“నెచ్చెలి”మాట 

2022కి ఆహ్వానం!

-డా|| కె.గీత 

2022వ సంవత్సరం వచ్చేసింది!

గత రెండేళ్లుగా అలుముకున్న 

చీకట్లని పాక్షికంగానైనా- 

పదివిడతల టీకాలతోనైనా- 

తొలగిస్తూ

మనలోనే ఉన్న 

వైరస్ 

ఓ-మైక్రాన్ 

కాదు కాదు 

ఓ-మేక్సీ లాగా 

బలపడుతున్నా 

వెనుతిరగకుండా 

మనమూ 

పోరాడీ పోరాడీ 

బలపడుతూ ఉన్నాం

కిందపడినా లేస్తూ ఉన్నాం

కొత్త ప్రారంభాల 

కొత్త ఉత్సాహాల 

కొత్త జీవితాల 

మేలుకలయికగా-

పోరాటం ఎంతకాలమో తెలీదు 

ఎవరు 

ఎప్పుడు 

బలవుతారో తెలీదు 

అయినా 

తెగని ఆశతో  

రొమ్ము ఎదురొడ్డే ధైర్యంతో  

వచ్చుకాలము మేలు- గతకాలము కంటె

అని మార్చుకుందాం

మరింత రెట్టించిన బలంతో తలపడదాం 

కొత్త సంవత్సరాన్ని 

ఆనందంగా ఆహ్వానిద్దాం

కొత్త పనుల 

కొత్త విషయాల  

కొత్త కార్యక్రమాల 

మేలుకలయికగా 

పోరాటం ఎంతకాలమైనా 

వరదలు

తుఫానులు 

హిమపాతాలు 

ఎండలు 

కార్చిచ్చులు 

భూకంపాలు… 

పోరాటం ఏదైనా

ఎదురు నిలబడదాం   

అన్నిటినీ మించి 

ఏ రోజుకారోజు 

సంతోషంగా గడుపుదాం!

2022 వ సంవత్సరాన్ని 

ఆనందంగా ఆహ్వానిద్దాం!!

*****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

 ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.