ఓటమి (కవిత)

ఓటమి -ఎరుకలపూడి గోపీనాథరావు సమ ఉజ్జీవుల నడుమ సాగే హోరాహోరీ స్పర్థలో ఓటమి కూడ ఒక్కింత ఆనందంగా, కొంత గౌరవ ప్రదంగానే ఉంటుంది! మన తప్పిదాలపై మన బలహీనతలపైనా, పొరబాటుకు తావీయని ఎదుటివారి సత్తువపైనా నిజాయితీగా సమీక్ష చేసుకునే సదవకాశాన్ని కల్పించి లోపాలను సరిదిద్దుకునే సలహాలను, రేపటి గెలుపుకు తగిన క్రొత్త వ్యూహాలనూ అందించే అపజయం సాధనకు సానబెట్టి విజయ సంకల్పానికి వినూత్న శక్తినిస్తుంది! యుక్త యుక్తినిస్తుంది! పరాజయాలను పరాభవాలను ప్రతికూల స్థితుల పరంపరలనూ పరాస్తం చేస్తూ […]

Continue Reading

మార్పు (కవిత)

మార్పు -ఎరుకలపూడి గోపీనాథరావు అగచాట్ల పోటులను, అదవదల కాటులను, వంచనల పాటులనూ అమితంగా అనుభవించిన ఆతనిని బాధల గిలి ఇక ముట్టలేదు! ప్రభుత్వ ప్రణాళికల ప్రదర్శనల చేత, పాలకుల ప్రతిజ్ఞల ప్రవాహల చేత, బాబాల భవిష్య వాణి ఫర్మానాల చేత, జాతక చక్ర తంత్ర జాల తీర్మానాల చేత అనేక మార్లు మోసగించబడి విసిగి వేగి వేసారిన అతనిని పరాభవాల గేళి ఇక చుట్టుముట్ట లేదు! ఆశల పత్రాలను రాల్చే శిశిర కాలానంతరం అభిలాషలను వికసింపజేసే వసంత […]

Continue Reading

దుర్దశ దృశ్యాలు (కవిత)

దుర్దశ దృశ్యాలు -ఎరుకలపూడి గోపీనాథరావు వ్యాపార వాతావరణ కాలుష్యం దట్టంగా వ్యాపించిన బజారు వంటి సమాజంలో బహు విధాల వస్తువులుగా మార్పిడి చెందుతూ త్రోసుకుంటూ, రాసుకుంటూ సర్వత్రా మానవాకృతుల మాదిరి దివారాత్రులూ దిర దిరా సంచరించే ఆకారాలు మర తోలు బొమ్మల ఆకృతులే! అచ్చమైన మానవుని దర్శన భాగ్యం అందడం అతి కష్టమిక్కడ! సంబంధాలన్నీ ఆర్ధిక ప్రయోజనాల అయస్కాంతాల నంటి ఉండే కఠిన ధాతు శకలాలైన దైన్యం అంతటా విస్పష్టమిక్కడ! ఇక్కడి ప్రతి కూడలి ధనం లావాదేవీల […]

Continue Reading

విలక్షణుడు (కవిత)

విలక్షణుడు -ఎరుకలపూడి గోపీనాథరావు పోగు బడుతున్న చీకటి పొరలను ఓర్పుగా ఒలుచుకుంటూ దారిలో దేదీప్యమానంగా ఊరేగుతున్న దేవునికి ఆత్మ నమస్కారాలనర్పిస్తూ అతడు పయనిస్తున్నాడు! పొగలూ, సెగలూ తాకే తావుల్లో మంటలుంటాయనీ నడక తడబడే బాటల్లో ఎత్తు పల్లాలుంటాయనీ ఎదుటి వారి కంఠ స్వరాలలోని వైవిధ్యాలూ స్పర్శలలోని వ్యత్యాసాలూ వారి ఆంతర్యాన్ని వ్యక్తీకరిస్తాయనీ బాల్యంలోనే బ్రతుకు నేర్పిన అనుభవాలను మననం చేసుకుంటూ అతడు ప్రయాణిస్తున్నాడు! ఉన్న మనో నేత్రాలతోనే తాను చర్మ చక్షు ధారులకన్నా ఉన్నంతంగా జీవిస్తున్నందుకు మానసికంగా […]

Continue Reading