రాయాలనిపించినప్పుడు రాసుకోవడం, చదవాలనిపించినప్పుడు చదవడం, పాడాలనో, మంచి పాటలు వినాలనో అనిపించినప్పుడు వినడం ఇవే ఇప్పటి నా వ్యాపకాలు. ఇక ఏం రాశావని అడిగితే, ఇప్పటికి రెండు తెలుగు నవలు (ఒకటి సహజీవనం, రెండవది లాకర్ నెంబరు 112) వెబ్ మాగాజైన్లలో ప్రచురితమయ్యాయి. పదేహేడు కధలు ఇప్పటి దాకా రాస్తే దాదాపు ఒక పది ప్రచురించబడ్డాయి, మిగిలినవి ఇంకా రాతప్రతిగానే ఉండిపోయాయి. నాట్సు 2015 కదల పోటిలలో నా హాస్య కథ “కంప్యూటర్ కవిత కు బహుమతి వచ్చింది. బ్యాంకు వారి పుణ్యమా అని, ఆ చెక్కు మ్యూజియంలో దాచుకున్నాను. మరొక ఇంగ్లీష్ నవల రాస్తున్నాను. ఒక రెండు తెలుగు కవిత్వం పుస్తకాలు అచ్చేస్తే, మరొక తెలుగు కవిత్వం పుస్తకం, ఒక ఇంగ్లీష్ కవిత్వ పుస్తకం ప్రింటులోకి వెళ్ళ బోతున్నాయి. ఇక హాస్య కథలంటే నాకు ఇష్టం. ఇతర కథలు కూడా రాసినా, ఇష్టమైనవి హాస్య కథలే. మొన్ననీ మధ్య పరమపదించిన,మా బందరు వాడైన ఆదివిష్ణు గారు నా హాస్య కధలకు స్ఫూర్తి. అలాగే యర్రంశెట్టి సాయిగారి కథలన్నా, వ్యంగ్యమన్నా ఇష్టం.
కరోనా విరహం- భరోసా వరం –టి.వి.ఎస్.రామానుజ రావు సెల్ ఫోను మోత వినగానే, “అమ్మలూ, బావ అనుకుంటా చూడు! ఆ వంకాయలు నేను తరుక్కుంటానులే. నువ్వు పోయి మాట్లాడు.” ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది తల్లి సావిత్రి. తల్లి వంక ఒకసారి కోపంగా చూసి వంటింటిలోంచి తన గదిలోకి పరిగెత్తింది వినతి. గది తలుపు గడియ పెట్టి, ఫోను తీసింది. “హలో, ఇంతసేపూ ఏం చేస్తున్నావోయ్?” చిరుకోపంతో అడిగాడు చంద్ర. “వంటింట్లో కూరలు తరుగుతున్నాను, స్వామీ! ఏదో […]
సాప్ట్ వేరు కరోనా వైరు (హాస్య కథ) -టి.వి.ఎస్. రామానుజరావు వాసుదేవ మూర్తి వస్తూనే, సోఫాలో కూర్చున్న భార్య వొడిలో దబ్బున తలపెట్టుకుని పడుకున్నాడు. “ఏమిటా పిచ్చి వేషాలూ? నలభై ఏళ్ళు వస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాడిలా ఏమిటలా గారాలు పోతున్నారు? కాసేపట్లో స్కూలు నుంచి బాబు వస్తాడు. లేచి కూర్చోండి” లేచి చీర సర్దుకుంది శాంత. “వాడు పుట్టి ఇక్కడ నా స్థానం ఆక్రమించేసాడు. అక్కడ ఆఫీసులో ఇంకెవడో నాస్థానం ఆక్యుపై చేస్త్హాడు” వాసుదేవ మూర్తి […]
రోడ్డు రోలరు – టి.వి.ఎస్.రామానుజ రావు ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త టీ పెట్టుకుని తాగి, అలా నాప్రెండు సుబ్బు గాడింటికి వెళ్ళి వద్దామని ఇంటికి తాళం పెట్టి బయల్దేరాను. ఇంతలో సెల్ ఫోను ఇంట్లో వదిలేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. మా ఆవిడ ఫోను చేసినప్పుడు తియ్యకపోతే, […]