కథాకాహళి-పి.శ్రీదేవి కథలు

స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-16)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం జరగబోయే సంఘటనలపట్ల కొందరు వ్యాకులపడ్డారు. ఏం జరగబోతోందో తెలియని అమోయమంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయని! కటావి సంఘటన వింటే గుండె చెరువవుతుంది. సెలవులు గనుక భర్త ఎటో ప్రయాణమయి వెళ్ళిపోయాడు. కాల్పులూ, ఘర్షణలూ – ఈ గందరగోళమంతా చూసి భార్య తన పిల్లల్ని మంచంకింద దాచింది. మా దగ్గర ఇది ఒక అలవాటు. కాల్పులు జరిగేటప్పుడు పిల్లల్ని […]

Continue Reading
Posted On :

కెథారసిస్ (కథ)

కెథారసిస్ –సునీత పొత్తూరి చటుక్కున కళ్లు విప్పి చూసింది సునంద. ఏదో కల. అది కలా అనే స్పృహ కలిగినా, కల మిగిల్చిన చిన్న అసౌకర్యం మస్తిష్కాన్ని అంటిపెట్టుకునే వుంది. సునంద వచ్చిన కల ఓ క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది.    పైగా కల కూడా అస్పష్టంగా, తెగిన సాలిగూడు లా.. అన్నీ   పొంతన లేని దృశ్యాలు! ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు.. అరుద్దామంటే తన నోరు పెగలడం లేదు. అరుపూ బయటకు రావడం లేదు.  అదీ […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో […]

Continue Reading
Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది “శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ […]

Continue Reading
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి. దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు […]

Continue Reading

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ)

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ) -రమేశ్ కార్తీక్ నాయక్ ( 1 )                            ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు.  తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది. ‘బఱ్ఱె ముందే సూడిది, […]

Continue Reading
Sasikala

కథాకాహళి- శశికళ కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

ముందడుగు (కథ)

ముందడుగు -రోహిణి వంజారి పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు.  సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది.  ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో  ఫేస్బుక్, వాట్సాప్ లు  మార్చి మార్చి గంట  నుంచి చూస్తున్నాను.  అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు.  కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు  అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే […]

Continue Reading
Posted On :

మిణుగురులు (కథ)

మిణుగురులు -శ్రీసుధ మోదుగు సాయంత్రం బుగ్గ వాగు  దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరూ, దూరంగా చిన్న కొండలు వర్షాకాలంలో ఆకుపచ్చగా, ఎండాకాలంలో పసుపచ్చగా మారిపోతాయి. ఎలా చూసినా అందంగానే ఉంటాయి. “బుగ్గ వాగులో నీళ్లు లోతు లేనట్లు కనిపిస్తాయ్, కానీ లోతెక్కువ. ఎప్పుడూ వాగులో దిగకు. శివా! వింటున్నావా?” “ఆ … కాక.”   “శివ! మీ అమ్మ వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా?”  “కాక! అమ్మ మంచిది కాదా?”  “మంచిది శివ.”  “పున్నమ్మ చెప్పింది అమ్మ మంచిది కాదు, వచ్చి […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం)

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం) -రమేశ్ కార్తీక్ నాయక్ తండా మధ్యల నుండి ఎటు సుసిన అడ్వి కనబడతది.కొండలు కనబడతయి.కొండల మీద నిలబడే నక్కలు, నెమళ్ళు, ఉడ్ములు కనబడతయి, వాటన్నింటినీ లెక్కలు ఏసుకునుడే పిల్లల రోజు పని. తాండా నుండి అడ్వి దాకా వాట్ (దారి) కనిపిస్తది, ఆ పై ఏమి కనబడది. అయినా అడ్వికి పోయేటోల్లు రోజుకో కొత్త దారి ఏసుకుంటరు. తాండా సుట్టు నల్లని కొండలు, ఆ కొండల మీద,దాని ఎనక పచ్చని […]

Continue Reading

మాటవిన్న మనసు (కథ)

మాటవిన్న మనసు -విజయ దుర్గ తాడినాడ ‘ఎందుకిలా జరిగింది?’  ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా అనుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?  ఈ ప్రశ్న కేవలం ఆరు నెలల నుండి నా మనసుని తొలిచేస్తోంది. జరగాల్సినదంతా జరిగిపోయింది. ఊహించనిది జరిగిపోయింది.  […]

Continue Reading
Posted On :

కథాకాహళి- రాజీవ కథలు

డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు                                                                 – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా సంపుటాలు వచ్చాయి. “నడుస్తున్న కథ”, “రాబోవుతరం స్త్రీ”  అనే నవలలు “లవ్ ఇన్ ఒన్” , “కొత్తచిగుళ్ళు”, “రాబందులు”, అనే కవితా సంపుటాలు ప్రచురించారు.  సావనీర్లకు కూడా పని చేశారు. 2010 సంవత్సరంలో వచ్చిన […]

Continue Reading
Posted On :

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది. గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది. ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను. నెమ్మదిగా […]

Continue Reading

ముసురు (కథ)

ముసురు –మణి వడ్లమాని వాన  జల్లు  పడుతూనే ఉంది. ఒక్కసారి  పెద్దగా, ఒక్కోసారి చిన్నగా  జల్లులు  పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం,సందడిగ  కోలాహలంగ ఉంది , కుర్చీలలో  కూర్చొని   కునికి పాట్లు పడేవారు కొందరు. పుస్తకాలు  తెచ్చుకొని  చదువుకునే  వారు మరి కొందరు.  చెవులకి  హియర్  ఫోన్స్  పెట్టుకుని  మ్యూజిక్  ని వింటూ ఉండేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి   ఎవరి కి వాళ్ళు  యేదో రకంగా  బిజీ గా ఉన్నారు. “బయట వాతావరణం బాగా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదిహేనేళ్ళనుండి కథలు రాస్తున్నారు. జన్మస్థలం కోస్తాంధ్ర ప్రాంతమైనా రాయలసీమ  ప్రాంతీయ జీవితానికి ప్రాతినిధ్యం వహించే “గాజుకళ్ళు” లాంటి కథలు కూడా రాశారు. అనంతపురం నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. […]

Continue Reading
Posted On :