ఉరి తీయబడ్డ అక్షరాలు

  –శిలాలోలిత

చెంచా గిరీలు నడుస్తున్న కాలమిది
సరిహద్దుల మీద నరుకుతున్న కాళ్లు
గుండె ఒక్కటే మనుషులొక్కటే
మానవత్వం ఒక్కటే అనే
విశ్వ మానవ ప్రేమికులు రచన ద్రష్టలు
అందరూ అందరూ కలగలవలనే కాంక్షా తీరులు(హితులు)
సంకుచిత హృదయాలతో
భూమి నుంచి చీల్చుతున్న
గండ్రగొడ్డల ధ్వనులు
అరమరికలు లేని స్వేచ్ఛ ధోరణలతో
ప్రపంచ కవుల తీరొక్కటే అని ఎలుగెత్తుతుంటే
కీర్తిలు, భుజకీర్తుల కాలమైపోయింది
కొంత _____(?)
కొంత నష్టం
ఎంపిక లోపాలు
లోపాయి కారీతనాలు
ప్రతిభావంతులు కొందరికే సమ్మానాలు
తాలు తప్పులు ఎక్కువై
సాహిత్యం అంటే భజన బృందాల సమూహమని తేలిపోయింది

ఈ మట్టిని ప్రేమించిన వాళ్లను సైతం
మసిచేసే శతృవుల నేపథ్యంలో
కొన్నాళ్ళకు
సాహిత్యమంటే బజారుపాలు కావాలిసిందేనా
ఒకరి మెప్పులకో గొప్పలకో మొక్కులకో అక్షరం ఉరివేయబడుతోంది.

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.