పిల్ల చిలక అబద్ధం

-కందేపి రాణి ప్రసాద్

ఒక చిలకల కుటుంబం చెట్టు మీద చక్కగా కాపుర ముంటున్నది.తల్లి చిలక ,తండ్రి చిలక, పిల్ల చిలక చక్కని సంసారం.పిల్ల చిలకను గూట్లోనే ఉంచి తల్లి చిలక, తండ్రి చిలక రెండు ఆహారం కోసం బయటకు వెళతాయి.ఆహారం తెచ్చి పిల్ల చిలకకు తినిపిస్తాయి.
పిల్ల చిలక వయసు ఇంకా చిన్నది.అదిగాక దానికి పుట్టుకతోనే ఆస్త్మా ఉన్నది.కొద్దిగా ఎగరగానే అలసిపోతూ ఉంటుంది.ఈ కారణంగా గూట్లోనే ఉంచి అవి రెండు తిండి తెచ్చేందుకు వెళతాయి.
గూట్లో వదిలి వెళ్ళే సమయంలో పిల్ల చిలకకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళతాయి.తల్లి దండ్రుల చిలకలు .నెమలి డాక్టర్ ఇచ్చిన మందుల్ని ఖచ్చితంగా వేసుకోమని చెబుతాయి.పొద్దున్న పూట మందు తాగించే వెళతాయి..మద్యాహ్నం తననే తాగమని చెబుతాయి.సాయంత్రం పూట తల్లి వచ్చాక తాగిస్తుంది.ఇంకా జామకాయలు తినవద్దని చెబుతాయి.జామకాయలు తినటం వలన జలుబు ఎక్కువై ఆస్త్మ వస్తుందని నెమలి డాక్టర్ చెప్పింది.
రోజు జాగ్రత్తలు చెప్పివెల్లినట్లే ఆరోజు వెళ్ళాయి.చిలకల జంట సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్ల చిలక ఆయాసంతో శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతోంది.పిల్ల చిలక నలా చూడగానే చిలకల జంట భయపడి వెంటనే డాక్టర్ నెమలి దగ్గరకు తీసుకెల్లాయి.
[28/02, 11:17 am] Dr KANDEPI RANIPRASAD: డాక్టర్ నెమలి పరిక్ష చేసి ఇంజక్షన్ వేసింది.ఆరోజంతా ఆసుపత్రిలోనే ఉంచుకున్నది.తర్వాతి రోజు ఇంటికి పంపిస్తానన్నది.
పిల్ల చిలక పరిస్థితి కొద్దిగా నెమ్మదించాక చిలకల జంట “ఎందుకిలా అకస్మాత్తుగా జరిగింది.డాక్టర్ అని అడిగాయి.డాక్టర్ నెమలి “”రోజూ నేనిచ్చిన మందు తాగిస్తున్నరా?జామకాయలు తినవద్దని చెప్పాను కదా పాటిస్తున్నారా అడిగింది.
“”రోజు మేము మందు తాగించే బయటకు వెళతాము.మధ్యాహ్నం తనే తాగుతుంది.సాయంత్రం పూట మేము వచ్చేసరికి తను తాగేశానంటుంది ఒక్కోసారి. లేకపోతె మేమే తాగిస్తాం.జామకాయలయితే ఇంటికే తేవటం లేదు “”అన్నాయి చిలకలు భయంగా చూస్తూ .
డాక్టర్ నెమలి ఇలా అన్నది “రోజూ తను జామకాయలు తింటున్నది.ఈరోజు ఎక్కువగా తిన్నట్లుంది అందుకే ఇలాంటి ఆపద వచ్చింది.తర్వాత మందుకూడా తాగటం లేదేమో అనిపిస్తుంది.”
“అయితే మా ఇంటి పక్కనే జామకాయల చెట్టున్నది.ఒకటి రెండుసార్లు ఇంట్లో జామ విత్తులు కనిపించాయి.నేను హెచ్చరించాను తినవద్దని . గట్టిగా చెప్పాను కూడా ” ‘అన్నది తల్లి
నేనిచ్చిన మందుసిసా లో మందు ఇంకా ఎంతున్నది అడిగింది.డాక్టర్ నెమలి
[28/02, 11:36 am] Dr KANDEPI RANIPRASAD: ఇంకా సగం సీసా ఉన్నది. డాక్టర్’ అన్నది తల్లి. ” అంటే రోజు తను మందును తాగటం లేదు అందుకే ఇలా ఇబ్బంది పడింది.”డాక్టర్ నెమలి తేల్చేసింది.
అంతలో పిల్ల చిలక “అమ్మా’ అంటూ పిలిచింది.తల్లి చిలక తండ్రి చిలక లోపలికి పరిగెత్తాయి.పిల్ల చిలక చాలా నీరసంగా ఉన్నది.ఆయాసం కొద్దిగా తగ్గింది.డాక్టర్ నెమలి లోపలికి వచ్చింది.
పిల్ల చిలకనుద్దేశించి డాక్టర్ నెమలి ఇలా అన్నది.”నువ్వు అమ్మా నాన్నలకు మందు వేసుకున్నానని అబద్దం చెబుతున్నావు.అది తప్పు అదిగాక నువ్వు వాళ్ళకు తెలియకుండా జామకాయలు కూడా తింటున్నావు.జామకాయలు నీకు పడవు .అయినా తినేశావు ఇప్పుడు నీకే కదా అనారోగ్యం వచ్చింది.ఒకోసారి ప్రాణాలు పోవచ్చు ఇక ఎప్పుడూ ఇలా చేయకు?
పిల్ల చిలక అమ్మా అంటూ ఏడ్చింది.తల్లి చిలక దాన్ని దగ్గరకు తీసుకోని తల నిమిరింది.”ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా!
నీకిలా ఆరోగ్యం పాడయితే మేము బాధపడతాము తల్లీ”” అని ఏడుపు గొంతుతో చెప్పింది తల్లి .,తండ్రి చిలక కూడా “ఇలా ఎప్పుడూ అబద్ధాలాడకూడదు. మంచిది కాదు”” అన్నది
ఇంకెప్పుడు జామకాయలు తినను.అబద్ధం కూడా చెప్పను అంటూ తల్లి ఒడిలో తల పెట్టి ఏడ్చింది పిల్ల చిలక.

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.