పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు

పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు -నాగరాజు రామస్వామి  పరామర్శ  ( Visit ) హాస్పిటల్. కాళీమాత రక్తవర్ణ నోటిచొంగ లాంటి ఎర్రెర్రని దుస్తుల్లో ఆయాలు. క్రిక్కిరిసిన వరండాలలో కోలాహలం; కడుగుతున్న బెడ్ పాన్ల గణగణలు, ఓదార్పుల, దూషణల రణగొణలు, అన్ని చికాకుల నడుమ ఆమె గదిలో బట్టలు వేలాడుతుంటవి, గృహకలతలు చెలరేగుతుంటవి, పెళ్ళి ముచ్చట్లు కొనసాగుతుంటవి, పరామర్శకులు పద్యాలు పాడుతుంటరు, ఆమె ఓ వృద్ధవర్షీయసి, ఆమె కోర్కెలు తెగిన పతంగులు, తొంటి విరిగినా తీరని మరణేచ్ఛ; వచ్చిన వాళ్ళందరు రాని మృత్యువును కోరుకుంటరు, అమెరికన్ యాసల మనుమలు ఆమె పాదాలకు మొక్కుతుంటరు, Continue Reading

Posted On :