image_print

గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ పుస్తక పరిచయం

 గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ పుస్తక పరిచయం  (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)   -ఎన్.వేణుగోపాల్ మార్కెజ్ గురించి మరొకసారి… బెజవాడ ఏలూరు రోడ్డులో గడిచిన వైభవోజ్వల దినాలలో నవోదయ పబ్లిషర్స్ దుకాణంలో 1981-82ల్లో పరిచయం అయిన నాటి నుంచి మిత్రులు, ప్రస్తుతం పల్లవి పబ్లికేషన్స్ నడుపుతున్న వెంకటనారాయణ గారు రెండు మూడు రోజుల కింద ఉదయాన్నే ఫోన్ చేసి మార్కెజ్ ను […]

Continue Reading
Posted On :

జి. ఉమామహేశ్వర్ కథా సంకలనం “భరోసా” పై సమీక్ష

“భరోసా”    -పి.జ్యోతి  మానవత్వాన్ని విశ్వసించే రచయిత కలం నుండి వెలువడిన కథాసంకలనం “భరోసా” జి. ఉమామహేశ్వర్ గారి కథా సంకలనం “భరోసా” చదివిన తరువాత తెలుగులో “కథ” స్థాయిని ఈ తరంలో కూడా నిలపగలిగే రచయితలు ఇంకా ఉన్నారని ఆనందం కలిగింది. ఈ రచయిత పేరు పెద్దగా సాహితీ చర్చలలో వినిపించదు. ఏ పోటిలలో కనిపించదు. ఎంతో హైప్ తొ వెలువడే కథా సంకలనాల మధ్య వీరి పుస్తకాలను ఎవరూ పరిచయం చేయరు. మంచి కథలు […]

Continue Reading
Posted On :

జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)

 జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)   -లలిత గోటేటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన కె. వరలక్ష్మి గారి ఆత్మ కధ ‘’తొలిజాడలు’’ చదవడానికి నాకు వారం రోజులు పట్టింది.  ఇంత మంచి కధారచయితగా ఆమెను ఎదిగించిన  ఆ నేపధ్యం ఆమె బాల్యం ఎటువంటివి అన్న కుతూహలంతో నేను ఈ పుస్తకాన్ని చదివాను. ‘’జగ్గంపేట’’ గోదావరి  జిల్లాలోని ఓ పల్లెటూరు. ఇది రచయిత పుట్టి పెరిగిన, చాలా సంవత్సరాలు  ఇక్కడే గడిపిన ప్రాంతం. […]

Continue Reading

“వెనుతిరగని వెన్నెల” నవలపై సమీక్ష

వెనుతిరగని వెన్నెల (డా||కె.గీత నవలపై సమీక్ష)   -శ్రీదేవి యెర్నేని   నెచ్చెలి పాఠకులందరికీ డా|| కె. గీత గారి బహుముఖ ప్రజ్ఞ తో పాటు, ఆవిడ వ్రాసిన మొట్టమొదటి నవల “వెనుతిరగని వెన్నెల” కూడా ఆడియో రూపంలో సుపరిచితమే. ఈ నవల “కౌముది” అంతర్జాల మాసపత్రికలో ఆరు సంవత్సరాలు ధారావాహికగా ప్రచురితమై ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది.  ఇప్పుడు ఈ అందమైన నవల మరింత అందమైన పుస్తకంగా ముస్తాబై  మన ముందుకు వచ్చింది.   జీవితం మనకు లభించిన అద్భుతమైన […]

Continue Reading

“మొహర్” పుస్తక సమీక్ష

“మొహర్”    -పి.జ్యోతి తెలుగు సాహిత్యంలో సహేతుకమైన అస్థిత్వవాదానికి నిదర్శనం  ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం గా మన ముందుకు వచ్చిన “మొహర్” కథా సంపుటి తెలుగు సాహిత్యంలో ఒక మంచి ప్రయోగం అనే చెప్పాలి. అస్థిత్వ వాదం నేపధ్యంలో తెలుగులో చాలా సాహిత్యం ఈ మధ్య వచ్చి చేరుతుంది. ఒక వర్గానికో, ఒక సమూహానికో కట్టుబడి ఉండి రాస్తూ, తమ సాహిత్యపు స్వార్దానికి, అవసరాల కోసం, తమ వ్యక్తిగత లాభాల కోసం,  ఆ […]

Continue Reading
Posted On :

“కొత్త బడిలో నవీన్” పుస్తక సమీక్ష

“కొత్త బడిలో నవీన్”    -అనురాధ నాదెళ్ల                               మనం ఈ నెల మాట్లాడుకోబోతున్నది ఒక అరుదైన పుస్తకం. పుస్తక శీర్షిక చూసి ఇదేదో పిల్లలకే సంబంధించిన బడి పుస్తకం అనుకోవద్దు. బడి అంటే పిల్లలకే కాదు టీచర్లకు, అమ్మా, నాన్నలకూ అలా మొత్తం సమాజానికి సంబంధించినది కదా. ఈ పుస్తకం ఒక స్నేహితురాలి ద్వారా నన్ను చేరింది. చదువుతున్నంతసేపూ ఒక టీచర్ గా నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఈ పుస్తకంలోని ఆలోచనల్లాటివే నన్ను వేధిస్తుంటాయి. బహుశా […]

Continue Reading
Posted On :
urimila sunanda

సరిత్సాగరం( సరితా నరేష్ కవిత్వం)

సరిత్సాగరం( కవిత్వం ఒక సముద్రం)    -వురిమళ్ల సునంద కవయిత్రి అక్షరాన్ని దారి దీపంగా చేసుకుందికవిత్వాన్ని ఆయుధంగా ధరించింది. సమాజంలోని రుగ్మతలపై పోరాడేందుకు నేను సైతం అంటూ  తన కవిత్వంతో  సాహిత్య రంగంలో అడుగుపెట్టి , తన కవిత్వంతో  ఉనికిని చాటుకుంటున్న వర్థమాన కవయిత్రి సరితా నరేష్.అనేక సందర్భాలను , సమాజంలో తనకు ఎదురైన సంఘటనలను కవిత్వంగా మలిచి భేష్ అనిపించుకుంటోంది. “కవి అంటే అంటే కాలం వెంట కాదు. కాలంతో పాటు నడిచే కవి అంటే […]

Continue Reading
Posted On :

పడి లేచిన కెరటం – గంటి భానుమతి పుస్తక సమీక్ష

పడి లేచిన కెరటం – గంటి భానుమతి    -పి.జ్యోతి తెలుగులో డిప్రెషన్ పై చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం, డిప్రెషన్ కేసులు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మహత్యలలో మనం చాలా ముందు వరసలో ఉన్నాం. సైకియాట్రిస్టుల కొరత మన దేశంలో చాలా ఉంది. అంతే కాదు వైద్యుల వద్దకు వచ్చే మానసిక రోగుల సంఖ్య అత్యల్పం. ఇక మానిక్ డిప్రెషన్ (OCD), స్కిజోఫ్రెనియా లాంటి జబ్బుల సంగతి తెలిసిన […]

Continue Reading
Posted On :

“నిత్యకల్లోలం” ముదిగంటి సుజాతారెడ్డి పుస్తక సమీక్ష

“నిత్యకల్లోలం” ముదిగంటి సుజాతారెడ్డి పుస్తక సమీక్ష    -అనురాధ నాదెళ్ల సుజాతారెడ్డిగారి ఆత్మకథ ‘’ముసురు’’ మన నెచ్చెలి పాఠకులకు ఇంతకుముందు పరిచయం చేసాను. వారి నుంచి వచ్చిన ఐదవ కథల సంపుటి ఈ పుస్తకం. ఇది 2018 సంవత్సరంలో వచ్చింది. పుస్తక మకుటమే ఇప్పటి మన జీవితాల్లో కనిపిస్తున్న అశాంతిని, అల్లకల్లోలాన్ని స్ఫురింపజేస్తోంది. మనిషి జీవితమైనా, ఒక సమాజ గమనమైనా అభివృధ్ధి దిశగా సాగాలని, సాగుతుందని ఆశిస్తాము. మెరుగైన భవిష్యత్తు కోసమే పరుగులు తీస్తాం. కానీ ఇప్పటి […]

Continue Reading
Posted On :

జీవన ప్రభాతం – “వెంట వచ్చునది” పుస్తక సమీక్ష

“వెంట వచ్చునది”     -అనురాధ నాదెళ్ల మనిషి పుట్టిన క్షణం నుంచి తన ప్రమేయం లేకుండానే సమాజంలో ఒక భాగం అయిపోతాడు. పెరుగుతున్న క్రమంలోనూ, ఆ తరువాత కూడా ఆ సమాజం మంచి చెడులే అతని మంచి చెడులవుతూ  వాటి ఫలితాలు అతని జీవితం మీద ప్రతిఫలిస్తూ, అతనికో వ్యక్తిత్వాన్నిస్తాయి. చుట్టూ ఉన్నది సంఘర్షణాత్మక వాతావరణం కావచ్చు, ప్రేమపూర్వకమైన వాతావరణం కావచ్చు, అది మనిషి ఆలోచనల్లోనూ, చేతల్లోనూ కనిపిస్తూ సమాజ రూపురేఖల్ని నిర్ణయిస్తూ ఉంటుంది. సమాజం మనుషుల […]

Continue Reading
Posted On :

జీవన ప్రభాతం – చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష

చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష    -వురిమళ్ల సునంద ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీ శ్రీ ‌.కవిత్వం అంటే తన మూలాల్లోకి వెళ్లి రాయడమే అంటారు మరో కవి.మాట తొలి క్షతం అంటారు వడ్డెర చండీదాస్.’అక్షరం ఉదయించాలి/ఒంటిమీది చెమట బిందువులా/అక్షరం ఉదయించాలి/ప్రాణ వాయువు ల్లో స్నానం చేసి/కురులార్చుకుంటున్న ప్రభాత కిరణంలా’ అన్నారు డా సి నారాయణరెడ్డి గారు.అమెరికా కవి ప్రొఫెసర్ కెన్నెత్ కోచ్ ఏమంటారంటే రెండు రెళ్ళు నాలుగు అని చెబితే […]

Continue Reading
Posted On :

“బషీర్ కథలు” పుస్తక సమీక్ష

 “బషీర్ కథలు”    -పి.జ్యోతి వైక్కం మొహమ్మద్ బషీర్ మళయాళ రచయిత. తన రచనా కాలంలో కేవలం 30 పుస్తకాలే రాసి గొప్ప పేరు తెచ్చుకున్నారాయన. వారి మళయాళ కథల అనువాదం ఈ “బషీర్ కథలు”. హైద్రరాబ్ బుక్ ట్రస్ట్ వారు ఆగస్టు 2009 లో ప్రధమంగా ముద్రించిన ఈ కథలు బషీర్ ను తలుగు పాఠకులకు పరిచయం చేసే చక్కని ప్రయత్నం. కేరళ లో దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన బషీర్ కథలు మానవ […]

Continue Reading
Posted On :

జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష

జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష    -పి.జ్యోతి జాషువా గారి కుమార్తె సంఘ సంస్కర్త హేమలతా లవణం గారి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. చంబల్ లోయల్లోని బందిపోట్లు వినోభా భావే గారి వద్ద లోంగిపోతున్నప్పుడు ఆ కార్యక్రమం కోసం విశేష కృషి చేసారు హేమలతా ఆమె భర్త లవణం గార్లు. నేరస్తుల బాగు, పునరావాసం కొరకు ఎంతో కృషి చేసిన దంపతులు వీరు. జయప్రకాష్ నారాయణ్ గారి […]

Continue Reading
Posted On :

‘ఎన్ని ఆమెలో నాలో’ – ఝాన్సీ కొప్పిశెట్టి కవిత్వ సమీక్ష

‘ఎన్ని ఆమెలో నాలో’ – ఝాన్సీ కొప్పిశెట్టి కవిత్వ సమీక్ష    -డా.సిహెచ్.సుశీల సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం అని చెప్పుకునే ఈ రోజుల్లో కూడా మారని స్త్రీల స్థితి గతులను చూసి, ఆలోచించి, స్పందించి, ఆడవాళ్ళ జీవితం గురించి రాస్తున్నానని, అలంకారాలు అంత్యప్రాసలు, పదలయలు  మొదలైన వాటికోసం వెదకకండి అంటూ ముందే చెప్పిి ఝాన్సీ కొప్పిశెట్టి –  వివిధ దశల్లో, పరిస్థితుల్లో ఆడవాళ్ళ జీవితాలు, వారి సంఘర్షణలకు సంబంధించిన  కవితలను…  ఎలాంటి అలంకార  ఆచ్చాదన లేని […]

Continue Reading

మేలుకొలుపు (సమీక్ష)

మేలుకొలుపు( సమీక్ష)    -సరోజన బోయిని జనజీవన జాగృతం ఈ మేలుకొలుపు కవనం.కారుణ్యం వీడిన కఠిన హృదయాలకు ఒక మేలుకొలుపు గీతం. మనిషి శాశ్వతంగా మహిని నిలువడని తెలిసికొనక, మానవత్వాన్ని మరిచిన మనుషులకు ఇదొక మేలుకొలుపు శ్లోకం. మానవీయ విలువల పెంపుకై, మానవతా వాద దృక్పథంతో కూకట్ల తిరుపతన్న రాసిన వచన కవితా సంపుటియే మేలుకొలుపు. ఈయన రాసిన ప్రతి కవితా సంపుటిలోను స్త్రీవాదాన్ని చాలా బలంగా వినిపించాడు. స్త్రీల ఆంతరంగిక ఆవేదనను అక్షరీకరిస్తూనే, సమానత్వ సాధన కొరకు  అసువులు ధారవోసిన అబలల జీవితాన్ని గురించి ఆర్ద్రంగా […]

Continue Reading
Posted On :
urimila sunanda

‘శిశిర శరత్తు’ కథా సంపుటి పై సమీక్ష

‘శిశిర శరత్తు’ సహృదయ జగత్తు    -వురిమళ్ల సునంద కథ చెప్పడం ఓ గొప్ప కళ.మరి ఆ కళను ఆస్వాదించే విధంగా ఉండాలంటే  కథా వస్తువు ఏదైనా సరేఎత్తుగడ,నడక తీరు ముగింపు ఒకదాని వెంట ఒకటి -కళ్ళను ఆ వాక్యాల వెంట పరుగులు తీయించేలా ఉండాలి. ‘కథ చదివిన తర్వాత మనసు చలించాలి.మళ్ళీ మళ్ళీ చదివింప జేయాలి.కథ  బాగుంది అని పది మందికి చెప్పించ గలగాలి.మళ్ళీ పదేళ్ళో,ఇరవై ఏళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి,స్పందన కలగాలి’ అంటారు […]

Continue Reading
Posted On :

‘అడవితల్లి’, సి.కె.జాను అసంపూర్తి ఆత్మకథ సమీక్ష

‘అడవితల్లి’ సి.కె.జాను అసంపూర్తి ఆత్మకథ సమీక్ష    -అనురాధ నాదెళ్ల మళయాళీ మూలంః భాస్కరన్ ఆంగ్లానువాదంః ఎన్. రవిశంకర్ తెలుగు అనువాదంః పి. సత్యవతి ఇదొక అసాధారణమైన కథ. నిరక్ష్యరాస్యురాలైన ఒక ఆదివాసీ మహిళ తన ప్రజల కోసం ధైర్యంగా చేస్తున్న పోరాటం ఈ ఆత్మకథ. సి.కె. జాను ఈ కథానాయకురాలు. ఈ పుస్తకం ముందుమాటలో రచయిత రవిశంకర్ చెప్పినట్లుగా జాను పుట్టి, పెరిగిన రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని పది ఉత్తమ సందర్శనీయ స్థలాలలో ఒకటిగా […]

Continue Reading
Posted On :

‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష

‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష    -వురిమళ్ల సునంద వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కవుల్లో  బాల గంగాధర్ తిలక్ గారికి ఓ ప్రత్యేక స్థానం ఉందంటారు కుందుర్తి.వచన కవిత రెండు ప్రధానమైన శైలులతో ప్రయాణం చేస్తుందనీ పూర్వ కావ్య భాషా సంప్రదాయానికి చేరువగా నడుస్తున్న శైలి. మరొకటి వ్యావహారిక భాషా వాదాన్ని జీర్ణించుకుని సమకాలీన ప్రజల హృదయాలకు దగ్గరగా నడుస్తున్న శైలి. ఈ రెంటిలో అత్యధిక కవితలు రెండవ శైలిలో  రాసినా అక్కడక్కడా […]

Continue Reading
Posted On :

“శారద కథలు” పుస్తక సమీక్ష

 నిండైన నిజాయితిని సొంతం చేసుకున్న కథా రచయిత     – శారద చెన్నపట్నం నుండి తెనాలి వచ్చిన ఒక పందొమ్మిదేళ్ల కుర్రాడు తెలుగు నేర్చుకుని, తెలుగు దేశంలో ఒక హోటల్ లో సర్వర్ గా పగటి పూట పని చెస్తూ, రాత్రి పూట సాహిత్య సృజన చేస్తూ జీవించాడు. 32 ఏళ్ళకే మూర్చ రోగం రూపంలో మృత్యువు లోబర్చుకునే దాకా దీక్షగా రాసుకుంటూ వెళ్ళాడు. తనది కాని భాషని, తనది కాని ఊరును తనవాటిగా చేసుకుని సాహిత్యానికి […]

Continue Reading
Posted On :

అనీడ కవితా సంపుటి పై సమీక్ష

అనీడ కవితా సంపుటి పై సమీక్ష    -గిరి ప్రసాద్ చెలమల్లు నీడ కవితలోని అనీడయే సంకలనం పేరై కవితా సంకలనం గా పాఠకుల ముందుకు తెచ్చిన గార్ల బయ్యారం పుత్రిక రూప రుక్మిణి గారు కవితల్లో సామాజిక అంశాలను సమకాలీన సమాజంలో మానసిక రాజకీయ అంశాల ను వస్తువులుగా తీసుకున్నారు. ” తన స్నేహం వెలుతురున్నంత వరకే! అది తెలిసి నీడ అనీడ గా ” అంటూ పసిప్రాయంలో గుర్తించిన నీడ తన తో పాటుగా […]

Continue Reading

“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష

“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష    -అనురాధ నాదెళ్ల సుధామూర్తికి వివిధ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, వివిధ వ్యక్తులతో తనకెదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవటం అలవాటు. ఆ అనుభవాలను ఇప్పటికే పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం కోసం ఆమె కొత్త ఆలోచన చేసారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన కథలను రాయమంటూ పోటీ పెట్టారు. అందులోంచి ఎంపిక చేసిన అద్భుతమైన కథల సంకలనమిది. ఈ వాస్తవ జీవన దృశ్యాలు కల్పనకు అందవు. పుస్తకం మొదలు […]

Continue Reading
Posted On :

“వలస పాట” కవితా సంపుటిపై సమీక్ష

“వలస పాట” కవితా సంపుటిపై సమీక్ష    -డాక్టర్. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “కాలం అంచులమీద అలసిన వలస పక్షులు”…!           సాహిత్యానికి మకుటం కవిత్వమే, వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వం అంటాడు ‘రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ’. ఈ విషయాలు దాదాపుదశాబ్దంనర నుండి కవిత్వాన్ని వ్రాస్తున్న’గవిడి శ్రీనివాస్’ విషయంలో నిజం.రచయిత మొదటి కవితా సంకలనం”కన్నీళ్ళు సాక్ష్యం” పాఠకుల మనసు గెలుచుకున్న కవిత్వం, రెండవ కవితసంకలనం “వలస పాట”.       తెలుగు సాహిత్య […]

Continue Reading

‘గోరాతో నా జీవితం” పుస్తక సమీక్ష

  గోరాతో నా జీవితం    -అనురాధ నాదెళ్ల రచనః సరస్వతి గోరా ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, నాస్తికవాద నాయకుడు శ్రీ గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి భార్య శ్రీమతి సరస్వతి గోరా తన జీవనయానం గురించి రాసుకున్న పుస్తకం ‘’గోరాతో నా జీవితం.’’ మతపరంగా, విద్య పరంగా, సంప్రదాయాల పరంగా సంఘంలో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకు వచ్చేందుకు కృషి చేసిన భర్త ఆలోచనలను అర్థం చేసుకుని, అనుసరించి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి సరస్వతీగోరా […]

Continue Reading
Posted On :

“ఉమ్రావ్ జాన్ అదా” పుస్తక సమీక్ష

 “ఉమ్రావ్ జాన్ అదా”    -పి.జ్యోతి ఉర్దూ లో రాయబడిన మొదటి నవల తెలుగు అనువాదం “ఉమ్రావ్ జాన్ అదా” “ఉమ్రావ్ జాన్ అదా” ఉర్దూ భాషలో రాసిన మొదటి నవల. దీని రచయిత మిర్జా హాదీ రుస్వా. ఈ నవల మొదట 1899 లో ప్రచురించబడింది. లక్నో లో పందొమ్మిదవ శతాబ్దపు మొదట్లో జీవించిన ఉమ్రావ్ జాన్ అనే ఒక వేశ్య జీవిత కథ ఇది. పాకిస్తాన్, భారత్ రెండు దేశాలలో కూడా చాలా మంది […]

Continue Reading
Posted On :

దళిత స్త్రీ ల శ్రమ జీవన దర్పణం “రాయక్క మాన్యం”

దళిత స్త్రీ ల శ్రమ జీవన దర్పణం “రాయక్క మాన్యం”    -సరోజన బోయిని జూపాక సుభద్ర గారి కలం నుండి వెలువడిన ఆణి ముత్యాల లాంటి   17 కథల  సంకలనం..ఈ “రాయక్క మాన్యం” పుస్తకం. జూపాక సుభద్ర గారు నాకు పెద్దగా పరిచయం లేకపోయిన..వారి ఇతరత్రా రచనల పై కూడ అవగాహన లేక పోయిన..మహిళలు రాసిన పుస్తకాలపై సమీక్ష రాయాలి అన్న నా తపనను చూసి..మా ఆత్మీయ సోదరి  జ్వలిత గారు మహిళలు అన్నింటా ముందు ఉండాలి అని మహిళల ఆత్మాభిమానానికి పెద్ద పీట వేస్తూ..ఇప్పుడు,ఇప్పుడే […]

Continue Reading
Posted On :

“మూడువేల అల్లికలు” సమీక్ష

“మూడువేల అల్లికలు” సామాన్య ప్రజలు-  అసాధారణ జీవితాలు   (ఇన్ఫోసిస్ సుధామూర్తి కథలపై సమీక్ష)    -అనురాధ నాదెళ్ల  సాఫ్ట్ వేర్ రంగంలో ‘’ఇన్ఫోసిస్’’ పేరు దేశ, విదేశాల్లోని వారికందరకూ తెల్సినదే. అలాగే దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు ఛైర్ పర్సన్ గా ఉన్న శ్రీమతి సుధామూర్తిని తెలియని వారుండరేమో! ఆమె ఒక రచయిత్రన్న విషయం కూడా మనందరకూ తెల్సినదే.  ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం సుధామూర్తి రాసిన ‘’మూడువేల […]

Continue Reading
Posted On :

“ఏది నేరం” సమీక్ష

ఏది నేరం – హజారీబాగ్ జైలు గాధలు    -పి.జ్యోతి ఏది నేరం” అనే ఈ పుస్తకంలో హజారీబాగ్ జైలు గాధలు కొన్ని ఉన్నాయి. రచయిత్రి బి.అనురాధ గారు మావొయుస్టు ఖైదీగా ఈ జైలులో 2009 నుండి 2013 దాకా మహిళా వార్డులో ఉన్నారు. అక్కడ పరిచయమైన కొందరి స్త్రీల జీవిత కథలను ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేసారు. మొత్తం 16 కథలలో ఎన్నో జీవిత కోణాలను వారు చూపించే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకంలో […]

Continue Reading
Posted On :

జేబు కథలపై సమీక్షా వ్యాసం

జేబు -అస్థిత్వపు జవాబు (జేబు కథలపై సమీక్షా వ్యాసం)    -వురిమళ్ల సునంద  లక్షల కోట్ల సంవత్సరాల క్రితం శూన్యంగా ఉన్న సమస్త శక్తి తన శూన్యత పై తనే ఆగ్రహించి ఒక్క విస్ఫోటనంతో విశ్వంగా రూపాంతరం చెందినట్లు-అనేక తరాలుగా అణిచి పెట్టబడిన స్త్రీ శక్తి కూడా అనేక పోరాటాలుగా విస్ఫోటనం చెంది అన్ని రంగాలనూ తన చేతిలోకి తీసుకుంటున్న యుగం ఇది.ఈ ఘర్షణలో మూడు సింహాల లాంటి తండ్రి,భర్త, కొడుకుల చేతిలో ఉన్న రాజ్యమూ-సంపదా, వాటికి […]

Continue Reading
Posted On :

దుర్గాపురం రోడ్ (దేశరాజు కవితాసంపుటి పై సమీక్ష)

నీలోని అపరిచితుడిని నీకు పరిచయం చేసే కవిత్వం…! “దుర్గాపురం రోడ్” – దేశరాజు కవితాసంపుటి పై సమీక్ష    -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి    “You will love again the stranger who was your self”….                             -DEREK WALCOTT ఈ వాక్యాలు సాహిత్యంలో(1992) నోబెల్ బహుమతిని అందుకున్న సెయింట్ లూసియానాకు చెందిన ప్రఖ్యాత […]

Continue Reading

అంగార స్వప్నం (ఊర్మిళ కవితా సంకలనంపై సమీక్ష)

 అంగార స్వప్నం ( ఊర్మిళ) కవితా సంకలనంపై చిరు పరామర్శ    -వి. విజయకుమార్ ఊర్మిళ పలవరించిన అందమైన రంగులకల ఈ అంగార స్వప్నం! ఈ నులివెచ్చని కల దొంగిలించబడిందో లేదో తెలీదు కానీ, దొంగిలించిన కలని భుజాన వేసుకొని అటు తిరిగే పరిశుద్ధాత్ములు ఎందరో, అంటిన మరకలు తుడుచుకొంటో ఎప్పటిలాగే యీ ‘నేను’ లు ఎందరో! అటుచేతిరాతలు పోయాయ్, అనుభూతుల్ని కవిత్వీకరించుకొని, ఉల్లిపొర కాగితపు హృదయం మీద అందంగాపరిచి, అందించిన వాటిని ఆప్యాయంగా స్పృశించి, అమ్మలా […]

Continue Reading
Posted On :

లేఖావలోకనం పై లేఖారూప సమీక్ష-

  ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు” -శైలజామిత్ర ఇదొక కరోనా సమయం. బయట ప్రపంచంలో ఎవరున్నారో, ఎక్కడున్నారో తెలియని అగమ్యగోచరం. ఉద్యోగాలు, కళలు, చేతివృత్తులు  అన్నీ మూతపడ్డాయి. ప్రపంచం నాలుగు గోడల మధ్యకు చేరిందా? లేక ప్రపంచాన్నే నాలుగు గోడలతో మూసేసారా అన్నంత భావన. ఒంటరితనం. లేమితనం. నిర్భంధాల్లో బంధాలు. పలకరింపు లేవు. వీధులన్నీ జంతువులు, పక్షుల  పరమయ్యాయి. అడవులు  విశాలమయ్యాయి. కొత్త పక్షులతో  ఆకాశం మురిసిపోయింది. అంతా నిశ్శబ్ధం. కరోనా కరచాలనంతో బయట ఏమి జరుగుతోందో, […]

Continue Reading

“ అనుభవాల దారుల్లో… ” సిలికాన్ లోయ సాక్షిగా- డా||కె.గీత కథల సంపుటిపై సమీక్ష

అనుభవాల దారుల్లో… సిలికాన్ లోయ సాక్షిగా- డా||కె.గీత కథల సంపుటిపై సమీక్ష -డా. నల్లపనేని విజయలక్ష్మి ఆంధ్రుల కలల తీరం అమెరికా. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇంటికొక్కరు ఉన్నత విద్య కోసమో, ఉద్యోగాలను వెతుక్కుంటూనో రెక్కలు కట్టుకొని అమెరికాలో వాలుతున్నారు. అలా వెళుతున్న వారిలో కవులు, రచయితలు కూడా ఉంటున్నారు. వారు తమ అనుభవాలను, అనుభూతులను, సంఘర్షణలను, మాతృభూమి నుండి వెంట తీసుకొని వెళ్ళిన జ్ఞాపకాలను తమ రచనల్లో వ్యక్తీకరించడంతో గత రెండు దశాబ్దాలుగా […]

Continue Reading

ముసురు (ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ పై సమీక్ష)

విషాద కామరూప        -అనురాధ నాదెళ్ల రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ పేరుతో రాయటం జరిగింది. ఈ అస్సామీ మాండలికం ఎక్కువ మందికి తెలియకపోవటం వలన రచయిత్రి స్వయంగా ‘’ఎ సాగా ఆఫ్ సౌత్ కామరూప” పేరుతో తన నవలను ఇంగ్లీషులోకి అనువదించారు. దానిని గంగిశెట్టి లక్ష్మీ […]

Continue Reading
Posted On :

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

ఇంత దూరం గడిచాక డా.సి.భవానీ దేవి కవితా సంపుటి పై సమీక్ష -వురిమళ్ల సునంద ఇంత దూరం గడిచాక కూడా మనసులోని బరువును దించుకోక పోతే ఎలా….మాటల మూటను విప్పుకోక పోతే ఎలా.. నలుగురితో పంచుకోకపోతే ఎలా..? ..ఏమో మనం దిగే స్టేషన్ ఎప్పుడు వస్తుందో… అందుకే  ఇంత కాలం మనతో కలిసి మెలిసి ప్రయాణించిన వారందరికీ తడి కళ్ళతో ధన్యవాదాలు చెప్పుకుంటూ.. వీలయినంత హాయిగా అందరితో గడిపేస్తూ… నా తర్వాత కూడా ప్రయాణించే వాళ్ళందరికీ/ నా […]

Continue Reading
Posted On :

“అడుగులు” కథా సంపుటి పై సమీక్ష”

“అడుగులు” కథా సంపుటి పై సమీక్ష  -జయంతి వాసరచెట్ల ఆధునిక సాహిత్యం లో ఎన్నో ప్రక్రియలు ఉన్నా కథాప్రక్రియకు విశిష్ట స్థానం ఉంది.  మన కళ్ళ ముందు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని క్రమంగా అక్షరీకరిస్తే కథ అవుతుంది.  ఆసక్తికరంగా ఉండి కొంతనిడివితోనే చెప్పవలసిన అంశం చెప్తే అది కథానిక అవుతుంది. సాహిత్యంలో కథానిక ప్రక్రియ కు ప్రత్యేక స్థానం ఉంది. పాశ్చాత్య సాహితీ సంప్రదాయం నుండి ఆకర్షించబడి మన భాష లోకి వచ్చిన ప్రక్రియ […]

Continue Reading
Posted On :

చంద్రిక కథ (పుస్తక సమీక్ష)

చంద్రిక కథ  -పి.జ్యోతి వీరేశలీంగం పంతులు గారిని ప్రధాన పాత్రగా చూపే సుబ్రహ్మణ్య భారతి గారి తమిళ అసంపూర్తి.                  చంద్రిక కథ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి అరవంలో వ్రాసిన అసంపూర్ణ నవల. ఈ నవలను గోపాల, కృష్ణ, రాఘవన్ అనే ముగ్గురు మిత్రులు తెలుగులోకి అనువాదం చేసారు. నార్ల గారు కేంద్ర సాహిత్య అకాడమీ పక్షంగా కందుకూరి వీరేశలింగం జీవిత సాహిత్యాలను గూర్చి 1968 […]

Continue Reading
Posted On :

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం-

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం  -పి.జ్యోతి గంగ ఎక్కడికెళుతోంది?…. ఇది తమిళంలో వ్రాసిన “గంగై ఎంగే పోగిరాళి”? అనే జయకాంతన్ గారి నవలకు తెలుగు అనువాదం. దీన్ని జెల్లేళ్ళ బాలాజీ గారు అనువాదం చేసారు. 2017 లో విశాలాంధ్ర లో ఇది డైలీ సీరియల్ గా వచ్చింది. పుస్తక రూపంలో 2019 లో వచ్చిన రచన ఇది.  జయకాంతన గారు చాలా ఏళ్ళకు ముందు “అగ్నీ ప్రవేశం” అనే ఒక […]

Continue Reading
Posted On :

బొట్టెట్టి (చంద్రలత కథలు)

    బొట్టెట్టి -అనురాధ నాదెళ్ల ‘’బొట్టెట్టి’’ కథల పుస్తకం రచయిత్రి చంద్రలతగారికి పరిచయం అక్కరలేదు. తానా వారు 1997లో మొదటిసారిగా పెట్టిన నవలల పోటీలో ఆమె రాసిన ‘’రేగడివిత్తులు’’ నవల బహుమతి పొందిందన్నది ఆమె పేరు పరిచయమున్న అందరికీ తెలిసున్న విషయం. ఆమె నడుపుతున్న ‘’ప్రభవ’’ పిల్లల ప్రపంచానికి ఒక కానుక. పిల్లల సహజ కుతూహలాల్ని అర్థం చేసుకుంటూ ప్రకృతి ఒడిలో వారి ఎదుగుదలకు పునాదులు వేస్తున్న సరికొత్త ప్రపంచం అది. బొట్టెట్టి కథా సంపుటిలో పదమూడు కథలున్నాయి. […]

Continue Reading
Posted On :

ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు”

  ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు” -శైలజామిత్ర   ఇదొక కరోనా సమయం. బయట ప్రపంచంలో ఎవరున్నారో, ఎక్కడున్నారో తెలియని అగమ్యగోచరం. ఉద్యోగాలు, కళలు, చేతివృత్తులు  అన్నీ మూతపడ్డాయి. ప్రపంచం నాలుగు గోడల మధ్యకు చేరిందా? లేక ప్రపంచాన్నే నాలుగు గోడలతో మూసేసారా అన్నంత భావన. ఒంటరితనం. లేమితనం. నిర్భంధాల్లో బంధాలు. పలకరింపు లేవు. వీధులన్నీ జంతువులు, పక్షుల  పరమయ్యాయి. అడవులు  విశాలమయ్యాయి. కొత్త పక్షులతో  ఆకాశం మురిసిపోయింది. అంతా నిశ్శబ్ధం. కరోనా కరచాలనంతో బయట ఏమి […]

Continue Reading
Posted On :

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు -వురిమళ్ల సునంద అనేక ఆకాశాలు ఈ ఒక్క మాట చాలు..ఆలోచింప జేయడానికి, అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడానికి…  సమాజంలో స్త్రీలను ఏ దృష్టితో చూస్తున్నారు వారి పట్ల ఎలా స్పందిస్తున్నారు. స్త్రీలు తాము గడుపుతున్న జీవితం ఎలా ఉంది. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఆధిపత్య సమాజంలో  అనేకానేక అసమానతల నడుమ అస్తిత్వం కోసం  వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు,ఏం మార్పు రావాలని కోరుకుంటున్నారో ఈ కథల్లో  ఆవిష్కరించారు. ఇందులో ఉన్న కథలన్నీ కాల్పనికాలు కావు.  సమాజంలో మనకు […]

Continue Reading
Posted On :

అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు”

అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు” -సరోజన ఇది ఒక అమీన కథఇది ఒక వేశ్య గాథఇది ఒక విధవ వ్యథఇది మనువు మాయాజాలపు ఉరులకు చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న ఉవిదల కన్నీటి ఊట. ఇది పురుషాధిక్యపు కబంధ హస్తాల్లో యిరికి అతలాకుతలమౌతున్న అతివల పదునెక్కినతూట.ఇది అడుగడుగునా దగా పడుతున్న అతివల ఆక్రందనలను బాపే, ఆక్రోశాల అక్షరాల మూట అభ్యుదయ కవి కూకట్ల తిరుపతన్న రాసిన ఎర్రగాలు కవితా సంపుటిలో అబలల అంతరంగ వ్యథను, అతివలపై జరుగుతున్న అరాచకాలను, ఎంతో ఆవేదనతో […]

Continue Reading
Posted On :

విషాద కామరూప

విషాద కామరూప        -అనురాధ నాదెళ్ల రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ పేరుతో రాయటం జరిగింది. ఈ అస్సామీ మాండలికం ఎక్కువ మందికి తెలియకపోవటం వలన రచయిత్రి స్వయంగా ‘’ఎ సాగా ఆఫ్ సౌత్ కామరూప” పేరుతో తన నవలను ఇంగ్లీషులోకి అనువదించారు. దానిని గంగిశెట్టి లక్ష్మీ […]

Continue Reading
Posted On :

సర్వధారి- సంవేదనల కవితాఝరి (పుస్తక సమీక్ష)

సర్వధారి- సంవేదనల కవితాఝరి -వురిమళ్ల సునంద కవితా సంపుటి పేరు చూడగానే  ఇది సర్వధారి సంవత్సరానికి  సంబంధించి రాసిన కవితలు కావచ్చు అనే అపోహ కలగడం సహజం.. కవయిత్రి ఇందులో మనిషి జీవితంలోని ఆశలు,ఆశయాలు స్నేహం.స్వప్నాలు, భావోద్వేగాలు, ఉద్యోగం పండుగలు పబ్బాలు, సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒకటేమిటి  మనిషి సకల  అనుభవాల ఆకృతి ఇందులో దాగుంది కాబట్టి .. సర్వం కలిగియున్నదనే అర్థంతో ‘సర్వధారి’ అని ఈ సంపుటికి నామకరణం చేశానని తన మాటలో చెప్పుకుంటారు.నిజమే […]

Continue Reading
Posted On :

జోగినీ మంజమ్మ – ఆత్మ కథ

జోగినీ మంజమ్మ – ఆత్మ కథ     -పి.జ్యోతి కర్ణాటక జానపద అకాడేమీకి అధ్యక్షురాలిగా నియమించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ మహిళ మంజెమ్మ ఆత్మకథ యొక్క తెలుగు అనువాదం ఇది. డా. చంద్రప్ప సోబటి దీన్ని కన్నడలో రాస్తే, రంగనాధ రామచంద్రరావు గారు దీని తెలుగులోకి అనువాదించారు. ట్రాన్స్జెండర్ల జీవితాన్ని సానుభూతితో అర్ధం చెసుకునే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో రావడం మంచి పరిణామం. తమ ప్రమేయం లేకుండా తమ శరీరం తో మనసు కలవలేక, తాము మరొకరి […]

Continue Reading
Posted On :

ఆపత్కాల ప్రకంపనల రికార్డే “అవలోకనం” (పుస్తక సమీక్ష)

ఆపత్కాల ప్రకంపనల రికార్డే ” అవలోకనం” -నాంపల్లి సుజాత కనీ వినీ ఎరుగని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది..కరోనా వైరస్ కోవిడ్-19 చైనా లోని ఊహాన్ లో పుట్టి ఇతరప్రాంతాలకు సంక్రమిస్తున్నదనీ…లేదా బయోవార్ లో భాగంగా శత్రుదేశాలు పన్నిన కపట అస్త్రమో..మరి ప్రయోగాల పేరిట వికటించిన తప్పిదమో..పర్యావరణ సమతుల్యత లోపించిన కారణమో..ఏదియేమైనా విశ్వవ్యాప్తంగా విధ్వంసాన్ని నెలకొల్పుతోంది..కనబడని ఓ భయంకర యుద్ధం కళ్ళముందు జరుగుతూనే ఉంది.. కనబడని శత్రువు యే దిక్కునుంచి దాడి చేస్తాడో..ఎంత […]

Continue Reading
Posted On :

డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష (పుస్తక సమీక్ష)

డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష -గిరి ప్రసాద్ చెలమల్లు ప్రేమ కవితల సమాహారం అద్భుత ఊహల సామ్రాజ్య అక్షరీకరణలో ఫలవంతమైన రచయిత్రి గీతా వెల్లంకి గారి తొలి  డార్క్ ఫాంటసీ సంపుటికి ముందుమాట డాక్టర్ నాగసూరి వేణు గోపాల్ వ్రాస్తూ రచయిత్రి కున్న ప్రేమ శిల్పాన్ని వ్యక్తీకరిస్తూ ప్రేమ కవితల విందుని పంచారన్నారు. ఇది ఒక గొప్ప తెలుగు ప్రేమ సాహిత్యమని అభివర్ణించారు. శ్రీమతి శిలాలోహిత గారు తెరచిన కిటికీలోంచి చూస్తూ స్నేహ చెలమను గుండెల్లో దాచుకున్న సముద్రమామె అని […]

Continue Reading

“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన (పుస్తక సమీక్ష)

“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన -డా. నల్లపనేని విజయలక్ష్మి “ నది అంచున నడుస్తూ ” కవితా సంపుటి రచయిత్రి డా.చిల్లర భవానీ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆంగ్ల ,హిందీ సాహిత్యాలలో పాండిత్యం కలిగినవారు. తెలుగు సాహిత్యంలో అపారమైన కృషి చేసినవారు. కవిత్వం, కథలు, నవలలు, బాల సాహిత్యం, వ్యాస సంపుటాలు, నాటికలు,టివి సీరియల్స్, నియో లిటరేచర్, అనువాదాలు – ఇలా ఆధునిక సాహిత్య  ప్రక్రియలన్నింటిలోనూ రచనలు చేసి తనదైన […]

Continue Reading

చదువు తీర్చిన జీవితం (పుస్తక సమీక్ష)

   చదువు తీర్చిన జీవితం — కాళ్ళకూరి శేషమ్మ -పి.జ్యోతి “చదువు తీర్చిన జీవితం” – ఒక సామాన్య మహిళ ఆత్మకథ అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ పుస్తకం కాళ్ళకూరి శేషమ్మ గారి ఆత్మ కథ. తెలుగులో మహిళలు రాసిన అత్మకథలు చాలా తక్కువ అని మనకు తెలుసు ఆ విషయాన్ని ప్రత్యేకంగా ముందుమాట రాసిన నాగసూరి వేణుగోపాల్ గారు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ప్రస్తావించారు. శేషమ్మ గారికి ఇప్పుడూ 77 సంవత్సరాల వయసు. పది […]

Continue Reading
Posted On :

మానవీయ విలువల పరిమళాలు(జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం)

మానవీయ విలువల పరిమళాలు (జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద సాహిత్య ప్రక్రియల్లో  పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి  కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ  ప్రక్రియ సాహిత్యంలో అగ్రగామిగా నిలిచింది.అందులో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కాల్పనికత అయితే పెద్దలు బాగా ఇష్ట పడేది యథార్థానికి దగ్గరగా ఉండే కథలనే. అందులో తమ జీవితాలను చూసుకుంటారు. సమకాలీన సమాజ పరిస్థితులు, వివిధ వర్గాల వారి […]

Continue Reading
Posted On :

రెక్కల పిల్ల (పుస్తక సమీక్ష)

రెక్కల పిల్ల -పి.జ్యోతి జీవితంలోని ప్రతి మలుపులో, స్థితిలో అనుభవాలు, అనుభూతులు ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయి. వాటికి స్పందించే పరిపక్వత అందరిలో ఒకేలా ఉండదు. ఒకొక్క మనిషి జీవితం మరొకరితో పోల్చితే అస్సలు ఒకేలా ఉండదు. కొందరి బాల్యం అనుభవాల మయం అయితే మరికొందరికే ఆ బాల్యంలో అంతగా గుర్తించుకోవలసిన సంఘటనలు ఎక్కువగా ఉండవు. వారి మనసు అవి రికార్డు చేసుకోదు. జీవితం గడిచిపోతుంది అంతే. అంత మాత్రం చేత వారి జీవితంలో సుఖం లేదని […]

Continue Reading
Posted On :

ఒక హిజ్రా ఆత్మ కథ (పుస్తక సమీక్ష)

 నిజం చెప్తున్నా     ఒక హిజ్రా ఆత్మకథ -అనురాధ నాదెళ్ల “మనం తరచుగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో ఉన్నాయా?” అంటూ ఆత్మకథ చెబుతున్న ఎ. రేవతి తన ముందుమాటలో సూటిగా అడిగారు. ఎంతో నిజాయితీగా తను పడిన శారీరక, మానసిక అవమానాలను, బాధలను, తనలాటివారు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టినట్టు రాసిన రేవతి అభినందనీయురాలు. ఆమె పూనుకోకపోతే వారి జీవితాల్లో ఉన్నదారుణమైన హింస, దుఃఖం […]

Continue Reading
Posted On :

నిర్భయాకాశం కింద (పుస్తక సమీక్ష)

నిర్భయాకాశం కింద  అనిశెట్టి రజిత కవితాసంపుటిపై  సమీక్ష -వురిమళ్ల సునంద కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేదే కవిత్వమన్న శ్రీ శ్రీ గారి మాటలకు కొనసాగింపు ఈ కవితా సంపుటని చెప్పవచ్చు.పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచి ఆధిపత్య అరాచక వర్గాలపై తిరగబడిన అక్షరాయుధాలు.ఈ  దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో జరుగుతున్న  దుర్మార్గాన్ని ఎదిరించడానికిగళమెత్తిన కలం తాలూకు ధర్మాగ్రహం ఇది. యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన నిర్భయ  ఘటన ఆ తర్వాత జరిగిన దిశ ఘటన.. అంతటితో ఆగకుండా  […]

Continue Reading
Posted On :

భారతదేశం నా జైలు జీవితం- మేరీ టైలర్

 భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు -పి.జ్యోతి నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఈ పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో కొన్ని సంవత్సరాలు ఉన్న బ్రిటీషు మహిళ గా మేరీ టైలర్ గుర్తు ఉండిపోయింది. ఈ పుస్తకం మళ్ళీ రీప్రీంట్ అయ్యింది అని తెలుసుకుని ఇది మళ్ళీ చదవాలని కొన్నాను. ఒక విదేశీ మహిళ మరో […]

Continue Reading
Posted On :

రైలుబడి (పుస్తక సమీక్ష)

 రైలుబడి -అనురాధ నాదెళ్ల రచన: టెట్సుకో కురొయనాగి అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్ మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి ఉంటారు కదా, అవును అది “రైలుబడి”. చదివిన ప్రతివారూ ఆ బడిలో తాము కూడా చదువుకుంటే ఎంత బావుణ్ణు అని అనుకోకమానరు. 1933లో జన్మించిన టెట్సుకో కురొయనాగి ఈ “రైలుబడి” పుస్తకం రచయిత్రి, జపాన్ […]

Continue Reading
Posted On :

నీలి మేఘాలు (పుస్తక సమీక్ష)

నీలి మేఘాలు -వురిమళ్ల సునంద కవిత్వం అంటే ఒక అన్వేషణ,ఒక తీరని వేదన,కవిత్వమొక జలపాతం. కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళు ఉండవంటారు చలం. అక్షరాన్ని అణువుగా అనుకుంటే ఆటంబాంబు లోని అణుశక్తి కవిత్వమని చెప్పవచ్చు. అక్షరాలను పూవులతో పోలిస్తే ఆ పూలు వెదజల్లే పరిమళాలే కవిత్వం అనవచ్చు. కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ అని సినారె అంటే.. “కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది కవిత్వమని’ శ్రీ శ్రీ గారు అంటారు. “ప్రశాంత స్థితిలో జ్ఞాపకం […]

Continue Reading
Posted On :