
కలుషిత ఏరు
-కందేపి రాణి ప్రసాద్
సమశీతోష్ణ ఆడవులలో జింకలు నివసిస్తున్నాయి. జింకలు చాలా అందంగా ఉంటాయి. వేగంగా పరిగెడతాయి. చురుకుగా ఉంటాయి. జింకలన్నీ ఒకే చోట నివసిస్తున్నాయి. అన్నీ సమూహంగా కలిసిమెలిసి ఉంటాయి. జింకల్లో మచ్చలున్న జింకల్నీ ‘కృష్ణ జింకలు’ అంటారు. కొమ్ములున్న జింకలు మగ జింకలు. వీటి కొమ్ములు మూడు, నాలుగు మెలికలు తిరిగి రెండు అడుగుల పైగానే పెరుగుతాయి. మగ జింకలు బలిష్టంగా ఉంటాయి. ఆడ జింకలకు కొమ్ములు ఉండవు.
జింకలు సమూహాలుగా అంటే మందలుగా జీవిస్తాయి అనుకున్నాం కదా!, అలాంటి ఒక జింకల మంద ఏటికి దగ్గరగా నివసిస్తోంది. ఈ జింకలన్నీ మధ్యాహ్నం, సాయంత్రం ఏటి వద్దకు వచ్చే దాహం తీర్చుకుంటాయి. పక్కనే ఉన్న పచ్చిక మైదానాలలో ఉన్న గడ్డిని తింటుంటాయి. అక్కడక్కడ పండ్లు దొరికిన తింటాయి. ఆడ జింకలు లేత గోధుమ రంగులో ఉండి అందంగా కనిపిస్తాయి. దగ్గర అన్ని జంతువులు నీళ్ళు తాగినా దగ్గరగా ఉన్న జింకలే ఎప్పుడు ఏటి దగ్గర నీళ్ళు తాగుతాయి.
ఒక మందలో ఇరవై, ఇరవై ఐదు జింకలు ఉంటాయి. ఈ మందకు ఒక మగ జింక నాయకుడుగా ఉంటుంది. అక్కడక్కడ దగ్గరలో ఉన్న మైదానాలలో జింకలన్నీ గడ్డి మేస్తున్నాయి. వీటితో నాలుగు చిన్న జింకలు కొద్దిసేపు గడ్డిని నమిలాక, ‘‘మంచినీళ్ళు తాగి వద్దామా’’? అని ఒక పిల్ల జింక అడిగింది. సరే సరే అంటూ మిగతా పిల్ల జింకలన్నీ తలూపాయి.
పిల్ల జింకలన్నీ కలిసి గెంతుకుంటూ ఏటిదాకా వెళ్ళాయి. అక్కడ ఒకదానిమీద మరొకటి నీళ్ళు జల్లుకుంటూ ఆటలాడుతున్నాయి. సరదాగా ఆటలాడుకుంటూ నీళ్ళు తాగేసి తిరిగి బయలుదేరాయి. ఆరోజు అడవిలో తిన్న పండ్ల రుచి గురించి మాట్లాడుకున్నాయి. ఆ తర్వాత సరదాగా పరుగు పందెం పెట్టుకుందామా అని అనుకున్నాయి. ఎదురుగా ఉన్న చెట్టు దాకా పరుగెడదాం అనుకున్నాయి.
అనుకున్నదే తడవుగా నాలుగు పిల్ల జింకలు పోటీ పెట్టుకుని పరిగెత్తడం మొదలు పెట్టాయి. అనుకున్న చెట్టు దాకా పరిగెత్తాయి. కానీ అక్కడకు రెండు జింకలే చేరుకున్నాయి. అవి వెనక్కి తిరిగి చూశాయి. మిగతా రెండు జింకలు దారిలో పడిపోయి ఉన్నాయి. పరిగెత్తేటప్పుడు కాలు జారిపోయి పడిపోయి ఉంటాయని వెనక్కు వెళ్ళాయి.
హాయ్ నేస్తాలూ! ఏంటాలా పడిపోయారు? కాళ్ళ నొప్పి పుట్టాయా? అని అపహాస్యంగా ముందుకు వెళ్ళిన పిల్ల జింకలు అడిగాయి. పడిపోయిన పిల్ల జింకల దగ్గర నుంచి చిన్నచిన్న మూలుగులు తప్ప, మాటలు వినిపించలేదు ‘‘మీరు ఓడిపోయారని బాధపడకండి’’ అంటూ ముందుకు వెళ్ళిన పిల్ల జింకలు ఎగతాళి చేశాయి. అయిన పడిపోయిన జింకల వద్ద నుంచి సమాధానం ఏమీ రాలేదు.
పడిపోయిన జింకలు కడుపు పట్టుకొని బాధగా మూలుగుతున్నాయి. పైకి లేవలేకపోతున్నాయి. ముందుకు పరిగెత్తిన జింకలు అప్పటికి ఈ జింకల్ని గమనించాయి. అయ్యో ఏమైంది, పడిపోయారా? దెబ్బలు తగిలాయా ? అంటూ ఆందోళనగా అడిగాయి.
అవి మాట్లాడిన తర్వాత కూడా కింద పడిన జింకలు మాట్లాడలేకపోయాయి. అప్పటికి అవి లేవలేకపోతున్నాయని గుర్తించాయి. వెంటనే పదిమందిని పిలిచి, పదిమంది పడిపోయిన జింకల్నీతీసుకొని ఆసుపత్రికి వెళ్ళాయి. ఎలుగుబంటి డాక్టరు వద్దకు ఈ జింకల్ని తీసుకువెళ్ళారు.
ఆసుపత్రిలోని టేబుల్ మీద పడుకోబెట్టి ఎలుగుబంటి పరీక్ష చేసింది. గబగబా రెండు ఇంజక్షన్లు చేసింది. ఆ రెండింటికీ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు చేయమని చెప్పింది. రెండు జింకలకు సెలైన్లు పెట్టింది. మిగతా జింకలన్నీ ఆశ్చర్యంగా ఎలుగుబంటిని చూస్తున్నాయి.
అంతలో ఈ పిల్ల జింకల తల్లిదండ్రుల జింకలు వచ్చాయి. ఏమైంది డాక్టరు గారు మా పిల్లలకు అని రెండు జింకల తల్లిదండ్రులు ఆదుర్థాగా అడిగాయి. కాసేపు ఆగమని ఎలుగుబంటి సైగ చేసింది. జింకలను పరీక్షలు చేసి, ఏమైందని మిగతా జింకల్నీఅడిగింది. స్నేహిత పిల్ల జింకలు ‘‘ తాము గడ్డి తినటం, ఏట్లో నీళ్ళు తాగటం, పరిగెత్తే పోటీ పెట్టుకోవడం వరసగా జరిగిన విషయాలు చెప్పాయి.
నీళ్ళెక్కడ తాగారు? అంటూ ఎలుగుబంటి మళ్ళీ అడిగింది.
‘‘అదుగో ఆ కొండ పక్కనున్న ఏట్లోనే తాగాము’’ అంటూ భయభయంగా పిల్ల జింకలు చెప్పాయి.
ఇప్పుడు ఎలుగుబంటికి విషయం అర్ధమయింది. అయ్యో ఆ ఏటిలో నీళ్ళు తాగకూడదు కదా!, మీకు మీ అమ్మానాన్నా చెప్పలేదా! అక్కడి నీళ్ళు కలుషితమయ్యాయి. తెలియదా!, అంటూ పిల్ల జింకల తల్లిదండ్రుల వైపు ఎలుగుబంటి చూసింది.
‘‘ ఏమైంది డాక్టరు గారూ!, ఆ ఏటిలోని నీళ్ళు తాగకూడదా!, మాకేమీ తెలియదు. మా పిల్లలకు తాగకూడదని చెప్పలేదు’’ అమాయకంగా జింకల తల్లిదండ్రులు అడిగాయి.
‘‘ఈ మధ్యనే ఆ ఏటి పక్కన ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ప్యాక్టరీలోని వ్యర్ధాలన్నింటినీ ఈ ఏటిలోకే వదులుతున్నారు. దాని వల్ల నీళ్ళు కలుషితమై అందులో ఉన్న చేప పిల్లలన్నీ జబ్బుపడ్డాయి. పెద్ద చేపలకు ఏమి కాలేదు కానీ, పిల్లలు జబ్బు పడ్డాయి. మీ పిల్లలు కూడా ఆ నీళ్ళు తాగటం వలనే ఇలా అనారోగ్యం పాలయ్యాయి. ఇక నుంచి ఎవరూ ఆఏటీ పక్కకు వెళ్ళకండి’’ అని ఎలుగుబంటి చెప్పింది.
‘‘అలాగా డాక్టరు గారూ ! మాకసలు తెలియదు మరి మేము కూడా ఈ నీళ్ళే తాగుతున్నాం. కదా!, మాకేమీ కాలేదు కదా!’’ అర్ధం కాని అయోమయంతో జింకల తల్లిదండ్రులు అడిగారు.
ఎలుగుబంటి అన్నది ‘‘వ్యర్ధాలు వదిలిన వెంటనే తాగిన నీళ్ళల్లో విష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు వదిలిన చాలా గంటల తరువాత నీరు తాగినపుడు విష ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతేగాక చిన్న పిల్లలకు, పెద్ద వాటికీ తేడా ఉంటుంది. అందువల్లే అవే నీళ్ళు తాగిన మీకు ఏమీ కాలేదు. కానీ పిల్ల జింకలకు ఆనారోగ్యం కలిగింది. అది కూడా నాలుగు జింకలు మంచి నీళ్ళు తాగితే రెండు జింకలకు మాత్రమే అనారోగ్యం, కడుపునొప్పి వచ్చింది. అంటే బలహీనంగా ఉన్న పిల్ల జింకలు మాత్రమే అనారోగ్యం పాలయ్యాయి. మిగతా రెండు పిల్ల జింకలకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందన్నమాట’’ అంటూ దీర్ఘ ఉపన్యాసం చేసింది.
అంతలో పిల్ల జింకలు కొద్దిగా కళ్ళు తెరిచాయి. ఎలుగుబంటి వారిని పరీక్ష చేసి ప్రమాదమేమి లేదు. వెళ్ళి మాట్లాడండి’’ అని చెప్పింది. పిల్ల జింకల తల్లిదండ్రులు గబగబా లోపలికి వెళ్ళి పిల్లల్ని చూసి పలకరించాయి. పిల్ల జింకలు నీరసంగా సమాధానమిచ్చాయి. ‘‘ఇంకెప్పుడూ ఈ ఏటి నీళ్ళు తాగకండమ్మా! ఆ కొండ దగ్గరున్న చెరువులోనే తాగండి’’ అని తల్లిదండ్రులు పిల్లల్ని చూసి బావురుమన్నాయి.
ఈ సరికే అడవిలోని జంతువులన్నీ వచ్చేశాయి. పిల్ల జింకలకు జరిగిన ప్రమాదాన్ని గురించి తెలుసుకున్నాయి. అంతలో మృగరాజులకు కూడా విషయం తెలిసింది. పిల్ల జింకల్నీ చూడటానికి ఎలుగుబంటి ఆసుపత్రికి వచ్చింది. ఏటీలో కలుస్తున్న విష రసాయనాల గురించి తెలుసుకున్నది. ఊళ్ళో ఎవరూ కూడా ఆ ఏటీలోని నీళ్ళు తాగవద్దని ఊరంతా టముకు వేయించింది. ఏటీలో నివసించే చేపలు, తాబేళ్ళు. మొసళ్ళకు వేరే నెలవు చూసుకోవాలని సూచించింది. పిల్లలలకు జాగ్రత్తలు చెప్పమని తల్లిదండ్రులకు గట్టిగా చెప్పింది.
సింహం ఇంతటితో ఊరుకోలేదు. ఆప్యాక్టరీని మూయించేయాలి అనుకున్నది., అందుకు గాను జంతువులన్నిటినీ సమావేశపరచి చేయాల్సిన పనులను పురమాయించింది. ఫ్యాక్టరీ చుట్టు పక్కలున్న కుక్కలకు ఆజ్ఞ జారీ చేసింది. అందులోని ఉద్యోగులను కండలూడేచ్చేలా కొరకమని చెప్పింది. ఏనుగులకు ఆ ఫ్యాక్టరీ బిల్డింగులను ధ్వంసం చేయమని చెప్పింది. ముఖ్యంగా దోమలకు కఠినంగా చెప్పింది. ‘‘కుట్టిన చోట కుట్టకుండా అందులోని ఉద్యోగస్థుల్నీ కుట్టింది. మలేరియా, డెంగ్యూ, పైలేరియా వంటి జబ్బుల్ని వ్యాప్తి చేయండి’’అన్న మృగరాజు ఆజ్ఞలతో దోమలు రెచ్చి పోయాయి.
కొద్ది రోజులకు ఫ్యాక్టరీ మూసేశారు. అడవిలోని జంతువులన్నీ పండుగ చేసుకున్నాయి. సంతోషంగా జీవించసాగాయి.
*****
Please follow and like us:

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
