image_print

కథా మధురం-2 (యాష్ ట్రే- చాగంటి తులసి)

కథా మధురం 2  చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే”  –జగద్ధాత్రి  డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా) ఉపోద్ఘాతం

అనువాదకులు ఎన్.వేణుగోపాల్ ముందుమాట (2003)  ఇరవై అయిదేళ్ల తర్వాత బొలీవియా -ఎన్.వేణుగోపాల్   ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం 1978లో, 25 సంవత్సరాల కింద వెలువడింది. అంటే ఈ పుస్తకం 25 ఏళ్ల వెనుకటి బొలీవియా గురించి వివరిస్తుంది. ఈ 25 ఏళ్లలో బొలీవియాలో చాలా మార్పులు జరిగాయి. బొలీవియా ప్రజల జీవన స్థితిగతులు ఇంకా దిగజారిపోయాయి. ఇటీవల బొలీవియా రెండు సంఘటనల నేపథ్యంలో వార్తల్లోకెక్కింది. ఇటీవలనే దేశాధ్యక్షుడు గోన్జాలో సాంకెజ్ దేశం వదిలి పారిపోయాడు. ప్రపంచ బ్యాంకు, […]

Continue Reading
Posted On :

కథామధురం (ఉడ్ రోజ్ – అబ్బూరి ఛాయాదేవి)

కథామధురం  -జగద్ధాత్రి ఆధునిక తెలుగు సాహిత్యం లో రచయిత్రులు ఇరవైయవ  శతాబ్దం లో అందించిన రచనలెన్నో ఉన్నాయి. అందులో రచయిత్రులు రాసిన కథలు, అలాగే స్త్రీల ను గురించిన కథలు ఈ శీర్షిక లో మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఈ శీర్షికలో మహిళల గురించిన రచనలను అవి మహిళ చేసినా లేక రచయితలు రాసినవి అయినా ఆ కథను ఇక్కడ అందించ దలిచాము. తెలుగు సాహిత్యం లో చాలా మంచి కథలు వచ్చాయి వస్తున్నాయి. అయితే మిగిలిన […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం (మెక్సికో)-1

యాత్రా గీతం (మెక్సికో-కాన్ కూన్) -డా||కె.గీత భాగం-1 ఇంతకు ముందు కాలిఫోర్నియాని ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దు నగరమైన బాహా కాలిఫోర్నియా కి నౌకా ప్రయాణం (క్రూయిజ్) వెళ్లొచ్చేం కదా!  ఇప్పుడు మెక్సికో కి తూర్పు తీరంలో ఉన్న కానుకూన్ వెళ్లి రావాలని అనుకున్నాం. అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న కాలిఫోర్నియా నుంచి మెక్సికో తూర్పు తీరానికి  ప్రయాణం అంటే విమానాల్లో దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం. అంతే కాదు, కాలమానంలో మూడు గంటలు ముందుకి వెళ్తాం.  […]

Continue Reading
Posted On :

మా కథ – ఇరవై ఏళ్ల తర్వాత

(వచ్చేనెల నుండి “మాకథ” (దొమితిలా చుంగారా ఆత్మకథ)  ధారావాహిక ప్రారంభం. ఈసందర్భంగా అనువాదకులు ఎన్. వేణుగోపాల్ ఆంధ్రజ్యోతి (జనవరి 19, 2004) లో రాసిన ముందు మాట మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. నెచ్చెలిలో పున: ప్రచురణకు అంగీకరించిన వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు-) ఇరవై ఏళ్ల తర్వాత… –   ఎన్. వేణుగోపాల్ నేను అనువాదం చేసిన పూర్తిస్థాయి మొదటి పుస్తకం మా కథే, అందువల్ల ఆ పుస్తకంతో నా అనుబంధం హృదయానికి చాలా దగ్గరిది. ఒక […]

Continue Reading
Posted On :

అనుసృజన-నేను ఓడిపోలేదు

నేను ఓడిపోలేదు   హిందీ మూలం : ఊర్మిలా శిరీష్    అనుసృజన : ఆర్.శాంతసుందరి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. నల్లటి నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.దోమల రొద, తేమ వాసన గదినిండా పరుచుకునుంది.బైట వర్షం ఆగిపోయింది,కానీ నీళ్ళు పారుతున్న చప్పడూ, చినుకుల చిటపటలూ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.రోడ్డుమీద మనుషుల సందడి వినిపిస్తోంది.ఆమె తన కళ్ళని చేత్తో తడిమింది…నిద్రపోతున్నానా, మేలుకునే ఉన్నానా… ఒక్క క్షణం పాటు అయోమయంగా అనిపించింది.ఇంకేదో రహస్యలోకం తన చుట్టూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో […]

Continue Reading
Posted On :

క“వన” కోకిలలు – మాయా ఆంజలోవ్

                                         క “వన” కోకిలలు   -నాగరాజు రామస్వామి                                                    మాయా ఆంజలోవ్  ( ఏప్రిల్ 4 , […]

Continue Reading

 స్నేహం (బాల నెచ్చెలి-తాయిలం)

                                                స్నేహం                                                    -అనసూయ కన్నెగంటి      హరిత, భవిత ఇద్దరూ […]

Continue Reading
Posted On :

చిత్రలిపి (గంగమ్మా గౌరమ్మా)

చిత్రలిపి -అన్వర్ ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, గౌరీ దేవి బొమ్మల్ని ఎదురెదురుగా కూచుని చెరో రోలు పుచ్చుకుని రోట్లో దంచడానికి సిద్దమై ఉంటారు. ఈ పీఠం పుచ్చుకున్న స్త్రీ కిందనుండి చేతులు ఉంచి ఆడించగానే ఇద్దరు సవతులు మర చేతులు ఊపుకుంటూ  […]

Continue Reading

ఆకాశమే ..గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నా మనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లొ ఆగనా ఆవాగు నీరల్లె సాగనా నా కంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆతీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని మురిపెంగ పెనవేసుకోనా ఓ మేఘనీలమై మారనా ఓ సంధ్య ఎరుపై జారనా  ఆ వర్ణకాంతులే నిండుగా ఒళ్ళంత నే పూసుకోనా మధుమాస […]

Continue Reading