స్వరాలాపన-15

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: సింధు భైరవి రాగం 

Arohanam: S R1 G2 M1 P D1 N2 S

Avarohanam: S N2 D1 P M1 G2 R1 S

చిత్రం: మేఘసందేశం(1982)

గీతం: నిన్నటిదాకా శిలనైనా

సంగీతం: రమేష్ నాయుడు

గీత రచన: వేటూరి సుందర్రామ్మూర్తి

పాడినవారు: పి.సుశీల

నిన్నటిదాకా శిలనైనా 

రిగరిస సానీ సససరిగా 

నీ పదము సోకి నే గౌతమినైనా

సరి మమమ మామ పని  పనిపమ గమరిస 

నిన్నటిదాకా శిలనైనా

రిగరిస సానీ సససా 

నీ మమతావేశపు వెల్లువలో

సాదదపా మాగ3మ మాపపా 

గోదారి గంగనై పొంగుతూ ఉన్నా… ఆ… ఆ … ఆ… 

సరినీస మామమా పనీరి*స నిదపానీ పమగారీసా 

నిన్నటిదాకా శిలనైనా

రిగరిస సానీగా  రిగరీసా 

నీ పదము సోకి నే గౌతమినైనా

సరి మమమ మామ పని  పనిపమ గమరిస 

నిన్నటిదాకా శిలనైనా

రిగరిస సానీ సససా 

 

సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని

దపపా మమమామ గమసారిగమ  గగగ గమపామాగ దామాగరిగా 

సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని

దపపా మమమామ గమసారిగమ  గగగ గమపామాగ దామాగరిస

మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక

మాప మాపపపాప గపదాని పపపా 

మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక

మాప మాపపపాప గపదాని పపపా 

మువ్వంపు నటనాల మాతంగిని

సారీససరినీస దామామపా 

కైలాస శిఖరాల శైలూశికా నాట్య

నీసా*నినిసా*స* పనిరీ*స* దానీప  

ఢోలలూగేవేళ రావేల నన్నేల

దాపమామామామా సారిమమ2మ గరిరిగస 

నిన్నటిదాకా శిలనైనా

రిగరిస సానీగా  రిగరీసా 

నీ పదము సోకి నే గౌతమినైనా

నిన్నటిదాకా శిలనైనా

నీ మమతావేశపు వెల్లువలో

గోదారి గంగనై పొంగుతూ ఉన్నా

నిన్నటిదాకా శిలనైనా

నీ పదము సోకి నే గౌతమినైనా

నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని

నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే

చిరునవ్వులో నేను సిరి మల్లిని

స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు

చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల

నిన్నటిదాకా శిలనైనా

నీ పదము సోకి నే గౌతమినైనా

నిన్నటిదాకా శిలనైనా

నీ మమతావేశపు వెల్లువలో

గోదారి గంగనై పొంగుతూ ఉన్నా

నిన్నటిదాకా శిలనైనా

నీ పదము సోకి నే గౌతమినైనా

నిన్నటిదాకా శిలనైనా

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.