
“నెచ్చెలి”మాట
గెలుపు – ఓటమి
-డా|| కె.గీత
గెలుపోటములు
ఓటమి గెలుపులు
లేనిదెక్కడ?
మనుషుల మధ్య
పార్టీల మధ్య
రాష్ట్రాల మధ్య
దేశాల మధ్య
ఉన్నవి రెండే
పంచుకోక తప్పదు
ఒకరి గెలుపు
మరొకరి ఓటమి
ఒకరి ఓటమి
మరొకరి గెలుపు
అన్నిసార్లూ
గెలుపు
లేనట్లే
అన్నిసార్లూ
ఓటమి
కూడా
ఉండదు
అయినా
గెలుపంటే
జీవితానికి
సరిపడా
సంబరం
స్థితప్రజ్ఞత
కోల్పోయిన
గెలుపు
మైమరపు
కమ్ముకున్న
గెలుపు
ఓటమంటే
జీవించడానికి
సరిపోని
నిరాశ
నిస్పృహ
చేతుల్లో
చేతల్లో
లేని
గెలుపు
కోసం
ఆరాటం
పోరాటం
ఓర్చుకోని
ఓటమి
నేర్చుకోని
ఓటమి
గెలుపు
నించి
వచ్చినది
ఓటమి
నించి
పోయినది
ఒక్కటే
అయినపుడు
గెలుపోటములకు
ఓటమి గెలుపులకు
విలువేది?
సంతోషాలకు
సంవేదనలకు
అర్థమేది?
ఒక్కటే సత్యం
ఒక్కటే నిత్యం
ప్రతి గెలుపు
వెనకా ఓటమి
ప్రతి ఓటమి
వెనకా గెలుపు
ఎదురుచూస్తూ
ఉంటాయి
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
ఏప్రిల్, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: యశోద
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: నీహార పథం (కథ) – డా|| నీహారిణి కొండపల్లి ఆత్మకథ
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

“నెచ్చెలి”మాట- గెలుపు – ఓటమి, -డా|| కె.గీత గారి రచన నిజమయిన గెలుపు ఓటముల గురించిన ఒక విశ్లేషణ. “గెలుపు
నించి వచ్చినది ఓటమి నించి పోయినది ఒక్కటే అయినపుడు” అంటూ తాత్విక దృష్టి తో టి గెలుపు ఓటములను స్వీకరించాలని చెప్పడంలో రచయిత్రి యొక్క స్థితప్రజ్ఞత్వం కనిపిస్తుంది . ధనువాదములు గీత గారు!
Thank you Padmavathi garu!
మీరు రాసిన గెలుపు-ఓటమి కవితలో చాలా తాత్విక భావన కనిపిస్తుంది. అర్థవంతమైన పదాలతో చాలా లలితంగా కవితను సందేశాత్మకంగా రాశారు. నేటి జీవనశైలిలో అనుసరించవలసిన మార్గమిది! పోటీ తత్వాన్ని వదిలి ప్రశాంతమైన జీవనాన్ని ప్రతి మనిషి గడపాలి. చక్కటి కవిత రాసినందుకు మీకు అభినందనలు 💐🙏
Thank you Surendra garu!
నమస్తే మామ్ 🙏
గెలుపు-ఓటమి శీర్షికగా మీరు రాసిన కవితలో ఎంతో తాత్వికత కనిపిస్తుంది! వీటికి అతీతంగా మసలగలిగితే జీవితంలో సదా ఆనందమే కదా ఉంటుంది! సులభమైన పదాలతో చాలా అర్థవంతంగా… లలితంగా…మీరు ఈ కవితను రాశారు. మీకు అభినందనలు💐
Thank you
నమస్తే
దేశాల మధ్య, వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య చివరికి అంతర్గతంగా అంతరంగ మధనంలో – నిత్యమైన చక్రీయ భ్రమణం… ఒకదానివెంటనొకటి! మైమరచి స్టితప్రజ్ఞత కోల్పోతే గెలుపు ఓటమి పాలవుతుంది.గెలవడానికి పునాది ఓటమీ కదా! నిత్య సంఘర్షణలో ఓటమి – గెలుపు ల్ని చవిచూస్తూ ముందడుగు వేయడమే జీవితం! ఎంత బాగా చెప్పేరు!
Thanks Sanghamitra garu!