అంతరంగాలు (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అంతరంగాలు (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – జి.వి.హేమలత బయటినుంచి వస్తూనే  మా ఆవిడ ఎందుకో చాలా కోపంగా ఉంది, ఎందుకో తెలియలేదు. ఆవిడ కోపం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంతేకానీ ఆ కోపం దేనివల్ల ఏమిటో అసలు విషయం చెప్పనే చెప్పదు. కొద్దిసేపు రుసరుసలాడుతూ ఫ్రిడ్జ్ డోర్ తీసి కొద్దిగా నీళ్లు తాగి గట్టిగా ఫ్రిజ్ డోర్ వేసింది. హ్యాండ్ బ్యాగుని గాజు టీపాయ్ పై […]

Continue Reading
Posted On :

అమ్మ (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అమ్మ  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – మంజీత కుమార్ అడగకముందే శరీరాన్ని చీల్చి జన్మనిచ్చాను ఎన్నో ఊసులు చెబుతూ జోలపాటలు పాడాను ఆకలి అని చెప్పకముందే నేను పస్తులు ఉండి మరీ నీ కడుపు నింపాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నా ఆరోగ్యాన్ని పట్టించుకోక నీకు సపర్యలు చేశాను పరీక్షల వేళ తోడుగా ఉంటూ నీకు గురువై అక్షరాలు దిద్దించాను నీకు కష్టం వస్తే నేను కన్నీరు కార్చి నువ్వు విజయం సాధిస్తే నేను […]

Continue Reading

ప్రమద- బచేంద్రి పాల్

ప్రమద సాహస వనిత బచేంద్రి పాల్: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శమూర్తి -నీరజ వింజామరం  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నబచేంద్రి పాల్ జీవితం అకుంఠిత దీక్షకు, తిరుగులేని ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. హిమాలయాల ఒడిలో పుట్టి, పెరిగి, ఆ పర్వతాలనే తన జీవిత లక్ష్యంగా మలచుకున్న ఆమె ప్రయాణం, ప్రతి భారతీయ మహిళకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. బచేంద్రి పాల్ 1954 మే 24న […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-20- షేక్ సలీమా

ఈ తరం నడక – 20 స్ఫూర్తి -రూపరుక్మిణి స్ఫూర్తి ఎక్కడో దొరకదు. మనకు మన చుట్టూ ఉన్న జీవితాలే అద్ధంలా అర్థవంతమైన ఆలోచనను కలిగిస్తాయి. అనడానికి ఉదాహరణగా ఉంటాయి షేక్.సలీమా కథలు. సాధారణంగా స్త్రీ అణిచివేతల్లోనే ఉంటుంది. పురుషాధిక్య ప్రపంచం నుండి వేరుపడలేక అమ్మగా, ఆడపిల్లగా అణగారిన పక్షం చేరిపోతుంది. సర్వసాధారణమైన స్త్రీ జీవితంలో కొన్ని వెలుగులు కావాలి, ఆ వెలుగు విద్యతోటే వస్తుందని బలంగా నమ్మి, తన చుట్టూ ఉన్న జీవితాల్లో నుండి తన […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-55

https://youtu.be/iRaesppv9Mw?si=BvvKtiqVHd_CedTy   Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం) – ప్రమీల సూర్యదేవర ముందుమాట ముఖంలో భావాలు తెలుపటానికి కళ్ళు అద్దాలవంటివని అంటారు. కాని గాజుకళ్ళలా ఉన్న ఆ కళ్ళల్లో భావాలు ఎక్కడ దాగి ఉన్నాయో!! క్షణికోద్రేకాలకు లోనైన వారి చర్యల ఫలితమే వారిని ఇక్కడకు చేర్చింది. ఒకానొకప్పుడు వారివారి కుటుంబాలతో కష్టసుఖాలు పంచుకుంటూ, వారివారి వృత్తులు నిర్వహించుకుంటూ ఉండేవారు. కిటికీకి ఈవలవైపున ఉన్న మనందరిలాగానే సమాజంలొ కష్టసుఖాలని ఎదుర్కొంటూ, వారివారి స్నేహితుల, బంధువుల ప్రేమాభిమానాలను […]

Continue Reading

శబ్దాల శాంతి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 శబ్దాల శాంతి (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – డా.లక్ష్మీ రాఘవ పార్వతి మరో సారి పిలిచింది కూతురు వాణిని.. దగ్గరలోకూర్చుని ఉన్నా మౌనంగా తలతిప్పిన వాణితో “ఏమిటో ఎప్పుడూ రెండుసార్లు పిలవాలి నిన్ను. మొదటి సారి పలకనే పలకవు..” విసుగ్గా అంది. ఎవరు మాట్లాడినా వాణికి ప్రతి పదం చెవికి అస్పష్టంగా వినిపించేది… గొల్లగొల్లు, బద్దలైన రేడియోలా. కానీ, వాళ్ల మనసులో ఏముందో మాత్రం ఆమెకు స్పష్టంగా వినిపించేది. అందుకేనేమో చిన్నప్పటి […]

Continue Reading
Posted On :
Suguna Sonti

ఋణానుబంధం

 ఋణానుబంధం -అక్షర అమ్మకు అంత్యక్రియలు జరిపి నేను, మా అబ్బాయ్ సంజూ , శ్రీనివాస్ తో కలిసి ఇంటికి తిరిగి వచ్చాము. వాళనాన్నమ్మ ఇంక ఉండదు అని తెలిసిన దగ్గర నుంచి వాడు కంటికి మంటికి ఏక ధారగా ఏడుస్తూనే ఉన్నాడు. “ ఇన్నాళకి నాకు కష్టం మీద దొరికిన నాన్నమ్మని కూడా దేముడు ఇంత త్వరగా తీసుకు పోయాడు” అంటూ నన్ను భారతిని పట్టుకుని కుమిలిపోతున్న కొడుకుని ఎలా సముదాయిం చాలో తెలీక మేమిద్దరం మౌనం […]

Continue Reading
Posted On :

దీపం వెలిగించాలి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

దీపం వెలిగించాలి  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి ఒక పాలు గారే చందమామను రాహు, కేతువులు మింగివేసినప్పుడు కూడలిలో నాలుగు కొవ్వొత్తులు వెలిగించినపుడు వెన్నెల కాంతి వెదజల్లదు కొన్ని గొంతులు కలిసి ఆక్రోశిస్తూ న్యాయం కావాలనే నినాదాలతో రోడ్డెక్కి దిక్కులు దద్దరిల్లేలా అరిస్తే భీతిల్లిన బాధితుల ఆక్రందనలు ఆగిపోవు అమ్మల పేగులు మెలిపెట్టినపుడు మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తే కడుపులో రగిలిన చిచ్చుతో జవాబులన్నీ నిప్పురవ్వలే చిమ్ముతాయి ఆరిపోయే […]

Continue Reading

ప్రమద- శకుంతలా దేవి

ప్రమద మ్యాథ్స్ తో మ్యాజిక్ చేసిన మానవ కంప్యూటర్ – శకుంతలా దేవి -నీరజ వింజామరం            సర్కస్ లో పని చేసే ఒక  వ్యక్తి తన మూడేళ్ల కూతురితో కార్డ్స్ ఆడుతున్నాడు. ప్రపంచాన్నే తన గారడీలతో మెప్పించ గల ఆ వ్యక్తి , మాటలు కూడా సరిగ్గా రాని తన చిన్నారి కూతురిచేతిలో ఓడిపోతున్నాడు. ఆ క్షణంలో కన్న ప్రేమతో పొంగిపోయి నప్పటికీ, తన కూతురు ఒక అద్భుతమని అతను […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-19- మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం”

ఈ తరం నడక – 19 మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం” -రూపరుక్మిణి వర్తమానమంతా యుద్ధ గీతాల్ని ఆలపిస్తూ, ఆలకిస్తూ బ్రతకాల్సి రావడం నేటి దుర్భరమైన పరిస్థితి. ఎటు చూసినా యుద్ధ విద్వంసమే. అధికారం కోసం ఒకడు పన్నిన కుట్రలో అనేక మందిని ఈ భూమి పొరల్లో కప్పి వేయబడుతున్నారన్న వాస్తవాన్ని గొంతెత్తి పలికేందుకు కూడా ఈ అధికారం అవకాశాన్ని లేకుండా చేస్తోన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. యుద్ధాన్ని కోరుకున్న వాడు,  ప్రకటించిన వాడు యుద్ధభూమికి రాడు. […]

Continue Reading
Posted On :

31 రోజుల నెల (హిందీ: “31 का महीना” డా. లతా అగ్రవాల్ గారి కథ)

31 రోజుల నెల 31 का महीना హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు కాంత తన కష్టసుఖాలు నాతో చెప్పుకుంటూ ఉంటుంది. నేను కూడా వీలయినంత వరకు నా సఖీధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తున్నాను. కాని ఇవాళ ఎందుకో ఏదో విషయాన్ని కాంత దాచటానికి ప్రయత్నిస్తోందని నాకనిపించింది. ఆమె ముఖంలో ఒక మొహమాటంలాంటిది కనిపించింది. తను మాటిమాటికీ పైకి మెట్లవైపు ఏకాగ్రంగా చూస్తోంది. అప్పుడే మనుమరాలు […]

Continue Reading

నీ కనుపాపను నేనై (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

నీ కనుపాపను నేనై (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వేలూరి ప్రమీలాశర్మ ఆటో దిగి ఆశ్రమం గేటు వైపుకి రెండు అడుగులు వేసిన స్వాతి… ఒక్క క్షణం ఆగి పైన బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలు మరోసారి చదువుకుంది. “సునందా మానసిక వికలాంగుల సంరక్షణాలయం” గుండ్రని అక్షరాలతో పొందికగా రాసి ఉన్న ఆశ్రమం బోర్డుకి రెండు వైపులా… అపురూపంగా బిడ్డను పొదివి పట్టుకున్న మాతృమూర్తి చిత్రం ఒకవైపూ, నీడ నిస్తున్న మహావృక్షం […]

Continue Reading

ఐనా..నేను ఓడిపోలేదు (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఐనా..నేను ఓడిపోలేదు  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – బి.కళాగోపాల్ నీ మనోవాంఛలు తీర్చుకోవడానికి నన్నో దేవిని చేసి పూజించావు/ నీ దైహికవాంఛలు తీర్చుకోవడానికి నన్నో వేశ్యను చేసి రమించావు/ శిరోముండనాలు, సతీసహగమనాలు, అలనాటి సనాతన సాంప్రదాయమన్నావు/ గడపదాటని కట్టడి బతుకుల గానుగెద్దు చాకిరీలు/ నోరువిప్పనీయని కంటిచూపుల శాసనాలు/ ఒకప్పటి పురాతన ధర్మమన్నావు/ మరి నేటి యుగధర్మమేమి బోధిస్తుంది అనాది పురుషా?!/ అలాగా తల్లులపై అత్యాచారం మినహా / అంటుడు ముట్టుడు అన్నింటికి అంటున్న […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-18- మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి)

ఈ తరం నడక – 18 మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి) -రూపరుక్మిణి  చీకటిని చీల్చిన దివ్వెలు చీకటి మాటున వెలుగు ఎప్పుడూ ఉంటుంది. అనుమానమే లేదనడానికి నిదర్శనాలు నాకు చాలా ఎదురవుతూనే వున్నాయి. అటువంటి మరో నిదర్శనమే ఈసారి నే పరిచయం చేయబోతున్న పుస్తకం. కొన్ని పుస్తకాలు మనం ఎంచుకుంటాం. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన కోసమే మనల్ని చేరుతాయి. అటువంటి అరుదైన పుస్తకం అందుకోవడానికి నేను చాలా దూరమే ప్రయాణం చేయాల్సి […]

Continue Reading
Posted On :

ప్రమద- సుధా చంద్రన్

ప్రమద సుధా చంద్రన్ -నీరజ వింజామరం  నటరాజ పాదాల నాట్య మయూరి… రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఒక  17 ఏళ్ల అమ్మాయి, ‘జైపూర్ ఫూట్’ అనే కృత్రిమ పాదంతో మళ్లీ నృత్యం చేయగలనని ప్రపంచానికి నిరూపించింది. ఈ సాహసమే ఆమెను దేశానికి స్ఫూర్తి చిహ్నంగా నిలబెట్టింది. ఆమె కథ కేవలం వ్యక్తిగత విజయం కాదు, పట్టుదల ఉంటే వైకల్యం అనేది ఒక అడ్డంకి కాదని నిరూపించిన గొప్ప సామాజిక సందేశం. ఆమె మరెవరో కాదు, నాట్య […]

Continue Reading
Posted On :

స్వల్పధరకే నిద్ర (కవిత)

స్వల్పధరకే నిద్ర (కవిత) – శ్రీ సాహితి నిద్రను అమ్మే సంత ఇంకా తెరచుకోలేదు నీలో జేబు నిండా తృప్తితో కొనే స్తోమత ఉంటే అతి స్వల్ప ధరకే పెద్ద మొత్తంలో నీకే అమ్ముతుంది. పడక, పరుపు, మత్తు, మైకం అక్కరలేని కళ్ళు స్వేచ్ఛగా నీకు కాస్తా దూరంగా తీసుకెళ్ళి ఏది గుర్తుకురాలేంత ప్రదేశంలో వదలివస్తాయి నిన్ను. ఒక్కడివే సంతోషంగా మేల్కొని తిరిగిస్తుంటే మెరిసిపోతూ మురిపిస్తాయి. ***** సాహితి -మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) […]

Continue Reading
Posted On :

ప్రమద- విజయ నిర్మల

ప్రమద విజయ నిర్మల -నీరజ వింజామరం  వెండితెర చరిత్ర లో బంగారు అధ్యాయం – విజయ నిర్మల అది 1950 వ సంవత్సరం. ఒక చిన్నారిని కెమెరా ముందు నిలబెట్టారు. దర్శకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు ఇప్పుడు ఏడవాలి. తెలిసిందా ?” అన్నాడు. కానీ ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆప్యాయంగా అడిగినా, నటించి చూపించి, నకలు చేయమన్నా – ఫలితం లేదు. చివరికి దర్శకుడి స్వరం కఠినంగా […]

Continue Reading
Posted On :
Suguna Sonti

వంచన

వంచన -అక్షర డోరు బెల్ విని తలుపు తీసిన నేను ఎదురుగా నిలచిన దీపని చూసి ఆనందంతో వెలిగి పోయిన నా ముఖం పక్కనే ఉన్న వ్యక్తి ని చూసి అంత కంటే ఎక్కువగా మాడి  పోయింది. మారుతున్న నా ముఖ కవళికలను గమనించన దీప… “మమ్మల్ని లోపల్కి రమ్మంటావా ?” అని అడిగింది. చేసేది లేక ముభావంగా పక్కకి తొలగి వారిద్దరికి దారి ఇచ్చాను. ఇద్దర్నీ కూర్చోమని చెప్పి నేను నా మనస్సును సర్దుకుందామని లోపలీకి […]

Continue Reading
Posted On :

ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ

ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ – శాంతి ప్రబోధ నాలోని వ్యాధి, అదొక నిశ్శబ్ద నీడ. గోడలపై వేలాడిన పాత పెయింటింగ్ లా, అది నాలో నెమ్మదిగా పాతుకుపోయింది. ఒకనాటి ఉదయం నిద్ర లేవగానే, నా నాలుకపై ఒక వింత పువ్వు పూసింది. అది చేదుగా ఉన్నా, సుగంధాన్ని వెదజల్లుతోంది. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టగానే, ఆయన చేతిలోని స్టెతస్కోప్ గుండెచప్పుడు కాకుండా, నాలో దాగిన ఆ పువ్వు గుసగుసలు వినిపించింది. “ఇది ఒక ప్రయాణం,” ఆయన కళ్ళు […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-17- మానుషి (శాంతి బెనర్జీ)

ఈ తరం నడక – 17  మానుషి (శాంతి బెనర్జీ) -రూపరుక్మిణి  ఆత్మ అభిమానం ఆత్మస్థైర్యాన్ని నింపుకున్న కథలు మానవత్వం పరిమళించిన చూపు, మనుషుల్ని వారి సమయాన్నిబట్టి అనుకూల, అననుకూలతల మధ్య భేదాన్ని సమకూర్చుకునే శక్తి ఎంతటి అవసరమో చెప్పే కథలివి.           మారుతున్న కాలంలో మనము మారడం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. “మానుషి” ఇదో సంస్కృత పదం. స్త్రీ రూపానికి అంతర్మదనానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించారు అనుకుంటా.., […]

Continue Reading
Posted On :

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)   -డా. కొండపల్లి నీహారిణి           మన కలం హలంగా చేసామంటే ఈ అక్కరల పొలంలో మొలిచిన మొక్కలన్నీ చిగురులెత్తి  పూత పూయాలి, కాతకాయాలి. అవి గట్టిగింజల్ని మొలిపించాలి. మళ్ళీ కొత్త చివురులెత్తాలంటే తెలివి అనే ఖనిజాలను, పోషకాలనూ అందించాలి. సాధారణంగా మనిషి శరీరంలో మెదడు,ఎముకలు, కండరాలు, గుండె వంటి అన్ని భాగాలు సరిగ్గా […]

Continue Reading

Breaking the Mould: Women’s Voices and Visions in Literature-4

Breaking the Mould: Women’s Voices and Visions in Literature-4 (A Brief study of Indian women writers, contributed for the upliftment of women from social norms) -Padmavathi Neelamraju “I’ve realized that the meaning of success for a woman does not lie in her relationship with a man. Only after that realization, did I find this man’s […]

Continue Reading
Posted On :

అపోహలూ-నిజాలూ (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

అపోహలూ– నిజాలూ (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -యశోదాకైలాస్ పులుగుర్త “రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రకటించింది మా మేనేజ్ మెంట్!”  ఆఫీస్ నుండి వస్తూనే ఇంట్లో అందరికీ వినబడేటట్లుగా చెప్పింది వైష్ణవి. “ఓ, నైస్వైషూ!”  ఇకనుండి పొద్దుట పొద్దుటే ఆఫీస్ వేన్ ఎక్కడ మిస్ అవుతానో అనుకుంటూ పరుగులు పెట్టనక్కర్లేదు. ఎంత మంచి వార్త చెప్పావంటూ,”  భర్త  పవన్,  వైష్ణవి వైపు […]

Continue Reading

ఏఐ ఏజి రాధ (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

ఏఐ ఏజి రాధ  (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ మనిషిలో మనీ ఉండొచ్చు, షి ఉండొచ్చు- కానీ మనిషి అంటే మగాడు. కేవలం మగాడు. మనిషిలో షి ఉండొచ్చు. కానీ మహిళ మనిషి కాదు. మనిషి అంటే కేవలం మగాడు. అంటే ఈ భూమ్మీద ఉంటున్నది మనుషులూ, మహిళలూ! వీళ్లతో స్టోన్ ఏజి దాటి, మరెన్నో ఏజిలను అధిగమిస్తూ ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) ఏజిలోకొచ్చాం. ఏ ఏజి తరచి చూసినా- నారీజాతి […]

Continue Reading

“నైరాశ్యపు శిశిరం – ఆశాన్విత వసంతం (హిందీ: “”उम्मीदों का उदास पतझड़ साल का आखिरी महीना है”” – శ్రీమతి అంజూ శర్మ గారి కథ)”

నైరాశ్యపు శిశిరం – ఆశాన్విత వసంతం उम्मीदों का उदास पतझड़ साल का आखिरी महीना है హిందీ మూలం – శ్రీమతి అంజూ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఆటోలో నుంచి దిగి అతను కుడివైపుకి చూశాడు. ఆమె ముందునుంచే బస్ స్టాప్ దగ్గర కూర్చుని అతని కోసం ఎదురుచూస్తోంది. అతని చూపులో మనస్తాపం స్పష్టంగా తెలుస్తోంది. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ అతను […]

Continue Reading

ఏం చెప్పను! (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

ఏంచెప్పను?  (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) – పద్మావతి రాంభక్త ఏమని చెప్పను లోలోతుల్లో మనసుకు ఉరేసే దుఃఖముడులు ఎన్నని విప్పను గోడపై కదిలే ప్రతిముల్లూ లోపల దిగబడి అల్లకల్లోలం చేస్తుంటే ఏమని చెప్పను నా మౌనానికి గల కారణాలకు రంగురంగుల వస్త్రాలు తొడిగి గాలిలోకి ఎగరేస్తుంటే ఏంచేయను నా పెదవులపై తూలిన ప్రతి పలుకును మసిబూసి మారేడుకాయను చేసి పుకారులను వీధివీధిలో ఊరేగించి కృూరంగా ఉత్సవాలు […]

Continue Reading

ప్రమద- పి.వి.సింధు

ప్రమద పి.వి.సింధు -నీరజ వింజామరం  ప్రపంచ బ్యాడ్మింటన్ లో మెరిసిన తెలుగు తార – పి .వి. సింధు తల్లిదండ్రులిద్దరు జాతీయ స్థాయి వాలిబాల్ క్రీడాకారులు అనగానే సహజంగానే వారి పిల్లలు కూడా వాలిబాల్ నే ఎంచుకుంటారని ఎవ్వరైనా అనుకుంటారు. కానీ ఆమె బ్యాడ్మింటన్ ను ఎంచుకుంది. కేవలం ఎంచుకోవడమే కాదు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగాచరిత్రలో పేరు నమోదు చేసుకుంది. ఆమె మరెవరో కాదు మన తెలుగు తేజం పి. […]

Continue Reading
Posted On :

నేనొక జిగటముద్ద (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

నేనొక జిగటముద్ద  (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – జె.డి.వరలక్ష్మి గురితప్పి పోవడంలేదు నా ఆలోచనలు నువ్వు కానుకిచ్చిన కపట ప్రేమను గుచ్చి గుచ్చి చూపిస్తూ పొడుచుకుంటూ పోతున్నాయి.. మెదడులో దాగిన మోసాన్ని అరచేతుల్లో పులుముకొని వెన్నంటే ఉంటానని నువ్వు చేసిన ప్రమాణాలు గుండె గోడలకు బీటలు తీసి ఉప్పొంగుతున్న రక్తంబొట్లను కన్నీరుగా నేలరాలకముందే ఆవిరి చేస్తున్నాయి.. విసురుగా నోటి నుండి వచ్చే ఆ మాటల నిప్పురవ్వలు నన్ను నిలబెట్టి నిలువెల్లా దహించేస్తాయి.. నాకెంత […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)- 2 వర్క్ ఫ్రం హోం

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 2. వర్క్ ఫ్రం హోం అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత           సూర్య ఆఫీసు నుంచి పెందరాళే వస్తున్నాడు. వచ్చే సరికి నేను, పాప గుర్రు పెట్టి […]

Continue Reading
Posted On :

జీవిత చక్రం (క‌థ‌)

జీవిత చక్రం -చిలుకూరి ఉషారాణి పండితుల వేదమంత్రోచ్ఛారణలతో, పచ్చని అరటి ఆకుల మధ్య రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పెళ్ళి మండపం, పెళ్ళికి విచ్చేసిన అతిధులతో ఆ కళ్యాణ ప్రాంగణం వైభోగంగా ఉంది. వధూవరుల జీలకర్ర బెల్లం తంతు పూర్తవ్వగానే తలంబ్రాల బట్టలు మార్చుకోవడానికి ఎవరికి కేటాయించిన గదులలో వారు తయారవుతున్నారు. “ఎంత బాగుందిరా మన అమ్మాయి, ఏదైనా మన పిల్ల అదృష్టవంతురాలు రా” నారాయణ, అని ఒకరూ, “ఆ పిల్లోడోల్ల మర్యాదలూ, ఆ వినయమూ, […]

Continue Reading

మనమే… మనలో మనమే

మనమే… మనలో మనమే – రూపరుక్మిణి.కె ఇంకా… అంటారానితనం వుందా!!!! అంటాడో అమాయక జీవి! ఇక్కడ వున్నదంతా వెలివేతల్లోని అంటరాని తనమే, అస్పృశ్యతే, కాదనలేని నిత్య సత్యమే, అయినా.. ఏది ఏమైనా… పుస్తకాల్లో వెలివేస్తాం. బింకాలుపోతాం, డాంబికాలు పలుకుతాం. అంతా అటుమల్లగానే, గారడి ఆట మొదలెట్టి లో లోపల ఈ అంటూ, ముట్టుని మెదళ్ళలో కోట కట్టి పాలిస్తాం. రంగు ఇంకో రంగుని బుద్ది మరో బుద్దిని అన్యాయం న్యాయాన్ని అబద్దం నిజాన్ని కులం ఇంకో కులాన్ని […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-14 (ఇది స్వేచ్ఛ గానం!)

కొత్త అడుగులు – 14 ఇది స్వేచ్ఛ గానం! (స్వేచ్ఛకు నివాళిగా ఈ వ్యాసాన్ని నెచ్చెలి తిరిగి అందజేస్తోంది!) – శిలాలోలిత ‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది నన్ను. ఎంతమంచిపేరు పెట్టారు ఆ అమ్మా నాన్నలు అన్పించేది. ఇన్నాళ్ళకు ఓ రోజున స్వేచ్ఛ కలిసి కవిత్వ సంపుటి వేస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందించేను. […]

Continue Reading
Posted On :

ప్రమద- పి. సుశీల

ప్రమద పి. సుశీల -నీరజ వింజామరం  వస్తాడు నా రాజు ఈ రోజు .. .. అని ఎదురుచూసినా ఝుమ్మంది నాదం .. అని ఒక మూగ గొంతు పలికినా శ్రీ రామ నామాలు శతకోటి .. అని భక్తి రసం లో ఓలలాడించినా ఆకులో ఆకునై పూవులో పూవునై .. అని ప్రకృతితో పరవశించినా అది పి. సుశీల గారికే చెల్లింది. తెలుగు లోగిళ్ళలో అనాదిగా ముగ్గులు వేసే ఆచార మున్నా , ముత్యమంత పసుపు […]

Continue Reading
Posted On :

Old Rusted Mindsets

Old Rusted Mindsets -Dr. Srivalli Chilakamarri It was a bright and breezy day, The sea called out to come and play. A family decided to meet the tide The sun, the waves, the open sky. The father dressed, the brother too, In shorts and shirts, just like the men do. No one stared, no one […]

Continue Reading
Posted On :

The name I was given

Life in words The name I was given   Becoming the Self between two worlds -Prasantiram           There are names we are born with.           And then, there are names the world gives us — nicknames, pen names, titles, workplace versions, even mispronounced or shortened forms that somehow […]

Continue Reading
Posted On :

గజల్ సౌందర్యం-1 (ఈ నెల నుండి ప్రారంభం)

గజల్ సౌందర్యం (ఈ నెల నుండి ప్రారంభం) -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ అనేది ఉర్దూ భాషలో శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఒక కవితా కళారూపం. ఇది భావోద్వేగాలు మరియు మనో భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే కవితా రూపం. గజల్ ప్రత్యేకమైన కవితా ప్రక్రియ ఎందుకంటే కవులు తమ తీవ్రమైన వ్యక్తిగతమైన సులభంగా వ్యక్తీకరించలేని భావోద్వేగాలను మరియు భావాలను గజల్ ప్రక్రియ ద్వారా వ్యక్తపరచగలరు. గజల్‌ లోని ఆ శక్తివంతమైన మరియు ఉత్తేజకరమైన గజలియత్ నిర్మాణ శైలి వల్ల గజల్ […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)- 1 స్పానిష్షూ- ఉష్షూ

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 1. స్పానిష్షూ- ఉష్షూ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ-పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత           అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు […]

Continue Reading
Posted On :

కథావాహిని-24 పి.సత్యవతి గారి “సూపర్ మామ్ సిండ్రోమ్” కథ

కథావాహిని-24 సూపర్ మామ్ సిండ్రోమ్ రచన : పి.సత్యవతి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

ఊపిరితో ఊదుకుని…… (కవిత)

ఊపిరితో ఊదుకుని…… (కవిత) – శ్రీ సాహితి గుండెను అక్షరంతో తవ్వుతుంటే కంగు కంగుమనే కాలం మ్రోతకు గాఢ నిద్రలో మనసు ఉలిక్కిపడి గాయపడ్డ నిజాలని ఊపిరితో ఊదుకుని పడిన మచ్చలను నిజాయితీతో మాన్పి జీవితమంతా మెరిసే ఒక్క కలను తృప్తిగా పొదువుకోవాలని ఉంది ***** సాహితి -మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-15- ఆర్. రమాదేవి కవిత్వం

ఈ తరం నడక – 15 ఆర్. రమాదేవి కవిత్వం -రూపరుక్మిణి  ప్రేమ పల్లకి ప్రేమ మైదానంలో ఓటమి ఎరుగని ఆట ఆడడం అంత తేలిక కాదు. అటువంటి ఆటని పదాల మాయాజాలంతో, గమ్మత్తయిన హృదయ గమకాలను పలికిస్తూ మనసు లోని తెరలని దించడం ఈ కవయిత్రి  కవితలకి అలవాటు. మనిషిని గెలిచి మనసుని గెలుస్తావా!! మనసును గెలిచి మనిషిని గెలుస్తావా!!అని ఇక్కడ ఓ ప్రశ్న వినపడుతుంది. ఎంతసేపు మనసు ఓ లోలకాన్ని మోస్తూ ఉంటుంది. .. […]

Continue Reading
Posted On :

ప్రమద- కిరణ్ బేడీ

ప్రమద లేడి సింగం – కిరణ్ బేడీ -నీరజ వింజామరం 1970లోనే ఢిల్లీ ట్రాఫిక్ మానవ సహనానికి పరీక్ష. కానాట్ ప్లేస్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ట్రాఫిక్ ఆఫీసర్ తో రేడియోలో మాట్లాడుతూ, “మేడం! ఓ వాహనం నిషేధిత ప్రదేశంలో పార్క్ అయింది. కాని ఇది ప్రభుత్వ నంబర్ ప్లేట్ ఉన్న ప్రత్యేక కారు. ఇది ప్రధాన మంత్రి గారి వాహనం అని డ్రైవర్ అంటున్నాడు.” అని చెప్పాడు . ట్రాఫిక్ ఆఫీసర్ వెంటనే […]

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading

సరస్సు-అమ్మాయి (హిందీ: `झील-सी लड़की’ ’డా. నీతా కొఠారీ’ గారి కథ)

సరస్సు-అమ్మాయి झील-सी लड़की హిందీ మూలం – డా. నీతా కొఠారీ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు గట్టిగా వస్తున్న గాలివిసురుకి కిటికీ అద్దాలలో ప్రకంపన మొదలయింది. కర్టెన్లు అటూ-ఇటూ ఊగసాగాయి. మంచినీళ్ళకుండ మీద పెట్టిన గ్లాసు మూతతోసహా ఎగిరి కిందపడింది. సంజన ఉలికిపాటుతో లేచి మంచంమీద కూర్చుండిపోయింది. నిద్ర కళ్ళతో ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. తరువాత ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట గాలిదుమారం ఉధృతంగా ఉంది. తను వరండాలో […]

Continue Reading

అతని ప్రియురాలు (కవిత)

అతని ప్రియురాలు -డా||కె.గీత అతని మీద ప్రేమని కళ్ళకి కుట్టుకుని ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని ఈదుతూనే ఉన్నాను అది మామూలు ప్రేమ కాదు అతని కుటుంబపు నిప్పుల గుండంలో వాళ్ళ మాటల చేతల కత్తుల బోనులో నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ- చస్తున్నా మొర్రో అంటే చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ భరించలేను బాబోయ్ అంటే పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ అయినా సిగ్గూ శరం లేకుండా ఆత్మాభిమానాన్ని చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి కూపస్థ మండూకాన్నై […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-14- ఉలిపికట్టెలు – పి.జ్యోతి

ఈ తరం నడక – 14 ఉలిపికట్టెలు – పి.జ్యోతి -రూపరుక్మిణి  బంధాలు –  బలహీనతలు ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు. ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు […]

Continue Reading
Posted On :

ప్రమద – సునీత విలియమ్స్

ప్రమద అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్ -నీరజ వింజామరం ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ , ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 […]

Continue Reading
Posted On :

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట)

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట) -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి సాయిపద్మ కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమన్నారు ఆమె భర్త ప్రజ్ఞానంద్. అది నా భాగ్యంగా భావించి రాసేను. ఇవాళ సాయంత్రం విశాఖ దసపల్లా హోటల్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సందర్భంగా సాయిపద్మ మిత్రులు అభిమానులు అందరితోనూ ఈ ముందుమాట పంచుకుంటున్నాను.***వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు సాయి పద్మ కొన్ని కథలు రాసిందని ఆ కథలకు ముందుమాట రాయాలని […]

Continue Reading

లంకంత ఇల్లు (కథ)

లంకంత ఇల్లు -కె.వరలక్ష్మి ఫోన్ రింగైంది. “హలో” “ఉమా…” “అవును, చెప్పండి” “ఉమా, గుర్తు పట్టలేదా?” నేను శేషూని” “చెప్పండి” ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్. ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటి లాగా శేషూ అనొచ్చుగా” “…….” “మాట్లాడు ఉమా” “ఏం మాట్లాడను!” “నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను” “ఊ…” “ఈ పొడి పొడి ఊ..ఆ…లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా” “నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ […]

Continue Reading
Posted On :

భూలోక స్వర్గం (కథ)-డా||కె.గీత

భూలోక స్వర్గం -డా.కె.గీత           అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు.            ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను.            నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! నిశ్శబ్దం (ములుగు లక్ష్మీ మైథిలి కథ)

https://youtu.be/28xQ4HPOUko ములుగు లక్ష్మీ మైథిలిములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, […]

Continue Reading

ఈ తరం నడక-13- జస్ట్ ఏ హౌస్ వైఫ్ – కవితకుందుర్తి

ఈ తరం నడక – 13 జస్ట్ ఏ హౌస్ వైఫ్ -రూపరుక్మిణి  కపట ప్రపంచానికో బ్రేకప్           సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….           సొంతగడ్డకి […]

Continue Reading
Posted On :

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు           పెనుగొండ సరసిజ గారి పద… అలా నడిచొద్దాం కవితా సంపుటిలోని కవితలు కొన్ని సమాజంపై ఎక్కుపెట్టిన అస్త్రాలు కాగా మరికొన్ని సమాజంలో మనుగడకు ప్రేమ ఆయుధమంటూ సాగాయి. అనుభూతులను కవితాత్మకంగా మలిచే ప్రయత్నంలో కొన్ని చోట్ల సఫలీకృతం కాగా కొన్ని శైలిలో కొత్తదనం కొరవడినదని చెప్పవచ్చు. పేజీలు తిరగేస్తుంటే ఒకే భావం కొన్ని కవితల్లో […]

Continue Reading

యే బారిష్ !! (కథ)

యే బారిష్ !! (కథ) -ఇందు చంద్రన్ “పైనున్న వాళ్ళకి కిందుండే వాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయండీ ? అంటూ ఏదో చెప్తూ ఉన్నాడు కిరణ్. “అర్రే అలా అంటావేంటి ?….మేం కూడా కింద నుండే పైకొచ్చాంలేవోయ్….మాకేం డైరెక్ట్ గా సీనియర్ ఫోస్టింగ్ లు ఇవ్వలేదు అన్నాను అతని వైపు చూస్తూ “ఎంతైనా గానీ…వద్దులేండి…..ఈ మాట ఇక్కడితో వదిలేద్దాం అన్నాడు కిరణ్ ఎటో చూస్తూ “పర్లేదు…చెప్పు…అన్నాను మళ్ళీ “కొన్ని సార్లు మన కష్టానికి తగ్గ ఫలితాన్ని వేరొకరు […]

Continue Reading
Posted On :

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష    -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి  “నా ఉత్తరం” “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” అనే ‘అమ్మ ప్రేమ కథ’ నవలా రూపంలో రచించి పాటకులందరి ప్రేమ కథలలోని పేజీలను ఒక్కసారిగా తిరగేస్తూ, బస్సులలో, రైళ్లలో,  విమానాలలో, ప్రయాణిస్తున్న ప్రయాణాలలో, కుటుంబాలతో కలిసి ఉన్నా  ప్రేమ ఉత్తరాలను చదివి పాత జ్ఞాపకాల గ్రంథాలయంలో కొంత సమయాన్ని గడిపి ‘రవి మంత్రి’ చెప్పినట్లుగా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, […]

Continue Reading

ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత)

ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత) – శ్రీ సాహితి నీవు నిరంతరం ఏదో కోరికలా ఏ పేరుతో పిలచుకున్నా చెదరని అందంతో గర్వపడే లోపలి లోకంలో నాటు పడిన ఒక్క మాటగా అర్దమెంత కోసినా ఎంతో కొంత వెలితివే. ఎంత కురిసినా ముఖంలో మొలకెత్తని నిజానివే. నీకేమీ కావాలో తెలియకుండా తవ్వుకునే ప్రశ్నవే. నాతో పని లేకుండా ఏది అడగకుండానే బాగా తెలిసిన ఇష్టాలతో అన్నీ వేళలా అన్నీ చోట్ల… నా లోపలే ఉంటావు ఓ […]

Continue Reading
Posted On :

నీ ఇష్టం (కవిత)

నీ ఇష్టం – నీరజ వింజామరం నీకు తెలిసి నువ్వే తలదించుకొని నిన్ను నువ్వే నిందించుకొని నిన్ను నువ్వే బంధించుకుని నీ పై బాణాలు సంధించుకుని ఏమిటిలా రగిలిపోతావు ? ఎందుకలా కుమిలి పోతావు? నాకు తెలిసి నువ్వే తల ఎత్తుకుని కారే కన్నీటిని వత్తుకుని పగిలిన గుండెను మెత్తుకుని ఎక్కడికో ఎదిగి పోతావు అయినా వినయంతో ఒదిగిపోతావు ఎంపిక నీకే వదిలేస్తున్నాను నీ నువ్వు లా  చితికి “చితికి “పోతావో నా నువ్వు లా అతికి బతికి […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-12- కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్

ఈ తరం నడక – 12 కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్ -రూపరుక్మిణి ఆమె ‘వో’ కబ్జా పోటుకు గురి అయిన శెరువు  ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరితలు లిఖించినా, మారని మనుషుల్లో మనిషిగా గుర్తించబడాలన్న తపన, సమానత్వాన్ని పొందాలని పోరాడుతూ…నెగ్గుతూ, ఓడుతూ, కదిలి పోతూ, కదిలిస్తూ బతుకు కడలి అంచున వో… తూరుపు పొద్దుగా నిలబడిన ఆమెల నుండి ఎన్ని సంధ్యాసమయాలు దాటి వెళ్లినా!…, ఎన్ని అగచాట్ల చీకట్లు చుట్టూ అల్లుకున్నా!…, […]

Continue Reading
Posted On :

‘సలాం హైద్రాబాద్’ నవలా సమీక్ష

‘సలాం హైద్రాబాద్’ – నవలా సమీక్ష  -డా.మారంరాజు వేంకట మానస చార్ సౌ సాల్ పురానా షహర్ హైద్రాబాద్ తో ఎంతో కొంత అనుబంధం ఉన్న వాళ్ళందరి నవల ‘సలాం హైద్రాబాద్’ !!! రాధా కృష్ణల ప్రేమకు బృందావనం, షాజహాన్ ముంతాజ్ ల ప్రేమకు ఆగ్రా, కుతుబ్ షా బాగ్ మతీల ప్రేమకు భాగ్యనగరం (హైద్రాబాద్) – అంతే, అంటే పొరపాటే! ప్రేమకు చిహ్నంగానే గాక మతసామరస్యాలలో, స్నేహపూరిత సంబంధ బాంధవ్యాలలో కూడా హైద్రాబాద్ నగరం దక్కన్ […]

Continue Reading

Bruised, but not Broken (poems) – 26. Song of the Hunter

Bruised, but not Broken (poems) -Challapalli Swarooparani  26. Song of the Hunter It makes me twist inside Twist hard This fateful statue! Seeing it I don’t get a wink of a sleep. I feel like one Whose crown has been snatched And dashed to the ground. That pointing finger Aims at our loins Hidden behind […]

Continue Reading
Posted On :

సోది (కథ)

సోది -ఉమాదేవి సమ్మెట “సోది చెబుతానమ్మ సోది! సోది చెబుతానమ్మ సోది!” చుక్కల చీర కట్టుకుని, ముఖాన ముత్యమంత పసుపు రాసుకుని, నుదుటన పావలా కాసంత బొట్టు పెట్టుకుని, చేతినిండా రంగురంగుల గాజులు వేసుకుని, సిగలో బంతిపూల మాల తురుముకుని చూడ  ముచ్చటగా వున్న చుక్కమ్మ అరుపులే గానీ.. సోది చెప్పించు కోవడానికి ఏ ఒక్కరు కూడా పిలవడం లేదు. చేతిలో చిన్నకర్ర, నడుమున ఒక గంప పెట్టుకుని ప్రతి గేటు ముందూ నిలిచి ఆశగా “సోది […]

Continue Reading
Posted On :

నేనూ.. నా నల్ల కోటు కథలు ‘ పుస్తక సమీక్ష

“నేనూ…. నా నల్లకోటు కథలు” – పుస్తక సమీక్ష  -డా.మారంరాజు వేంకట మానస నల్లకోటునుద్దేశించి వ్రాయాలంటే సరియైన అవగాహనతో పాటు కాసింత ధైర్య సాహసాలు ఉండాలి. అదే స్వయంగా నల్లకోటు వేసుకుని నల్ల కోటునుద్దేశించి వ్రాయాలంటే అవగాహనకు మించి అనుభవాలుండాలి. అనుభవాల దృష్ట్యా సరైన విశ్లేషణ అవసరం. ఇటువంటి ఆలోచనా దృక్పథం ఉన్న అరుదైన రచయితలలో మంగారి రాజేందర్ గారు ఒకరని చెప్పవచ్చు. కళ్ళ ముందు జరిగే అనేక సంఘటనలతో ఆందోళన చెంది, జరగవలసిన విధంగా న్యాయం […]

Continue Reading

అద్దం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అద్దం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శశికళ ఓలేటి మా ఇంట్లో తాతలనాటి బెల్జియమ్ అద్దం ఒకటి ఉంది…నిలువెత్తుగా, ఠీవిగా తలెత్తుకుని! పట్టీల పాదాలతో బుట్టబొమ్మలా నేను పరుగెట్టి… అందులో పాపాయిని ముద్దెట్టుకునేదాన్ని! నేను ఆడపిల్లనని ఎరుక కలగగానే… అలంకారాలన్నీ దాని ముందే! అమ్మ కన్నా పెద్ద నేస్తం ఆ అద్దం! నా కిశోరదశలో… అమ్మాయి పెద్దదయిందన్నారు. దుస్తులు మారాయి. ఆంక్షలు పెరిగాయి… పెత్తనాలు తగ్గాయి. అద్దంతో అనుబంధం గాఢమయింది. యుక్తవయసు వచ్చింది. […]

Continue Reading
Posted On :

ఓదార్పు ఘడియలు (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఓదార్పు ఘడియలు (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ఎన్. లహరి ఎవరు తెరచాపగా మారుతారు? కన్నీటి సంద్రపు ఉప్పు నీటి సుడుల్లో గింగిరాలు తిరుగుతున్న బాధలు ఉప్పెనలా చుట్టుముడుతుంటే ఆనంద భాష్పాలు శూన్యం! నిర్లిప్తతలో ఊగిసలాడుతున్న నావ ఇది కాలంతో పోటీ పడలేక ముడిసరుకులేని కాలభ్రంశానికి ఆగిపోతుందేమో ఈ జీవనచక్రం ఎక్కడో చిన్న అనుమానపు చూపు ఆడపిల్లగా అమాయకమైన ఓ బేలచూపు అభద్రతా భావం నన్ను కృంగదీసి నిలదీస్తుంటే.. అన్నీ ప్రశ్నల […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-44 – మాలతి చందూర్ గారి కథ “లజ్ కార్నర్”

వినిపించేకథలు-44 లజ్ కార్నర్ రచన : మాలతి చందూర్ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading

ఈ తరం నడక-11- జెన్నీ- అపర్ణ తోట

ఈ తరం నడక – 11 జెన్నీ- అపర్ణ తోట -రూపరుక్మిణి                      దుఃఖం పెల్లుబికినప్పుడు కవిత్వం ధారై ప్రవహిస్తుంది అంటారు. దుఃఖమే కాదు మనసు నిండా ప్రేమ నిండినా, మానవత్వం పరిమళం నిండినా కవిత్వం చిగురిస్తుంది. అయితే కవిత్వానికి రసజ్ఞత మూలం అనుకుంటాను. ఏ కాలాన్నైనా కవి కన్నుల నుండి చూడగలగాలి. గాలికి రూపురేఖలు కట్టి చూపడం కవిత్వ ప్రతిభ అయితే ఆ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-50)

నడక దారిలో-50 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ […]

Continue Reading

Bruised, but not Broken (poems) – 25. Corn Picker

Bruised, but not Broken (poems) -Challapalli Swarooparani  25. Corn Picker I only know how to lose But never to gain again My womanhood an affliction. I gather troubles at every step As each heaves himself up To his palanquin By stepping over my head. I am Soopanakha Who ensured Rama stayed monogamous The queen Prameela […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-10- చిక్ లిట్ – కడలి

ఈ తరం నడక – 10 కడలి – “చిక్ లిట్” (నవల) -రూపరుక్మిణి              ఈ శీర్షిక మొదలుపెట్టి ఇప్పటికి పది నెలలు అయింది. ఒక్కొక్కటిగా చదువుతూ, కొత్తగా నిర్మించుకుంటున్న సాహిత్యదారులను వెతుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగేయడం మనసుకి భలే బాగుంది.           “ఎవరు డిఫరెంట్ గా రేపటి కంటెంట్ ని చూపించగలుగుతున్నారు?” అని వెతుకుతున్న నన్ను “చిక్ లిట్ ” ఆకర్షించింది. […]

Continue Reading
Posted On :

జన్యు బంధం (కథ)

జన్యు బంధం -కామరాజు సుభద్ర పాతరోడ్డైనా గట్టిగా ఉండడంతో పెద్దగా కుదుపులు లేకుండా సిటీవైపు వస్తోంది ట్యాక్సి. శారద వెనకసీట్లో వాలి కళ్లు మూసుకుని కూర్చుంది. పక్కనే ఉన్న కోడలు మృదుల కిటికీలోంచి బయటికి చూస్తోంది. ముందుసీట్లోవున్న కొడుకు ప్రవీణ్ రోడ్డుకేసి చూస్తున్నాడు. ప్రవీణ్ ఉద్యోగరీత్యా సిటీకి దూరంగా చిన్నటౌనులో ఉంటున్నారు వాళ్లు. శారదకు మూడునెలల నుంచి ఆరోగ్యం బాగలేదు. క్రితంనెలలో సిటీకి తీసుకొచ్చి ఆధునిక సౌకర్యా లున్న పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందని […]

Continue Reading
Posted On :
Vijaya Tadinada

నేను బాగానే ఉన్నాను (క‌థ‌)

నేను బాగానే ఉన్నాను -విజయ తాడినాడ  నా ప్రియమైన నీకు .. .. ‘ఎలా ఉన్నావు? బాగున్నావా?’ ఇదొక అర్థం లేని ప్రశ్న కదూ?           అసలు “బాగుండటం” అనే పదానికి అర్థం ఏంటో?’ అని చాలాసార్లు ఆలోచిస్తాను.. విఫలమవుతూనే ఉంటాను.           చిన్నతనంలో నేనే ఒక రాకుమారిని.. అమ్మ అనురాగం, నాన్న మమకారం .. అన్నల మాలిమి, అక్కల మక్కువ …. అన్నాలాటలు, తొక్కుడుబిళ్లలు, […]

Continue Reading
Posted On :

మాకు మీరూ మీకు మేమూ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

మాకు మీరూ మీకు మేమూ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -జి.యెస్.లక్ష్మి “ఇప్పుడెలాఉంది పిన్నిగారూ..” నెమ్మదిగా కళ్ళు విప్పిన అనసూయకి తన మీదకి వంగి ఆరాగా అడుగుతున్న ప్రసన్నని చూస్తే “అమ్మయ్యా..” అనిపించింది. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది ప్రసన్న.. “వేడిగా కాఫీ కలిపి తెమ్మంటారా..” అనడిగిన ప్రసన్నని వద్దని చేత్తో వారిస్తూ.. హాల్ వైపు చూసింది. ఆమె ప్రశ్న తెలిసినట్టు “బాబాయిగారూ… పిన్నిగారు లేచారు..” […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-49)

నడక దారిలో-49 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, బియ్యీడీ పూర్తిచేసి, […]

Continue Reading

Bruised, but not Broken (poems) – 24 Mother Curry

Bruised, but not Broken (poems) -Challapalli Swarooparani  24. Mother Curry You’re the consumers of Ghee-mixed food, my lords. Till now, none has taught us, Sirs, That food has caste And gruel, religion. I swear on my mother In our abject poverty It was this curry, Sirs, That saved our race From hunger pangs And filled […]

Continue Reading
Posted On :

The tune of life (Telugu:Jeevaragam By K. Varalakshmi)

The tune of life (జీవరాగం) (Telugu Story) Telugu Original : Smt. K. Varalakshmi Garu English Translation : Dr. K. V. Narasimha Rao It was not known why the train had stopped for such a long time. I kept the novel that I was reading, aside with annoyance and looked out of the window. The view […]

Continue Reading

జాహ్నవి (హిందీ: `जाह्नवी’ – లతా అగర్వాల్ గారి కథ)

జాహ్నవి जाह्नवी హిందీ మూలం – లతా అగర్వాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “దయచేసి వినండి. భోపాల్ జంక్షన్ నుంచి వారణాసికి వెళ్ళవలసిన బండి కొద్దిసేపట్లోనే ప్లాట్ ఫారం నెం. ఒకటి మీదికి వస్తోంది.” రైలు నిర్వాహకుల ద్వారా ప్రకటన చేయబడింది. ప్రయాణీకుల్లో ఆత్రుత మొదలయింది. అందరూ డిస్ప్లే బోర్డు మీద తమ-తమ బోగీ నెంబరు వెతుక్కుంటూ ముందుకీ వెనక్కీ వెడుతున్నారు. అయిదు నిమిషాల్లోనే ధడధడమని ధ్వనిచేసుకుంటూ ట్రైన్ తన వేగంతో […]

Continue Reading

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -సింగరాజు రమాదేవి విషాదమేమీ ఉదాత్తమైన భావన కాదు! దాన్ని అర్ధం చేసుకుని అధిగమించేందుకు చేసే ప్రయాసలోనే ఉంది ఉదాత్తత! పిరికితనం నేరమేమీ కాదు! భయపడుతూ అయినా చేసే తిరుగుబాటు ప్రయత్నంలోనే దాగి ఉంది ధీరత్వం! నిరంతరం ఒకరి నీడలో, బేలగా పరాధీనగా బ్రతికితే అంతా ప్రశాంతమే! జీవితపు ఉపరితలం పై అలవోకగా ఆనీ ఆనకుండా అడుగులేస్తుంటే అంతా నునుపే! గుండెలనిండా ఊపిరిపీల్చుకుని బలంగా కాలు […]

Continue Reading

ఈ తరం నడక-9- అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ఈ తరం నడక – 9 అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి -రూపరుక్మిణి. కె             మనిషై పుట్టాక ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేయక తప్పనిసరి. పసితనంలో మొదలైన ఆలోచనలలో ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో..? ఎవరి ఆలోచన ఎక్కడ మొదలవుతుందో మనకి తెలియదు.           ఇలా కొన్ని కథలు చదువుతుంటే ఇన్ని ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు ఈ […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి  -డా. సిహెచ్. సుశీల ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే సంప్రదాయం లేని రోజుల్లో, కనీసం అక్షర జ్ఞానం లేని రోజుల్లో కూడా వారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మల ద్వారా విని నేర్చుకున్న పాటల్ని పాడుకునే వారు. శ్రామిక స్త్రీలు కూడా పొలం పనుల్లో వరినాట్లు లోనో, కలుపు తీస్తూనో, శ్రమ తెలియకుండా, అలుపు రాకుండా పాటలు పాడుకునేవారు. దంపుళ్ళ పాటలు, తిరగలి పాటలు, కవ్వం పాటలు నుండి పెళ్ళిసంబరాలకి […]

Continue Reading

కలల కరపత్రం (కవిత)

కలల కరపత్రం -డా||కె.గీత అమ్మా! ఎందుకేడుస్తున్నావు? అప్పటిదాకా గాలిపటం ఎగరేస్తున్న బిడ్డడేడనా? ప్రపంచపటమ్మీద సరిహద్దుల కోసమో ఆధిపత్యం కోసమో కలల్ని కూలదోసేచోట గాలిపటాలకు తావుందా? రోజూ బాంబు దాడుల మధ్య తిండీ, నిద్రా లేని పసికందుల భవిష్యత్తునీ నేల రాస్తున్న చోట ఒక్కటే మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నది యుద్ధ కుతంత్రం- అయినా ఎగరేయాలి- స్వేచ్ఛగా వీధుల్లో బంతాటాడుకునే బాల్యాలు మళ్ళీ మొలకెత్తేవరకు ఎగరేయాలి- నీ బిడ్డడు కూలిన భవంతుల కింద దారపు ఉండ చుట్టుకున్న చెయ్యిగానో తెగిన […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-8- లిప్తకాలపు స్వప్నం- స్వర్ణ కిలారి

ఈ తరం నడక – 8 లిప్తకాలపు స్వప్నం – స్వర్ణ కిలారి -రూపరుక్మిణి. కె           ప్రవహించే నది పాయలు పాయలుగా చీలినా., తనలో ఉధృతి ఎంత మాత్రమూ తగ్గదన్నట్లు , జీవితంలోని ఆటుపోట్లతో మనిషి అంతరంగం అల్లకల్లోలమైపోవడం చూస్తూనే ఉంటాం. అందరం ఏదో ఒక సందర్భంలో ఈ ఆటుపోట్లని ఎదుర్కోవాల్సిందే.           అమ్మ మనసుకి ఎన్ని గాయాలైనా… తన బంగారు పిల్లలు లేడీ […]

Continue Reading
Posted On :

ముందడుగు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ముందడుగు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చిలుకూరి ఉషారాణి ఉదయాన్నే మందుల షాపులో, శైలు, మీకే ఫోన్ అని షాపు యజమాని పిలవగానే, నాకా… అన్నది అనుమానంగా, ఇక్కడ మీరొక్కరే కదా ఉన్నారు. అంటే మీరేగా శైలు. అన్నాడు షాపతను. అవును నేనే, అని చెప్పి ఆ ఫోన్ ను అందుకుంది. బుజ్జి పాపాయికి పద్ధెనిమిదో పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అట్నుంచి వినపడగానే, ఆనందంతో వెల్లి విరిసిన  మోముతో, హేయ్ తేజ్, […]

Continue Reading

అడవి పువ్వు (అమృతాప్రీతమ్ కథ “వైల్డ్ ఫ్లవర్” కి అనువాదం)

అడవి పువ్వు (అమృతాప్రీతమ్ కథ “వైల్డ్ ఫ్లవర్” కి అనువాదం) -కాత్యాయని మా పొరుగింటి వాళ్ళ ముసలి నౌకరు పర్బతీ. అతని పడుచుపెళ్ళాం అంగూరీ ఇటీవలే కాపురానికొచ్చింది. అతనికిది రెండోపెళ్ళి. మొదటిభార్య ఐదేళ్ళ కిందట చచ్చిపోయింది. ఆమె కర్మకాండలు చెయ్యటానికి గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరీ తండ్రి పరిచయమై తన కూతురినిచ్చి పెళ్ళి చేశాడు. పెళ్ళి నాటికి అంగూరీ చాలా చిన్నపిల్ల కావటంవల్లా, కీళ్ళవాతంతో మంచానపడిన తల్లిని చూసుకోటానికి ఇంకెవరూ లేనందువల్లా వెంటనే కాపురానికి పంపలేదు. ఇటీవలే పర్బతీ […]

Continue Reading
Posted On :

బతుకమ్మ పద్యాలు

బతుకమ్మ పద్యాలు -సముద్రాల శ్రీదేవి సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో దివ్యమైన బాట దేవిమాట తీరుతీరు పూలు గౌరమ్మగను నవ రాత్రులందు మారి చిత్రముగను నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి నారిగణము నాడు దీరులైరి న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట ఊరువాడయాటలుయ్యాల పాటలు నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ వనములోన మనము జనజాతర గణము దివ్యమైన బాట దేవిమాట […]

Continue Reading

వస్తున్నా (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

వస్తున్నా (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – నీరజ వింజామరం అనంత చైతన్య తరంగాన్ని నేను శ్రమించకుండా విశ్రమించానేం ? ఎన్నటికీ వాడని నిత్య వసంతాన్ని నేను నవ్వుల పువ్వులు పూయకుండా వాడిపోయానేం? అంతులేని ఆశల కిరణాన్ని నేను నిరాశను చీల్చకుండా నిల్చుండి పోయానేం? లోతు కొలవరాని అనురాగ సంద్రాన్ని నేను కెరటంలా ఎగిసి పడక అలనై ఆగి పోయానేం? ఎందరి మనసుల్లోనో వెలిగిన నమ్మకాన్ని నేను వెలుగులు విరజిమ్మకుండా ఆరిపోయానేం ? […]

Continue Reading
Posted On :

“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష

“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష -సునీత పొత్తూరి జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాల సాహిత్యం పట్ల ఈ మధ్య ఎక్కువగా యూత్ ప్రభావితం అవుతున్నారని తోస్తోంది. జపనీస్, కొరియన్ భాషలు నేర్చుకోవడం, ఇంక అక్కడి సంగీతం అయితే మరీను – యూత్ అంతా అమితంగా ఇష్ట పడుతున్నారు. ఈ పుస్తకం నాకు చదవమని ఇచ్చినది అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న నా మేనకోడలు. తను జపనీస్ […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

https://www.youtube.com/watch?v=WUHdxewIEec&feature=youtu.be  ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం. తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.           బలభద్రపాత్రుని రమణి పరిచయం అవసరం లేని పేరు. సినిమా, టీవీ, వెబ్ సిరీస్ ల రచయిత్రిగా, […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-7-కొత్త తలుపు- కాళ్ళకూరి శైలజ కథలు

ఈ తరం నడక – 7 కొత్త తలుపు- కాళ్ళకూరి శైలజ కథలు -రూపరుక్మిణి. కె ఒక ఆలోచన మనల్ని మనుషుల్లోనికి లాక్కెళుతుంది. మనిషిని చేస్తుంది. good thoughts gives us a good life మన ఆలోచనలే మనల్ని ఇతరులకు పట్టించేస్తాయి. అనిపించక మానదు ఈ “కొత్త తలుపు” తెరిచినప్పుడు. శైలజ గారు మీతో ఒక చిన్నమాట ” మన మాటల్లో ఎప్పుడూ దొర్లిపోయే కాలం ఇక్కడ చాలా మారాం చేసేసిందండి “. ఆల్చిప్పలో ముత్యం […]

Continue Reading
Posted On :

వాన తడపని నేల (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వాన తడపని నేల (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -ఝాన్సీ కొప్పిశెట్టి మేడమీద ఆరుబయట నీలాకాశపు పందిట్లోతెలిమంచు పరదాల సందిట్లో మిణుకు మిణుకు మంటూ మెరిసే తారల ముంగిట్లో చంద్రుని వెన్నెల కౌగిట్లో పాతకాలపు నవారు మంచం పైన వెల్లకిలా పడుకుని సిరిచందన రవితో పరవశంగా మాటాడుతోంది. పేరుకి తగినట్లే సిరి, చందనాల మేళవింపు ఆ మోము. మొబైల్లో రవి సెక్సీ గళానికి, అతని రొమాంటిక్ భావాలకు, అతడి వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు […]

Continue Reading

నిటారు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

నిటారు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -మణి వడ్లమాని           “రండమ్మా ! రండి చూడండి, లోపలికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. నచ్చితేనే కొనండి. అందరూ మెచ్చే అన్ని రకాల బట్టలు ఇక్కడే ఉన్నాయి. శ్రీలీల చీరలు, రష్మిక చీరలు, అలాగే పాత సినీ తారలు అప్పట్లో వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి కట్టే చీరలో మా ఒక్క షొప్ లోనే దొరుకుతాయి. తప్పకుండా దయచేయండి ”           ఆకట్టుకునే ఆమె మాటల చాతుర్యం […]

Continue Reading
Posted On :

కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి ఆమె చేతి వేళ్ళు వెదురు బద్దలపై ప్రతిరోజూ నెత్తుటి సంతకం చేస్తాయి పంటి బిగువున బాధను బిగబట్టి పక్షి గూడు అల్లుకున్నట్టు ఎంతో ఓపికగా బుట్టలు అల్లుతుంది ఆమె చేయి తాకగానే జీవం లేని వెదురుగడలన్నీ సజీవమైన కళాఖండాలుగా అందంగా రూపుదిద్దుకుంటాయి తనవారి ఆకలి తీర్చటం కోసం రేయింబవళ్ళు ఎంతో శ్రమిస్తుంది తెగిన వేళ్ళకు ఓర్పును కట్టుగా కట్టుకుని […]

Continue Reading

బతుకు పుస్తకాన్ని తెరిచిన ఆత్మకథ ‘యాదోంకీ బారాత్’

బతుకు పుస్తకాన్ని తెరిచిన ఆత్మకథ ‘యాదోంకీ బారాత్’ -కల్వకుంట్ల శ్రీలత రావు తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలను పరిశీలిస్తే అవి సాహిత్యపరమైనవి, రాజకీయపరమైనవి, ఆధ్యాత్మికమైనవి, సాంఘికమైనవి, సాంస్కృతికమైనవి ఇలా రక రకాలుగా కనిపిస్తాయి. సాహిత్యపరమైనవిగా చూస్తే కందుకూరి ‘కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్ర’, చిలకమర్తి వారి ‘చిలకమర్తి లక్ష్మీనర సింహం స్వీయచరిత్రము’ ఇంకా శ్రీ శ్రీ ‘అనంతం’తదితరాలు అనేకం ఉన్నాయి. రాజకీయ ప్రస్థానంతో రాసిన స్వీయ చరిత్రల విషయానికి వస్తే టంగుటూరి ప్రకాశం గారి *నా జీవితయాత్ర [3 […]

Continue Reading
ravula kiranmaye

స్మశానపూలు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

స్మశానపూలు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -రావుల కిరణ్మయి మెరుపు తీగ లాంటి దేహసౌందర్యంతో, కమలముల వంటి కన్నులతో తుమ్మెదల వంటి కురులతో చంద్ర బింబం వంటి మోముతో నతనాభితో మరున్నారీ శిరోరత్నములా అచ్చం అల్లసాని మనుసంభవ నాయిక వరూధినిలా ఉంది కదూ ! తెలుగు అధ్యాపకుడి నయిన మధుకర్ మనుచరిత్రను బోధిస్తున్నట్లుగా వర్ణనాత్మకంగా ‘’ఆమె ‘’సౌందర్యాన్ని తన ధోరణిలో తన భార్య మరాళికి చెప్పేసరికి , మరాళి కళ్ళ లో నిళ్ళు […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

https://www.youtube.com/watch?v=ECPTAGvkTMM ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం.           తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.           “డా||అమృతలత” అంటే తెలుగు సాహితీ, విద్యా రంగాల్లో పరిచయం అవసరం లేని […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-6-కుంకుమ పూల తోట – స్వయంప్రభ

ఈ తరం నడక – 5 రూపం మార్చుకున్న నిరీక్షణ – గీతా వెల్లంకి -రూపరుక్మిణి. కె           ఒక్కోసారి కొందరిని చదువుతూ ఉంటే,           మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.          పుస్తకం చిన్నదే కదా,  ఎందుకు ఇంత సేపు?          అవుతుంది తిరగేసిన పేజీలే మళ్ళీ ఎందుకు తిరగబడుతున్నాయి ??          మనసుని […]

Continue Reading
Posted On :