జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! మూలం: మార్గె పియర్సీ అనువాదం: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో నా ఆడతనాన్ని అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది… ఏం,ఎందుక్కూడదు? మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని తొడుక్కొనే ఉంటారా? ఆ ఫాదరీ, ఆ డాక్టరు, ఆ మాష్టారు అందరూ విలింగతటస్థభావంలో నత్తగుల్లల్లా తమ వృత్తులకు హాజరవుతున్నామంటారా? నిజానికి నేను పనిలో ఉన్నప్పుడు ఏంజిల్ టైగర్ లా స్వచ్ఛంగా ఉంటాను చూపు స్పష్టంగా […]
తండ్రీ, కూతురూ -చెరువు శివరామకృష్ణ శాస్త్రి ఆనాడు అల్లరి చేసే పిల్ల ఈనాడు చల్లగ చూసే తల్లి ఆనాడు ముద్దులొలికే బంగరు బొమ్మ నేడు సుద్దులు చెప్పే చక్కని గుమ్మ నీ పసితనమున నీకు అన్నం తినిపించబోతే నీ చిన్ని చేతులతో తోసి వేసినావు మారం చేసినావు, హఠం చేసినావు కథలూ కబుర్లు చెప్పి, నిను మాయ చేసినాను. కాలము కరుగగ, ఈ మలి వయసులో చేయూత నిచ్చావు, నాకు అన్నం తినిపించావు చదువు కోకుండా, ఆడుతూ […]
ఆత్మీయ నేస్తం -ములుగు లక్ష్మీ మైథిలి ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది బ్రతకడానికి పాచిపని అయినా ఇంటి మనిషిలా కలిసిపోతుంది ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది నాలుగు రోజులు రాకపోతే డబ్బులు తగ్గించి ఇచ్చే నేను.. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో పనంతా నా భుజస్కంధాలపై వేసుకున్నా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పని మొత్తం చిటికెలో చేసేది నిత్యం ముంగిట్లో ముగ్గులు ఆమె రాకను తెలియచేస్తాయి పెరట్లో చిందరవందరగా వేసిన గిన్నెలన్నీ ఒద్దికగా బుట్టలో చేరేవి ఒక్కోరోజు […]
దుఃఖ మోహనం -ఐ.చిదానందం నీవెప్పుడు ఏడవాలనుకున్నా నిస్సంకోచంగా ఏడ్చేయ్ దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్ కానీ మద్యంలో తేలనీయకు ఏడ్వలనిపించినప్పుడల్లా ఏడ్చేయ్ కానీ ఈ లోకానికి దూరంగా వెళ్లి ఏడ్వు ప్రతి దుఃఖాన్ని వెలకట్టే ఈ దుష్టప్రపంచం నీ గొంతుతో ఎప్పటికీ గొంతు కలపదు ఈ లోకం మాటలు ఒట్టి ఓదార్పులు నీ హృదయంలో సంతోషం మొలిచే వరకు ఏడ్వు నీ గుండె లో ఆవేదన తొలిగే వరకు ఏడ్వు నీ బాధను చూసి ఎప్పుడైతే ఈ లోకం […]
ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు కూడా తరిగిపోతోంది!! చందమామ మెరిసిపోతున్నాడు!! మకిలిలేని.కొత్తగాలి కమ్ముతోందిగా!! అంతులేని విశ్రాంతిలో ఆయనకు నడక! అలసటతో.. ఆమె పడక! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా […]
బతుకు బీడీలు -అశోక్ గుంటుక నా పెళ్లిచూపుల్లో నాన్నకెదురైన మొదటి ప్రశ్న “అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?” లోపల గుబులున్నా నేనపుడే అనుకున్నా జవాబు వారికి నచ్చేనని కట్నం తక్కువే ఐనా నేనే ఆ ఇంటి కోడలయ్యేనని………. నీటిలో తడిపి కొంచెం ఆరిన తునికాకు కట్టల్ని బీడీలు చుట్టే ఆకుగా కత్తిరించాక ఒక్కో ఆకులో కాసింత తంబాకు పోసి బీడీలుగా తాల్చి దారం చుట్టేది……. ఈ రోజుకివ్వాల్సిన వేయి బీడీల మాపుకి తక్కువైన నాలుగు కట్టల […]
వర్షానికి ప్రేమ లేఖ -వెంకటేష్ పువ్వాడ ఒక ఉష్ణ ధామ హృదయం ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల దేహమంతా పగుళ్లు ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం పశ్చిమ మలయ మారుత వింజామరాల హాయి లాలనలో లోలనమై ఊగుతున్న క్షణాన ఒక కణాన సంధ్య తో సంధి కుదిరింది కుదరక ఏంచేస్తుంది ఇద్దరి రందీ ఒకటే మరి అల గడ్డి పోచల మెత్త పై వొళ్ళు వాల్చి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా మబ్బుల పందిరికేసి మరో […]
ఊరుపిలుస్తుంది -కె.రూపరుక్మిణి అది నివాస స్థలమే నల్లని మేఘాలు ఆవరించాయి చుట్టూ దట్టమైన చీకటి గాలులు ఎక్కడా నిలబడే నీడ కూడా దొరకడం లేదు కడుపు తీపి సొంత ఊరిని అక్కడి మట్టి వాసనను గుర్తుచేస్తుంది ఊరు *ప్రేమ పావురం* లా మనసున చేరి రమ్మని పిలుస్తోంది ఆ ..నల్లని దారుల్లో ఎక్కడి నుంచో వలస పక్షులు దారికాచుకుంటూ రక్తమోడుతూ వస్తున్నాయి చూపరులకు ఎదో *కదన భేరీ* మ్రోగిస్తున్నట్లుగా గుండేలవిసేలా నిశ్శబ్ద శబ్దాన్ని వినిపిస్తున్నాయి ఏ దారిలో […]
నలుపు -గిరి ప్రసాద్ చెల మల్లు నేను నలుపు నా పొయ్యిలో కొరకాసు నలుపు రాలే బొగ్గు నలుపు నాపళ్లని ముద్దాడే బొగ్గు పొయ్యిమీది కుండ నలుపు నాపొయ్యిపై పొగచూరిన తాటికమ్మ నలుపు కుండలో బువ్వ నా దేహదారుఢ్య మూలం నల్లని నాదేహం నిగనిగలాడే నేరేడు నల్లని నేను కనబడకపోతే ఎవ్వరిని నల్లగా చేయాలో తెలీక సూరీడు తికమక సూరీడు తూర్పునుండి పడమర నామీదుగానే పయనం పొద్దుని చూసి కాలం చెప్పేంత స్నేహం మాది నా పందిరిగుంజకి […]
ప్రకృతి నా నేస్తం -యలమర్తి అనూరాధ పువ్వు నన్ను అడిగింది దేవుని పాదాలచెంతకు నన్ను తీసుకెళ్ళావూ అని గోడ నాకు చెప్పింది బంధాలకూ అనుబంధాలకూ తాను అడ్డుగోడ కానని పక్షి నాతో గుసగుసలాడింది మాటలు రాకపోయినా కువకువల భాష తమకుందని శునకం కాళ్ల దగ్గర చేరింది బుద్ధివంకరకు కాదు విశ్వాసానికి గుర్తుగా తమని చూపమని చెట్టు నన్ను స్పృశించింది గాలి ,నీడ ,పండు సరిగా అందుతున్నాయా అని ఆకాశం నా నీలికళ్ళతో ఊసులాడింది నీకూ నాకూ మధ్యన […]
నా కవితా వేదిక -శీలా సుభద్రా దేవి బాల్యంలో బుడ్డీదీపం వెలుగు జాడలో చాపమీద కూర్చుని అక్షరాలు దిద్దిన నాటి వెలిసి పోయిన జ్ణాపకం బొంతచేను పై బోర్లానో, వెల్లకిలో దొర్లుతూనో గెంతుతూనో పదాలకంకుల్ని ముక్కున కరుచుకున్న వల్లంకి పిట్టనయ్యాను అలా అలా జంటపిట్ట తో జతకట్టి కొత్త లోకం లోకి ఎగిరొచ్చి గూట్లో కువకువ లాడేను ముచ్చట పడి కొన్న డబుల్ కాట్ మంచం అన్యాక్రాంత మై పోగా పాత నవారుమంచమే హంసతూలికైంది మూడు […]
మెరుస్తోన్న కలలు – శాంతి కృష్ణ రేయంతా తెరలు తెరలుగా కమ్మిన కలలు కను రెప్పలపై హిందోళం పాడుతున్నాయి…. నీ రాకను ఆస్వాదించిన గాలి తన మేనికి ఎన్ని గంధాలు అలదుకుందో…. మగతలోనూ ఆ పరిమళం నన్ను మధురంగా తాకిన భావన… ఓయ్ వింటున్నావా…. ఒక్కో చినుకు సంపెంగలపై జారుతున్న ఆ చప్పుడును…. ఇప్పుడు నా కలలకు నేపధ్య సంగీతమవే… వర్షం ఇష్టమని చెప్పిన సాక్ష్యంలా నీతో పాటు ఇలా ప్రతిరేయి పలుకరించే చిరుజల్లుకి… ఋతువులతో పని […]
మాకూ ఊపిరాడటం లేదు -జె. గౌతమ్ నల్ల సముద్రం మళ్లీ గర్జిస్తోంది నల్ల హృదయం ఉద్విగ్నంగా ఎగసి పంజా విసురుతోంది నల్ల ఆకాశం దావానలమై రగులుతోంది నల్ల నేత్రాలు నెత్తుటి మెరుపులతో ఉరుముతున్నాయి. నల్ల పర్వతాలతో కొన్ని తెల్లమేఘాలూ చేతులు కలిపాయి. శ్వేత సామ్రాజ్యపు విద్వేష సౌధంపై కణకణమండే పిడుగులవాన కురుస్తోంది తెల్ల తోడేలు భయంతో కాస్సేపు బంకర్లో తలదాచుకుంది. గుండె పగిలిన మానవత్వం మోకాళ్ళపై నిలబడుతోంది ప్రపంచ పీడితుల జెండాపై అజెండాలా దుఃఖ గాయాల ధర్మాగ్రహం […]
ఆకాశంలో సగం -లక్ష్మీకందిమళ్ళ నీ అడుగుతో నా అడుగు ఈ నడక కొత్తగా మొదలైంది కాదు బంధంతో బతుకు బతుకుకో బంధం ఎప్పుడో ముడిపడింది మనసు మనసు.మురిపెం హద్దులు దాటని పరిధి నదులుగా తడుస్తూ అహం తెలియని ఆసరాల ఆలింగనాలు ఆవేశం కాని ఆలోచనలు నువ్వు ఆకాశమై నీలో సగమై నేను. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
అభేద్యారణ్యం -కె.వరలక్ష్మి ఇల్లు వదిలి ఇంత దూరమొచ్చానా ఏరు దాటి కొండ ఎక్కి దిగి ఆవలి వైపు అక్కడా వాగూ వంకా ఎడ తెగని వాన మనసు మబ్బుల్లో కూరుకుపోయి దుఃఖం కరిగి నీరై కురుస్తున్న వాన కీకారణ్యంలో ఎన్నెన్నొ మూగజీవులున్నై పలకరించే పెదవి ఒక్కటీ లేదు బయలుదేరినప్పటి ఉత్సాహం ఉద్వేగం ఆవిరై పోయాయి ఎక్కడ ఉన్నానో ఎరుక లేనిచోట ఒక్క పూపొదైనా పరిమళించని చోట జీవితం శూన్యపుటంచుకి చేరుకుంటోంది బాల్యం నుంచి నేరుగా వృద్ధాప్యం లోకి […]
వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న కళ్ళకి వయస్సుతో పనేముంది?? మొలకల్ని ,చెట్లను వేటినైన నరుక్కోవచ్చు . కావాల్సినప్పుడల్లా న్యూడ్ వెబ్సైట్స్ ఓపెన్ సౌకర్యం పుట్టాక నేర్పేపనే ముంది?? వాడుకోవొచ్చు ,చంపేయొచ్చు అనే ఒక లోపలి నినాదానికి స్వేచ్ఛ చాలానే ఉందిగా. […]
వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) -అరణ్యకృష్ణ (జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని తెలుగులో “ఒకతల్లి” పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు. ఉద్యమంలో కన్నుమూసిన తన కుమారుడి మరణానికి కారణాల కోసం ఒక తల్లి చేసే అన్వేషణ ఈ అద్భుతమైన నవలకి కథాంశం. ఆ పుస్తకం చదివి నేను […]
చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా నాన్న మిఠాయి తెస్తారా ?” తెస్తారు బాబూ పెద్ద పెట్టెనిండా తెస్తారు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిన బుగ్గమీద ముద్దు పెట్టి చెప్పింది తెల్లారుతూనే ఒక పెట్టెను సాయంపడుతూ కొంతమంది మనుషులొచ్చారు “అమ్మా ఈ […]
నల్ల పాదం -సతీష్ బైరెడ్డి మేము శ్వాసిస్తే సహించలేరు మా విశ్వాసాన్ని భరించలేరు శతాబ్దాలుగా మా స్వేచ్చా కంఠాలపై శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి. మేమంటే హృదయము,మేధా లేని ఒట్టి నల్ల రంగే పుట్టుకతోనే నిషిద్ధ మానవులగా మారిన వాళ్ళం మా కలలు నిషిద్ధం మా కదలికలూ నిషిద్ధం అగ్ర రాజ్యంలో పేదరికంతో పెనవేసుకపోయిన జీవితాలు మావి నల్ల జాతిని నేరానికి చిరునామా చేసింది శ్వేత రాజ్యం పీఠాల మీది బతుకులు వారివైతే పాదాల కింద నలిగిన […]
బాలబాబు-బుజ్జి అత్త -యశస్వి ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారిఇప్పుడు అంపశయ్య ఎక్కి బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది నిన్నటి వరకూ నిలిచోడం ఆమె యుద్ధం, పడకుండా నడవడం యుద్ధాన్ని గెలవడమే..పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే మంచాన పడ్డ పెనిమిటిని పసిపిల్లాడిలా సాకిన గట్టిమనిషేకట్టుకున్నోడ్ని కాటికి అప్పజెప్పాక పట్టు వదిలేసిన ఒళ్లాయే; ఆపై తలతిరిగి కూలబడి పోతుండేది ఎముక లేనట్టు వండి వడ్డించిన చేయి వందల సార్లు జారి కిందపడ్డందుకు జబ్బ జారిపోయింది కొడుకులు పురిట్లోనే పోయినా అడుగు దూరం నుంచి ప్రేమించే […]
నీ అస్థిత్వం ఎక్కడిది..? -గట్టు రాధిక మోహన్ పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు. నా జన్మం కూడా మారలేదు. శతాబ్దాల వేదనలో నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను. నా మీద రాసివ్వబడని పేటెంట్ హక్కులు నీ సొంతం అనుకుంటావు. ఎప్పటికప్పుడు నీకిష్టమైన కొత్త కొత్త నాగరికత విత్తనాలను విత్తుకుంటు నా కన్నీటి చుక్కలతో తడిపేస్తుంటావు. నువ్వు సృష్టించిన ఈ పితృస్వామ్య రాజ్యాంగంలో నా చూపుడు వేలును విరిచేసుకుంట నవ్వుకుంటుంటావు. […]
రైన్ కోటు -యలమర్తి అనూరాధ గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. గాలివాన నేనున్నా అనాలి విప్పుకున్న గొడుగులా అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ వెచ్చదనం అంతా నీ సొంతం చేస్తుంది కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ గూటిలో గువ్వలా తన ఒడిలో కాపాడే తల్లి మనసుకు ఏం తీసిపోదు చినుకు చినుకు కి చిత్తడవుతున్నా చిరునవ్వుతో నిన్ను హత్తుకుంటూనే నిలువెల్లా రక్షణ కవచం […]
వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, కదిలి వచ్చి తన చేతిని, మనసును తలపుల్ని, బ్రతుకును నాతో పెనవేసుకుని తిరిగి నన్ను నిలబెట్టిన నా నెచ్చెలి వెచ్చని పరిష్వంగంలో ‘అమ్మ తనం’ సదా పరిమళిస్తూనే ఉంటుంది! ‘అమ్మలా’ నన్ను లాలించి మందలించి, […]
యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం సరిహద్దుల్లో కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం చిదిమేది బడుగు బతుకునే దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడసౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు ఇచ్చట […]
మిస్సోరీ లో (అనువాద కవిత) -దాసరాజు రామారావు నేనున్న మిస్సోరీలో ఒక సగటు మనిషి ఒక కఠిన మనిషి బాధకు అర్థం తెలియని చలన రహిత మనిషి కడుపులో పేగుల్ని దేవేసినట్లు హింసిస్తుంటడు వాణ్ణి చల్లని వాడనాల్నా పరమ కసాయి ఆ మనిషి నేనెప్పుడూ మధురమైన మనిషిని కలువలేదు దయగల మనిషిని నిజమైన మనిషిని ఎవరొకరో చీకటిలో వుంటే భరోసా మనిషి తోడుండాలనుకుంట ఖచ్చితమైన మనిషే ఆ మనిషి జాక్సన్ ,మిస్సిసిపీలో లక్షణమైన పురుషులున్నరు […]
మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా […]
విడదీయ లేరూ !!! -గిరి ప్రసాద్ చెల మల్లు నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం బహిర్గతం నేను ఆమె అధరాలను స్పృశిస్తూ నాసికాన్ని నా ఆధీనంలోకి తీసుకు రాగానే ఆమె ఉఛ్వాసనిశ్వాసాల గాఢత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆమె కింది కనురెప్పల వారగా నేను ముడతలను మూసేస్తూపై కనురెప్పల ఈర్ష్యను గమనిస్తూ ముంగురులను ముద్దాడుతూ ఆమె […]
బంగారమంటి- -డా||కె.గీత ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను లంచ్ టైముకి కాస్త అన్నం మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో రాత్రికి ఓ చిన్న చపాతీ ఏదో ఓ కూరో, పప్పో పాపం సింపుల్ జీవితం అట్టే ఆదరాబాదరా లేని జీవితం లాక్ డవున్ లోనూ ఇవన్నీ […]
రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో వింత చూస్తూ వుంటుంది. సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు […]
చీకటి వేకువ (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే భుజం ఎప్పుడైనా సరాసరి లోపలికి నడవగల పొరుగిల్లు మానవానుబంధపు అతి సాధారణ ఆనవాళ్లన్నిటినీ సవాల్ చేస్తున్నదిది ఎగుడుదిగుళ్ల వ్యక్తివాదపు గొప్పలతో మన భుజాలు మనమే చరుచుకుంటూ, మనిషి మీద సకల హక్కులూ ఆస్తికే ఉన్నాయంటూ […]
ముందస్తు కర్తవ్యం (కవిత) -యలమర్తి అనూరాధ కనికరం లేని కబళింపు జాపిన చేతులు పొడగెక్కువ గాలి కన్నా వేగంగా వ్యాప్తి లక్షణాలు మెండే అయితే ఏంటంట చేయి చేయి కలుపు ఒకప్పటి నినాదమైతే దూరం దూరంగా జరుగు ఇప్పటి నినాదం ఎంతలో ఎంత మార్పు? ఊహించనవి ఎదురవ్వటమేగా జీవితమంటే!? తట్టుకుని నిలబడటమేగా ధైర్యమంటే కరోనా అయినా మరేదైనా ఆత్మస్థైర్యంతో తరిమి కొట్టడమే ముందస్తు కర్తవ్యం వైద్యులు అండ పోలీసులు తోడు శాస్త్రజ్ఞులు సహకారం నిస్వార్థ హృదయాల మానవత్వం […]
ఒంటరి (కవిత) -ములుగు లక్ష్మీ మైథిలి రాతిరి కొన్ని బాధలు కరిగిస్తుంది అర్థరాత్రి నిశ్శబ్దం వెలుతురు నాహ్వానిస్తూ గడిచిన వెతలకు జవాబు చెపుతుంది రాతిరి నా అక్షరాలు నల్లని చీకటిని చీల్చే కాంతి పుంజాలవుతాయి చెదిరిన ఆశల తునకలను కవిత్వం గా అల్లుకుంటాను రాతిరి వెన్నెల లో ఊసులు చెప్పుకొని ఎన్నాళ్ళయిందో? ఆ నిశీధి మౌనంలో హృదయాల సవ్వడులు మూగగా మాట్లాడుకుంటాయి రాతిరి నిదురలేని రాత్రులు ఈ దేహపు ఆకాశం లో ఉదయాస్తమయాలు ఒక్కటే కన్నీటి నక్షత్రాలు […]
లక్ష్మణరేఖ (కవిత) -డా.సి.భవానీదేవి నీకిది సరికొత్త కాలం నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు నా జీవితమంతా ఎప్పుడూ లాక్ డౌనే ! అందుకే నాకస్సలు తేడా కనిపించటం లేదు ఏ మాల్స్ మూసేశారో ఏ మార్కెట్ తీసిఉందో నాకెప్పుడయినా తెలిస్తేగా… ఇప్పుడు నీ మార్నింగ్ వాక్ బంద్ నీ ఉద్యోగానికి నిర్విరామ విశ్రాంతి నువ్వు నిరంతరం ఇల్లు కదలకపోబట్టే నేను మరింత చాకిరీకాళ్ళకింద..నలుగుతూ తరతరాలుగా నాకోసం నువ్వు గీసిన లక్ష్మణరేఖను కరోనా భయంతోనైనా మొదటిసారి నువ్వు అనుభవిస్తుంటే […]
మైల(కవిత) -జయశ్రీ మువ్వా మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది.. ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం .. చివరికి మూడు రోజుల ముట్టు నెత్తుటి పుట్టుకకి ఇప్పుడు బతుకంతా మడికట్టా?? సమాజమా…సిగ్గుపడు… !! అలవాటుపడ్డ ప్రాణలే సిగ్గుకి ముగ్గుకి తలొంచుకున్నాం ఇక చాలు ఓ ఆడతనమా మరీ ఇంత సహనమా తాతమ్మ ,బామ్మ అంటు అంటూ […]
ఆమె (కవిత) -గిరి ప్రసాద్ చెల మల్లు ఆమె ఒక ప్రశ్న జవాబు దొరకదు ఆమె ఒక పజిల్ అంచనాకు అందదు ఆమె వర్షిణి కురిపించే ప్రేమ కొలిచే పరికరం లేదు ఆమె సృష్టి బిడ్డ కోసం పంచే పాల నాణ్యత లాక్టో మీటర్ కి చేరదు ఆమె దుఖం కుటుంబ పాలన లో అడుగడుగునా రెప్పల మాటున గడ్డ గట్టి ఏకాంతంలో విష్పోటనం ఆమె ఆరోగ్యం జీవన శైలి ప్రతిబింబం ఆమె భద్రత ఆమె చుట్టూ […]
ఎందుకు(కవిత) -లక్ష్మీ దేవరాజ్ కంటికి కనిపించని జీవికంటి మీద కునుకు లేకుండా చేస్తుంటేమార్స్ వరకూ వెళ్ళిన మనిషిమౌనంగా మిగిలిపోయాడేం? ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బుఆరోగ్యాన్ని మాత్రం కొనలేదనిమరోసారి మరచిపోయాడేం? డైనోసార్లు….సరే ఎప్పటివోపులులు మాత్రం నిన్నమొన్నేగాకాలగర్భంలో కలిసిపోతుంటేఅంటీముట్టనట్టున్న మనిషిఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు? ప్రకృతి నేర్పే పాఠం కష్టమేఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే ఇకనుంచైనా బాహ్య శుభ్రంతో పాటుఅంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం అలాగే ప్రపంచంలో మనతోపాటు సంచరించేప్రతీజీవి ప్రాణంఖరీదుమనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి లక్ష్మీ దేవరాజ్పేరు: లక్షీ దేవరాజ్ వృత్తి: […]
మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత) ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్ తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్ నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది నువ్వది ఆలకించలేదు నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది నువ్వది వినలేదు నేలతల్లి అరిచి గగ్గోలు పెట్టింది నువు చెవిన పెట్టలేదు అప్పుడు నేను పుట్టాను… నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను మేల్కొల్పడానికే నేను పుట్టాను… సాయానికి రమ్మని నేలతల్లి విలపించింది… బీభత్సమైన వరదలు. నువు వినలేదు. మహారణ్య దహనాలు. నువు […]
ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే బాల్యానికి వెలుగురేఖను స్వేచ్ఛనెరుగని స్వాతంత్ర్యాన్ని కనుసైగలోని మర్మాన్ని భావం లేని భాద్యతను విలువ లేని శ్రమను ఆమెను నేను… కల్లోల సంద్రంలో కన్నీటి కడలిగా ఎన్ని కాలాలు మారిన నిలదొక్కుకోవాలనే అలుపెరుగని పోరాటం సమానత్వం […]
ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి రంగవల్లులు , కానీ ఇవి నీ కర్కశత్వంలో చెరిగి నలిగిన కళేబరాలు కావచ్చు ! ఆర్ద్రత చిమ్మే ఈ మల్లెలు పరిమళాల తెమ్మెరలు పరామర్శల పరవశాలు, కానీ ఇవి నీ కళింకిత బూటు కాళ్ల […]
ఎర్రకాలువ -తోట సుభాషిణి నా గదంతా రక్తంతో నిండిపోతుంది ఆ నాలుగు రాత్రుల యుద్ద సమయంలో అమావస్యనాడు వెన్నెల చూసావా నేను చూసాను చాలాసార్లు లోదుస్తులపై ఎర్రటి మరకలు మెరుస్తుంటే మా ఇంటిముందు మోరీ యుద్ధంలో సైనికుల మరణానికి ఆనవాలు చరిత్ర నల్లరక్తం …. ఎరుపు విరిగి సన్నని తీగరాగం అందుకుంటుంది అదే విప్లవగీతం స్నానాల గదిలో ఆ గేయం వర్ణనాతీతం నేను కమ్యూనిస్టుగా ముద్రవేయించుకుంటుంటా అడవికి ప్రేమికురాలునై ఋతు చక్రాన్ని మొలిపించుకునేందుకు అవునూ నాకు కొన్ని […]
ఓ నా బట్టా! ముట్టుకో! Day – 1 అదొక ఎర్రనదిఅదొక అరుణ గంగఅదొక రుధిర యమునఅదొక నెలసరి బ్రహ్మ ఇది ఓ తిట్టు ఆత్మ కధఉండచుట్టి చాటుగా దాపెట్టివిసిరేసిన ప్యాడ్ అనే బట్ట తిట్టు వ్యధ కోపాన్ని నొప్పినీఅసహనాన్నీ తిట్టుగా మోస్తున్న ఆత్మ కధ బడి పీరియడ్ లకీ బాడీ పీరియడ్లకూతేడా తెలియని అజ్ఞానాన్ని ఆమెకు ప్రసాదించిన మనమ్ కదా అంటరానివాళ్ళం.. పాపం ఆ పిచ్చి టిచర్నేమీ అనకండి ఆమెకూ ఆ మూడురోజులున్నాయిఆమెకూఅంటుముట్టుమైలలున్నాయిపీడకురాలి రూపంలోని పీడిత ఆమె Day -2 ఆ రక్తంలోనే పుట్టి దాంతోనే స్నానంచేసి అందులోనే ప్రవహించి బయటకొచ్చిన నీకు …మరకలేంట్రా నీకు ఒళ్ళంతా మరకేగా నీదేహం […]
నువ్వు లేని ఇల్లు -డా|| కె.గీత నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని రిక్కించుకుని ఉండే చెవులు కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా సాయంత్రం గూటికి చేరే వేళ నువ్వు కనబడని ప్రతి గదీ కాంతివిహీనమై పోయింది నువ్వు వినబడని ప్రతీ గోడా స్తబ్దమై వెలవెలబోయింది నీతో తాగని ఈవెనింగ్ కాఫీ ఖాళీ కప్పై సొరుగులో బోర్లా పడుకుంది […]
తపస్సు -వసుధారాణి ఒక తపస్సులా గమనించు తూనీగల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. కొండ యుగయుగాల కథలు చెపుతుంది. జలపాతం చిలిపితనం నేర్పిస్తుంది. నది ఆగిపోని జీవనగమనం చూపిస్తుంది. ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. ముని అవ్వటం అంటే ఇదేనేమో జనజీవనంలో నిలబడి కూడా. ఏమయినా సముద్రుడు నాకు బోలెడు కబుర్లు చెపుతాడు. నది వచ్చి నాలో చేరేటప్పుడు ఆ మంచినీరు నేనేమి చేసుకోనూ? వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాను. ఐనా నది సంగమించే తీరుతుంది. […]
ముగింపు లేని సమయం -దాసరాజు రామారావు ముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు దివా రాత్రాలు వెళ్లిపోయి,వయస్సు మళ్లిపోయి వికసించీ, వాడిపోయీ పూల వోలె. నువ్వు తెలుసుకోవాల్సింది ఎట్లా వేచివుండటం. నీ సంవత్సరాలు ఒకటొకటి అనుసరిస్తూ ఒక సంపూర్ణమైన చిన్ని అడవి మల్లె కోసం. మనకు సమయం లేదు కోల్పోవడానికి. మరియు సమయం కలిగి లేం మనం ఒక అవకాశం కోసం పాకులాడక తప్పదు మనం […]
ఇదీ నా కవిత్వం – వసుధారాణి నీపై ప్రేమ ఎలాగో ఈ కవిత్వమూ అంతేలా ఉంది . నా ప్రమేయం లేకుండా నాలో నిండిపోయి అక్షరాల్లో ఒలికిపోతోంది. కవి అంటే ఓ వాన చినుకు, ఓ మబ్బుతునక మండేసూర్యగోళం చల్లని శశికిరణం కన్నీటికెరటం ఉవ్వెత్తు ఉద్వేగం పేదవాడికోపం పిల్లలకేరింత కన్నతల్లి లాలిత్యం గడ్డిపూవు,గంగిగోవు ఒకటేమిటి కానిదేమిటి కవి అంటే విశ్వరూపం వేయిసూర్య ప్రభాతం. గుండెకింద చెమ్మ, కంటిలోన తడి ఇవి లేకుండా కవిత్వం […]
ద్వీపాంతం -శ్రీ సుధ ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి వెన్నెల లేని చంద్రుడు హృదయం లేని ఆకాశం వుంటాయని తెలియదు వాటికి విసిరి కొట్టిన రాత్రుళ్ళు వృక్షాలై వీచే ఈదరగాలుల్లో అలసి ఎప్పటికో నిదురపోతాయి తీరంలేని నేలలవ్వాలని ఆశపడతాయి రెండో మూడో ఝాములు దాటాక నిశ్శబ్దంగా నావలు వచ్చిచేరతాయా బహుశా యిక ఆ తరువాత దీపస్తంభాలకి ఆ […]
ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు. ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె ఒక మనిషని మరచిపోతుంటారు. కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
వ్యక్తి-శక్తి -డా||కె.గీత వ్యక్తిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే అంకురమవ్వడం నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం నిన్ను నువ్వే ప్రేమించుకోవడం ద్వేషించుకోవడం నీలోనువ్వే మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం నీకు నువ్వుగా మిగలడం వ్యక్తిగా ఉన్నంతసేపు నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం నీ అరచేతికందినంతమేర- నీ బాధల్ని నువ్వే తుడుచుకోవడం నీ బంధాల్ని నువ్వే పెంచుకోవడం నువ్వే తుంచుకోవడం *** సమిష్టిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే నీ […]
గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి గీత శ్రావణం ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]
నాన్నని పోగొట్టుకుని ! – రేణుక అయోల 1 . అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి – ప్రవాహంలో నాన్న జీవితం – పాదాలని కడుగుతూన్న గోదావరి అలలకి నా దుఃఖం వో చినుకు నది మెట్ల మీదనుంచి అడుగులు వెన క్కివేయడం ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో అగ్నిని బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది నిన్నటి వరకు నీది నాది ఒక పేగు బంధం ఇప్పుడది ఎముకలు […]
కాళీ పదములు -పాలపర్తి ఇంద్రాణి 1. ధూళి ధూసరితమైన భూమి పైన్నుంచి లేచి హంసలా మబ్బులలో ఎగురుతున్నాను సాటి రాయంచల హొయలు చూచి మైమరచానో మోహించానో ఆ వేల అడుగుల ఎత్తునుంచి జారి పడబోయాను అమ్మా,అమ్మా, అమ్మా,అమ్మా! అద్భుతమాశ్చర్యమానందం! మూడు హస్తాలు నిలువరించాయి నన్ను నువ్వు పంపిన పరమ గురువులు ముగ్గురు పక్షి పాదాల వారు కాంతి కమండలాల వారు గాలి బిరడాల వారు […]
దేహమంటే మనిషి కాదా – కొండేపూడి నిర్మల దేశమ౦తా మనది కాకపోవచ్చు దేహమయినా మనది కాకుండా ఎలా వుంటుంది ? దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు కానీ నిన్నటి దాకా చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి నుంచి దేహాన్ని విడదీసి మంట పెట్టడం ఏమి న్యాయం..? కాలధర్మం […]