఏపిల్ – కోపం నిండిన. చిత్ర కారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్ర కారుల్లా తను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీస్తూ వాల్ స్ట్రీట్ ఆక్రమణ.. వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్యగీతం గా మారింది – పోరాటవీరులను, శరణార్ధులను, పోలీసుల బాధితులను నల్లని రేఖా చిత్రాలుగా తన శైలిలో చూపించింది. ఎన్నో వాల్యూమ్ […]

Continue Reading
Posted On :

ప్రమద- విజయ నిర్మల

ప్రమద విజయ నిర్మల -నీరజ వింజామరం  వెండితెర చరిత్ర లో బంగారు అధ్యాయం – విజయ నిర్మల అది 1950 వ సంవత్సరం. ఒక చిన్నారిని కెమెరా ముందు నిలబెట్టారు. దర్శకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు ఇప్పుడు ఏడవాలి. తెలిసిందా ?” అన్నాడు. కానీ ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆప్యాయంగా అడిగినా, నటించి చూపించి, నకలు చేయమన్నా – ఫలితం లేదు. చివరికి దర్శకుడి స్వరం కఠినంగా […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-17- మానుషి (శాంతి బెనర్జీ)

ఈ తరం నడక – 17  మానుషి (శాంతి బెనర్జీ) -రూపరుక్మిణి  ఆత్మ అభిమానం ఆత్మస్థైర్యాన్ని నింపుకున్న కథలు మానవత్వం పరిమళించిన చూపు, మనుషుల్ని వారి సమయాన్నిబట్టి అనుకూల, అననుకూలతల మధ్య భేదాన్ని సమకూర్చుకునే శక్తి ఎంతటి అవసరమో చెప్పే కథలివి.           మారుతున్న కాలంలో మనము మారడం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. “మానుషి” ఇదో సంస్కృత పదం. స్త్రీ రూపానికి అంతర్మదనానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించారు అనుకుంటా.., […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 18 (శ్రీ రాగం)

https://youtu.be/b-pks4g6-Qc?si=1EN5OQo26b88gds2https://youtu.be/dDTyA-UN3r0?si=5UE3YfxNQ6lEgcuLhttps://youtu.be/hjXEbLewfQw?si=xCh-Fbr0oVb9No7e రాగసౌరభాలు-18 (శ్రీ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి             ప్రియమైన హితులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. శ్రీ కృష్ణ జయంతి, వినాయక చతుర్థి వంటి పండుగలు ఘనంగా జరుపుకున్నాము కదా! ఈ పవిత్రమైన మాసంలో శ్రీకరమైన, శుభప్రదమైన శ్రీరాగం విశేషాలు తెలుసుకుందాము. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా! ఒకే ఒక తెలుగు అక్షరం కలిగిన ఏకైక రాగం శ్రీరాగం. అంతేకాక ఘనరాగ పంచగుచ్చములోని ఆఖరి రాగము.        […]

Continue Reading

గజల్ సౌందర్యం-4

గజల్ సౌందర్య – 4 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజళ్ళలో భావ శిల్ప నిర్మాణ సౌందర్యాన్ని, అభివ్యక్తి తీవ్రతలను విశ్లేషించి బేరీజు వేయడం ఓ బృహత్  సాహితీ ప్రక్రియ. గజల్ కవుల కవి సమయాలు; ప్రేమ ప్రణయ వియోగాల అంతర్ మథనాల వ్యక్తీకరణ, భావ రూప శబ్దాలంకారాలు, నడక .., గాన లయలను ఆస్వాదిస్తూ గజల్ సౌందర్య విశ్లేషణ చేయడం ఓ వైవిధ్య భరిత అందమయిన అధ్యయన అనుభవం. “గజల్ సౌందర్యం “ వ్యాసాల ముఖ్య ఉద్దేశం గజల్ కవుల పరిచయం , వారి […]

Continue Reading

కనక నారాయణీయం-72

కనక నారాయణీయం -72 –పుట్టపర్తి నాగపద్మిని ఇప్పుడున్న నారాయణ బాబా గారు కడపకు ఎప్పుడు వచ్చినా రామ మూర్తిగారి ఇంటిలోనే వారి బస. వారి వద్ద సుమారు మూడు నాలుగు అడుగుల సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు, వాటికి పూజలు, వారితో వచ్చే శిష్య సమూహానికి ఏర్పాట్లూ – ఇవన్నీ రామమూర్తి గారు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. పుట్టపర్తికి ఉన్న పాండిత్యం, కవిగా వారికున్న కౌశలం – ఇవి కాకుండా  ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా […]

Continue Reading

చిత్రం-66

చిత్రం-66 -గణేశ్వరరావు 1954లో తాను దర్శకత్వం వహించిన ‘7 year itch’ సినిమా ఇంత చరిత్ర సృష్టిస్తుం దని బిల్ ఊహించి ఉండడు. మార్లిన్ మన్రో థియేటర్ నుంచి బయటకు వచ్చాక టామ్ తో ‘సబ్వే నుంచి గాలి ఎంత ఉధృతంగా వీస్తోందో తెలుస్తోందా? ‘ అని అన్నప్పుడు, కింద నుంచి వీచిన గాలికి ఆమె వేసుకున్న skirt కింది భాగం కొద్దిగా పైకి లేచి, ఆమె కాళ్ళను చూపించేటట్టు బిల్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడే […]

Continue Reading
Posted On :

ప్రమద- పి.వి.సింధు

ప్రమద పి.వి.సింధు -నీరజ వింజామరం  ప్రపంచ బ్యాడ్మింటన్ లో మెరిసిన తెలుగు తార – పి .వి. సింధు తల్లిదండ్రులిద్దరు జాతీయ స్థాయి వాలిబాల్ క్రీడాకారులు అనగానే సహజంగానే వారి పిల్లలు కూడా వాలిబాల్ నే ఎంచుకుంటారని ఎవ్వరైనా అనుకుంటారు. కానీ ఆమె బ్యాడ్మింటన్ ను ఎంచుకుంది. కేవలం ఎంచుకోవడమే కాదు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగాచరిత్రలో పేరు నమోదు చేసుకుంది. ఆమె మరెవరో కాదు మన తెలుగు తేజం పి. […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 17 (గౌళ రాగం)

రాగసౌరభాలు-16 (గౌళ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులకు నమస్తే. మనం ఇప్పటివరకు ఘన రాగాలలో మూడు రాగాల గురించి తెలుసుకున్నాము. అవి నాట, ఆరభి, వరాళి.  ఇంకా గౌళ, శ్రీ రాగాల గురించిన వివరాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా ఈ నెల గౌళ రాగ విశేషాలతో మీ ముందుకి వచ్చాను. మరి అవేమిటో తెలుసుసుకుందామా? ఈ గౌళ రాగం తూర్పు బెంగాల్ ప్రాంతంలోని గౌళ దేశంలో ఆవిర్భవించిందని ఒక కథనం. గౌళ అంటే గోకాపరుల […]

Continue Reading

గజల్ సౌందర్యం-3

గజల్ సౌందర్య – 3 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్‌పై సూఫీయిజం ప్రభావం: పర్షియన్ మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవితా రూపమైన గజల్‌పై సూఫీయిజం తీవ్ర ప్రభావాన్ని చూపిందని అంటారు చరిత్ర కారులు. అనేక గజళ్లు సూఫీ మార్మికవాదం నుండి ప్రేరణ పొంది ఆ దైవిక ప్రేమ మరియు ఆధ్యాత్మిక కోరిక యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. సూఫీ తత్వం ప్రభావం ,రూపకాలు, ప్రతీక వాదం మరియు భావోద్వేగ లోతులను గజళ్ళలో ఉపయోగించడం స్పష్టంగా కనిపిస్తుంది. సూఫీ కవుల […]

Continue Reading

కనక నారాయణీయం-71

కనక నారాయణీయం -71 –పుట్టపర్తి నాగపద్మిని           ‘దెబ్బ తగలగానే పరిగెత్తుకుని వచ్చి, వసంత టీచర్తో నోరంతా శుభ్రం చేయించి, రవికె మీద పడ్డా రక్తమూ తుడిచి, వెంటనే ఇంటికి పంపించేసినాను కూడా!! ఇంతకూ డాక్టర్ దగ్గరికి పోతున్నారా, నన్ను తీసుకుని వెళ్ళమంటారా?’           అడిగాడాయన. సమాధానం చెప్పేలోగా, వీధిలో వెళ్తున్న రిక్షా వాణ్ణి పిలిచి, నాగ చేయి పట్టుకుని పెద్ద మసీదు దగ్గరున్న ప్రభుత్వ […]

Continue Reading

బొమ్మల్కతలు-32

బొమ్మల్కతలు-32 -గిరిధర్ పొట్టేపాళెం            గీసే ప్రతి గీతలో ఇష్టం నిండితేనే, ఆ ఇష్టం జీవమై వేసే బొమ్మకి ప్రాణం పోసేది. గీత గీతలో కృషితో, పట్టుదలతో తనదైన శైలిలో పదును తేలటమే ఆర్టిస్ట్ ప్రయాణంలో వేసే ముందడుగుల్లోని ఎదుగుదలకి తార్కాణం. పొరబాట్లకీ తడబాట్లకీ ఎక్కువ ఆస్కారం ఉండే చేతి కళ డ్రాయింగ్ – చిత్ర లేఖనం. అందులో లైన్ డ్రాయింగ్ అయితే ఆ పొరబాట్లు తడబాట్లు మరింత తక్కువగా ఉండేలా […]

Continue Reading

కొత్త అడుగులు-14 (ఇది స్వేచ్ఛ గానం!)

కొత్త అడుగులు – 14 ఇది స్వేచ్ఛ గానం! (స్వేచ్ఛకు నివాళిగా ఈ వ్యాసాన్ని నెచ్చెలి తిరిగి అందజేస్తోంది!) – శిలాలోలిత ‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది నన్ను. ఎంతమంచిపేరు పెట్టారు ఆ అమ్మా నాన్నలు అన్పించేది. ఇన్నాళ్ళకు ఓ రోజున స్వేచ్ఛ కలిసి కవిత్వ సంపుటి వేస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందించేను. […]

Continue Reading
Posted On :

ప్రమద- పి. సుశీల

ప్రమద పి. సుశీల -నీరజ వింజామరం  వస్తాడు నా రాజు ఈ రోజు .. .. అని ఎదురుచూసినా ఝుమ్మంది నాదం .. అని ఒక మూగ గొంతు పలికినా శ్రీ రామ నామాలు శతకోటి .. అని భక్తి రసం లో ఓలలాడించినా ఆకులో ఆకునై పూవులో పూవునై .. అని ప్రకృతితో పరవశించినా అది పి. సుశీల గారికే చెల్లింది. తెలుగు లోగిళ్ళలో అనాదిగా ముగ్గులు వేసే ఆచార మున్నా , ముత్యమంత పసుపు […]

Continue Reading
Posted On :

గజల్ సౌందర్యం-2

గజల్ సౌందర్య – 2 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ సౌందర్యాన్ని ఇనుమడింప చేసేది హృదయ లోతుల్లో ఉండలేక పొంగి పొర్లి ఉప్పెనగా బయట పడే భావోద్వేగాల అక్షర స్వరూపం గజల్ . “గుండె గొంతుక తోన కొట్లాడుతాది కూర్చుండనీదురా కూసింతసేపు “.అని నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో అంటారు. అదేభావం Robert Frost poem నిర్వచనంలో వినిపిస్తుంది.Robert Frost famous American poet “ A poem is “never a put-up job. … It […]

Continue Reading

కనక నారాయణీయం-70

కనక నారాయణీయం -70 –పుట్టపర్తి నాగపద్మిని రోజులు పరుగులు పెడుతున్నాయి.           ఆ రోజు ఇంట్లో అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత, కనకమ్మ తళిహింట్లో వంట పూర్తి చేసుకుని సుందరాకాండ పారాయణం చేసుకుందామని అటు వెళ్తూ ఉంటే, గట్టిగా నాగ ఏడుపు. గాభరావేసి, తొందరగా పడసాలలోకి వచ్చేసరికి, నాగ మరింత గట్టిగా ఏడుస్తూ వచ్చి ఆమె కాళ్ళు చుట్టేసింది. తనతో పాటూ వచ్చిన తన స్నేహితురాలు చిట్టి (రామ […]

Continue Reading

బొమ్మల్కతలు-31

బొమ్మల్కతలు-31 -గిరిధర్ పొట్టేపాళెం            జీవితంలో ప్రతిదీ సహజత్వం కోల్పోయి కృత్రిమత్వం సంతరించుకునే కాలం వచ్చేసింది, మెల్లి మెల్లిగా అందరి జీవితాల్నీ మబ్బుల్లా కమ్ముకుంటోంది. ఆ మబ్బుల మసకల్లోకి కొంచెం కొంచెంగా ప్రవేశిస్తున్నాం. మన ప్రమేయం ఉన్నా లేకున్నా, అందులో ప్రవేశం తప్పనిసరి అవుతున్న పరిస్థితి. అమ్మమ్మలు, తాతయ్య లు, తాత, బామ్మల్ని సైతం అందులోకి తోసేస్తూ ఆ మబ్బులు కమ్ముకుని జీవితాల్ని కప్పేస్తున్నాయి. నిద్దర లేచాక గుడ్ మార్నింగ్ నుంచి […]

Continue Reading

ఈ తరం నడక-16- సింగిల్ ఉమెన్

ఈ తరం నడక – 16 సింగిల్ ఉమెన్ -రూపరుక్మిణి  కవిత్వం రెప్పపాటు కాలాన్ని కూడా బంధించగల గుండె ధైర్యం కలది. ఎన్ని వసంతాలు.., ఎన్ని పౌర్ణములు.., ఎన్ని సంధ్య వేళలు.., ఎన్ని ఉషోదయాలు.., వీటన్నింటి మధ్య నిట్టాడిగా నిలబడి నడివయసు నీరెండగాయం ఒకటి సలపరిస్తూనే ఉంటుంది. అదిగో అటువంటి ఓ గాయాన్ని జీవితకాలగమనంలో అరమరికలలోని.., ఓ పార్శ్వపు గుండె చప్పుడు.., అక్షరాల్లోకి ఒంపుకొని నా చేతుల్లో వాలింది. “రవిక” కవిత్వ సంపుటి. బోధి ఫౌండేషన్ వారి […]

Continue Reading
Posted On :

గజల్ సౌందర్యం-1 (ఈ నెల నుండి ప్రారంభం)

గజల్ సౌందర్యం (ఈ నెల నుండి ప్రారంభం) -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ అనేది ఉర్దూ భాషలో శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఒక కవితా కళారూపం. ఇది భావోద్వేగాలు మరియు మనో భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే కవితా రూపం. గజల్ ప్రత్యేకమైన కవితా ప్రక్రియ ఎందుకంటే కవులు తమ తీవ్రమైన వ్యక్తిగతమైన సులభంగా వ్యక్తీకరించలేని భావోద్వేగాలను మరియు భావాలను గజల్ ప్రక్రియ ద్వారా వ్యక్తపరచగలరు. గజల్‌ లోని ఆ శక్తివంతమైన మరియు ఉత్తేజకరమైన గజలియత్ నిర్మాణ శైలి వల్ల గజల్ […]

Continue Reading

ఈ తరం నడక-15- ఆర్. రమాదేవి కవిత్వం

ఈ తరం నడక – 15 ఆర్. రమాదేవి కవిత్వం -రూపరుక్మిణి  ప్రేమ పల్లకి ప్రేమ మైదానంలో ఓటమి ఎరుగని ఆట ఆడడం అంత తేలిక కాదు. అటువంటి ఆటని పదాల మాయాజాలంతో, గమ్మత్తయిన హృదయ గమకాలను పలికిస్తూ మనసు లోని తెరలని దించడం ఈ కవయిత్రి  కవితలకి అలవాటు. మనిషిని గెలిచి మనసుని గెలుస్తావా!! మనసును గెలిచి మనిషిని గెలుస్తావా!!అని ఇక్కడ ఓ ప్రశ్న వినపడుతుంది. ఎంతసేపు మనసు ఓ లోలకాన్ని మోస్తూ ఉంటుంది. .. […]

Continue Reading
Posted On :

ప్రమద- కిరణ్ బేడీ

ప్రమద లేడి సింగం – కిరణ్ బేడీ -నీరజ వింజామరం 1970లోనే ఢిల్లీ ట్రాఫిక్ మానవ సహనానికి పరీక్ష. కానాట్ ప్లేస్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ట్రాఫిక్ ఆఫీసర్ తో రేడియోలో మాట్లాడుతూ, “మేడం! ఓ వాహనం నిషేధిత ప్రదేశంలో పార్క్ అయింది. కాని ఇది ప్రభుత్వ నంబర్ ప్లేట్ ఉన్న ప్రత్యేక కారు. ఇది ప్రధాన మంత్రి గారి వాహనం అని డ్రైవర్ అంటున్నాడు.” అని చెప్పాడు . ట్రాఫిక్ ఆఫీసర్ వెంటనే […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 16 (వరాళి)

రాగసౌరభాలు-16 (వరాళి) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులారా! అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్చములోని మరొక ప్రత్యేకమైన రాగం వరాళి గురించిన వివరాలు తెలుసుకుందాము. ఈ రాగం గురించిన ఒక (మూఢ?)నమ్మకం ప్రచారంలో ఉంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. 1300 సంవత్సరాలకు ముందే ఈ రాగం ఉండేదనీ, వరటి అనే పేరుతో సంగీత మకరందం, సంగీత రత్నాకరం, సంగీత సమయ సారం వంటి ఉద్గ్రంధాలలో లిఖించబడినదనీ, కాలక్రమేణా వరాళిగా మార్పు […]

Continue Reading

కనక నారాయణీయం-69

కనక నారాయణీయం -69 –పుట్టపర్తి నాగపద్మిని మార్చ్ 5వ తేదీ. రాత్రి 8 గంటల సమయం.           కనకవల్లి పంటి బిగువున నొప్పి భరిస్తూ ఉంది. శేషమ్మ, తరులతా ఆమె దగ్గర లోనే ఉన్నారు. మంత్రసాని ఆజ్ఞతో వేడి నీళ్ళు కాస్తున్నారు, తులజా అరవింద్! నాగ భయం భయంగా ఇంట్లోకీ బైటికీ పరుగులు పెడుతూ ఉంది.           ఇదివరకు తెలియని దృశ్యం మరి!     […]

Continue Reading

బొమ్మల్కతలు-30

బొమ్మల్కతలు-30 -గిరిధర్ పొట్టేపాళెం           ఆగస్ట్ 15 1994, స్వాతంత్య్రదినోత్సవం రోజు, ఉదయం 4 గంటల సమయం. ఇరవయ్యవ శతాబ్దిలో పోరాటాలలో, త్యాగాలతో స్వాతంత్య్రం సాధించు కుని దాస్య విముక్తి పొందిన తర్వాత, సరిగ్గా అన్ని సంవత్సరాలు ముందుకి నడచిన భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తూ కంప్యూటర్ యుగంలోకి నెమ్మదిగా అడుగులు వేస్తున్న కాలం. మన భారతావనిని ఆక్రమించి రెండొందల ఏళ్లకి పైగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బ్రిటీష్ నేల మీదికి నా […]

Continue Reading

చిత్రం-65

చిత్రం-65 -గణేశ్వరరావు ఈ చిత్రం పేరు ‘పుష్పాలంకరణ’, 1923 లో సుప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు – తన భార్య సత్యవాణి సీమంతం చూసాక – వేసిన చిత్రం ఇది. ప్రసిద్ధి చెందిన తన నవల ‘అతడు ఆమె’ లో డా. ఉప్పల లక్ష్మణరావు ఈ చిత్రం గురించి, చిత్రకారుడు దామెర్ల చిత్రకళ గురించి హీరో హీరోయిన్లు చర్చించటం దీర్ఘంగా రాసారు.             అందమైన వేడుక కళ్ళకు కట్టే ఈ అద్భుతమైన వర్ణ […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-14- ఉలిపికట్టెలు – పి.జ్యోతి

ఈ తరం నడక – 14 ఉలిపికట్టెలు – పి.జ్యోతి -రూపరుక్మిణి  బంధాలు –  బలహీనతలు ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు. ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు […]

Continue Reading
Posted On :

ప్రమద – సునీత విలియమ్స్

ప్రమద అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్ -నీరజ వింజామరం ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ , ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 15 (నాటరాగం)

రాగసౌరభాలు-15 (నాటరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియా మిత్రులారా! శుభాకాంక్షలు. క్రితం నెల మనము ఘనరాగ పంచగుచ్ఛము లోని ఆరభి రాగ వైభవాన్ని తెలుసుకున్నాము కదా? ఈ నెల ఆ గుచ్ఛములోని మొదటి రాగమైన నాటరాగ సౌరభాన్ని ఆస్వాదిద్దాము. “ఆది నాట, అంత్య సురటి” అని నానుడి. కచేరిని నాట రాగంతో మొదలుపెట్టి సురటి రాగంతో సంపూర్ణం చేస్తే మంగళప్రదంగా ఉంటుందని పెద్దల ఉవాచ. పెళ్లిళ్లు పేరంటాలలో కూడా నాదస్వర విద్వాంసులు నాటరాగంలోని “మహా గణపతిమ్” కీర్తనతో […]

Continue Reading

కనక నారాయణీయం-68

కనక నారాయణీయం -67 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ  విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే […]

Continue Reading

చిత్రం-64

చిత్రం-64 -గణేశ్వరరావు  కొన్ని శతాబ్దాల నుంచి Mona Llsa గమ్మత్తైన చిరు నవ్వు ..కాలాతీతమైన ఆమె ఆకర్షణ గురించి అధ్యయనం జరుగుతూనే వుంది. నిజానికి అందరినీ కలవర పరుస్తున్నది ఆమె చిత్రం కానే కాదు, ఆ చిత్రం వెనుక ఉన్న కథ! చిత్రకళా రంగాన్ని అది ఒక కుదుపు కుదుపినప్పటికీ , దాని పరిణామం 30 x 21″, బరువు 8 కిలోలే. మోనాలిసా అంటే అర్థం ‘నా లేడీ లిసా ‘ అని. ధనవంతుడైన ఆమె […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-13- జస్ట్ ఏ హౌస్ వైఫ్ – కవితకుందుర్తి

ఈ తరం నడక – 13 జస్ట్ ఏ హౌస్ వైఫ్ -రూపరుక్మిణి  కపట ప్రపంచానికో బ్రేకప్           సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….           సొంతగడ్డకి […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 14 (ఆరభిరాగం)

రాగసౌరభాలు-14 (ఆరభిరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు  నామ సంవత్సరం విశ్వానీకంతటికి శాంతిని, సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్ఛములోని ఆరభి రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దామా? ఆరభి రాగం క్రీస్తు శకము 7వ శతాబ్దం నాటిదిగా భావించబడుతోంది. తమిళ సంప్రదాయంలో “పజాంతక్కం” గా పిలువబడేదట. పూర్వం షాడ్జి, అర్షభి, గాంధారి, మాధ్యమి, పాంచమి, దైవతి, నైషది అనే జాతుల ద్వారా […]

Continue Reading

కనక నారాయణీయం-67

కనక నారాయణీయం -67 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ  విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే […]

Continue Reading

బొమ్మల్కతలు-29

బొమ్మల్కతలు-29 -గిరిధర్ పొట్టేపాళెం         వెన్నెల రాత్రి – నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే – ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.     […]

Continue Reading

చిత్రం-63

చిత్రం-63 -గణేశ్వరరావు            ఫోటో చూసారుగా? మాయా .. మంత్రమూ .. తంత్రమూ లాంటివి ఇందులో ఏమీ లేవు.           ఈ టెక్నిక్ ను ‘Drostee” అంటారు. ఒక డచ్ కాఫీ ప్రకటనలో ఒకామె చేత్తో కాఫీ డబ్బా పట్టుకొని నిల్చొని వుంటుంది, ఆమె చేతిలో ఉన్న డబ్బా మీద ఉన్న చిన్న బొమ్మలో – అదే ఫోటో కనిపిస్తుంటుంది. అలా అప్పటి నుంచే ఒక ఫోటోలోని […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-12- కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్

ఈ తరం నడక – 12 కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్ -రూపరుక్మిణి ఆమె ‘వో’ కబ్జా పోటుకు గురి అయిన శెరువు  ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరితలు లిఖించినా, మారని మనుషుల్లో మనిషిగా గుర్తించబడాలన్న తపన, సమానత్వాన్ని పొందాలని పోరాడుతూ…నెగ్గుతూ, ఓడుతూ, కదిలి పోతూ, కదిలిస్తూ బతుకు కడలి అంచున వో… తూరుపు పొద్దుగా నిలబడిన ఆమెల నుండి ఎన్ని సంధ్యాసమయాలు దాటి వెళ్లినా!…, ఎన్ని అగచాట్ల చీకట్లు చుట్టూ అల్లుకున్నా!…, […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 13 (చక్రవాకం)

రాగసౌరభాలు-13 (చక్రవాకం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలందరికి శుభాకాంక్షలు. ఈ నెల మనసును కదిలించే చక్రవాకం రాగాన్ని గురించిన విశేషాలు తెలుసుకుందాము. చక్రవాకం 72  మేళకర్తల పథకానికన్నా మునుపే ఉన్న పురాతన రాగం. పూర్వ నామం వేగవాహిని. 16వ మేళకర్తగా ఇమడ్చటానికి వెంకటమఖీ రాగ నామానికి ముందు తోయ అనే అక్షరాలను చేర్చి తోయవేగ వాహినిగా నామకరణం చేశారు. దీక్షితులుగారు కూడా ఈ నామాన్నే గుర్తించారు. గోవిందాచార్యులు 72 మేళకర్తల నామాలను సరిచేసి మార్చినపుడు ఈ […]

Continue Reading

కనక నారాయణీయం-66

కనక నారాయణీయం -66 –పుట్టపర్తి నాగపద్మిని           పర్తల్ ముందు సిగ్గు పడింది. తరువాత చిత్రపటం చూసింది. నిజమే, ఇతడినే కదా తానూ ఆనాడు చూసింది? తన అందం ఒక రాజును ఆకర్షించేంత గొప్పదా? కానీ..? ఇతణ్ణి పెళ్ళి చేసుకుని తాను వెళ్ళిపోతే ఇంక పుట్టింటితో తన సంబంధం పూర్తిగా తెగిపోయి నట్టే! విజయనగరం పొరుగు దేశమైనా తమ రాజుకు శత్రుదేశం. ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలూ ఉండవు కానీ రాజుల […]

Continue Reading

చిత్రం-62

చిత్రం-62 -గణేశ్వరరావు  పేరంటం – కళాప్రపూర్ణ అంట్యాకుల పైడిరాజు (1919-1986)జంట కవులు పింగళి-కాటూరి ‘సంక్రాంతి’ ని వర్ణిస్తూ ఇలా చెబుతారు: ‘పచ్చపూల జనుప చేలకు ముత్యాలసరులు గూర్చిమిరపపండ్లకు కుంకుమ మెరుపు దార్చిబంతిపూల మొగములు అల్లంత విచ్చిమన గృహమ్ముల ధాన్య సంపదలు నిల్పిసరసురాలైన పుష్యమాసము వచ్చే’ .           సాతాని జియ్యరు మేలుకొలుపు పాట పాడుతూవుంటాడు . కుంకుమ పసుపుతో గొబ్బెమ్మ ను అలంకరించి మొక్కుకోమని, దీవెనను అందుకోమని కూతురును మేలుకో మంటారు. అన్ని పండుగల్లోని ఇది […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-11- జెన్నీ- అపర్ణ తోట

ఈ తరం నడక – 11 జెన్నీ- అపర్ణ తోట -రూపరుక్మిణి                      దుఃఖం పెల్లుబికినప్పుడు కవిత్వం ధారై ప్రవహిస్తుంది అంటారు. దుఃఖమే కాదు మనసు నిండా ప్రేమ నిండినా, మానవత్వం పరిమళం నిండినా కవిత్వం చిగురిస్తుంది. అయితే కవిత్వానికి రసజ్ఞత మూలం అనుకుంటాను. ఏ కాలాన్నైనా కవి కన్నుల నుండి చూడగలగాలి. గాలికి రూపురేఖలు కట్టి చూపడం కవిత్వ ప్రతిభ అయితే ఆ […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 12 (ఆనంద భైరవి)

రాగసౌరభాలు-12 (ఆనంద భైరవి) -వాణి నల్లాన్ చక్రవర్తి స్నేహితులు, హితులకు అనేక వందనములు. అమ్మవారు ఆనంద నాట్యం చేసిన అనుభూతిని, ఆనందాన్ని పంచే రాగం ఆనంద భైరవి. మరి ఈ రాగ విశేషాలు ఏమిటో ఈ నెల వ్యాసంలో తెలుసుకుందామా? ఆనంద భైరవి రాగం అత్యంత పురాతనమైనది. ఈ రాగం దక్షిణ దేశంలోని జానపదాలలో నుండి గ్రహింపబడినది అని అభిప్రాయము. ఈ రాగాన్ని కొందరు ఆంధ్ర భైరవిగా పిలిచినా అది ఎక్కువ ప్రచారంలోనికి రాక మునుపే భూస్థాపితమయింది. […]

Continue Reading

కనక నారాయణీయం-65

కనక నారాయణీయం -65 –పుట్టపర్తి నాగపద్మిని క్రీ.శ. రెండవ హరిహర రాయలు కుమారుడు మొదటి దేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. పర్షియన్ చరిత్ర కారుడు ఫెరిస్తా (1406) లో ఆనాటి సంఘటనలను పుస్తకానికెక్కించాడు. ఇతని కాలంలో ఆనాటి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతమంతా ఇతని పాలనలోకి వచ్చిందట! వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందట! తుంగభద్ర నదికి ఏనుగుల సాయంతో ఆనకట్ట కూడా ఎర్పడిందట! అక్కడినుంచీ విజయ నగరం హంపీకి 24 మైళ్ళదాకా కాలువ తవ్వించి, త్రాగు నీరు తెప్పించే ఏర్పాటు […]

Continue Reading

బొమ్మల్కతలు-28

బొమ్మల్కతలు-28 -గిరిధర్ పొట్టేపాళెం             గిర్రున తిరగే కాలం ఎవరికోసమూ ఒక్క క్షణం కూడా ఆగదు. కాలంతో అనుక్షణమూ అలుపెరుగని పరుగే జీవితం. ఆగని కాలం పరుగులాగే మన పరుగునీ ఆపలేం, కానీ కొన్ని క్షణాలని మాత్రం పట్టి మన మదిలో బంధించి ఆపుకోగలం. మదిలో బంధీ అయిన అలాంటి క్షణాలే కాలక్రమేణా జ్ఞాపకాలై గాలుల్లా వీస్తూ అప్పుడప్పుడూ మదిలో సడి, సందడి చేస్తూ, ఒక్కొకప్పుడు అలజడి రేపుతూ ఉంటాయి. కాలంలో […]

Continue Reading

చిత్రం-61

చిత్రం-61 -గణేశ్వరరావు  ఇటాలియన్ ఐశ్వర్య వంతురాలు, అందకత్తె Marchesa Casati చిత్రం ఇది. దీనిని 1914 లో చిత్రించిన Giovanni Boldini, ‘Master of Swish’ గా అప్పటికే ప్రసిద్ధి చెందాడు. రంగుల పళ్లెం లో కుంచెను ముంచి, దానితో కాన్వాస్ పైన ఝళిపించినట్లు, అతి వేగవంతంగా బొమ్మను గీయడం అతని ప్రత్యేకత. మిరుమిట్లు గోలిపే ఆమె అందం మన కళ్ళను చెదరగొడుతుంది. ఆత్మాశ్రయ ధోరణిలో చిత్రించిన ఈ చిత్రంలో ఆమె అధునా తన రూపాన్ని, ఆడంబరాన్ని […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-10- చిక్ లిట్ – కడలి

ఈ తరం నడక – 10 కడలి – “చిక్ లిట్” (నవల) -రూపరుక్మిణి              ఈ శీర్షిక మొదలుపెట్టి ఇప్పటికి పది నెలలు అయింది. ఒక్కొక్కటిగా చదువుతూ, కొత్తగా నిర్మించుకుంటున్న సాహిత్యదారులను వెతుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగేయడం మనసుకి భలే బాగుంది.           “ఎవరు డిఫరెంట్ గా రేపటి కంటెంట్ ని చూపించగలుగుతున్నారు?” అని వెతుకుతున్న నన్ను “చిక్ లిట్ ” ఆకర్షించింది. […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 11 (కేదారగౌళ)

రాగసౌరభాలు-11 (కేదారగౌళ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలు అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ మాసం మనం కేదారగౌళ రాగ విశేషా లను ముచ్చటించుకుందాము. ముందుగా ఈ రాగ నామ విశేషాలు గమనిద్దాము. కొందరు శాస్త్రకారుల ప్రకారము కేదార అంటే పొలము, గౌళ/గౌడ అంటే గౌడ దేశము. గౌడ దేశములోని పొలము పాటలలో ఈ రాగ స్వరూపము లభించి ఉండవచ్చని అభిప్రాయము. అనేక రాగాలు జానపదాల నుంచి […]

Continue Reading

కనక నారాయణీయం-64

కనక నారాయణీయం -64 –పుట్టపర్తి నాగపద్మిని ఇటీవల  ఆళ్ళగడ్డ రాజశేఖరా బుక్ డిపో ప్రింటర్ పరిచయమైనాడు. ఇంటికొచ్చి మరీ అడిగినాడు, ‘మీకు విజయనగర చరిత్రతో మంచి అనుబంధం ఉంది కదా! దాన్ని గురించి చారిత్రక నవల వ్రాయండి స్వామీ! మీరు బాగా పరిశోధన చేసినారు కదా!  తాతాచార్యుల వంశస్తులు కూడా! మీరు వ్రాస్తే, ప్రింటు చేసేందుకు నేను రెడీ!’ అన్నాడు. తనకూ ఆ ప్రతిపాదన నచ్చింది. సరేనన్న తరువాత విచికిత్స. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన […]

Continue Reading

బొమ్మల్కతలు-27

బొమ్మల్కతలు-27 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటి లో సైతం కనిపించే నల్లదనం…ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయ మే. బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు […]

Continue Reading

చిత్రం-60

చిత్రం-60 -గణేశ్వరరావు  టోనీ ప్రో, కాలిఫోర్నియాకు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణ పొందారు.           అతనివి కాల్పనిక చిత్రాలు కావు. ఊహాజనితం కావు. వాస్తవికత నిండినవి. అతను ఎప్పుడూ తన నిజ జీవితంలోని వ్యక్తులను చిత్రించాలని అనుకుంటాడు : తన అందమైన భార్య, పిల్లాడు, తన మిత్రులు, క్లబ్ […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-9- అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ఈ తరం నడక – 9 అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి -రూపరుక్మిణి. కె             మనిషై పుట్టాక ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేయక తప్పనిసరి. పసితనంలో మొదలైన ఆలోచనలలో ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో..? ఎవరి ఆలోచన ఎక్కడ మొదలవుతుందో మనకి తెలియదు.           ఇలా కొన్ని కథలు చదువుతుంటే ఇన్ని ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు ఈ […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 10 (షణ్ముఖ ప్రియ)

రాగసౌరభాలు-10 (షణ్ముఖ ప్రియ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ వందనం, అభివందనం. శివ పార్వతుల తనయుడు కుమార స్వామి. తలితండ్రుల రూపాలను పుణికి పుచ్చుకొని అత్యంత సుందరాకారునిగా పేరు పొందాడు. అతనికి 6 ముఖములు ఉన్న కారణంగా షణ్ముఖడు, ఆర్ముగం అని కూడా పిలుస్తారు. ఆ షణ్ముఖ సుబ్రమణ్య స్వామికి ప్రీతి పాత్రంగా పేర్కొనే షణ్ముఖ ప్రియ రాగ విశేషాలు ఈ నెల తెలుసుకుందాము. ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందామా? కటపయాది సూత్రాన్ని అనుసరించి ఈ […]

Continue Reading

కనక నారాయణీయం-63

కనక నారాయణీయం -63 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఇంతకూ ఎందుకప్పా ఇట్లా వచ్చినావు?’ అయ్యగారు కాఫీ స్టీల్ కప్పు తీసుకోగానే తానూ కప్పు చేతిలోకి తీసుకుని కింద పెట్టి గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడా శిష్య పరమాణువు. ‘అదే స్వామీ! మా స్కూల్ లో లైబ్రరీకి తీసుకోవాలసిన పుస్తకాలు, విద్యార్థులకు ఉపకరించేవి మీకు ఆ లిస్ట్ చూపించి వెంకట్రామా అండ్ కోలో కొందామని వచ్చినాను.’ ‘బాగుందిరా! ప్రతిసారీ యీ విధంగా నా సలహా కావాలంటే కష్టం. నేను ఊరిలో […]

Continue Reading

స్వరాలాపన-42 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-42 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-8- లిప్తకాలపు స్వప్నం- స్వర్ణ కిలారి

ఈ తరం నడక – 8 లిప్తకాలపు స్వప్నం – స్వర్ణ కిలారి -రూపరుక్మిణి. కె           ప్రవహించే నది పాయలు పాయలుగా చీలినా., తనలో ఉధృతి ఎంత మాత్రమూ తగ్గదన్నట్లు , జీవితంలోని ఆటుపోట్లతో మనిషి అంతరంగం అల్లకల్లోలమైపోవడం చూస్తూనే ఉంటాం. అందరం ఏదో ఒక సందర్భంలో ఈ ఆటుపోట్లని ఎదుర్కోవాల్సిందే.           అమ్మ మనసుకి ఎన్ని గాయాలైనా… తన బంగారు పిల్లలు లేడీ […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 9 ( భైరవి రాగం)

రాగసౌరభాలు-9 (భైరవి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఇంకొక పురాతనమైన, బహుళ ప్రచారంలో ఉన్న భైరవి రాగం గురించి ఈ నెల తెలుసుకుందామా? ఇదొక విలక్షణమైన రాగం. దాదాపు 1500 వందల సంవత్సరాల పూర్వం 72 మేళకర్తల పథకానికి ముందే ఉన్నదీ భైరవి రాగం. సంగీత సాంప్రదాయ ప్రదర్శినిలో ఈ కింది విధంగా చెప్పబడింది. భైరవి రాగ సంపూర్ణ స్సాయంకాలే ప్రగీయతే పంచశృతి దైవతం క్వచిత్ స్థానే ప్రయుజ్యతే పూర్వం ఈ రాగాన్ని కౌశికముగా పిలిచేవారు. […]

Continue Reading

కనక నారాయణీయం-62

కనక నారాయణీయం -62 –పుట్టపర్తి నాగపద్మిని           ఈ ఆలోచనలిటు ప్రయాణిస్తూ ఉండగానే, యధాలాపంగా పుట్టపర్థి తన గదిలో భద్రపరచుకుని ఉన్న విజయనగర చరిత్రకు సంబంధించి తాను ప్రత్యేకంగా ఒక చోట పెట్టుకున్న సామగ్రిలోనుంచీ, ‘అళియ రామ భూపాలుడు’ అన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కారణమేమిటో తెలియదు కానీ అళియ రామరాయలంటే తనకు చాలా ఆరాధన. చరిత్రకారులు అతన్నిఅహంభావిగా, రాజ్యకాంక్ష కలిగినవానిగా క్రూర కర్కశ హృదయునిగా  చిత్రీకరించినా అతని సాహసం, రాజనీతి […]

Continue Reading

బొమ్మల్కతలు-26

బొమ్మల్కతలు-26 -గిరిధర్ పొట్టేపాళెం           గిరీ..కమాన్…గో…గో…గో…అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా “విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి” స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటి కప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. “సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్” ఇచ్చిన చీటీలో రాసింది మైక్ లో చదివాను. “నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు” […]

Continue Reading

స్వరాలాపన-41 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-41 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-59

చిత్రం-59 -గణేశ్వరరావు  మహాకాళి మాత్రమే పది కాళ్ళు, పది చేతులతో చిత్రించబడింది. మరి ఈ ఫోటోలో ఉన్నామె ఎవరు? ఆమె చేతులు ఎన్ని కనిపిస్తున్నాయి? ఏమిటి ఈ మాయాజాలం? ఈ అద్భుతాన్ని చూపిస్తున్న డాన్స్ ఫోటోగ్రాఫర్ లోయిస్ గ్రీన్ ఫీల్డ్ dance photographer గా సుప్రసిద్ధులు.                   సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలుగా పట్టుకోవడంలో ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమల క్షణాలను […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-7-కొత్త తలుపు- కాళ్ళకూరి శైలజ కథలు

ఈ తరం నడక – 7 కొత్త తలుపు- కాళ్ళకూరి శైలజ కథలు -రూపరుక్మిణి. కె ఒక ఆలోచన మనల్ని మనుషుల్లోనికి లాక్కెళుతుంది. మనిషిని చేస్తుంది. good thoughts gives us a good life మన ఆలోచనలే మనల్ని ఇతరులకు పట్టించేస్తాయి. అనిపించక మానదు ఈ “కొత్త తలుపు” తెరిచినప్పుడు. శైలజ గారు మీతో ఒక చిన్నమాట ” మన మాటల్లో ఎప్పుడూ దొర్లిపోయే కాలం ఇక్కడ చాలా మారాం చేసేసిందండి “. ఆల్చిప్పలో ముత్యం […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 8 (తోడి రాగం)

రాగసౌరభాలు-8 (తోడి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఈనెల మనం రాగాలలో కలికితురాయి వంటి రాగం, అత్యంత శ్రావ్యత కలిగిన తోడిరాగం గురించి తెలుసుకుందామా? కొందరు ఈ రాగాన్ని కష్టతరంగా భావించి “తోడి నన్ను తోడెరా” అనుకోవటం కూడా కద్దు. ముందుగా రాగలక్షణాలు తెలుసు కుందాం. ఈ రాగం ఎనిమిదవ మేళకర్త రాగం. కటపయాది సూత్రాన్ని అనుసరించి 72 మేళ కర్తల పథకంలో చేర్చడానికి “హనుమ” అనే పదాన్ని కలిపి, హనుమతోడిగా నిర్ణయిం చారు. వెంకటమఖి […]

Continue Reading

కనక నారాయణీయం-61

కనక నారాయణీయం -61 –పుట్టపర్తి నాగపద్మిని శ్రీ చపలకాంత్ భట్టాచార్య లేచి, పుట్టపర్తిని వాటేసుకున్నారు.’తెలుగు భాష ఎంత మధురమైనదో యీరోజు నాకు అర్థమైంది. గ్రాంధికమైన తెలుగు భాషకూ, సంస్కృతానికీ పెద్ద తేడా లేదని పుట్టపర్తి రచన ద్వారా తెలిసింది. ఆయన అచ్చ తెనుగులో వ్రాసిన భాగం కూడా వారి నాట్యాభినయం సాయంతో అర్థమైనట్టే అనిపించింది. అది లేకున్నా, వారి పఠనం శక్తివంతం కావటం వల్ల, అదేమిటో, పుట్టపర్తి చదివినదంతా నాకు అవగతమైపోయినట్టే భావన. అదే కవిత్వం శక్తి, […]

Continue Reading

బొమ్మల్కతలు-25

బొమ్మల్కతలు-25 -గిరిధర్ పొట్టేపాళెం           నా బొమ్మల బాటలో “ఆంధ్రభూమి” సచిత్ర వారపత్రికకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా చిన్నప్పుడు నెల నెలా “చందమామ” కొని ప్రతి అక్షరం, ప్రతి బొమ్మా క్షుణ్ణంగా చదివినా, టీనేజ్ రోజుల్లో సహజంగానే చందమామ చదవటం ఆగిపోయింది. అప్పట్లో వార పత్రికలు బంకుల్లో తాళ్ళకి వేళాడుతుంటే ముఖచిత్రాలు చూట్టమో, ఎక్కడైనా దొరికితే బొమ్మలు, జోకుల కోసం తిరగేయటమో తప్ప వాటిల్లో కథలు, శీర్షికలు, ధారావాహికలు […]

Continue Reading

స్వరాలాపన-40 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-40 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-6-కుంకుమ పూల తోట – స్వయంప్రభ

ఈ తరం నడక – 5 రూపం మార్చుకున్న నిరీక్షణ – గీతా వెల్లంకి -రూపరుక్మిణి. కె           ఒక్కోసారి కొందరిని చదువుతూ ఉంటే,           మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.          పుస్తకం చిన్నదే కదా,  ఎందుకు ఇంత సేపు?          అవుతుంది తిరగేసిన పేజీలే మళ్ళీ ఎందుకు తిరగబడుతున్నాయి ??          మనసుని […]

Continue Reading
Posted On :