గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

మంచిచెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో

హంసలాగ మంచినొకటె ఎంచడమే తెలుసుకో

అల్పునిదే ఆర్భాటం సజ్జనునిది చల్లని పలుకు

కంచువలె కనకం మోగదు సత్యమదే తెలుసుకో

గోవుపాలు కాస్తచాలు కడివెడేల ఖరముపాలు

భక్తితొ తినెడి కూడు పట్టెడు చాలునదే తెలుసుకో

పరుల చోట పరుగు తగదు తగ్గి ఉండిన తప్పు కాదు

కొండకూడ అద్దమందు కొంచమదే తెలుసుకో

తనువు గాని కూడబెట్టిన ధనము గాని సొత్తు కాదు

నీ ప్రాణమె  నీ సొత్తు కాదు పోవునదే   తెలుసుకో

(వేమన పద్యాల ఆధారంగా రాసిన గజల్)

*****

Leave a Reply

Your email address will not be published.