
కలతల నిద్ర
-ఇందు చంద్రన్
కరగని రాత్రులు కలవరపెట్టే ఆలోచనలు
ఒక్కోసారి చీకటి అలసి వెలుగొచ్చేస్తుంది.
ఎన్నో కలలు రెప్పల బయటే ఎదురు చూస్తుంటాయి.
ఇప్పుడంతా కలతల నిద్రే!
శిఖరాలని తాకాలన్న ఆశలు ఓ వైపు,
ఈదలేని సముద్ర లోతుల్ని గుర్తు చేసబాధలు మరోవైపు,
రెండింటి మధ్య అప్పుడపుడూ గడ్డకట్టుకుని పోతూ ఉంటాను.
మళ్లీ వాస్తవాన్ని తల్చుకుని కరిగిపోతూ ఉంటాను.
ఆ నిద్రని లాక్కోడానికి ప్రయత్నిస్తుంటాను.
చుట్టూ ఉన్న ప్రత్యామ్నాయాలతో,
ఎంతటి స్వార్థం !
రోజూ జరిగే ఈ యుద్దంలో గెలుస్తాను.
కాలాన్ని భారంగా నెడుతూ నిద్రకి దగ్గరగా వెళ్తాను.
ఇంతకీ నిద్ర పట్టేదెప్పుడో !
*****
Please follow and like us:

ఇందు చంద్రన్ స్వస్థలం చిత్తూరు జిల్లా. బి టెక్ పూర్తి చేసుకుని ఐటీ లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు , కవితలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో సరదాగా రాయటానికి ప్రయత్నిస్తున్నాను.
