ముగింపు లేని సమయం

-దాసరాజు రామారావు


ముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ
నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు

దివా రాత్రాలు వెళ్లిపోయి,వయస్సు మళ్లిపోయి
వికసించీ, వాడిపోయీ
పూల వోలె.
నువ్వు తెలుసుకోవాల్సింది
ఎట్లా వేచివుండటం.

నీ సంవత్సరాలు ఒకటొకటి అనుసరిస్తూ
ఒక సంపూర్ణమైన చిన్ని అడవి మల్లె కోసం.

మనకు సమయం లేదు కోల్పోవడానికి.
మరియు సమయం కలిగి లేం
మనం  ఒక అవకాశం కోసం పాకులాడక తప్పదు
మనం చాలా పేదవాళ్లం ఆలసించినందుకు.

ఈ తీరున  సమయం గడచిపోవడం అయితే 
ప్రతి  ఫిర్యాదుదారునికి సమయమిస్తాను నెగ్గడానికి.
నీ తదుపరి ఇవ్వడానికేమీ వుండదు ఆఖర్న.

దినపు అంతాన భయం వలన
నీ గేటు త్వరితంగా మూయబడుతుంది

అయిననూ నాకు తెలుసు, ఇంకనూ సమయ ముందని.

* రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్ల కవితకు అనుసృజన

*****

Please follow and like us:

3 thoughts on “ముగింపు లేని సమయం(అనువాద కవిత)”

  1. ‘ దినపు అంతాన భయం వలన
    నీ గేటు త్వరితంగా మూయబడుతుంది

    అయిననూ నాకు తెలుసు, ఇంకనూ సమయ ముందని….’ – గుండె కలుక్కుమంది. ఈ వాక్యాలు మళ్లా మళ్ళా చదివా.. మీకు నా అభినందనలు.

  2. నా అనువాద కవితను ప్రచురించినందుకు, సాహిత్య విలువలకు పట్టం కట్టిన “నెచ్చెలి” కి ధన్యవాదాలు.

    1. మంచి రచనలకు నెచ్చెలి ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. దాసరాజు గారూ! కవిత పంపినందుకు ధన్యవాదాలండీ.

Leave a Reply

Your email address will not be published.