వాంగ్మూలం

(మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా)

-అరణ్యకృష్ణ

(జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని తెలుగులో “ఒకతల్లి” పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు. ఉద్యమంలో కన్నుమూసిన తన కుమారుడి మరణానికి కారణాల కోసం ఒక తల్లి చేసే అన్వేషణ ఈ అద్భుతమైన నవలకి కథాంశం. ఆ పుస్తకం చదివి నేను రాసిన కవిత ఇది. ఆమె స్మృతికి అంకితం. ఈ కవితని Nauduri Murty గారు ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. ధన్యవాదాలు మూర్తి గారూ! తెలుగు కవిత కింద ఇంగ్లీష్ అనువాదం కూడా చదవండి.

వాంగ్మూలం

ఈ ప్రపంచంలో అమ్మని మించింది ఏదో కావాలి
నా అన్వేషణకి గమ్యాలు అనేకం
బహుశ మృత్యువు అందులో ఒకటి కావొచ్చు
అమ్మా క్షమించు… నిన్నుకూడా పరాయిగా చూసినందుకు
మరి సెలవని చెప్పకుండానే నిష్క్రమించినందుకు
ఎవరికి ఏమీకానీ సామూహిక జీవితంలో అందరం ఒంటరివాళ్ళమే
అందుకే ఏకాకినై బైటకి నడిచాను
నా గురించి దుఖించేవారి కంటే నన్నెదురు చూసే వాళ్ళవైపే ప్రయాణం కట్టాను
నేను ఆగిపోయి ఉంటే జీవితాన్ని భుజం మీద కళేబరంలా మోస్తూ తిరగటమే అయ్యేది
నిన్ను తీరాన వదిలేసి అవతలిగట్టుకు ప్రయాణమైపోయాను
నేనెక్కిన పడవ మధ్యలోనే ముక్కలు కావొచ్చు
నాకు తెలుసు నేను చచ్చిపోతే అందరూ బాధపడతారు
నువ్వొక్కదానివే దుఖాతీతంగా కకావికలమైపోతావు
నాకు తెలుసు మార్చురీలో బిడ్డ శవాన్ని గుర్తు పట్టమంటే
అతనింకా తన గర్భంలోనే ఉన్నాడనే భ్రాంతిని అమ్మ పెంచుకుంటుందని
***
ఎగరటం మరిచిన పక్షుల్లానో
రెక్కలు ఊడిన గాజుపురుగుల్లానో
మనమంతా దేకుతూ బతికే కుటుంబం … అది పంజరమో సాలెగూడో
నాన్నల ఏర్పాటే కదా! అందరమూ బందీలమే
బందీలమధ్య నవ్వుల్లో కరచాలనాల్లో ముద్దుల్లో కౌగిలింతల్లో
రక్తమాంసాల ఒరిపిళ్ళే తప్ప
కరెన్సీ నోట్ల కత్తెర్ల చప్పుళ్ళే తప్ప ప్రేమానురాగాల ప్రవాహమేది?
కుటుంబం అంటే ఒకర్ని మరొకరం నేలమట్టం చేసేసి
ఓడిపోయిన వాళ్ళమీద జెండా ఎగరెయ్యటమే కదా
స్వేచ్చనీ కాంతినీ ద్వేషిస్తూ మనసుని చీకటిబజారు చేయటమే కదా
పంజరం విదిల్చి పరేసిన పక్షి కళేబరం లాంటి
సాలెగూడు వదిలేసిన ఈగ అస్థిపంజరం లాంటి
దయనీయ పతాక సన్నివేశాన్ని జీవితానికి ఏర్పాటు చేసుకోవటమే కదా
ఎన్ని తరాల తల్లుల పిల్లల నెత్తుటితో తడిశాయో నా ఇంటి గుమ్మాలు
ఎన్ని సమాధుల పునాదుల మీద లేచాయో ఆ వంటిళ్ళు పడగ్గదులు
రక్తసిక్తమైన నీలాంటి తల్లులెందర్నో చూసాను
మానవ మహా విషాదాన్ని వీధుల్లోనూ మురికివాడల్లోనూ చూసాను
రూపాయిలకు బ్లేళ్ళు మొలిచి జీవితాల్ని కోసెయ్యటాన్ని
ధాన్యం గిడ్డంగుల ముందు అనాధల ఆకలిచావుల్ని
పనిముట్ల పళ్ళమధ్య పుళ్ళు పడిపోయిన పసితనాన్ని చూసాను
నాన్నలనుండి ప్రభుత్వాలదాకా శతృరూపం బహుముఖం
జీవితం మీద ప్రేమతో శతృవుతో పోరాటానికి వెళ్ళాను
అమ్మా! ఈ ప్రపంచంలో అమ్మని మించింది పోరాటం ఒక్కటే
(“కవిత్వంలో ఉన్నంతసేపూ….” నుండి)
 

An Apology to Mother

I am in search of something sacrosanct to mother.
The reasons for my search are several,
Death, perhaps, is one among them.
Mother!
Pardon me for not taking you into confidence
And leaving you without proper leave-taking.
In this ensemble of estranged people,
All of us are loners
Serving sentences of exile!
That’s why I walked out of it — alone.. .
From the people who grieve for me
I coursed towards those who await me.
Had I stayed behind for any reason
I would only be lugging my life
Like a corpse on my shoulders.
I rowed off to the thither bank
Leaving you behind hither.
Who knows… my boat may sink midway through!
.
I know, when I am dead, people would grieve for me,
And, above all grief, you will be shattered.
I know what it feels to a mother
to identify her child lying in the mortuary:
she develops the illusion
that he was ‘still’ in her womb.
***
What’s there in our homes?
You may better call them cages or cobwebs instead,
Where we live like birds that have forgotten to fly
Or like beetles clipped off wings.
They are there only as conveniences for our fathers?
.
We are all prisoners.
And among the prisoners, what’s there in their laughter,
In their shake-hands, embraces and kissing
But for the heat of corporeal senses
And the hissing of the crisp currency notes?
Did the warm currents of love and affection
Ever flow from one to the other?
Knocking the other man down
The victorious hoists his flag over the vanquished;
Or, cursing freedom and knowledge
Makes his heart a haven to darkness;
Or, scripts pitiful climaxes to life
As of a cage easing off a dead bird;
Or, a spider letting go off the skeleton of a house fly…
That’s all!
For how many generations my doors must have bathed
In the blood of mothers and their daughters!
And on how many tombs of theirs
These Kitchens and Bedrooms have been raised!
No violence can surpass killing of the ‘self’ each day…
Mother!
I saw many mothers bathed in blood like you.
Saw greater human tragedy on the streets and slums,
Saw the razors of rupee slivering lives with finesse,
Saw starvation deaths before hoards of food grain,
Saw childhood ulcerated between the merciless cogs of machine tools
And saw the man-eater Democracy
Sucking people’s blood in gulps.
.
From fathers to governments
The enemy is omnipresent and polygenic.
Just for the love of life,
Dear Mother, I took cudgels against the enemy.
Mother!
If there is anything in this world
Sacrosanct to you
It’s just… ‘Revolution’.
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.