స్వదేశం -కుందుర్తి కవిత విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా… ఆలోచనలు ఏదో అజెండా తో గిర్రున వెనక్కి తిరిగి జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి… పదిహేనేళ్ళ నా పూర్వం పరదేశంలో తన పునాదులు వెతికింది!! ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే మనసు మనసులో ఉండకపోవడం… మన దేశం నుంచి ఎవరొచ్చినా సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం… మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం మన దేశపు చిన్ని భాగాన్నైనా ఇంట్లో బంధించామని పొంగిపోవడం… పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ , “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా” అని మైమరిచి పాడటం.. జణగణమన తరువాత జై హింద్ కి ప్రతీసారీ అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం… ఇవన్నీ దేశాభిమానానికి Continue Reading