స్వరాలాపన-21

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: హంసధ్వని  రాగం 

Arohanam: S R2 G3 P N3 S

Avarohanam: S N3 P G3 R2 S

చిత్రం: మహానది (1994)

గీతం: శ్రీ రంగ రంగ నాధుని

సంగీతం: ఇళయరాజా

గీత రచన: వెన్నెలకంటి

పాడినవారు: యస్.పి.బాలు & చిత్ర

శ్రీ రంగ రంగ నాధుని దివ్య రూపమే చూడవే

రీగారిగాగ రీపగా రీస సారిగా రీససా

శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే 

రీగారిగాగ రీపగా రీస ససరిగా రీససా

నీలవేణిలో నీటిముత్యాలు

గాపగాదపా గాద పాగారి 

కృష్ణవేణిలో అలల గీతాలు

గగపగాదపా గగద పాగారి 

నీలవేణిలో నీటిముత్యాలు నీరాజాక్షునికి పూలుగా

గాపగాదపా గాదపాగారి గాపగాదపగ గాదపా

కృష్ణవేణిలో అలల గీతాలు క్రిష్ణగీతలే పాడగా

గగపగాదపా గగద పాగారి గగప గాదపా గాదపా

శ్రీ రంగ రంగ నాధుని దివ్య రూపమే చూడవే

రీగారిగాగ రీపగా రీస సారిగా రీససా

శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే 

రీగారిగాగ రీపగా రీస ససరిగా రీససా

క్రిష్ణ తీరాన అమరావతిలో 

గాపనిసాసాస నినిసా పసపగా    

శిల్పకళావాణి పలికిన శ్రుతిలో

గాపనిసాసాస నినిరిస పసపగా 

అలలై పొంగెను జీవన గీతం

పనిరీ* రి*గ*సా*ని నిగ*రి*గ*సా*నీ 

కలలే పలికించు మధు సంగీతం

పనిరీ* రి*గ*సా*ని నిగ*రి*గ*సా*నీ 

చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా

సాససా నీసనీపపా  పానిపాగాప నీసనీ 

వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా

సాససా నీసనిపగాప పానిపాగాప నీసనీ 

శ్రీ త్యాగరాజ కీర్తనై సాగే తీయని జీవితం 

రీరీరి నీరి నీపనీ పాని పాగపా గాగ పగరి పగరి రిస 

గంగను మరపించు ఈ కృష్ణవేణి

గాపనిసాసాస నీసాని పనిసా నిపపగా    

వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి

గగపని సాసాస నినిసాని పనిసా నిపగా

పాపాల హరియించు పావన జలము

గాపాని రి*గ*సా*ని* ని*గ*రి*గ*  నిస*ని*

పచ్చగా ఈ నేల పండించు ఫలము

గాపాని గా*సా*ని* ని*గ*రి*గ*  నిస*ని*

ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా

సాసాస నీసనీనినీ పానిపాపపా గాపనీసనీ 

సిరులెన్నొ పండి ఈ భువి స్వర్గలోకమై మారగా

సససాససాస నీసనీ పానిపాపపా గాపనీసనీ 

కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో

గా*గ*సాససా  పాసపాపా నీపాగగాగ పగరి పగరి రిస 

శ్రీ రంగ రంగ నాధుని దివ్య రూపమే చూడవే

రీగారిగాగ రీపగా రీస సారిగా రీససా

శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే 

రీగారిగాగ రీపగా రీస ససరిగా రీససా

 *****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.