శ్రీ సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీలు

-ఎడిటర్

(10,000/- రూపాయల బహుమతులు)
 
   శ్రీ సింగమనేని నారాయణ గారు ఎనిమిది దశాబ్దాల జీవన క్రమంలో ముప్పాతిక పై భాగం సాహిత్యజీవిగా కొనసాగారు. ప్రసిద్ద కథకులుగా, విమర్శకులుగా, ఉపన్యాసకులుగా, సంపాదకులుగా  తనదైన ముద్ర వేసారు. నమ్మిన ఆశయాల కోసం జీవితాంతం నిబద్ధతగా నిలబడ్డారు.
 
ప్రజాస్వామిక, శాస్త్రీయ, సమసమాజ భావనలకు ఆయన రచనలు అద్దం పడతాయి. మనుషుల మధ్యే కాకుండా ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండాలనేవారు. రాయలసీమ ప్రాంత సామాజిక, సాహిత్య వికాసానికి కృషి చేసారు. సీమ ప్రాంతీయ నిర్దిష్ట జీవితాన్ని, భాషను తన కథల్లో చిత్రీకరించారు. వ్యాసాలలోనూ వివరించారు. “సీమ కథలు” అనే కథల సంకలనం కూడా వెలువరించి సీమ జీవన సంఘర్షణను  ప్రపంచానికి పరిచయం చేసారు. కేవలం రచనలు, ఉపన్యాసాలకే పరిమితం కాక సీమ సమస్యల పరిష్కారానికి  కొనసాగే కార్యక్రమాలలోను భాగమయ్యేవారు. వైవిధ్యమైన సింగమనేని గారిని ఇటీవల కోల్పోవడం బాధాకరం. సీమ సాహిత్యానికి తీరనిలోటు. 
 
శ్రీ సింగమనేని నారాయణ గారు సీమ కథాసాహిత్యానికి విశేషంగా కృషిచేసిన నేపథ్యంలో  రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం పక్షాన రాయలసీమ కథల పోటీలను నిర్వహించి, వారి స్ఫూర్తిని కొనసాగించాలని భావిస్తున్నాం. 
 
రాయలసీమ నిర్దిష్ట జీవనగతులు ఇతివృత్తంగా, కథా ప్రక్రియ లక్షణాలను అనుసరించి, కొత్తగా రాసిన కథలను 31 మే 2020 లోగా దిగువ చిరునామాకు  పంపాలి. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తం “పదివేల రూపాయల బహుమతులను” కథకులకు అందచేస్తాము.
 
సమన్వయకర్త:
# డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
శ్రీ సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీలు, అనంతపురము.
9963917187

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.