ఎంత బాగుందో!

-శ్రీ సాహితి

ఈ ముసురులో
భలే చల్లావు నీ చూపును…
అదును చూసి మొలకెత్తింది కవితగా

అది నీ పెదాలకు చేరి సువాసనాలతో
తీపి శబ్దలుగా సంచరిస్తుంటే
ఎంత బాగుందో!

ఎప్పుడో వ్రాసిన ఉత్తరం..
ఆమెను తలుస్తూ
పోస్ట్ చేయడం మరిచాను.

ఆలేస్యంగా ఆమెకందిన నా అక్షరాలు
ఆమె నవ్వును
వెంటనే తిరిగి పోస్ట్ చేశాయి.

నా మాటను రాళ్లతో తరిమికొట్టావు…
ప్రేమకొద్దీ పరిగెత్తాను..
గాయం మాయకుండానే మళ్లివచ్చాను

మళ్ళీ తరమాలని చూశావు…కానీ
నీ దగ్గర రాళ్లు లేవు..
కన్నీళ్లున్నాయి.

ఆమెను
పుస్తకంగా దాచుకున్నాడు.
అక్షరం ముఖం తెలియకపోయినా

ప్రేమికుడుగా ప్రతి పరీక్ష  విజయమే.
ఆమె ఓటమి అతనికి ఇష్టం లేని
సంతోషం.

ఊరి చివర
కొండ అవతల ఓ కీచు గొంతు
సన్నగా నిద్రలో సహితం గోల.

ఓ చిన్న రాయి లాంటి
ఓ కసురు చూపుకు
నిజం మాయం .

నీవు నాలో ఉదయంచని
రోజు నా అక్షరానికి
అమావాస్యే..

ఆ రాత్రి పుట్టిన కవితలు.
మనసంతా మెరిసే
నక్షత్రాలే…

*****

Leave a Reply

Your email address will not be published.