image_print

నల్లబడిన ఆకాశం (కవిత)

నల్లబడిన ఆకాశం – డా॥కొండపల్లి నీహారిణి కొంత చీకటి తలుపు తెరుచుకొని వచ్చాక నిన్నటి కారు మేఘం క్రోధమంతా మరచినప్పుడు కొత్త దారిలో చూపుగాలానికి చిక్కుతుంది మసక బారిన దృశ్యాలు కంటి తెరపై టచ్చాడి ఉచ్చులు విడదీసుకుంటూ పెనవేసుకుంటూ గది మొత్తం కథలా కదలాడుతుంది పెదవి విరిచిన ముసలినవ్వొక్కటి నువ్వు పుట్టినప్పటి సంగతులు గతితప్పనీయని మజిలీలనుకున్నది మబ్బులు కమ్మిన నింగి వెనుక ఏమి దాగుందో చీకటిలో కలవాలనే హృదయ జ్యోతులు వ్యధాభరిత వృద్ధాప్యానికి పెనుసవాళ్ళనేమీ విసరవు సన్నగిల్లిన […]

Continue Reading
Posted On :

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా నాలుగు రోజుల గుండె బరువు కన్నీటి మడుగులో కడిగి దింపలేని ఇరుకును మనసు గోడలకు తెలియని కడుపుదేనని ఐదు దశాబ్దాల నిశ్శబ్ద క్షుత్తు నొప్పి నుండి దాటిరాలేని బతుకు భ్రమ భ్రమలు బతుకైనప్పుడు దాటిరాగల […]

Continue Reading
Posted On :

గృహవాసం (కవిత)

గృహవాసం – డా॥కొండపల్లి నీహారిణి అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు. వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది! కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ, గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో నమస్కారం!! నాలో నేను రంగులేసుకున్న బొమ్మనై, నవ్వుల్ని విచ్చుకుంటుంటే, మరో ఆశ్చర్యం ముందటర్ర వరకూ తీసుకుపోయింది. వాళ్ళమ్మకు అందిచ్చినట్టే మా అమ్మకూ ఆయన చాయగిలాసనిస్తుంటే, ఇనుమడించిన గౌరవాలకు హృదయ ఛాయ ఒకటేదో చెప్పని సాక్ష్యమయ్యింది నేను […]

Continue Reading
Posted On :

కలలు (కవిత)

కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు పాత్రలో నింపినప్పుడు అభివృద్ధి ఒత్తిడీ విడదీయరాని బాంధవ్యాల సుగంధాలు మోసుకొస్తూ చెమట చుక్కల లెక్కలు ఎందుకు అన్నప్పుడు సాయం సమయపు యానం ఏమీ ఆనంద విమానం ఎక్కనప్పుడు నిమిషాలు గంటలుగా విరాజిల్లే నాలుగు చక్రాల […]

Continue Reading
Posted On :