బద్ధకం

-కందేపి రాణి ప్రసాద్

ఓ మర్రిచెట్టు మీద కాకి జంట గూడు కట్టుకున్నది.అందులో పిల్లల్ని పెట్టుకొని కాపురం ఉంటున్నది.రోజు ఎక్కడెక్కడికో వెళ్లి ఆహారం సంపాదించుకొని వచ్చేది.తల్లి వచ్చేదాకా పిల్లలు నోరు తెరుచుకొని చూస్తూ ఉండేవి. ఎప్పుడెప్పుడు తల్లి ఆహారం తెస్తుందా! తిందాం అని ఎదురుచుస్తూండేవి.కాకి తన పిల్లల కోసం ఎంత దూరమైనా ఎగురుకుంటూ వెళ్ళేది. రెక్కలు నొప్పి వచ్చిన పిల్లల కోసం భరించేది.పిల్లలంటే ఎంతో ప్రేమ దానికి చాలా గరభంగా చూసుకునేది.ఎండు పుల్లలతో గూడు కట్టినా మధ్యలో మెత్తటి గడ్డి పరకల్ని పరిచింది.పిల్లలకు గుచ్చుకోకుండా మెత్తగా ఉండాలని చూసేది.

పిల్లలు మెల్ల మెల్లగా పెద్దవి కసాగాయి.రెక్కలు వచ్చాయి.పెద్దవి అవుతున్నకొద్ది కాకి తన పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పించేది.ఒక్క పిల్ల తప్ప మిగతా పిల్లలన్నీ తల్లి చెప్పినట్లు వినేవి.అన్నింటికన్నా చిన్న పిల్ల మాత్రం ఇటు పుల్ల తీసి అటు పెట్టేది కాదు.తల్లికి ఎ సహాయం చేసేది కాదు.ఎప్పుడు ఖాళీగా బద్ధకంగా కూర్చునేది.ఆహారం తెచ్చినప్పుడు మాత్రం అందరికన్నా ముందుండేది.

తల్లి కాకి పిల్లలకు మెల్లగా ఆహారం సంపాదించుకోవటం.ఎవరైనా వేటగాడు వస్తే ఎలా తప్పించుకోవాలి.జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి వంటి విషయాలు నేర్పిస్తుండేది.మిగతా పిల్లలన్నీ శ్రద్ధగా విని పాటిస్తుండేవి.చిన్న పిల్ల మాత్రం వినేది కాదు పాటించేది కాదు.వాళ్లంతా పనులు చేస్తుంటే ఇది మాత్రం ఖాళీగా ఉండేది.కనీసం ఆటలు కూడా ఆడేది కాదు.

పిల్లలన్నీ మెల్ల మెల్లగా ఎగరటం మొదలు పెట్టి దానిలో నైపుణ్యం సంపాదించాయి.కానీ చిన్న పిల్లకు ఎగరటమే రాలేదు. ఒకరోజు తల్లికాకి బెదిరించింది.”ఇక నువ్వు ఎగరటం నేర్చుకోకపోతే తిండి పెట్టాను.ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది.ఎగరటం రాకపోతే తిండి ఎలా తెచ్చుకుంటావు.నువ్వు ఈరోజు నుంచి ఎగరటం ప్రయత్నించాల్సిందే.”

చిన్నపిల్లకు ఇక తప్పదనిపించింది.అక్కలూ ఎగురుతుంటే తానూ అలాగే ప్రయత్నించింది.దబాలని పడిపోతున్నది.మిగతా పిల్లలు చూపిస్తూనే ఉన్నాయి.అయినా ఎగరాలేకపోయింది.ఆరోజంత ప్రయత్నిస్తూనే ఉన్నది.అయినా ఎగరటం రాలేదు.ఆరోజు అమ్మ తిండి పెట్టేదేమో అనే బెంగతో కూర్చిండి పోయింది.

సాయంత్రం తల్లి కాకి ఆహారం తెచ్చింది.పొద్దుట్నుంచి జరిగిన విషయం అంత తెలుసుకున్నది.చిన్న పిల్ల ఏడుపు మొహం చూసి ఇలా చెప్పింది. “చూడు నువ్వు రోజు తిండి తింటున్నావు కానీ దానికి తగ్గ పని చేయటం లేదు అందుకనే నువ్వు వాళ్ళ కన్నా లావుగా తయారయ్యావు.ఇంత లావుగా ఉంటే ఎలా ఎగరగలవు? అందుకే నువ్వెంత ప్రయత్నించిన ఎగరలేకపోయావు.ఎంతవరకు ఈసమస్య మనుష్యులోనే ఉన్నది.వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే లావుగా మారిపోయి ‘ఒబేసిటీ’ అనే సమస్యతో బాధపడుతున్నారు.పిల్లలకు మంచి పౌస్తకాహారాన్ని ఇచ్చి పనులు చేయించకుండా అనారోగ్యం పాలు చేస్తున్నారు.కానీ నీకు నేను ముందు నుంచే చెప్పుతున్నాను.అయినా నువ్వు వినలేదు.ఎప్పుడైనా మారు బరువు తగ్గు ముందు నువ్వు కూడా” ఎగరగలుగుతావు” అని హితబోధ చేసింది.

చిన్నపిల్లకు ఎగరలేనోమోనని భయం వేసి రోజు ఇంట్లో పనులు చేయసాగింది.త్వరలోనే బరువు తగ్గింది.తర్వాత సులభంగా ఎగరగలిగింది.ఆకాశంలో ఎగురుతూ ఎంతో ఆనందాన్ని పొందింది.తన తిండిని తానే తెచ్చుకుంది.మారిపోయిన చిన్నపిల్లను చూసి తల్లి కాకి సంతోషించింది.

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.