కథాకాహళి- 28

 చాగంటి తులసి కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

చాసోగా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని తులసి కథలుపేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి.

చాగంటి తులసి చిన్నతనంలోనే చా.సో, రోణంకి అప్పలసామి, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ మొదలైన వాళ్ళ చర్చలు, వాదోపవాదాల ద్వారా సాహిత్యంచర్చలు విన్నారు. నారాయణబాబు ఆమెను బాగా ప్రోత్సహించేవారు. చిన్నప్పుడే చాసో కథలమీద జరిగే చర్చలు ఆమెలో కథకు సంబంధించిన బీజం వేశాయి. చాసోగారి ఎందుకు పారేస్తాను నాన్నావంటి కథలు ఆమెలో సామాజిక వ్యవస్థలో ఆర్థిక అంతరాలను గురించి స్పృహ కలిగించాయి. రాత్రి పూట కాళ్ళు పట్టించుకుంటూ వాళ్ళ నాన్న చెప్పే కథలు తులసిగారికి ప్రాపంచిక జ్ఞానాన్ని, కల్పనా సామర్థ్యాన్ని అందించాయి. ఇతర భాషాసాహిత్య పరిజ్ఞానం ఆమె ఆలోచనల్ని విస్తృతపరిచింది.

డబ్బు మానవసంబంధాల మధ్య నిర్వహిస్తున్న పాత్రను విమర్శనాత్మకంగా తన కథలో స్పష్టం చేశారు. చాలా కథలలో మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీ పురుష సంబంధాలమీద డబ్బు పెత్తనం వహిస్తూ స్త్రీ పురుష అసమానత్వాన్ని చిత్రించారు. స్త్రీల పెంపకం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రవర్తన మొదలైన అంశాలలో మధ్యతరగతి ఆర్థిక సాంఘిక పరిమితుల ప్రభావం, దానిని ధిక్కరించడానికి స్త్రీలు చేసే ప్రయత్నాలు తులసి అనేక కథల్లో ప్రదర్శించారు. 

మధ్యతరగతిలో లేని తెగువ, నిజాయితీ, కలుపుగోలుతనం, క్రింది తరగతిలో ఉండే తీరును మరికొన్ని కథల్లో ప్రదర్శించారు. కుటుంబకథల్ని తీసుకొని సమాజ వ్యవస్థ రూపురేఖల్ని, వాటిని నిర్ణయించే ఆర్ధికశక్తుల్ని పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. తులసిగారు ఎక్కువకథల్లో తనకు తెలిసిన జీవితాన్ని, మధ్య తరగతి బ్రాహ్మణ జీవితాన్ని చెప్పడానికే ప్రయత్నం చేశారు. ఆ జీవితాన్ని పోల్చి నిగ్గుతేల్చడానికి అవతలి వర్ణ, వర్గ జీవితాన్ని తీసుకున్నారు. కొన్ని కథల్లో ఇతర వర్గాల జీవితాలను చిత్రించారు.

పెరిగే అవసరాలు, సరిపోని ఆర్థికస్థితి ఇదొక వలయంఅంటారు తులసి. ఈ వలయం మధ్యతరగతి వాళ్ళను పలాయనవాదులుగా చేసి రక్తసంబంధాలను కూడా తెంచుకునేట్టు చేసే తీరుకు నిదర్శనం వలయంకథ, ఒక కుటుంబ జీవితం ఆధారంగా మొత్తం మధ్యతరగతి జీవితాన్ని ప్రదర్శించారీ కథలో రాజుకు తల్లి, తండ్రి, బామ్మ, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. రాజు అతనిభార్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్కాలర్షిప్ తీసుకుంటూ రిసెర్చి చేస్తున్నారు. భార్య తనతో సమానంగా చదువుకున్నదైనా కట్నం తీసుకునే పెళ్ళి చేసుకున్నాడు రాజు. మెట్రిక్యులేషన్ పాసయిన అతని చెల్లెలు శాంతకు ఇంకా పెళ్ళికాలేదు. మరో చెల్లెలు, చిన్న తమ్ముడు స్కూల్లో చదువుతున్నారు. పెద్ద తమ్ముడు బి.ఎ. తప్పాడు. పరిస్థితులమీద విసుగెత్తి విప్లవం వైపు మొగ్గుచూపుతున్నాడు. స్వాతంత్ర్యానంతర వలసవాద విద్య, మధ్యతరగతి ఆర్థికస్థితి ఈ రెండూ కలసి తనవాళ్ళనందరినీ తనవాళ్ళుకాదని భావించాల్సిన స్థితికి నెట్టేశాయి రాజును. రాజుకు భార్య అయిన తర్వాత ఆయిన వాళ్ళంతా తనవాళ్ళే అనుకొని, వాళ్ళను పరామర్శించి కొన్ని రోజులు ఉండిపోదామని వచ్చిన రాజు భార్య ఆ వలయంలో ఇమడలేక మర్నాడే తిరుగు ప్రయాణం కట్టేస్తుంది. రాజుకు పెద్దతమ్ముడు కృష్ణుడు మాత్రం వదినతో వలయంలాంటి సమాజాన్ని చూచి భయపడి పారిపోకూడదని, సమాజాన్ని కదిలించాలని, అందుకు అందరూ నడుంకట్టాలని అంటారు. ఉద్యమాలద్వారా సమాజాన్ని మార్చాలిగాని, బాధ్యతారాహిత్యం, పలాయనబుద్ధి మంచివి కాదని వలయంకథ చెబుతుంది.

మొగపిల్లాడికి చదువు ముఖ్యంగాని ఆడదానికి అంత ముఖ్యమా? మొగపిల్లాడి మీద పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదు. అది పెట్టుబడే, ఆడపిల్లల చదువులమీద డబ్బు ఖర్చుపెడితే నీళ్ళదారే!” అని ఆలోచించే తల్లిదండ్రులమీద తిరుగుబాటు చేసి తన నిర్ణయం తాను తీసుకున్న కూతురి కథ చిన్న దేవేరి. తల్లిదండ్రులు ఆడపిల్లలకు అంతకన్నా చదువెందుకని స్కూల్ ఫైనల్దాకే చదివించారు. పెళ్ళిచేసి మరో ఇంటికి పంపేదానికి ఎక్కువ చదువక్కరలేదని ఆపేశారు. మాఘమాసంలో పెళ్ళి చెయ్యాలనుకుంటే అనేక మాఘమాసాలు వచ్చాయి, పోయాయి. కాలక్షేపంగా ఉంటుందని టైపు నేర్చుకోమన్నారు. నేర్చుకొంది. గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం దేనికి, టైపిస్టు ఉద్యోగం చెయ్యమన్నారు. ఉద్యోగంలో చేరింది. సాయంకాలాల్లో ఒంటరిగా ఎందుకు గుడిలో భజనకు పొమ్మన్నారు. వెళ్ళింది. భజనలో బాగా పాటలు పాడుతున్న ఎనిమిదిమంది పిల్లలుగల తండ్రిని పెళ్ళిచేసుకుని చిన్నదేవేరి అయ్యింది. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ అశక్తతకు స్త్రీ వివక్షను పరిష్కారంగా భావిస్తే, వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రుల గుట్టును రట్టు చేసి, “మీరూ మీ చట్టాలు ఊరుకోకపోతే ఉరిపెట్టుకోండి” అని తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. 

 అవకాశవాదంతో మొగాడు రెండో మనువుకు సిద్ధపడితే అందుకు స్త్రీలు సిద్ధంగాలేరని చెప్పే కథ యాష్-ట్రే‘. శేఖర్, కమల ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. తల్లిదండ్రుల వత్తిడితో శేఖర్ వరకట్నం పెళ్ళిచేసుకున్నాడు. విదేశాలకు వెళ్ళాడు. కొన్నేళ్ళ తర్వాత భార్య చనిపోయింది. స్వదేశానికి తిరిగివచ్చి కమలను పెళ్ళిచేసుకుంటానన్నాడు. ఆమె తిరస్కరించింది. తన ఇంట్లో యాష్- ట్రేపెట్టడానికి చోటు లేదంది. చిన్న దేవేరిలో అమ్మాయి పెళ్ళి చుట్టూ నాటిన మధ్య తరగతి కంచెను తెగనరికి యాష్-ట్రేలో కమల స్త్రీకి పెళ్ళే సర్వస్వం కాదని చెప్పి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంది. ఈ రెండు కథలూ నాణేనికున్న రెండు వైపులనూ విప్పిచెప్పగలిగిన రచయిత్రిలోని సమన్యాయాన్ని రుజువు చేస్తున్నాయి.

స్త్రీ పురుష సంబంధాలలో మధ్య, క్రింది తరగతుల మధ్య గల తేడాను చర్చించిన కథ మనువు’. మధ్యతరగతిలో ఆదర్శం ఎక్కువ, ఆచరణ తక్కువ. భయం తెగింపు తక్కువ. ఏజెంటుగారి పెళ్ళాం సావిత్రమ్మ. వాళ్ళ పనిమనిషి సత్తి. గిచ్చి కొడుతుంటే, మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, మొగుణ్ణి కృష్ణుడు మాత్రం వదినతో వలయంలాంటి సమాజాన్ని చూచి భయపడి పారిపోకూడదని, సమాజాన్ని కదిలించాలని, అందుకు అందరూ నడుంకట్టాలని అంటారు. ఉద్యమాలద్వారా సమాజాన్ని మార్చాలిగాని, బాధ్యతారాహిత్యం, పలాయనబుద్ధి మంచివి కాదని వలయం‘ –కథ చెబుతుంది.

మధ్యతరగతిలో ఆదర్శం ఎక్కువ, ఆచరణ తక్కువ. భయం. స్త్రీ పురుష సంబంధాలలో మధ్య క్రింది తరగతుల మధ్య గల తేడా, తెగింపు. ఏజెంటుగారి పెళ్ళాం సావిత్రమ్మ. వాళ్ళ పనిమనిషి సత్తి, భర్త తాగివచ్చి కొడుతుంటే, మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, మొగుణ్ణి వదిలెయ్యమని సూచించింది సావిత్రమ్మ సత్తికి, ఒకటీ రెండుసార్లు వెనకాడినా, మొగుణ్ణి భరించలేక వదిలేసింది సత్తి. ఏజెంటుగారు పొరుగింటి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకుంటే స్త్రీ స్వాతంత్ర్యాన్ని గురించి, స్త్రీ పురుష సంబంధాలలో మార్పుల్ని గురించి ఉపన్యాసాలుదంచే మధ్యతరగతి సావిత్రమ్మ సర్దుకొని భర్తకు లొంగిపోయింది.

చదువుకుని ఉద్యోగంచేస్తున్న టీచర్ అవివాహిత కావడంవల్ల ఒంటరితనాన్ని భరించలేక, ఎదురింటి దంపతుల అమ్మాయి మున్నిని చేరదీసి ఆటపాటలు నేర్చుతూ కాలక్షేపం చేస్తుంటుంది. టీచర్ తన భర్తతో చనువుగా మాట్లాడిందని అతని భార్య అతన్ని ఘోరంగా అనుమానిస్తుంది. వాళ్ళ సంభాషణ పరోక్షంగా విన్న టీచర్ ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇది శరణ్యంకథావస్తువు. ఇద్దరు స్త్రీ-పురుషులు మాట్లాడుకుంటే సెక్స్ సంబంధాలను మాత్రమే ఊహించే మధ్యతరగతి మనస్తత్వానికి ప్రతిబింబం ఈ కథ.

కట్నం ఇచ్చుకోలేక కూతురికి పెళ్ళిచెయ్యలేని తల్లిదండ్రుల ఏడుపుకు, అక్కకు పెళ్ళైతే ఆమె ఎక్కడికో వెళ్ళిపోతుంది. తనను ఆదరించేవాళ్ళు లేరు. అందువల్ల అక్క పెళ్ళి తప్పిపోవడం మంచిదేనని భావించే తమ్ముని మనస్తత్వానికి అద్దంపట్టే కథ వైవాహికం‘.

ఆడపిల్లల బాధలు తల్లికే తెలుస్తాయి తప్ప తండ్రికి తెలియవని, స్త్రీలు చదువుకొని ఆధునికులు కావాలని ఒక స్త్రీ ప్రబోధించిన కథ బోధఅయితే, ఆడపిల్లకు తల్లి అతిస్వాతంత్ర్యమిచ్చి అత్యాధునికంగా పెంచడంపట్ల తండ్రి ఆందోళనకు ప్రతిబింబం తిరోగామికథ. కాదుకాదనుకున్న పెళ్ళి అప్పులతో ఎలాగో అయిపోవడం మీద వ్యంగ్యకథ అప్పగింతలపాట‘,

మధ్యతరగతి పార్వతమ్మ కొన్న జర్మన్ సిల్వర్ బిందెపనికిరాదని అత్తా, మొగుడూ తిడితే, ఆమె దానిని తన పనిమనిషి పోలికి అమ్మేస్తుంది. పూటగడవని వాళ్ళకు అదెందుకని భర్త అప్పల కొండయ్య తిడితే పోలి “నీ సొమ్మేదో తగలేసినట్టు ఏడుస్తావేంది?” అని తిరగబడింది. అప్పలకొండయ్యకు చిన్న పని ఏదన్నా చూపమంటే చూపని పార్వతమ్మ భర్త, తమకు పనికిరాని బిందెను క్రింది తరగతి వాళ్ళకు ఇచ్చెయ్యడానికి ఒప్పుకోవడం ఆలోచించాల్సిన కథాంశం”స్వర్గారోహణ”.

పల్లె, పట్టణ నాగరికతలకు మధ్య, అగ్ర నిమ్నకులాల సంస్కృతులకు మధ్య నలిగిన అప్పన్న కథ “అప్పన్న”. ఆర్థిక, సాంఘిక అసమానతలమీద విమర్శపెట్టిన ఈ కథ శ్రమ గౌరవాన్ని ప్రతిపాదిస్తుంది. అలవాట్లలో, ఆర్జనలో, అభిమానంలో తరాలు మధ్య అంతరాన్ని చిత్రించిన కథ వడదెబ్బ‘. ఇది నరసారావుపేట పడక్కుర్చీ సంస్కృతికి, లింగ్ రూం సంస్కృతికి మధ్య జరిగిన సంఘర్షణ, కొడుకు అక్రమసంపాదన, ము: అహంకార ప్రదర్శనలు అనే వడదెబ్బలకు బలైపోయిన పాత తరం మనిషి కథ.

తులసి ’వైవాహికం’, ’బామ్మ రూపాయి’, ’పేషన్స్’ కథలు చిన్నపిల్లల పక్షంగా రాశారు. బొమ్మ రూపాయిమధ్యతరగతి బ్రాహ్మణ వృద్ధ స్త్రీ,ద్వంద్వ ప్రవృత్తికి ప్రతిఫలనం, చిన్నపిల్లలు ఒక పేదరాలికి ఒకరూపాయి దానం చేస్తే, దానిని గురించి ముసలావిడ చేసిన హడావిడి, అందులోని ద్వంద్వ ప్రవృత్తి ఈ కథలో వాస్తవికంగా చిత్రింపబడ్డాయి. దేవుడిమీద ఎంతైనా ఖర్చుపెడుతూ మనిషిని ఆదరించలేని వికృత మనస్తత్వం ఈ కథలో ప్రతిబింబించింది. చిన్నపిల్లలు చిన్న గుళ్ళను గళ్ళలోకి తోసే ఆట ఆడుతూ, మానవజీవితంలో మనుషులు కుండవలసిన సహనాన్ని పెద్దలకు నేర్పిన కథ “పేషన్స్”.

ఒకే తల్లికి పుట్టిన అక్కా చెల్లెళ్ళ ఆర్థిక స్థితిలోని అంతరాలను ప్రతిబింబిస్తూ వాళ్ళు పరస్పరం ప్రదర్శించుకునే అభిమానాలను వ్యక్తం చేసే కథ హుందాఅక్క పల్లెటూళ్ళో ఉంది. చెల్లెలు పట్నంలో ఉంది. అక్కను ఆదుకుందామన్న చెల్లెలి ప్రయత్నాన్ని వారించి వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న అక్క కథ ఇది.

తులసి కథలన్నిటినీ పరిశీలించినపుడు స్త్రీజాతి చైతన్యం మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ’చిన్నదేవేరి’, ’మనువు’, ’హుందా’, ’స్వర్గారోహణ’, ’తిరోగామి’, ’యాష్ – ట్రే’, ’వలయం’, ’బోధ’ వంటి కథలు సమస్యల సుడిగుండంలో ఇరుక్కొన్న కూడా అందులోంచి తమకు తామే బయటపడాలని ప్రయత్నించడం ప్రధానాంశం. స్త్రీకి పెళ్ళే జీవితంగా భావించే మధ్యతరగతి స్వభావాన్ని అనేకరకాలుగా వ్యతిరేకించే స్త్రీలూ మనకీ కథల్లో కనిపిస్తారు. తరాల అంతరాలను, వర్గాల అంతరాలను రచయిత్రి బామ్మ రూపాయి, అప్పన్న, స్వర్గారోహణ కథల్లో ప్రదర్శించారు. అలాగే జండర్ అంతరాలను అనేక కథల్లో చిత్రించారు. పెళ్ళి ప్రసక్తి వచ్చిన ప్రతి కథలోనూ స్త్రీపట్ల పురుషులు ప్రదర్శించే వివక్ష ప్రధానాంశమైంది.

తులసి కథలన్నీ చదివి ఆమె కథనరీతిలో ఉన్న కీలకాంశం ఏమిటా? అని ఆలోచిస్తే మనకు తోచేది ఆమె పేషన్స్: ప్రతి కథలోను ఒక పెద్ద ప్రపంచాన్ని తీసుకొచ్చి చిన్న గుళికగా పాఠకులకందించే ప్రయత్నం చేస్తారామె. ఆ ప్రయత్నంలో  గందరగోళ పడటంగాని, పాఠకుల్ని తికమక పెట్టడంగాని ఉండవు.

మధ్యతరగతి ఆర్థిక పరిమితులు వికృత ఫలితాలను కర్తలో వేశారు. అద్భుతమైన కథలు ఎన్నో వచ్చాయి. ఈ అంశాన్ని నగరంలో రిసెర్చి చేసుకుంటున్న కోడల్ని ఊరికి తీసుకొని విషయాలు చూచి వెళ్ళిపోవడం అనే చక్రంలో సులభంగా బిగించేశారు.

చిన్నదేవేరిలో ఆత్మవిమర్శ ధోరణిలో కథ చెప్పారు. అక చేసుకుంటున్నదెవరో గాని, అమ్మాయిల పెంపకంలోని వివక్షమీద అనే మాటిమాటికి వాక్యాంతంలో పెట్టి పఠనాసక్తిని పెంచి, వస్తువుపట్ల ఆలోచనల్ని రేకెత్తిస్తారు.తులసి ఉత్తమపురుష కథనవిధానాన్ని చాలా బాగా అధ్యయనం చేసారు. ’వలయ”, ’అప్పున్”, ’హుంద”, ’శరణ్య”, ’బామ్మరూపాయ”, ’తిరోగాట్ల”, –ఉత్తమ పురుషలో చెప్పిన కథలు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.