చూపు చెంగున…..

-చందలూరి నారాయణరావు

నేను అనుకోలేదు నా కవిత

ఓ బంధానికి
పెద్దమనిషి అవుతుందని…

ఓ మనసుకు
చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని…

ఓ సంతోషాన్ని
వరంగా బలమై నిలుస్తోందని….

ఓ కదలికను
పుట్టించి కలగా దగ్గరౌతుందని…

ఓ కమ్మనిమాట
సువాసనతో మనసు నింపుతుందని

ఓ ఆనందాన్ని
పంచే అందాన్ని మదికిస్తుందని….

ఎప్పుడు పుట్టిందో?
ఎక్కడ పెరిగిందో?
ఎలా ఎదురైందో మరి?

ఇప్పుడు
నాకై అనిపించేలా
నాలో ఇష్టమై

నా కవిత కొంగున
ఆమె బంగారం.
ఆమె చూపు చెంగున
నేనొక అనుభవం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.