
నెచ్చెలి-2026 కథా,కవితా పురస్కార పోటీలు
(ఆఖరు తేదీ మే31, 2026)
-ఎడిటర్
నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం!
బహుమతులు:
ప్రథమ బహుమతి కథ (నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం) – రూ.2000/-
ప్రథమ బహుమతి కవిత (నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం) – రూ.1000/-
ద్వితీయ బహుమతి – రూ.750/-
తృతీయ బహుమతి – రూ.500/-
ప్రత్యేక బహుమతి – రూ.250/-
20 సాధారణ ప్రచురణలు
ఎంపిక చేసిన కథలు, కవితలు “నెచ్చెలి”లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి.
నిబంధనలు:-
* ఇతివృత్తం: రచనా వస్తువులో, శైలిలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ, స్త్రీలకి సంబంధించిన అంశం అయి ఉండాలి.
* రచనతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు, కవితలు స్వీకరించబడవు.
* కథలు వర్డ్ ఫైల్ లో పది పేజీలకు మించకుండా, కవితలు వర్డ్ ఫైల్ లో 2 పేజీలకు మించకుండా తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
* ఒక్కొక్కరు ఒక్క కథ (లేదా) ఒక కవిత- ఏదైనా ఒక్కటి మాత్రమే పంపాలి.
* రచనతో బాటూ చిన్న పారాగ్రాఫులో యూనికోడ్ లో రచయిత(త్రి) పరిచయం, ఫోటో, ఈ-మెయిలు, ఫోను నంబరు జతపరచాలి.
* ఈ-మెయిలు మీద “ నెచ్చెలి- కథ-కవితల పోటీ-2026కి” అని రాసి editor@neccheli.com కు పంపాలి.
*నెచ్చెలిలో నచ్చిన మూడు రచనల మీద గానీ, నెచ్చెలి యూట్యూబ్ వీడియోల మీద గానీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు పత్రికలో (లేదా) యూట్యూబులో తప్పనిసరిగా పోస్టు చెయ్యాలి. పోస్టు చేసిన వ్యాఖ్యల వివరాలు ఈ-మెయిలుకి జతపరచాలి.
* రచనలు చేరవలసిన ఆఖరుతేదీ: మే31, 2026. గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
* బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు తావులేదు.
* పోటీ ఫలితాలు “నెచ్చెలి” 7వ జన్మదిన సంచికలో జూలై 10, 2026న వెలువడతాయి.
***
నిర్వాహకులు:
డా.కె.గీత, వ్యవస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
*****
