తెనిగీయం-3

శిథిలం కాని వ్యర్థాలు

ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్

స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి 

వెయిట్రస్ అమ్మాయిలను చూస్తె ఎండకు ఒడ్డుకువచ్చి సేదతీరుతున్న సీల్స్ లా కనిపిస్తున్నారు. నూనె పట్టించిన వారి గులాబి శరీరాలు మెరుస్తున్నాయి. అది సాంయంకాల సమయం. ఆందరూ బాతింగ్ సూట్స్లో వున్నారు. డాని కళ్ళార్పకుండా వారినే చూస్తున్నారు. బైనార్కులర్స్ మాంటి దగ్గర అద్దెకు తీసుకున్నాడు. డాని చాలాసేపటి నుంచి చూడవలసిన దృశ్యాలన్ని చూసేశాడు. అయినా ఇచ్చిన డబ్బులు పూర్తిగా రాబట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా చూస్తునే వున్నాడు. పక్కనే వున్న రిచీ ఒకసారివ్వు నేనుకూడా చూడాలని పోరుతున్నాడు. డాని బైనాక్యులర్స తో దూరంగా ఎండకాగుతున్న రొనేట్ నే చూస్తున్నాడు. క్యాంప్ కి వచ్చిన అబ్బాయిలందరి చూపులు ఆమెపైనే. డాని మిత్రబృందమంతా టేబుల్ దగ్గర ఆమె వడ్డిస్తె బాగుండునని అనుకుంటుంటారు. 

అక్కడ ఎండకాగుతున్న ఆవెయిట్రస్ అమ్మాయిలకు కూడా తెలుసు ఆబ్బాయిలు తమనే చూస్తుంటారని. వాళ్ళ వయసు కూడా పన్నెండు, పదమూడేళ్ళకు ఎక్కువేమి కాదు. వెయిట్రస్ అమ్మాయిలు ఒకరి ఒంటికి మరొకరు తైలం పట్టిస్తూ, పాత రొమాన్స్ పట్రికలు బిగ్గరగానే చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ట్రాషియా దగ్గర ఇలాంటి మాగజైన్లు చాలా వున్నాయి. ప్రతి మేగజైన్ కవర్ పైన ఒక అమ్మాయి బొమ్మ ఖచ్చింతంగా వుంటుంది. అవన్ని చీప్ అమ్మాయిల జీవితాలకు సంబంధించినవి.  చిందరవందరైన జీవితాలకు సంబంధించినవి. అందులో వుండే కథలు విజయం సాధించిన అమ్మాయిల కథలు కాదు. అందుకే హిల్లరీ వాటిని “శిధిలం కాని వ్యర్ధాల” వంటివి అంటుంది. అందుకే జోయన్ నిజమైన చెత్త అని వాటిని మోనోడ్రామా(moan-o-drama) అంటుంది. ఈ మేగజైన్లో కథలన్నింటిలోనూ అమ్మాయిలు బలహీనమైనవారు. తెలివితక్కువ దద్దమ్మల్లా వ్యవహరిస్తారు. చాలా తేలిగ్గా ప్రేమలో పడిపోతారు. అది కూడా మోసం చేసే మగాళ్ళ ప్రేమలో పడి తరువాత ఏడుస్తారు. 

     క్యంపులో మొత్తం తొమ్మిది మంది అమ్మాయిలున్నారు. ఎప్పుడూ తొమ్మిదిమందే వుంటారు. అమ్మాయిలు మారొచ్చు కాని నెంబర్ మారదేమో అనుకున్నాడు డాని. ఎనిమిదేళ్ళ వయసునుంచి ఇలా క్యాంపుకు వస్తూనే వున్నాడు. అప్పుడు ఈ వెయిట్రస్ అమ్మాయిలపైన అంత ఆసక్తి వుండేది కాదు. ఎప్పుడైనా చూస్తె అంట్లుతోముతూ మరో పనేదైనా చేస్తూ తొమ్మిదిమంది తల్లుల్లా కనిపించేవారు. ఇప్పుడు వాళ్లెవరూ తల్లుల్లా కనిపించట్లేదు.

     వెయిట్రస్ అమ్మాయిలు పనిచేస్తూ హాయిగా పాడుకుంటున్నారు. హిల్లరి లాంటి అమ్మాయిలు ఇక్కడ ఈ పిల్లల క్యాంపులో డబ్బుకోసం వెయిట్రస్ పనులు చేయడంలేదు. వాళ్ళ తల్లులు క్యాంప్ నిర్వహించే మిస్టర్ బి ని ఏదో ఫంక్షన్ లో కలవటం వల్ల వీళ్ళు ఇక్కడకొచ్చిపడ్డారు. జోయనే పరిస్దితి అలా కాదు. ప్రతిరోజు స్కాలర్షిప్ వచ్చిందా అని పోస్ట్ కోసం ఎదురుచూడ్డామే. అక్కడ అందరికి ఏదో ఒక నిక్ నేమ్. హిల్లరిని హిల్ అని, స్టెఫానీని స్టెఫ్ అని, అలెక్స్ ని అల్ అని, జోయనెని జో అని పిలుస్తుంటారు. కాని రోనెట్ మాత్రం స్పెషల్. ఆమె హోదాయే వేరు. ఆమెను పూర్తి పేరుతో పిలుస్తారు. ఆమెను మిగిలినవారికన్నా భిన్నంగా చూస్తుంటారు. ఆ రోజురాత్రి డానితో మాంటీ మాట్లాడుతూ డార్సీ రహస్యంగా ఫ్లాస్క్ లో మందు తాగుతున్నాడని వెళ్లి పట్టుకుందామనుకున్నారు. కాని అక్కడ వాళ్ళకు మందు గుంరించి కాక రోనెట్ గురించి అసహ్యంగా మాట్లాడటం వినిపించింది. వాళ్ళు రోనెట్ గురించి అసహ్యంగా మాట్లాడటం డానీకి నచ్చలేదు. కాని డార్సీని ఏమి చేయలేడు. బాధ అలాగే దాచుకున్నాడు.  మర్నాడు మాంటి బానాక్యులర్స్ దొంగలించి సరస్సులో విసిరేశాడు. ఈ పని డానీయే చేశాడని మాంటి అన్నాడు. తాను చేయలేదని డాని చెప్పలేదు, అహం అడ్డొచ్చింది. ఎందుకలా చేశాడో కూడా చెప్పలేదు. ఆ తర్వాత డానిని క్యాంపునుంచి బయటకు పంపేశారు. 

         వేసవి చివరి రోజుల్లో క్యాంపుకు వచ్చిన అబ్బాయిలంతా వెళ్లిపోయారు. కొందరు కౌన్సిలర్లు, వెయిట్రస్ లు మాత్రమే వున్నారు. జోయెనే తన రూంలో బ్యాగు సర్దుకుంటోంది. రోనెట్ నెమ్మదిగా ఆమె రూముకొచ్చింది. జోయెన్ కి ఆమె ఏదో చెప్పడానికొచ్చిందని అర్ధమైంది. రోనెట్ కళ్ళు పైకెత్తి జోయెన్ వైపు చూసింది. “పెద్ద చిక్కుల్లో వున్నాను” అంది. “ఏమైంది” అంది జోయెన్. “నీకు తెలిసిన సమస్య” అంది. ఇప్పుడేంచేస్తావు అనడిగింది జోయెన్. నాకు తెలియదు అని సమాధానం చెప్పింది రోనెట్. ఎవరీకీ ఈ విషయం చెప్పకు అంది. వాడితో ఈ విషయం గురించి మాట్లాడావా అనడిగింది జోయెన్.  ఎవరితో అని ఎదురు ప్రశ్నవేసింది రోనెట్. డార్సీని అంది జోయెన్. వాడు పిరికి గొడ్డు… వాడు కాదు అంది. జోయెన్ ఆశ్ఛర్యపోయింది. తన అంచనా తప్పినందుకు తనమీద తనకే కోపం వచ్చింది. డార్సి కాకపోతే మరెవరు?అంది. కాని రోనెట్ అంతకు మించి చెప్పడానికి సిద్దంగా లేదు. ఇప్పుడు జోయెని కు ఇది మిస్టరీగా మారింది. “నువ్వు ఏదోరకంగా దీన్ని వదిలించుకోవటం మంచిది” అని జోయెన్ సలహా ఇచ్చింది. నీకేమైనా మతిపోయిందా… అంది రోనెట్. నేనలా చేయించను అంది. జోయెన్ ఆలోచనలో పడింది. మరి తనకెందుకు చెప్పింది. ఎవరు రోనెట్ తో గడిపింది. కౌన్సిలర్లందరి ముఖాలు గుర్తుచేసుకుంది. కాని ఎవరన్నది అర్ధం కాలేదు. రోనెట్ వెళ్ళిపోయింది. పదకొండేళ్ళు గడిచిపోయాయి. 

                   టోరంటో లోని యార్క్ విలా ఎవెన్యులో నడుస్తున్నాడు డానీ. వేసవి ఎండ ఎక్కువగా వుంది. ఇప్పుడు పాత డానీ కాదు. కాళ్ళకు శాండిల్స్, వైట్ ఇండియన్ స్టయిల్ షర్ట్, జీన్స్ వేసుకున్నాడు. పెద్ద జుట్టు, గెడ్డం వుంది. ఇది శనివారాల్లో అతని డ్రస్సింగ్. సరదాగా యార్క్ విలాలో గడపడానికి వేసుకునే డ్రస్సులు. మామూలు వారం రోజుల్లో సూటుబూటులోనే వుంటాడు. 

       అకస్మాత్తుగా వీధి చివర డానికి జోయెనె కనిపించింది. చాలా కాలంగా ఆమె గురించి కనీసం ఆలోచన కూడా అతనికి రాలేదు. ఏదో పనిమీద వెళ్తున్నట్లు కనిపించింది. జోయెనె అని పిలిచాడు. కాని ఆమెకు వినపడలేదు. పరిగెత్తుకుని వెళ్లి వెనకనుంచి ఆమె చేయి పట్టుకుని ఆపాడు. డాని…నువ్వా…మైగాడ్… ఎదిగిపోయావు అంది. ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు. పాత స్నేహితుల మధ్య వుండే సాన్నిహిత్యం వారి మధ్య ఏర్పడింది. ఏంచేస్తున్నావని అడిగాడు డాని. ఫ్రీలాన్స్ స్క్రిప్టులు రాస్తున్నాను అంది. అప్పట్లో డాని ఎక్కువగా రోనెట్ వైపే చూసేవాడు. కాని ఇప్పుడు జోయెనె చాలా అందంగా కనిపిస్తోంది. మేము నీ పైన కన్నేసి ఉంచేవాళ్ళం తెలుసా అన్నాడు. నువ్వుకూడానా… మాకు తెలుసు… దూరాన పొదలు కదులుతూ వుండడం చూసేవాళ్ళం అంది. డాని కాస్త సిగ్గుపడ్డాడు. మిగతావాళ్ళెవరైనా కలుస్తున్నారా అనడిగాడు. లేదు, యానివర్సిటిలో కొందరు కలిసేవారు. హిల్లరి, అలెక్స్, పాట్ అప్పుడప్పుడు కలుస్తుంటారు అంది. రోనెట్ గురించేమైనా తెలుసా అన్నాడు. నిజానికి అదే అతను అడగాలనుకున్నాడు. 

                       అప్పట్లో డానీని క్యాంప్ నుంచి గెంటేసినప్పుడు తన ఎనిమిదేళ్ళ వయసునుంచి వస్తున్నాడు కాబట్టి అతనేమి పెద్దగా పట్టించుకోలేదు. ఒక రాయిమీద కూర్చునిసరస్సును చూస్తున్నాడు. అకస్మాత్తుగా అక్కడికి రోనెట్ వచ్చింది. ఇంకా యూనిఫాం లోనే వుంది. తనను గెంటేసినందుకు సానుభూతి చూపించింది. నేనిప్పుడు నీతో వున్నాను అంటూ తనవైపు చూసి నవ్వుతోంది. నవ్వుతుంటే ఆమె ఇంకా అందంగా వుంది. ఆమెకళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు, చేతులు వణుకుతున్నాయి. గొడవ జరిగింది నీగురించే డార్సి…డార్సి నీగురించి చాలా అన్నాడు. రోనెట్ నవ్వుముఖం మాయమైపోయింది. ఏంచెప్పాడు అంది, వద్దులే నువ్వు వినలేవు అన్నాడు, నాకు తెలుసులే ఆచెత్త అంది, కోపంగా కాదు, నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. ఆమె లేచి నిలబడింది. తన రెండు చేతులు మెడవెనుక పెట్టింది. ఆమెతన యూనిఫాంవిప్పుతోందని కాసేపటికి కాని డానీకి అర్ధం కాలేదు. ఆమెఅలాగే నేలపై వాలింది, ఆతను తనవేపు రావడాన్ని నవ్వుతూ చూస్తోంది. ఇదంతా పట్టపగలు తనకు జరుగుతుందని అతను నమ్మలేకపోతున్నాడు.                                 

మరో కాఫీ కావాలా అనడిగింది జోయన్. వెయిటర్ని పిలిచింది. కాని డానీ ఆ మాటలు సరిగా వినలేదు. ఆమె నాతో చాలా స్నేహంగా వుంది. నీకు తెలుసా క్యాంప్ ఆర్గనైజర్ నన్ను బయటకు పంపేసినప్పుడు ఆమె చేసింది నాకు చాలా చాలా ఎక్కువ… అతని మాటల్లో తప్పుచేశానన్న భావం వుంది. ఎందుకంటే ఆ తరువాత అతనామెకు ఉత్తరం కూడా రాయలేదు. ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. జోయనే అతనివైపే నోరు తెరుచుకుని చూస్తోంది. అతను ఒక మాట్లాడే కుక్కలా కనిపిస్తున్నాడు. అతను కాస్త ఇబ్బందిగా తన గడ్డం గోక్కున్నాడు, తానేమైనా చెప్పకూడని రహస్యాలు చెప్పేశానా అన్నట్లు.

                          జోయనేకి కథలో ముగింపు తెలిసింది. ఇన్నాళ్ళకు కనీసం. రోనెట్ ఎందుకు డానీ పేరు చెప్పలేదంటే, ఆమె అతడిని బహుశా కాపాడ్డానికి చెప్పలేదు. లేదా తనను తాను కాపాడుకోడానికి చెప్పలేదు. పద్నాలుగేళ్ళకుర్రాడితో అంటే అప్పుడు చాలా ఎబ్బెట్టు విషయమే. అప్పుడు ఎబ్బెట్టు కాని ఇప్పుడు ఎబ్బెట్టు గా వుండదు. గతానికి వర్తమానానికి మధ్య ఒక గీత. గతం చాలా చీకటిగా కంటికి గుచ్చుకునే చీకటిగా వుంది. 

                          వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమెకు తొమ్మిది మంది వెయిట్రస్ అమ్మాయిలు కనిపిస్తున్నారు. అందులో తాను కూడా వుంది. ప్రమాదకరమైన సెక్సు… నిషిద్దం, రహస్యం, మూడు చుక్కలతో మాత్రమే చెప్పే విషయం, ఎందుకంటే దాన్ని చెప్పడానికి పదాలు వేరే లేవు. కాని మరోవైపు పెళ్ళి, భార్య, పిల్లలు, సంసారం, భద్రత. లైంగిక సంబంధం అనేది సంసారీకరించబడింది. అందులో మిస్టరీ పోయింది. అంది లాంఛనంగా జరిగే వ్యవహారంగా మారింది. రోనెట్ ఏమైంది… జనం మాటలు పడుతూ గతంలో కూరుకుపోయింది. ఏంచేస్తుందో ఇప్పుడు…టెబుల్ అవతల కూర్చున్న డానీ ఇప్పుడు ఒక పదేళ్ళ పిల్లాడికి తండ్రి. కాని ఆ విషయం అతనికి తెలిదు. ఆ విషయం అతనికి చెప్పేసి ముగింపు ఇవ్వాలనిపించింది జోయన్ కి, కాని అది ముగింపు కాదు. మరో ప్రారభం అవుతుంది. ఏమైన ఈ కథ మళ్ళీ ఇప్పుడు జరిగే అవకాశం లేదు ఎందుకంటే వాడి పడేసిన శిథిలం కాని వ్యర్థాలు ఎవరికి అవసరంలేదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.