ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

డాక్టర్ సి. మృణాళిని తెలుగు పాఠకులకి, ప్రేక్షకులకి పరిచయం అవసరంలేని పేరు. సాహిత్యం, సంగీతం, పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు, విద్యా బోధన మొ.న అనేక రంగాల్లో అందెవేసిన చెయ్యి మృణాళిని గారు. ప్రముఖ కవి పండితులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి మనుమరాలు. ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారులు శ్రీ కె.బాలగోపాల్ గారి సహోదరి.


మృణాళిని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం కావలి, తిరుపతి, విశాఖపట్నాలలో సాగింది. వీరు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి., ఇంగ్లీషులో ఎం.ఎ. పట్టాలను సాధించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక పరిశీలన విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసారు. ఉదయం దినపత్రికకు ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేసారు. వరల్డ్ స్పేస్ రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేసారు. వీరు యు.ఎస్., చైనా, మారిషస్, మలేషియా, నార్వే తదితర దేశాలలో పర్యటించి పలు సాహితీగోష్టులలో పాల్గొని సిద్ధాంత పత్రాలను సమర్పించారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇతర తెలుగు ఛానళ్లలో 2000కు పైగా కార్యక్రమాలను నిర్వహించారు. యద్దనపూడి సులోచనారాణి, వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి పురస్కారాలు, రామినేని ఫౌండేషన్ వారి విశేష పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, ప్రజ్వలిత సాంస్కృతిక సంస్థ ‘ప్రతిభామూర్తి’ పురస్కారం అందుకున్నారు.

వీరి రచనలు:
ప్రేమిస్తే పెళ్ళవుతుందా? (నవల)
నెరేటివ్ టెక్నిక్ ఇన్ తెలుగు నావెల్ (ఆంగ్లంలో విమర్శాగ్రంథం)
తెలుగు ప్రముఖులు చమత్కార భాషణలు
ఇ(ం)తిహాసం
కోమలి గాంధారం
మాల్గుడి కథలు (అనువాదం)
గుల్జార్ కథలు (అనువాదం)
ప్రతిధ్వని
నిశ్శబ్ద విప్లవాలు
సకల
తాంబూలం
రఫీ (ఒక ప్రేమపత్రం)

(ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

 

*****

Please follow and like us:

10 thoughts on “ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి”

 1. మృణాళిని గారితో గీత గారు నిర్వహించిన ముఖాముఖి చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు గీతా మేడం.

 2. మృణాళిని గారు అక్షరయాత్ర లో సాహితీవేత్తలను చేసిన ఇంటర్యూలు అన్నింటినీ చూస్తే ప్రత్యేకించి ఇంటర్వూలు చేయాలనుకున్న వారికి పాఠ్యాంశాలని చెప్పవచ్చు.సాహితీవేత్తల రచనలన్నీ కూలంకషంగా చదివి ప్రతీ రచన నేపధ్యాన్ని,ప్రభావాలనీ రాబట్టేలా మృణాళిని గారు చేసె ఇంటర్యూలు ఉంటాయి.అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి , విదుషీమణి నుండి నెచ్చెలి ద్వారా పరిచయం చేసి మృణాళిని గారి అంతరంగ ఆవిష్కరణ చేసారు డా.గీతగారు.స్నేహశీలి అయిన మృణాళిని గారు తన పద్ధతి లోనే ఖచ్చితమైన తన అభిప్రాయాల్ని వెల్లడించారు.వారి గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలిసాయి.మృణాళిని గారికి, డా.గీత గారికి అభినందనలు & ధన్యవాదాలు ‌

  1. మీ అభినందనలకు కృతజ్ఞతలు సుభద్రాదేవి గారూ!

 3. మృణాళిని గారితో గీత గారి ముఖాముఖిలో ఎన్నో తెలియని విషయాలు చర్చించారు. తెలియని విషయాలు నేర్చుకొనేలా ఉంది. ముఖ్యంగా కొత్తగా రాసే కవులకు, రచయితలకు, విమర్శకులకు మంచి సూచనలు అందజేశారు. మృణాళిని గారి నిరాడంబరత, విషయ విశదీకరణలో స్వచ్ఛతకు అభినందనలు. ఇంత మంచి ముఖాముఖి మాకందించిన గీత గారికి ధన్యవాదాలు -వడలి లక్ష్మీనాథ్

 4. డా.గీతగారు మీరు తక్కువ మాట్లాడి బహుముఖ ప్రజ్ఞాశాలి డా.మృణాళిని గారిద్వారా ఎక్కువ విషయాలను రాబట్టారు. వారి అక్షరయాత్ర చాలా ఇంటర్వూలు చూశాను. వారు ఆ పండితుల, రచయితల ఇంటర్వూ చేయాలంటె ఎంత చదివిండాలి వారి రచనలగురించి!! ఆమె ఇచ్చిన ఇంటర్వూలు అన్నీ చూశాననే అనుకొంటాను. ఈ ఇంటర్వూ చాలా నచ్చింది.డా.గీతగారు. నేను మృణాళిని గారి వీరాభిమానిని. ఒక వ్యక్తి ఇన్ని సాధించటానికి సాధ్యం అని నిరూపించారు. World Space Radio లొ ఆమె చేసిన కార్యక్రమాలు లభిస్తాయా అని వెతుకుతుంటాను. మృణాళిని గారికి మనఃపూర్వక అభినందనలు. మనసులొ నిలిచిపోయింది ఇంటర్వూ. మృణాళిని గారిని ఒక్కసారి కలవాలని. చూద్దాం. Time decides !! ఇంత మంచి ఇంటర్వూను మాకు అందించినందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు డా.గీతగారు.

  1. మీకు నెచ్చెలి ఇంటర్వ్యూ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సుశీల గారూ!

 5. అక్షరయాత్ర చూసాక నేను మృణాళిని గారి అభిమానిని అయ్యాను. ఈ సంచికలో వారి ఇంటర్వ్యూ నే మూందుగా చూడటం జరిగింది. ఇంటర్వ్యూ చాలా బాగుంది. చాలా విషయాలు తెలిసాయి.సాహిత్యం లో క్వాలిటీ పెరగాలి అన్నది ఆహ్వానించదగిన విషయమే.
  ఆవిడ కోరినట్లు నెచ్చెలి విభిన్నమైన విషయాలను ప్రచురిస్తూ చేసిన చాలా మార్పులు గమనించాను.
  అభినందనలు గీత గారూ.

Leave a Reply

Your email address will not be published.