
వికసించే సందర్భాన్ని కలగంటూ
-గవిడి శ్రీనివాస్
మౌనంగా ఉండే మనసు
రెప్పల పై ఎగిరే తూనీగలకి
స్పందిస్తుంది.
ఈ కాసింత మౌనం
చూపులతో మాట్లాడుతుంది.
విరిసే గులాబీల మీద
మెరిసే రెమ్మల మీద
కాంతిని ఈ కళ్ళలోకి
ప్రవహింప చేస్తుంది.
పువ్వు సహజంగానే
వికసిస్తున్నట్లు
మనసు మౌనంగానే
పరిమళిస్తుంది.
సమాధాన పరచలేని ప్రశ్నలకి
ప్రకృతి ధర్మం జవాబు ఇస్తుంది.
నా చుట్టూ వీచే గాలులు
ఊగే ఆకులు
మనసుని ముంచి పోతుంటాయి.
నేను నా కలల ప్రపంచంలో
మునిగిపోతుంటాను.
కలువ పువ్వులా
వికసించే సందర్భాన్ని కలగంటూ….!
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
