“నెచ్చెలి”మా

వనితా విజయం

-డా|| కె.గీత 

నెచ్చెలులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము

భ్రూణహత్యల నుండి
పునర్జనించినాము
అత్యాచారముల నుండి
తలెత్తుకు లేచినాము

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము

ఆడపిల్లవని
అపహాస్యాలెన్నో
పనికిరావని
హేళనలెన్నో
అన్నిటినీ
మెట్లు చేసి
అపహాస్యపు
మెడలు విరిచి
రోదసీకి
ఎగసినాము

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము

కుటుంబమే
మూలమని
నిట్రాటగా
నిలబడినాము
గుర్తింపు లేని
సహాయాలు
చేసి చేసి
అనారోగ్యమైనాము

మనకోసం కాక
ఎపుడూ
పరుల కొరకు
బతికినాము
చివరికి
మనకోసం
ఎవరున్నారని
వెతలుపోయి
ఏడ్చినాము

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము

ఉద్యోగాలు
ఆఫీసులు
బిజినెస్సులు ……..
బిజీ బిజీ
బతుకంతా
కష్టపడినా
భవితంతా
గజిబిజి

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము
ఒకరిచ్చే స్వేచ్ఛ
అవసరం లేదు
వెతికి చూస్తే
స్వాతంత్య్రం
లేకపోలేదు

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము

వనితలకు
వనితలే
సాటిగా
మనకోసం
మనం
నిలబడదాం
ఏ ప్రపంచానికైనా
ఎదురు తిరిగి
నిలబడదాం

జయము
జయము
వనితలందరకు
దిగ్విజయము
జయము
దిగ్విజయము
జయము

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఫిబ్రవరి, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  డా.సి. ఎస్.జి. కృష్ణమాచార్యులు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: వాత్సల్యం (కథ) – సీతాసుస్మిత

ఇరువురికీ  అభినందనలు!

****


Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.