మేకప్

-బండి అనూరాధ

మరోసారి గాయాలని పిలుద్దాం
రహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాం
కాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాం
లోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం
 
రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాం
ముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాం
పచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాం
అద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం
 
చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి తప్ప
వెలుగులుచిందే ముఖాలు ఎన్నీ భూమండలమ్మీద
అయినా ఎందుకో దుఃఖాన్నంతా తలగడకిద్దాం
చిరునవ్వుతో కాలంపై యుద్ధం చేద్దాం

*****

Please follow and like us:

4 thoughts on “మేకప్ (కవిత)”

 1. ‘Genuine poetry can communicates before it is understood’.-TSEliot

  నిజానికి, ఇందులో అర్థం కానిదంటూ ఏమీలేదు. అంతా direct గానే ఉంది.

  పైకి కవితార్థం సుళువుగానే బోధపడుతున్నా కవితాంతరార్థం మాత్రం వెంటనే communicate కాదు ..కొంచెం time తీసుకుంటుంది. అది అందిన తర్వాత కలిగే అనిర్వచనీయమైన ఆనందపుటాలోచన అంతా ఇంతా కాదు..చెప్పేందుకు మాటలు చాలవు.

  ఆగని అంతులేని దు:ఖం, తగరపు ( hypocrisy) జీవితాల మెరుపులపై నిరసన, అందులోనే అందమైన వ్యంగ్యం అత్భుతంగా. పండింది .. “రసన” అంటే ఇదీ.. ఇట్లుండాలి..

  Eliot నిర్వచనాన్ని అధిగమించిన పొయెం.

  కవికీ publish చేసిన మీకూ అభినందనలు చాలవు.. ధన్యవాదాలు..

Leave a Reply

Your email address will not be published.