image_print

కెథారసిస్ (కథ)

కెథారసిస్ –సునీత పొత్తూరి చటుక్కున కళ్లు విప్పి చూసింది సునంద. ఏదో కల. అది కలా అనే స్పృహ కలిగినా, కల మిగిల్చిన చిన్న అసౌకర్యం మస్తిష్కాన్ని అంటిపెట్టుకునే వుంది. సునంద వచ్చిన కల ఓ క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది.    పైగా కల కూడా అస్పష్టంగా, తెగిన సాలిగూడు లా.. అన్నీ   పొంతన లేని దృశ్యాలు! ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు.. అరుద్దామంటే తన నోరు పెగలడం లేదు. అరుపూ బయటకు రావడం లేదు.  అదీ […]

Continue Reading
Posted On :

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో […]

Continue Reading
Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది “శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ […]

Continue Reading
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading
Posted On :

ముందడుగు (కథ)

ముందడుగు -రోహిణి వంజారి పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు.  సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది.  ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో  ఫేస్బుక్, వాట్సాప్ లు  మార్చి మార్చి గంట  నుంచి చూస్తున్నాను.  అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు.  కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు  అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే […]

Continue Reading
Posted On :

మిణుగురులు (కథ)

మిణుగురులు -శ్రీసుధ మోదుగు సాయంత్రం బుగ్గ వాగు  దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరూ, దూరంగా చిన్న కొండలు వర్షాకాలంలో ఆకుపచ్చగా, ఎండాకాలంలో పసుపచ్చగా మారిపోతాయి. ఎలా చూసినా అందంగానే ఉంటాయి. “బుగ్గ వాగులో నీళ్లు లోతు లేనట్లు కనిపిస్తాయ్, కానీ లోతెక్కువ. ఎప్పుడూ వాగులో దిగకు. శివా! వింటున్నావా?” “ఆ … కాక.”   “శివ! మీ అమ్మ వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా?”  “కాక! అమ్మ మంచిది కాదా?”  “మంచిది శివ.”  “పున్నమ్మ చెప్పింది అమ్మ మంచిది కాదు, వచ్చి […]

Continue Reading
Posted On :

మాటవిన్న మనసు (కథ)

మాటవిన్న మనసు -విజయ దుర్గ తాడినాడ ‘ఎందుకిలా జరిగింది?’  ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా అనుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?  ఈ ప్రశ్న కేవలం ఆరు నెలల నుండి నా మనసుని తొలిచేస్తోంది. జరగాల్సినదంతా జరిగిపోయింది. ఊహించనిది జరిగిపోయింది.  […]

Continue Reading
Posted On :

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది. గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది. ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను. నెమ్మదిగా […]

Continue Reading

పార్వతీ తనయ (కథ)

పార్వతీ తనయ                                                       -మనోజ నంబూరి  పతి ఏ సమయాన్నైనా రావచ్చును. హిమపర్వత శ్రేణీ శీతల పవనాలకు చెదురుతున్న ముంగురులను ముడివేసుకుంటూ పార్వతి స్నానానికి అన్నీ సిద్ధపర్చుకుంది. ద్వారపాలకులూ , పరిచారకులంతా కలిసి యూనియన్ ఆదేశాలతో తమ కోర్కెల సాధనకై  “మాస్. సి.యల్” […]

Continue Reading
Posted On :

దుర్గ (కథ)

దుర్గ                                                       –డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం అర్థరాత్రి దాటింది. అలసిన దేహాలను మత్తు నిద్ర ఆవహించే వేళ. నడిచి, నడిచి పుళ్ళు పడిన పాదాలు కదలలేమని మొరాయిస్తుంటే , ఆకలి పేగులను ఎండిపోయిన సద్ద రొట్టెతో బుజ్జగించి, రైలు పట్టాల వెంట […]

Continue Reading

మల్లమ్మ (కథ)

మల్లమ్మ                                                                 – గంటి భానుమతి “  అమ్మా నేనెవరిని? “ నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ, తన ఉనికి తెలుసుకోడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షీ, ఓ యోగిని ఆత్మ జ్ఞాని కూడా కాదు. ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల.  తన లోపల  జరుగుతున్న మార్పులు గమనిస్తున్న ఆమెని అలా అడిగించింది. కూతురు ఈ ప్రశ్న వేస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా అనుకో లేదు. అందుకే జవాబులు సిద్దంగా పెట్టుకోలేదు. “ చెప్పు, నేను మల్లమ్మనా,  మల్లయ్యనా, […]

Continue Reading
Posted On :

నిజానిజాలు (కథ)

నిజానిజాలు                                                                 – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం  కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి  ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు  సింహాచలం.  ఒకళ్ళు  కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది  కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే  వాడినే నమిలేసేదేమో  అన్నట్టుగా  పళ్ళు కొరుకుతూ చూసింది  సింహాచలం భార్య తిరపతమ్మ. ఇద్దరూ యజమాని   వీరభద్రయ్యకి ఎదురుగా  చేతులుకట్టుకుని  నిలబడిఉన్నారు. మా ఇంటి  కాంపౌండ్ లోనే  ఔట్ హౌస్ లో మిమ్మల్ని ఉండనిస్తూ  మీ  మంచీచెడ్డా మీ […]

Continue Reading
Posted On :

ఈ పిలుపు నీకోసమే! (కథ)

ఈ పిలుపు నీకోసమే!                                                                 – వసుంధర నేను, నా ఫ్రెండు సుస్మిత కె ఎల్ ఎం షాపింగ్ మాల్ లో దూరాం. నేను జీన్సు పాంటుమీదకి టాప్సు చూస్తుంటే, సుస్మిత డ్రెస్ మెటీరియల్ చూడ్డానికి మరో పక్కకు వెళ్లింది. ఎవరో నా భుజం తట్టినట్లయి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే సుమారు పాతికేళ్ల యువకుడు. సన్నగా, పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. అపరిచితురాలైన ఓ కన్నెపిల్లని అలా భుజం తట్టడం అమర్యాద అని తెలియనట్లు మామూలుగా నవ్వుతున్నాడు. నేను కాస్త […]

Continue Reading
Posted On :

రోడ్డు రోలరు (హాస్య కథ)

రోడ్డు రోలరు – టి.వి.ఎస్.రామానుజ రావు ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త టీ పెట్టుకుని తాగి, అలా నాప్రెండు సుబ్బు గాడింటికి  వెళ్ళి వద్దామని ఇంటికి తాళం పెట్టి బయల్దేరాను. ఇంతలో సెల్ ఫోను ఇంట్లో వదిలేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. మా ఆవిడ ఫోను చేసినప్పుడు తియ్యకపోతే, […]

Continue Reading