వాలుతున్న ఎండ (హిందీ: `उतरती धूप’ – డా. రమాకాంత శర్మ గారి కథ)
వాలుతున్న ఎండ उतरती धूप హిందీ మూలం – – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు సెలవురోజు. విపరీతమైన చలిగా ఉంది. చేతులు-కాళ్ళు చైతన్యరహితం అయిపోతున్నాయి. భోజనం చేసిన తరువాత అయితే ఒంట్లో చలి ఇంకా ఎక్కువ బాధ పెట్టసాగింది. వేడినీళ్ళతో చేతులు కడుక్కున్న తరువాత కొన్ని క్షణాలకి ఆమెకి ఊరట అనిపించింది. కాని మళ్ళీ వేళ్ళు కొంకరపోసాగాయి. ఆమె తొందరగానే పని ముగించుకుంది. శాలువ కప్పుకుంది. ఆపైన […]
Continue Reading
