“సంతకం”

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– డాక్టర్ ఎమ్. సుగుణరావు

విశాలమైన గదిలో నలభైమంది కూర్చోవచ్చు. ఐనా నలుగురితో గదిలో చర్చ నడుస్తోంది. కారణం కరోనా లాక్డౌన్‌. నలుగురిలో ఒకాయన రాజకీయ ప్రముఖుడు. పేరు గంగరాజు. ఇంకొకాయన స్థానిక ఎమ్మెల్యే. పేరు కోదండరామయ్య. ఇంకో ఆయన జిల్లా స్థాయి ఇంజనీరు లోకనాథం. నాలుగో వ్యక్తి ప్రస్తుతపు వారి చర్చకు సూత్రధారి, ఎమ్మార్వో కామాక్షి.

అది ఇన్కెమెరా సమావేశం. ఎవరికీ తెలియకుండా నడుస్తోంది. కామాక్షి నిలబడింది. తను చెప్పవలసినదానికి

ఫరవాలేదమ్మా కూర్చుని మాట్లాడండిఅన్నారు ఎమ్మెల్యే కోదండరామయ్య.

అంతమందిని నించోబెట్టేసింది రోడ్డు మీద ఈవిడ కూర్చుని మాట్లాడాలా!” విసుక్కున్నాడు గంగరాజు.

మాటలు ఆమెకు వినబడినా చిన్నగా నవ్వుకుంటూ తను చెప్పడానికి సిద్ధవడింది.

వారం రోజుల క్రితం ఆమె పని చేస్తున్న మండల పరిధిలో వున్న ఒక రెసిడెన్సియల్కాలేజీలో ఆగ్ని ప్రమాదం జరిగింది. లాక్డౌన్మూలంగా విద్యార్థులంతా తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది కానీ నలుగురు సెక్యూరిటీ గార్జులు అగ్ని ప్రమాదంలో ఆహుతి అయ్యారు. ఆ భవనం పది అంతస్తులు. వెయ్యి మంది విద్యార్థులుకు హాస్టల్వసతి వుండేలా భవనం కట్టారు. కట్టి సంవత్సరం కూడా కాలేదు.

కాలేజీ మూసెయ్యాలనీ, తాము కట్టిన ఫీజులు తిరిగి ఇచ్చెయ్యాలనీ విద్యార్థులు, తల్లిదండ్రులు కలిపి ధర్నా చేసారు. కలెక్టరు వెంటనే స్థానిక ఎమ్మార్వో కామాక్షి అధ్యక్షతన కమిటీ వేసారు. ఆమెతో పాటు మండల పరిషత్ఇంజనీరు, మండల విద్యాధికారి సభ్యులు కమిటీ ఎంక్వయిరీ చేసి విద్యార్థులు కోరినట్టే విద్యా సంస్థ లైసెన్సు రద్దు చేయాలని, కట్టిన ఫీజులు తిరిగి ఇచ్చేయాలనీ తీర్మానం చేసారు.

అది కాలేజీ యాజమాన్యానికి మింగుడుపడని విషయం. వారి రాజకీయ పలుకుబడితో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇంకో కమిటీ వేయించుకున్నారు. వారికి అనుకూలంగా రిపోర్టు తెప్పించారు. ఐతే భవిష్యత్తులో లీగల్సమస్యలు రాకుండా ముందుగా ఎంక్వయిరీ చేసిన కామాక్షిగారి కమిటీ సభ్యులు క్రొత్త రిపోర్టు ధృవీకరిస్తూ సంతకాలు పెట్టమన్నారు. ఆమె కాక, మిగతా ఇద్దరు సభ్యులు సంతకాలు పెట్టేసారు. ఆమె సంతకం పెట్టడానికి నిరాకరించింది. సంతకం పెట్టించేందుకు సమావేశం ఏర్పాటుచేసారు

ఆమె చెప్పడం మొదలుపెట్టింది.

భవిష్యత్దేశ నిర్మాతలైన పిల్లలు చదువుకునే విద్యా సంస్థలలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం దారుణం. భవనాలు కట్టి సంవత్సరం అయింది. ప్రమాదాలు నివారించేందుకు కనీసం వుండవలసిన ప్రమాణాలు కూడా పాటించలేదుఆమె చెప్పడం పూర్తి కాకుండానే వెంటనే గంగరాజు అరిచాడు. “ఇంతకీ భవనాలలో ప్రమాదనివారణా చర్యలు లేవంటారా?!” అన్నాడు.

ఆయన మాటలకు ఆమె శాంతంగాబెనండీ లేవు. అగ్ని ప్రమాదం జరిగినపుడు గుర్తించడానికి సెన్సార్లు, నీటిని వెదజల్లడానికి స్పింకర్లు లేవు. అలాగే నీటిని సరఫరా చేసేందుకు ఆటోమేటిక్గా పనిచేసే మోటారు వుండాలిఉష్టోగ్రత ఎక్కువైతే స్పింకర్లు వున్న బల్పు పగిలి, నీరు బైటకు వస్తుంది. ఇవేమీ లేవు…” అంది.

అవి హోటళ్ళకు, ఫ్యాక్టరీలకుఅన్నాడు ఇంజనీరు లోకనాథం.

లేదు సార్‌… వెయ్యి మంది పిల్లలుండే వసతిగహంలో, పది అంతస్తుల భవనంలో వంటశాల, జనరేటర్‌, కంప్యూటర్లేబ్లు, రసాయనిక ప్రయోగశాలలు వున్న భవనంలో ఇవన్నీ తప్పదు.

ఇంకా చెప్పండి…!” అన్నాడు కోదండరామయ్య. ఆయన ఆమె పట్ల మొదటి నుంచి ఉదాసీనంగా ఉన్నారు. ఆయనకు చర్చకు రావడం, ఆమెను సంతకానికి ఒప్పించడం ఇష్టంలేదు. ఆయన గతంలో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, రిటైరయ్యాక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయ నిజాయితీపరుడని పేరుంది.

ఆయన మాటలకు ఆమె మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.

అగ్నిప్రమాద సమయంలో ముందుగా వచ్చే స్మోక్ను గుర్తించేందుకు డిటెక్టర్లు వుండాలి. అలారం మోగాలి. అలాగే భవనాల్లో మెట్లు ఇరుకుగా ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ మంది దిగే పరిస్థితి లేదు. అలాగే విద్యుత్నియంత్రణ చట్టం ప్రకారం (డై కెమికల్పౌడర్‌, కార్బన్డయాక్సైడ్అందుబాటులో వుండాలి. ఇవేమీ లేవు. పిల్లల దగ్గరనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు గానీ నాసిరకంగా తక్కువ ప్రమాణాలతో భవనం కట్టారని అర్ధమవుతోంది. పిల్లలు ఇళ్ళకు వెళ్ళారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంతటి ప్రాణ నష్టం జరిగేదో! పాపం, నలుగురు పేద సెక్యూరిటీ గార్జులు బలయ్యారుఅంది నిట్టూరుస్తూ.

వారి కుటుంబాలకు లక్ష రూపాయలు కాంపన్సేషన్ఇచ్చారు కదా! అలాగే వారికి ఇన్సూరెన్స్క్లెయిమ్వస్తుందిఅన్నాడు గంగరాజు, ఆవిడ మాటలకు అద్దు వస్తూ

అది సరిపోతుందావారి పిల్లలకు తండ్రిని, వారి భార్యలకు భర్తలను తేగలమా?” ఆమె ఎదురు ప్రశ్న వేసింది

ఆమె మాటలకు గంగరాజు ఊగిపోయాడు. “నేను వెళ్ళిపోతున్నానుఅంటూ కోపంగా లేచాడు అతను, కళాశాల యాజమాన్యానికి సానుకూలం

కోదండరామయ్య ఆయనను కూర్చోమంటూ సైగచేసి, వాతావరనం చల్లబరచడానికి – “అమ్మా, మీ వ్యక్తిగత వివరాలు కొంత తెలుసు. మీ వారు రెవెన్యూ డిపార్టుమెంటులో పని చేసేవారనీ, చాలా నిజాయితీ గల అధికారి అనీ. వారు ప్రమాదవశాత్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం ద్వారా మీరు గుమస్తా స్థాయి ఉద్యోగిగా మీ ముష్ఫయ్యవ ఏట చేరారని విన్నాను అంతేనా…” అన్నాడు టాపిక్ను ప్రక్కకు మళ్ళిస్తూ కోదండరామయ్య.

జెను సార్‌. నాకు పదహారేళ్ళకే పెళ్ళయింది. ఆయన నాకు మేనమామ. వారు పదేళ్ళు పని చేసారు. ఆఫీసు నుంచి కేంపులో జీపులో వెళుతుంటే లారీ గుద్దేసింది. అప్పుడు ఆయన తాసీల్దారుగా పని చేసేవారు.”

వెంటనే గంగరాజు మెల్లగాజెను సిన్సియర్గా సినిమా హీరోలా పని చేస్తానంటే విలన్గాడికో కోపం వచ్చి వుంటుంది. తాసీల్దారును రోడ్డు మీద బలి చేసి వుంటాడుఅన్నాడు గొణుక్కుంటూ.  

ఎంత మెల్లగా మాట్లాడినా, మాటలు ఆమెకు వినిపించాయి.

జెను సార్‌. నిజమే. ఆయన సిన్సియర్గా పని చేసేవారు. అందుకే శత్రువులు హిట్అండ్రన్ఏక్సిడెంటు చేయించి, బలి తీసుకున్నారు. సత్యవంతంగా పని చేసేవారికి ప్రమాదాలు పొంచి వుంటాయి. అయినా వారు భయపడరుఅంది ఆవేశంగా.

మాటలకు సమావేశమందిరంలో అంతా మౌనం వహించారు. మౌనం భగ్నం చేస్తూ కోదండరామయ్యగారు ఆమె వంక సూటిగా చూసిఅమ్మా మీ సంతకం ఇప్పుడు వారికి అవసరం. కారణం ముందుగా మీరు ఎంక్వయిరీ చేసేరు కనుకఅంటూ ఆయన చెప్పడం పూర్తి కాక మునుపే సంతకం అనేది చాలా విలువైంది సార్‌. అది ఒక సిఫార్సుకో, రాజకీయ నాయకుల ఆధిపత్యానికో లొంగిపోకూడదు. నాకు చాలా ఇష్టమైన సంతకాన్ని వృథా కానీయను. ఇది నేను కష్టపడి నేర్చుకున్న సంతకం. విలువైన సంతకం. సంతకం కొన్ని వందల జీవితాలను టబ్రతికించాలి. వారికి వెలుగు నివ్వాలిఅందామె.

ఏమిటీ, ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. సంతకం కష్టపడి నేర్చుకున్నారా!!” అన్నాడు గంగరాజు వెటకారంగా.

జెను సార్‌. కష్టపడే నేర్చుకున్నాను. వినండి నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనఅని ఆమె చెప్పబోయేంతలో

మీ కథలు వినడానికి మేము ఖాళీగా లేముఅంటూ మళ్ళీ లేవబోయాడు గంగరాజు కోపంగా

కోదండరామయ్య మళ్ళీ ఆయనను కూర్చోబెట్టినువ్వు చెప్పమ్మా?!” అన్నాడు అనునయంగా.

ధన్యవాదాలు సార్‌… ఇది చెప్పడం నాకు ముఖ్యం. నా ఆర్తిని మీ ముందు బైట పెడతానుఅంటూ చెప్పడం ప్రారంభించింది.

మాకు ఒక్కడే కొడుకు. వాడిని ఒక మంచి స్కూల్లో వేసాము. వాడు బాగానే చదివేవాడు. ఒకరోజు స్కూల్లో హెడ్మాస్టారుగారి నుంచి పిలుపు వచ్చింది. అపుడు వాడి వయసు ఆరేళ్ళు. మావారు ఎప్పుడూ టూర్ల మీదే వుండేవారు. అందుకే నేను స్కూలుకు వెళ్ళాల్సివచ్చింది. నన్ను స్కూలువారు ఎందుకు పిలిచారో తెలుసా? మా అబ్బాయి నా సంతకాన్ని ఫోర్జరీ చేసేసాడు. వాడికి మార్కులు బాగానే వచ్చాయి. అంతకుముందు నాకు ప్రోగ్రెస్కార్డు చూపించాడు. తర్వాత చూపించడం మానేసాడు. తనే సంతకం పెట్టేసుకునేవాడు. ఎందుకో తెలుసాండీ?!” ఆమె సభ్యుల వంక పరిశీలనగా చూస్తూ అడిగింది.

అంతా మౌనం వహించారు.

వెంటనే ఆమె నోరు విప్పింది.

తన తల్లికి అక్షరజ్ఞానం లేదు. కనీసం సంతకం పెట్టడం రాక, ప్రోగ్రెస్రిపోర్ట్మీద వేలుముద్ర వేయడం వాడికి సిగ్గుగా అనిపించింది. కారణం, తోటి పిల్లలు ఏడిపించేవారట! అందుకోసమే వాడే నా సంతకం ఫోర్జరీ చేసేవాడు.”

ఊహించని ఆమె చెప్పిన విషయం సమావేశమందిరంలో వారికి షాక్కలిగించింది

సంతకం పెట్టడం రాని ఆవిడ, ఎమ్మార్వో స్థాయికి ఎలా ఎదిగింది?! అనే విస్మయంలో వారు వుండగానే ఆమె నోరు విప్పింది. “నా కొడుకు సిగ్గుపడడం, నా వేలుముద్రకు బాధపడడం నాకు కనువిప్పయింది. మాది వ్యవసాయ కుటుంబం. ఇంట్లో ఇద్దరు అన్నల తర్వాత పుట్టిన దానిని. మా అమ్మతో పాటూ ఇంటి పనితో, వంట పనితో సరిపోయేది. దానికి తగ్గట్టు, ఆడపిల్లకు చదువెందుకని నన్ను మూడో తరగతితో ఆపేసారు. పెళ్ళయ్యి, కొడుకు పుట్టి, వాడి వలన జ్ఞానోదయం అయి, నా మూడో తరగతి నుంచి డైరెక్టుగా మెట్రిక్యులేషన్పరీక్షకు కూర్చున్నాను. ట్యూషన్మాస్టారును పెట్టుకుని, నాలుగేళ్ళలో మెట్రిక్యులేషన్పాసయ్యి, తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసాను. చదువే నన్ను నా కొడుకుని కాపాడింది. భర్త పోయిన తర్వాత ఆధారం లేని నాకు కారుణ్య నియామకం ద్వారా గుమస్తా ఉద్యోగం వచ్చింది. తర్వాత స్వయంకృషితో ఎదిగాను. ఇప్పుడు కామాక్షి ఎమ్మార్వోమా అబ్బాయి ద్వారా నేర్చుకున్న సంతకం అంత విలువైంది సార్‌. దీనిని వృధాగా పాడుచేయనుఆమె దృఢంగా చెప్పింది

ఇక ఆమె సంకల్పం ఏమిటో వారికి అర్ధమైంది. ఇక చర్చ కొనసాగించలేమని – “ఇక ముగిద్దాం…” అంటూ కోదండరామయ్య లేచాడు. మిగతావారూ ఆయనతో పాటూ కుర్చీల్లోంచి కదిలారు.

గంగరాజు వెంటనే అన్నాడుఒక ఆడదానిచేత సంతకం పెట్టించలేకపోయాముఅన్నాడు గట్టిగానే ఆమెకు వినపడేలాగానే

మాటలకు కామాక్షిఆడది అని అంత తేలికగా తీసి పారేయకండి సార్‌. ఆడదే ఒక గృహిణిగా మీ ఇల్లు చక్కబెడుతుంది. ఒక ఉద్యోగినిగా సమాజాన్ని చక్కబెడుతుంది. పాలిచ్చి పెంచేవాళ్ళకు, పాలించడమూ తెలుస్తుంది. ఎవరో రచయిత చెప్పలేదా…” అంది తనూ గట్టిగానే

మాటలకు కోదండరామయ్య ఆశ్చర్యంగా అభిమానపూర్వకంగా ఆమె వంక చూసాడు. వెంటనే అన్నాడుతల్లీనువ్వు సంతకం పెట్టాల్సిందే!? నీ సంతకం కావాలి!”

ఆయన మాటలకు ఆమె ఆశ్చర్యపోతూమీరు నిజాయితీపరులని విన్నాను. నన్ను ఒత్తిడి చెయ్యరనుకున్నాను సార్‌… మరి మీరు?” అంటూ ఆమె కోదండరామయ్య వంక అనుమానంగా చూస్తూ వుండిపోయింది.

ఆయన నవ్వుతూసంతకం పెట్టాల్సింది ఆటోగ్రాఫ్మీద తల్లీనా కూతురు సివిల్సర్వీస్పరీక్షలు పాసయ్యింది. తనకు నీలాంటి వారి సంతకాలు కావాలిఅంటూ ఆమెకు తన బేగులోని ఆటోగ్రాఫ్బుక్అందించాడు కోదండరామయ్య.

****

Please follow and like us:

7 thoughts on ““సంతకం”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

  1. నమస్తే అండి చదువు విలువ తెలుపుతూ సమాజంలో
    జరిగే అన్యాయాలు గురించి చెప్పకనే చెప్పారు. ఓ మహిళ భర్తని కోల్పోయి కన్నబిడ్డ ముందు చదువు రాక నిరక్షరాస్యత నుంచి సంతకం చేసే స్థాయికి ఎదగటం ఆ
    అక్షరమే తన ఆయుధంగా ఓసంతకంతో గెలుపొందిన వైనం చాల బాగుంది ఇది కదా మహిళా విజయం అభినందనలు అండి.

  2. మంచికథ. నిజమే..సంతకం అనేది చాలా విలువతో కూడుకున్నది. అభినందనలు సుగుణరావు గారు.

  3. “సంతకం ” విలువని పెంచే చక్కని కథ. మూడోవ తరగతిలో చదువు ఆపేసినా, తిరిగి మొదలుపెట్టి ఎమ్మారో స్థాయి కి ఎదిగిన కామాక్షి జీవితం ఆదర్శప్రాయం, అనుసరణీయం. సుగుణ రావు గారికి అభినందనలు.

  4. Excellent 👌👌 sir.. సంతకం విలువెంటో చెబుతూ, ఆ సంతకం చేయడం రాకపోవడమే ఆమెలో కసిని పెంచి, ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళింది. చివరి దాకా ఆమె తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. చాలా బాగుంది అండి. కళ్లముందే ఇలాంటి ఘటనలు (స్కూల్ నిర్లక్ష్యం/అధికారుల అలసత్వం) యెన్నో జరుగుతూ ఉంటాయి. వాటిని కథగా మలచిన మీ ప్రతిభ నిజంగా చాలా నచ్చింది 👌👌

  5. చక్కని, నైతిక విలువలు పెంపొందించే కథ. సుగుణ రావు గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.