సి వనజ. జర్నలిస్టు. సమయం, సుప్రభాతం, ఆంధ్రజ్యోతి మనీ బిజినెస్, వార్త, అంధ్రప్రదేశ్ టైమ్స్ వంటి పత్రికల్లో పనిచేసి 1990ల చివరిలో ఎలక్ట్రానిక్ మీడియంలోకి మారి జెమిని, ఈటివి లలో పని చేసి ఆ తర్వాత స్వతంత్ర జర్నలిస్టుగా ఎన్నో పత్రికలకు రచనలు చేశారు, ఎన్నో టెలివిజన్ చానళ్లలో వేరు వేరు కార్యక్రమాలు చేశారు, ప్రస్తుతం వనిత టివి లో ఒక కార్యక్రమం చేస్తున్నారు. డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. జర్నలిస్టుగా ప్రతిష్ఠాత్మక రామ్ నాథ్ గోయెంకా అవార్డు గెలుచుకున్నారు. కథ, వ్యాసం, అనువాదం వంటి ప్రక్రియల్లో కూడ కృషి చేశారు.
అవమానం -సి.వనజ భుజానికి బాగ్ తగిలించుకొని వడివడిగా నడుస్తోంది సింధు. మంటలు మండిస్తున్న ఎండకు వెరచి వంచుకున్న మొహంలోంచి అప్పుడప్పుడూ చిన్న నవ్వు వెలుగుతోంది. ఇంట్లో చిన్నతల్లి అల్లరీ, రవి తలపులూ కలగా పులగంగా సింధు పెదవుల మీద నవ్వు మొలకలవుతున్నాయి. అంతలోనే గుర్తొచ్చినట్టు చేతి గడియారం వంక చూసుకుంది సింధు. రెండవటానికి ఇంకా పది నిమిషాలుంది. నడవవలసిన దూరాన్ని అంచనా వేస్తూ తలెత్తి చూసింది. మలుపు వరకూ మరో ఫర్లాంగు పైన ఉంటుందేమో. ఆ మీద […]
కోపం లేని మనుషులపై కనికరం లేని దేశం -సి. వనజ హైదరాబాద్ లో వలస శ్రామికుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో మొత్తంగా వలస శ్రామికుల సమస్యలో ఇమిడి ఉన్న కోణాలను చర్చిస్తున్నారు సి. వనజ- దేశంలో కోవిడ్ కేసులు 340 ఉన్న రోజే తెలంగాణాలో జనం మీద లాక్ డౌన్ బాంబు పడితే మరో రెండు రోజులకు అది దేశమంతా పడింది. ఒక డిమానెటైజేషన్ లాగా, ఒక జిఎస్టీ లాగ ఇది కూడా ముందూ వెనకా […]
నిర్భయ నుంచి దిశ దాకా –సి.వనజ అత్యాచారాల గురించి మరొకసారి దేశవ్యాప్త చర్చకు దారితీసిన దిశపై అత్యాచారం, నిందితుల బూటకపు ఎన్ కౌంటర్ నేపథ్యంలో అత్యాచార సంస్కృతి అసలు మూలాల గురించి విశ్లేషిస్తున్నారు సి వనజ- *** నిర్భయకి ముందు కానీ ఆ తరవాత కానీ భారత దేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు గాని ఈ రెండు సంఘటనలకి ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, […]