మాలతీ చందూర్

-యామిజాల శర్వాణి

1950ల నుండి దాదాపు సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువారికి సుపరిచితమైన పేరు శ్రీమతి మాలతి చందూర్ . ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడులో 1930 లో జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు ఆరుగురి సంతానంలో అందరికంటే ఆమె చిన్నది.  ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివింది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది.ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి (చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరు లోని వట్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా ‘కథావీధి’ అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకట చలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది.

1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరు కున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్‌ గారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. మద్రాసుకు వచ్చిన తరువాతే పైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. వారు ఇంతకు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, పి.వి.రాజమన్నార్, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పరుసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. మద్రాసులో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే డియర్ అబ్బీ వంటి శీర్షికను క్రమము తప్పకుండ 47 సంవత్సరాలు నిర్వహించారు

ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం,విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి.మాలతీ చందూర్ రాసే “జవాబులు” ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ ‘జవాబులు’ శీర్షిక పేజీలను ఆరోజుల్లో వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు ఎందుకంటే అవి జ్ఞానాన్ని పంచి ఇచ్చే జవాబులు తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించింది. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి ‘పాత కెరటాలు’ శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నది. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నది. నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించింది మద్రాసులో స్థిరపడ్డ మాలతి చందూర్  క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయి 2013 ఆగస్టు 21 న స్వర్గస్తురాలైయినారు ఆవిడ  తన పార్థివ దేహాన్ని పరిశోధనల నిమిత్తము మద్రాసు లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ కు దానము చేశారు.

ప్రస్తుతము ఆవిడ వ్రాసిన కధలలో ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురితమైన” కారుణ్యము” అనే కథను పరిచయము చేస్తాను ఈ కధ  ఒక పదేళ్ల కుర్రవాడు వాళ్ళ పక్కింటి వ్యక్తి తన పెంపుడు కుక్కపై చూపించిన నిర్లక్ష్యానికి  క్రూరత్వానికి చలించి తన మేనత్త సహాయముతో ఆ కుక్కను కాపాడిన విధము ను రచయిత్రి చక్కగా వివరించారు ఈ కధకు టైటిల్ కారుణ్యము అని పెట్టారు గాని ఈ  కదాంశము జీవకారుణ్యము నోరు లేని జీవాల పట్ల ఆ చిన్నపిల్లవాడిలో ఉండే దయ జాలి వాటికి న్యాయము చేయాలి అన్న తపన స్పష్టముగా కనిపిస్తుంది

ఆదివారము అవటముతో టీచర్ గా పనిచేస్తున్న సుమతి తీరికగా పేపర్ చూస్తూ కూర్చున్నది మాములుగా అయితే సుమతి మేనల్లుడు వాసు వాళ్ళ అమ్మ నూనె రాసి నలుగు పెట్టి పొసే తలంటి భయపడి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు కానీ ఈ రోజు వాళ్ళ మేనత్త  చుట్టూ ఎదో పనికోసము తచ్చాడుతున్నాడు ఇది గమనించిన సుమతి బహుశా సినిమాకు వెళ్లటానికి డబ్బులకోసము తన చుట్టూ తిరుగు తున్నాడని అనుకుంది కానీ వాసు సుమతి  దగ్గరకు వచ్చి,”అత్తా మనము ఫోన్ చేస్తే పోలీసులు వస్తారా?”అని సందేహముగా అడిగాడు సుమతి ఒక్కసారి ఉలిక్కిపడి,”అయినా నీకు పోలీసులతో ఏంటి పని “అని అడిగింది “100 కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారా?”అని మళ్ళీ అడిగాడు. “ఫైర్ లేదా యాక్సిడెంట్ జరిగితే వస్తారు”అని  సుమతి చెపుతుంది అయితే పోలీసులు రారా?అని అడుగుతాడు  దొంగతనము ఏదైనా జరిగిందా? అంటే దొంగతనము జరిగితే తప్ప  పోలీసులు రారా అన్యాయము జరుగుతూ ఉంటె రారా మరి వాళ్ళను రక్షక భటులు అంటారు కదా? అన్యాయము జరిగిన చోటుకి రావాలి కదా? అని ప్రశ్నల వర్షము వాళ్ళ మేనత్త మీద వాసు కురిపిస్తాడు. ఇంతకీ అసలు విషయము ఏమిటో చెప్పు పోలీసులులు వచ్చి ఎవరికీ సహాయము చేయాలి అని సుమతి అడుగుతుంది 

“పోలీసులు మనుషులకు మాత్రమే సహాయము చేస్తారా? జంతువులకు సహాయము చెయ్యరా? “అని వాసు అంటే సుమతికి విషయము కొద్దీ కొద్దిగా అర్ధము అవుతుంది. వాసు ఏ జంతువునో రక్షించటానికి కంకణము కట్టున్నాడు ఎవరు చెప్పిన వినడు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లేట్టున్నాడని సుమతికి  అర్ధమయింది “ఇంతకూ టామీ గురించియేనా నీ భాధ “అని సుమతి వాసును  అడుగుతుంది “అవును అత్తా పక్కింటి మురుగేశన్ వాళ్ళు ఆ టామీ (బొచ్చుకుక్క) ని లోపలి రానివ్వటము లేదు అదేమో గేటు దగ్గర కుయ్యో మర్రో అంటూ ఉంటుంది పైపెచ్చు రాళ్లతో  కొడుతు ఉన్నారు  మనింటికి తెద్దాము అంటే నాయనమ్మ ఒప్పుకోదు  .ఇన్నాళ్లు పెంచి ఇప్పుడు  నోరులేని జీవాన్ని తరిమేస్తున్నారు అని పోలీసులకు చెపుతాను” అని ఆవేశముగా  వాసు అంటాడు  మురుగేశన్ ఇంట్లో కాపలా కుక్క ఈ బొచ్చు కుక్క రెండు ఉన్నాయి రోజు సాయంత్రము ఆ బొచ్చు కుక్క టామీ ని వెంట బెట్టుకొని షికారుకు వెళ్ళేవాడు ప్రస్తుతము ఆ కుక్క పెద్దది అయి పోయిందని తిండి దండగ అని బయటకు గెంటేశారు ఇది తెలియని టామీ గేటు దగ్గర అరుస్తూ (ఏడుస్తూ)ఉంది ఇదంతా గమనిస్తున్న వాసుకు టామీ కి సహాయము చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు ఆ విషయము లో మేనత్తను సహాయము సలహా అడుగుతున్నాడు వాడికి తట్టిన ఆలోచన పోలీసు సహాయము 

ప్రక్క వాడి గోడు పట్టించుకోని నేటి సమాజములో తన మేనల్లుడు కుక్క పట్ల చూపించే జాలికి సుమతి ఏంతో  సంతోషించింది. “అత్తా పోలీసులు వచ్చి మురుగేశన్ కు బుద్ధి చెప్పి  పాపము కుక్కను రక్షించరా?” అని అమాయకంగా అడుగుతాడు. పదేళ్ల వాసు దృష్టిలో ప్రాణులు అన్ని ఒక్కటే పెంచుకుంటున్న “మురుగేశన్ కి ఇష్టము లేదు అందుచేత టామీ న తరిమేశాడు అది పోలీస్ కేస్ క్రిందకు రాదు” అని సుమతి అంటే  అంటే వాసు “రేపు మురుగేశన్  ముసలివాడు అయితే వాళ్ళ పిల్లలు ఇంట్లోనించి తరిమేస్తారా?” అని లాజికల్ గా అడుగుతాడు చివరకు అర్గ్యుమెంట్ల తరువాత సుమతి “ఫోన్ చేస్తే ఉపయోగము ఉండడు గాని  నీవు నీ స్నేహితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ ఇన్స్పెక్టర్ కి అంతా  వివరముగా చెప్పండి అయన సహాయము చెయ్యకపోయినా జీవకారుణ్య సంఘానికి చెప్పి సహాయము జరిగేటట్లు చూస్తాడు” అని సుమతి సలహా ఇచ్చింది. టెలిఫోన్ డైరెక్టరీ చూసి జీవకారుణ్య సంఘము ఆఫీసు అడ్రెస్ ఫోన్ నంబర్ చూసి వాసు వాడి ఫ్రెండ్స్ పోలీసు స్టేషన్ వెళ్లి అక్కడినుండి జీవకారుణ్య సంఘము ఆఫీస్ కు వెళ్లి వారితో జరిగిన వృత్తాంతాన్ని అంతా  పూసగుచ్చినట్లు చెప్పారు 

ఆ రోజు ఆదివారము అయినా జీవకారుణ్యము సంఘము వారు పోలీసులను వెంట బెట్టుకుని వాసు, వాడి మిత్ర బృందంతో మురుగేశన్ ఇంటికి వచ్చారు.ఊహించిన ఈ పరిణామానికి మురుగేశన్ ఖంగు తిన్నాడు జీవకారుణ్యము వారు ఈ ప్రాణి నైన హింసిస్తే అపరాధరుసుము జైలు శిక్ష ఉంటుంది అని మురుగేశన్ కు వార్నింగ్ ఇస్తారు “మీరు ఇన్నాళ్లు పెంచుకున్న కుక్కను ఇలా గెంటి వేయటం న్యాయ సమ్మతము కాదు మీరు పోషించలేకపోతే మాకు నెలకు వందరూపాయల చొప్పున ఇస్తే మా జీవకారుణ్య సంఘము వారే ఆ కుక్కను బ్రతికి ఉన్నంత కాలము పోషిస్తాము ‘ అని చెప్పి మురుగేశన్ ను ఒప్పిస్తారు గేటు తీయగానే టామీ లోపలికి  మురుగేశన్ దగ్గరకు వచ్చిప్రేమగా చుట్టూ తిరిగుతూ ఉంది  ‘కుక్కకు ఉన్న ప్రేమ విశ్వాసము చూడండి మీరు అన్నము పెట్టకపోయినా రాళ్లు వేసిన ఎంత ప్రేమ విశ్వాసము చూపిస్తుందో’ అని పోలీస్ అంటాడు టామీ కళ్ళలోని విశ్వాసాన్ని ప్రేమను చుసిన మురుగేశన్ మొదటిసారిగా తానూ మనిషిగా పుట్టినందుకు టామీ ని నిరాదరణ గా చూచినందుకు సిగ్గు పడి టామీ ని దగ్గరకు తీసుకున్నాడు. కధ  సుఖాంతం అయింది వాసు మరియు అతని మిత్ర బృందం వాళ్ళు సాధించిన ఘన  విజయానికి సంతోషిస్తూ వాళ్ళ ఇళ్లకు వెళ్లారు.వాసు ఇంటికి వెళ్లి వాళ్ళ మేనత్త సుమతి ముందు కాలర్  ఎగరేసాడు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.