జల చక్రం

-కందేపి రాణి ప్రసాద్

సముద్రుడి ఏకైక గారాల కూతురు నీరు ఆమెకు జల కుమారి అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు.

అమ్మాయి ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది. ఒక్కచోట నిలవదు ఉన్నచోట ఉండకుండా ప్రవాహంలా కదిలిపొతూనే ఉంటుంది. ఆమెకు ఒక్కచోట నిలబెట్టటం చాలా కష్టమైన పని. జలకుమారి యవ్వనానికి వచ్చాక పెళ్లి చేయాలని తలచాడు తండ్రి. ఉరకలు వేస్తూ ఉత్సాహంగా నింగి నందుకోవాలని ఎగిరి గంతులు వేస్తుంది. సముద్రుడు అమ్మాయికి గొప్ప సంబంధం తేవాలనుకున్నాడు. తనకన్నా ధనవంతుడ్ని, ఉన్నత కుటుంబాన్ని తీసుకొచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. అందుకుగాను భారీగా కట్న కానుకలు ఇవ్వాలని అనుకున్నాడు. విలువైన ముత్యాలు, అమూల్యమైన రత్నాలు, మాణిక్యాలను రాశులుగా పోసి తన గర్భంలో దాచి ఉంచాడు.

లోకాలకు వెలుగునిచ్చేవాడు సమస్త ప్రాణికోటికి మిత్రుడు అయినా సూర్యుణ్ణి సలహా అడిగాడు సముద్రుడు. మంచిసంబంధం కావాలని చెప్పాడు. సూర్యుడు ‘ఎవరూ అందుకోలేని గొప్ప సంబంధం చెబుతాను. ఆకాశం వాళ్ళ కొడుకు మేఘనికిచ్చి పెళ్ళి చేస్తావా’ అని అడిగాడు. నువ్వు నేల మీద ఉన్నావు. ఆకాశం పైన ఉన్నది నువ్వు నేల మీద ఒక భాగం మాత్రమే ఆకాశం మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఉంటుంది నీకన్నా గొప్ప సంబంధం చెప్పాడు సూర్యుడు. సముద్రుడు ఎగిరి గంతేశాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు.

ఆకాశం గారి కొడుకు మేఘానికి సముద్రుడు గారి కుమార్తె జాలానికి పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పెళ్ళి జరిపిస్తున్నారు. అందరూ చక్కగా విందునారగిస్తున్నారు. అమ్మాయిని అత్త వారింటికి పంపారు.

మేఘ కుమార్, జలకుమారిని ఆకాశంలోకి తీసుకెళ్ళి తాగడానికి నిళ్ళిచ్చి ఇలా అన్నాడు – మీ నాన్న పెళ్ళి విందులో అందరికి ఉప్పు నీళ్ళిచ్చాడు. చూడు మా ఇంట్లో ఎలా ఉన్నాయో ఇలా తియ్యగా ఉండాలి. మీ ఇంట్లో ఏమి బాగాలేవు. నీకు చూపించాలనే ఇక్కడి దాకా తీసుకొచ్చాను. నాకు నువ్వక్కర లేదు. నువ్వు మీ నాన్న దగ్గరకు వెళ్ళిపో” అంటూ జలకుమారిని సముద్రుడి దగ్గరకు పంపేశాడు మేఘ కుమార్. జలకుమారి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేసింది.

అంతరార్థం:- ఇది జల చక్రానికి సంబంధించిన కథ. సముద్రంలోని నీరు ఎండా వేడిమికి ఆవిరై ఆకాశంలోని మేఘాలను చేరి, ఆ తర్వాత వర్ష రూపంలో భూమిపై కురుస్తుంది. దీన్నే జలచక్రం అంటారు. విద్యార్థులకు ఈ జలచక్రం సులభంగా అర్థం కావాలని ఇలా కథ రూపంలో అందిస్తున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.