image_print

మౌనశిఖ ( కవిత)

మౌనశిఖ -లక్ష్మీ కందిమళ్ళ ఆమె మౌనశిఖ  ఆమెలోని సున్నితత్వమే ఆమె మాటలోని మాధుర్యం  తన మనసులోకి ఏది ఒంపుకోవాలో తెలిసిన సహృదయిని  తనకు ఎంతో ఇష్టమైంది స్వచ్ఛత ఆమె గురించి ఎంతో చెప్పాలనే ఉంటుంది  కానీ  వినిపించుకునేవారెవరు?? వినేవాళ్ళు లేరనే నేమోఎప్పుడో మూగబోయింది గొంతు. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

నిశ్శబ్ద గ్రంథాలయం ( కవిత)

నిశ్శబ్ద గ్రంథాలయం -లక్ష్మీ కందిమళ్ళ ఇప్పుడు సత్యం పలికే చోటికి పయనం  అక్కడంతా సీతాకోకచిలుకల సందడి ఇంకా శంఖు శబ్దాలు మధురంగాఆ ముచ్చట ఎంత చెప్పినా తక్కువే మరిఇహ ఆ అనుబంధపు తడికి ఎండిన కొమ్మైనా చిగురించదూ ఆ మాటలు వినగలగడం ఒక వరంపాషాణమైనా కరిగి కదులుతుంది నదిలా  ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుందిఅప్పుడు అదంతా ఒక మురిపెం ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో.. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

నిశ్శబ్ద శిలలు ( కవిత)

నిశ్శబ్ద శిలలు -లక్ష్మీ కందిమళ్ళ ఒట్టి శిలలు కాదవి కన్న కలలు  రాళ్ళలా పడివున్న అంతరాత్మలు  కన్నీటిలో తడిచిన కథలు చెబుతాయి  మరచిపోకు రాళ్ళల్లోనూ కన్నీళ్ళుంటాయి అవి శూన్యంలో నిలిచిన నిశ్శబ్ద శిలలు  గత చరిత్ర సాక్షాలు. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :