సంతోషాన్ని వెతుకుతూ -హేమావతి బొబ్బు సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని పబ్బుల్లో ఉందో మబ్బుల్లో ఉందో తాగే మందులో ఉందో చల్లటి చెట్టు నీడలో ఉందో మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లో లేకా ప్రేమించే గుండెలోన హిమాలయాల లోనే కలియతిరుగుచూ కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిళ్ళలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలో యవ్వనాన ఎదిగేను మహావృక్షంగా నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచి పోయెను నేను ఎదిగానని తలచి ***** నేను Continue Reading