నెత్తురివ్వు ఊపిరవ్వు(కవిత)-విజయ “అరళి”

నెత్తురివ్వు ఊపిరవ్వు -విజయ “అరళి” కాయపు కుండలో తొణికిసలాడే జీవజలం నెత్తురు!! కటిక నలుపు, స్పటిక తెలుపు పసిమి రంగు మిసిమి ఛాయల తోలు తిత్తులన్నింటిలో ఎరుపు రంగు నెత్తురు!! కులం లేదు మతం లేదు జాతి భేదమసలే లేదు రాజు లేదు పేద లేదు బతికించేదొకటే నెత్తురు!! నువ్వెంత, నేనింత వాడెంత, వీడెంత హెచ్చుతగ్గుల ఎచ్చుల్లో ఉరుకులాడే నెత్తురు!! అన్యాయం, అక్రమాలు పగలు, ప్రతీకారాలు తెగనరికే తన్నులాటల తెగ పారే నెత్తురు!! ఉరుకు పరుగు జీవితాల […]

Continue Reading
Posted On :

పల్లె ముఖ చిత్రం (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

పల్లె ముఖచిత్రం  (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ కష్ట సుఖాల కలబోతలు శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు […]

Continue Reading
Posted On :
subashini prathipati

నానీలు (కవిత)

నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!! **** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి యుద్ధమేఘం కింద అనాధ పసిబాలలు విచ్చుకోలేని గిడసబారిన మొగ్గలు! శాంతిపావురం కోసం ఆశగా వారు ఆకాశానికి అతికించిన చూపుల పూరేకులు అలసిపోయి నేలరాలిపోతున్నాయి ఆర్తనాదాల్ని కంఠంలోనే బంధించి డేగరెక్కలు విసురుతోన్న భయ వీచికల్ని కప్పుకొని కలుగుల్లో ఎలకలై బిక్కచచ్చిపోతూ పసితనపు ఆహ్లాదాన్ని యుద్ధంముళ్ళకంపపై ఆరేసుకొని చీలికలువాలికలు అయిపోతోన్న బాల్యాన్ని తన గర్భంలో దాచుకొనేందుకు యుద్ధభూమే మాతృమూర్తి అయిపోతుందేమో! అక్షరాలు దిద్దాల్సిన వయసులో అమ్ములపొది లౌతున్నారు […]

Continue Reading
Posted On :

అద్దానికి ఏమి తెలుసు? (కవిత)

అద్దానికి ఏమి తెలుసు? -చందలూరి నారాయణరావు నీవు అంటే ఏమిటో అద్దానికి ఏమి తెలుసు? దగ్గరగా ఉంటూ అందాన్ని మాత్రమే మాట్లాడుతుంది. నిన్ను దాచుకున్న మనసును అడిగి చూసేవా? ఎంత దూరంగా ఉన్నా ప్రేమే ఊపిరిగా జీవిస్తూనే ఉంటుంది. **** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి  

Continue Reading
Posted On :

లోచన …!! (కవిత)

లోచన …!! -రామ్ పెరుమాండ్ల కాలం పరిచే దారుల్లో వేసిన అడుగుల జాడలు భాష్పిభవిస్తున్నాయి.ఎడారిలో విరిసిన వెన్నెలలుచీకట్లను పులుముకున్నాయి.ఉష్ణపు దాడుల్లో దహనమైనఆశల అడవులన్నీచిగురించే మేఘాల కోసం తపిస్తున్నాయి . ఎక్కడో ఓ ఖాళీకడుపు అర్థనాధం చేస్తుంటే చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి. జీవితం కూడా కాలపు వల కింద దాచిన గింజలకు ఎపుడో దరఖాస్తు చేసుకుంటది.మరిప్పుడు మరణవార్తమరణమంత మాట కాదు. నీకు గుర్తుండదు భీకరవర్షంలో తడిసి వణికినకుక్కపిల్లను తరిమేశావో,నీ మనసు వెంటిలేటర్లో కట్టిన పిచ్చుక గూడును విసిరేశావో ,ఏ పసివాని చిరునవ్వును కర్కశంగా నిలిపివేశావో గానీ నేడు మరణవార్త బోసిపోయింది. ఏదో ఒక […]

Continue Reading
Posted On :

అవనీమాతకు అక్షరమాల (కవిత)

అవనీమాతకు అక్షరమాల – ముప్పలనేని ఉదయలక్ష్మి కనుచూపు అందినంతమేర పచ్చని పైరునేల ఎదురుగాఉన్న నా  మనసులో భావపరంపర ఆనందించే అద్భుత ఆకాశంలా జీవితకాలం హత్తుకున్న నాన్నప్రేమలా ఆలంబనై నిలబెట్టిన వెన్నెముకలా అమ్మ మమకారానికి ప్రతిరూపం ఈభూమి ! కన్నపేగు దీవెనకు అస్థిత్వమయి ఆర్ధిక ఉన్నతికి సోపానమై ఈశ్వరుని దయకు ఇచ్ఛాస్వరూపిణివై ఊపిరికి ఎదురీదే ఏటికి తీరంచూపి ఓర్పు విలువకు ఉదాహరణను చేశావు ఓపలేని బరువును  మోస్తూ గమ్యంకేసి నడిపావు చల్లని మనసుతో   చలివేంద్రమయ్యావు -2- తల్లిలా […]

Continue Reading
Posted On :

జీవితం ఒక పుస్తకమైతే (కవిత)

 జీవితం ఒక పుస్తకమైతే – డా . సి. భవానీదేవి జీవితం ఒక పుస్తకమైతే జరగబోయేవి ఇప్పుడే చదివేసేదాన్ని ఏది నన్ను చేరుకుంటుందో మనసు దేనిని కోల్పోతుందో కొన్ని  స్వప్నాలనైనా  ఎప్పుడు నిజం చేసుకుంటానో గాయాల చెట్టునయి ఎప్పుడు కూలిపోతానో జీవితం ఒక పుస్తకమైతే ….. చదువుతుంటే తెలిసిపోయేది! ఏడిపించిన జ్ఞాపకాలను చింపేసేదాన్ని మురిపించిన అనుభవాలను దాచుకునేదాన్ని మధురమైన సందర్భాలకు మరిన్ని పేజీలను చేర్చుకునేదాన్ని చివరి పేజీ చదివేటప్పటికి గెలుపు ఓటముల లెక్క అర్ధమయ్యేది ముళ్ళకంపలమధ్య మల్లెపూల […]

Continue Reading
Posted On :

గోడంత అద్దంబు గుండెలకు వెలుగు (కొండేపూడి నిర్మల కవిత)

https://youtu.be/PcmdB2_3KBM “గోడంత అద్దంబు గుండెలకు వెలుగు”  -కొండేపూడి నిర్మల అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా? ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦ అదేపనిగానో , అప్పుడప్పుడో అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ వంద మయసభలు కట్టుకోవచ్చు అద్దంతో నా […]

Continue Reading
Posted On :

గతి తప్పిన కాలం (కవిత)

గతి తప్పిన కాలం -కూకట్ల తిరుపతి ఇవ్వాల్టి మనిషంటే? అట్టి ముచ్చట గాదు అతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదు బొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొని రామసక్కని పుట్క పుట్టిండాయే సుద్దపూసల సుద్దులోడు గ్యారడీ విద్దెల గమ్మతోడు పాణసరంగ కొట్లాడి లొంగదీసుకొన్నడో మచ్చికతోటి మరిగించుకొన్నడో కానీ పసుపచ్చుల పంచెపాణాలను దొర్కవట్టుకొని మెస్లకుంట అదుపాగ్గెల వెట్టుకొన్నడు ఉత్తగ సూత్తిమనంగనే రెక్కలు కట్టుకొని విమానమైతడు బొత్తిగ మెరుపు తీగోలె రాకెట్టై రయ్యన దూసుకుపోతడు నింగి అంచున నివాసం కడలి కడుపున […]

Continue Reading
Posted On :

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు)

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు) -కర్ణ రాజేశ్వర రాజు రంభలా మేకప్ చేసి వదులుతారు నే రంభను కాను టీ కప్పు అందించమంటారు టీ బాయ్ ను కాను ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు  నే గంగిరెద్దును కాదు తల పైకెత్తి కనులతో కనులు కలిసి చూడమంటారు నే మెజీషియన్ను కాను అక్కరకు రాని లక్ష ప్రశ్నలు సందించుతారు కోర్టులోనే ముద్దాయిని కాను ఎందుకీ యుద్ధభూమిలో నిస్సహాయురాలైన నన్ను క్షతగాత్రిని చేస్తారు నాకూ మనసూ మానవత్వం ఉంది […]

Continue Reading
Posted On :

నా పల్లె లోకం లో … (కవిత)

నా పల్లె లోకం లో … – గవిడి శ్రీనివాస్ వేలాడే  ఇరుకు గదుల నుంచీరెపరెపలాడే  చల్లని గాలిలోకిఈ ప్రయాణం ఉరికింది .ఔరా |ఈ వేసవి తోటల చూపులుఊపిరి వాకిలిని శుభ్ర పరుస్తున్నాయి . కాలం రెప్పల కిలకిలల్లోఎంచక్కా  పల్లె మారింది. నిశ్శబ్ద మౌన ప్రపంచం లోరూపు రేఖలు కొత్త చిగురులు  తొడిగాయి . పండిన పంటలుదారెంట పలకరిస్తున్నాయి . జొన్న కంకులు ఎత్తుతూ కొందరుఆవులకు  గడ్డిపెడుతూ కొందరుమామిడి తోట కాస్తూ కొందరుఇక్కడ చిరు నవ్వుల తోటను చూసాను . […]

Continue Reading
Posted On :

“సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డా॥కొండపల్లి నీహారిణి కోసుకొస్తున్న చీకట్లు మోసుకొస్తున్న ఇక్కట్లు మెలికల నాలుకకు మొలకలు బుట్టిస్తూ అబద్ధాలే అల్లుకుపోతున్న నేలమీద కళ్ళూ, కాళ్ళూ ఆన్చిన బతుకయ్యి శిక్షాస్మృతి పుటలలో మనం అక్షరాలమైపోయినం. సమయనియమాలు లేని ప్రయాణాలను గమ్యం చేర్చే పనిలో కాలాన్ని అధీనం లోకి తెచ్చామనుకునే అపరాధులం. సత్యాసత్యాల జగత్తు కల్తీలో జీవితాల్ని బింబమానం చేస్తుంటే కారణాలను చూడక ప్రతిఫలనాలనే చూసే ఆక్రమిత జీవులం చల్లగాలికీ పిల్ల […]

Continue Reading
Posted On :

చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ కనిపించవు ఎటు చూసినా మనుషులే ! అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య జరుగుతున్నది గ్రామాలక్లోనింగ్ ! ఒంటరి భూతం కోరలకి పట్టణాలే కాదు పల్లెలూ బలి ఇక్కడ తలుపుల్నీ టీవీ యాంటీనాలు మూసేసాయి మానవ సంబంధాలు […]

Continue Reading
Posted On :

చేతులు చాస్తేచాలు!

 చేతులు చాస్తేచాలు!  – కందుకూరి శ్రీరాములు సూర్యుడు ఒక దినచర్య ఎంత ఓపిక ! ఎంతప్రేమ ! భూమిపాపాయిని ఆడించేందుకు లాలించేందుకు నవ్వులవెలుగులు నింపటానికి పొద్దున్నే బయల్దేరుతాడు భానుడు తల్లిలా – ఆత్మీయత ఒక వస్తువు కాదు ఒక పదార్థం అంతకంటే కాదు లోలోన రగిలే ధగధగ- వేల వేలకిరణాలతో నేలను  ఒళ్లోకి తీసుకొని నేలను ఆడించి పాడించి లాలించి బుజ్జగించి ముద్దాడి తినిపించి నిద్రపుచ్చి కూలికి వెళ్లిన తల్లిలా మళ్లీవస్తా అంటూ వెళ్లిపోతుంది పొద్దు! అరచేయి […]

Continue Reading
Posted On :

వెలుతురు పండుటాకు

వెలుతురు పండుటాకు  -నారాయణస్వామి వెంకటయోగి ఎక్కడినుండో, ఎడతెరపిలేకుండా దుఃఖధారలు కురుస్తున్నాయి కాలమెన్నడూ  మాన్పలేని   గాయాలపై   శతాబ్దాల తర్వాత  సుడిగాలుల్లా వీస్తున్న పలకరింపుల్లో దుమ్ము కొట్టుకుపోతోంది మసకబారిన జ్ఞాపకాల మీదినుంచి  గతంపొరల్లో దాగిన శిలాజాల కన్నీటి చారికలనీ , గాజుపెంకుల నెత్తుటి మరకలనీతడుముకోవాలి,  అరచేతులతో మునివేళ్లతో గీరుకుపోయేదాకా, కొత్త గాయాలై మళ్ళీ మళ్ళీ  గుచ్చుకుపోయేదాకా  ఎవరికి  ఏమి తెలుసని    మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎవరు వింటారనీ  ఎవరికేమి కొత్తగా  అర్థమవుతుందనీ  రాళ్లకు మళ్ళీ మళ్ళీ తలలు మోదు కోవడం  ఎవరిని అడగొచ్చిప్పుడు ఏది ఎందుకు జరగలేదో ఎవరికి వివరించగలమిప్పుడు ఏది ఎందుకు ఎన్నటికీ అర్థం కాదో    మౌనహననాలైన జ్ఞాపకాలు ఇప్పుడు కొత్తగా […]

Continue Reading
Posted On :
k.rupa

“మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రూపరుక్మిణి.కె వొళ్ళంతా బాలింత వాసనలు మాసిన జుట్టు,  ముతక బట్ట అర అరగా ఆరబోసిన ఆడతనం తానమాడి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ.. నొసటితో వెక్కిరిస్తూ.. పుట్టిన బిడ్డకి బారసాల చేస్తున్నం కదా!! రక్తాన్ని అమృతంగా పంచేటి పాలిండ్ల బరువుల సలపరింతలనెరుగుదువా..!! పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురి చూపు తగిలిందంటే ఎట్లా!! బొడ్డు తాడు తెంపుకున్న పేగు సాగివేళ్ళాడే పొట్టకు నడికట్టు […]

Continue Reading
Posted On :

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నాకు…. ఒక్కసారైనా….. పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని కనుపాపల్లో నింపుకోవాలి! తుషార బిందు పరిశ్వంగానికి  మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ కనురెప్పలపై భారంగా ఒరగాలి! ఎగిరిపోతున్న సాయంత్రం పిట్టల్ని కాఫీ కప్పులోకి ఆహ్వానించి వెలుగు కబుర్లు చెప్పాలి! రాత్రి చెట్టుపై నక్షత్రమై వాలి ఇష్టమైన అక్షరాలను కౌగలించుకోవాలి! పారేసుకున్న కలలనెమలీకల్ని రెక్కలుగా చేసుకొని ఏకాంతంలోకి ఎగిరెళ్ళాలి! […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి అల్లకల్లోలమౌతున్న సాగరాల్లో మానవ వినాశనానికి జరిగే ప్రయత్నాలూ వెన్న చిలికినట్లు నీటిబిందువుల్ని పగలగొట్టే ప్రయత్నాలూ ఆవిష్కరణలు జరిగేది మొట్టమొదట ప్రశాంత సముద్రగర్భంలోనే! జలచర జీవనాన్ని విధ్వంసం చేస్తూ నీటి అడుగున విచ్చుకుంటున్న బడబానలం ఎక్కడ మొదలైందో తెలుసుకోలేక తనని తానే చుట్టుకొంటున్న సుడిగుండాల్ని నియంత్రించుకోలేని సంచలన సందర్భాల్ని సముద్రగర్భ ఆయుధ ప్రయోగాల్ని ఉధృతమౌతున్న ప్రకంపనాల్ని ఎగసిపడుతూ అశాంతి ప్రతిబింబిస్తున్న తరంగాల్ని జలాంతర్భాగాన జీవరాసుల్ని అతలాకుతలం […]

Continue Reading
Posted On :

ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల మబ్బు చాటు నుంచే సూరీడు రాత్రి జరిగిన ఘటనను పరిశీలిస్తున్నాడు అవును! నిన్న రాత్రి మళ్ళీ యిక్కడో  ” కాకరాపల్లి” కనిపించింది ! ఉదయాన్నే పోలీసుల బూట్ల  చప్పుడుతో ఊరు నిద్ర లేచింది! బాధితులకండగా ఊరూరా…… ర్యాలీలు,….. సమావేశాలు కవుల కలాలు కత్తులు దూసాయి నేను మాత్రం అక్కడి నుంచీ  కదిలాను ! జాబిలి జోల పాడుతున్న  వేళ ఊరంతా […]

Continue Reading
Posted On :

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -కూకట్ల తిరుపతి ఇప్పటికీ… ఊర్లల్లా! మంచికీ చెడ్డకూ దొడ్లెకు గొడ్డచ్చిన యాళ్ల ఇంట్ల కొత్త కోడలడుగు వెట్టిన యాళ్లంటరు ఓ అంకవ్వా! నువ్వయితే… మా నాయన కనకయ్య యేలు వట్టుకొని అమృత ఘడియల్లనే ఇంట అడుగువెట్టుంటవు గందుకేనేమో! మా లేకిడి అయ్యకు ఇగ ముట్టిందల్లా ముచ్చమయ్యింది పట్టిందల్లా పగుడమయ్యింది తొక్కుడు బండంత నీ ఓపికకు మొక్కాలె పందికొక్కుల్లాంటి పెత్తందార్ల పంటికింద రాయిలా ఊళ్లె అన్నాలాలకు అడ్డువడుకుంట ఉగ్గుర నరసిమ్ముడయిన […]

Continue Reading
Posted On :
rama rathnamala

పల్లె ముఖచిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

పల్లె ముఖ చిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ కష్ట సుఖాల కలబోతలు శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు మదిని […]

Continue Reading
Posted On :
sailaja kalluri

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డాక్టర్. కాళ్ళకూరి శైలజ ఉపగ్రహం కన్నుకు దొరకని ఉపద్రవం మాటు వేసింది. ఊపిరాడనీయని మృత్యువు వింత వాహనం ఎక్కి విహార యాత్రకు వచ్చింది. బ్రతుకు మీద ఆశ నాలుగ్గోడల మధ్య బందీ అయింది.  ప్రియమైన వారి శ్వాస ఆడేందుకు పరుగులు తీసి  అలిసిన గుండెలు, కూర్చున్న చోటే కలత నిద్దర్లోకి జారి మందుల పేర్లు పలవరిస్తూ ఉలిక్కిపడి లేస్తున్నాయి.  ప్రాణం కోసం ఇంటి పునాదులుకుదువ పెట్టినప్పుడు, కళ్ళలో దైన్యం కరెన్సీ నోట్లను   తడిపేస్తుందిమరణం నల్లని […]

Continue Reading
Posted On :

“కేశోపనిషత్ “

 “కేశోపనిషత్ “ – మందరపు హైమవతి పచ్చకాగితాల కట్ట చూచినా పసిడి కణికలు కంటబడినా చలించదు నా హృదయం అరచేతి వెడల్పున్న పొడుగు జడల అమ్మాయిల్ని చూస్తే చాలు మనసులో ఈతముల్లు గుచ్చుకొన్న నరకయాతన దువ్వెన పెట్టినా పెట్టకున్నా ప్రతిరోజూ నేల రాలుతున్న కేశరాజాలను చూసి దిగులు మేఘాలు కమ్మిన కన్నీటి ఆకాశం నా మానసం ఏదైనా జబ్బు చేస్తే శిరోజపతనం సహజం ఏజబ్బు లేకున్నాతల దువ్వుకొన్నప్పుడల్లా ఊడిపోతున్నకురులన్నీ కూడబలుక్కుని జీవితం క్షణభంగురమన్నపాఠాన్ని చెంప మీద చెళ్ళున […]

Continue Reading
Posted On :

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను ఇంకా కొను ఇంకా ఇంకా ఇంకా కొను సరుకులు బరువైన కొద్దీ మనసు తేలికవుతుంది ఇప్పుడు మనం మార్కెట్ లేకపోతే మనుషులం కాదు కొనుగోలు శక్తి ముందు ఏ బలమైనా బలాదూరవుతుంది **** ఇప్పుడు […]

Continue Reading
Posted On :

ముందస్తు భయం( కవిత)

ముందస్తు భయం( కవిత) -సాహితి ప్రపంచానికి జ్వరమొచ్చింది. ఏ ముందుకు చావని వింత లక్షణం వణికిస్తోంది. హద్దులు లేకుండా స్వచ్ఛగా పరిసారాన్ని సోకి ప్రాణం తీసే ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి చావు భయంపట్టుకుంది. జీవితంలో తొలిసారిగా బతుకు భయాన్ని తెలియచేస్తూ వీధులు తలుపులు మూసి మూతికి చిక్కాన్ని తొడుక్కుమని జీవితాలకి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటే ఇళ్లు సంకెళ్లుగా మారి బంధాలన్ని ఏకాంత ద్వీపాలుగా మార్చి భద్రత బోధిస్తున్నాయి. ఏ వైపు నుంచి గాలి […]

Continue Reading
Posted On :

నిర్గమించిన కలలు (కవిత)

నిర్గమించిన కలలు (కవిత) -సుజాత.పి.వి.ఎల్ నిరీక్షణలో నిర్గమించి..కలలు మరచికలత నిదురలోకలవరపడుతున్న కనులు బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..ముళ్ళతో ముడిపడిన నా జీవితం..ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?సంతోషాలన్నీనీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..పెదవులపై చిరుదరహాస దివిటీని వెలిగిచడం ఎలా!?నా కళ్ళలో కన్నీటి చారికలు కనిపించకూడదన్నావు..నువ్వే కనిపించనంత దూరాన దాగున్నావు..నీవు లేని భూతలంనాకు శూన్యాకాశమని మరిచావు..అందుకే..నిన్ను చేరలేని దూరాన్ని తుడిచేస్తూకళ్ళమాటు దాగిన జ్ఞాపకాల ఆణిముత్యాల తలపులనుఆఖరిసారిగా తిరగేస్తున్నాయి అరమోడ్పు కనులు..! ***** పేరు సుజాత.పి.వి.ఎల్. వృత్తి హిందీ టీచర్. సికిందరాబాద్ లో నివాసం. కవితలు, […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి దేశాలన్నిటినీ పెంపుడు జంతువుల్ని చేసి యింటిచుట్టూ కాపలాగా పెట్టుకొని తిరుగులేని నియంతృత్వ భావనతో ఆదమరచి నిశ్చింతగా పెంపుడు జంతువులకు గారడీ ఆటలు నేర్పి కాలాన్ని కొనగోట నిలిపి దానిమీద భూగోళాన్ని బొంగరంగా తిప్పాలని అహంకిరీటం ధరించి రింగుమాష్టరువి కావటమే కాక జగన్నాటక సూత్రధారుడివి అనుకున్నావు నియంతవి కావటానికై క్షుద్రబుద్ధితో నువ్వు నేర్పిన విద్య లక్ష్యం తప్పి నీ పైనే ప్రయోగింపబడేసరికి మకుటం జారేసరికి తల్లడిల్లి […]

Continue Reading
Posted On :

షార్ట్ ఫిలిం (కవిత)

షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం రాసుకుంటారో తెలియనికాలమిది. బిడ్డా.! జీవితం సీరియల్ కాదురా..!ఇప్పుడో షార్ట్ ఫిలిం. ***** కె.ముని శేఖర్ కవి, రచయిత. నివాసం గద్వాల్ జిల్లా నారాయణపురం.

Continue Reading
Posted On :
sudhamurali

కుమ్మరి పురుగు (కవిత)

కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు తప్ప ఏ అచేతనత్వపు నీడలూ కానరావునిశిని ఎరుగని చీకటి వెలుగులు తప్పఏ ఏ మౌనభాష్యాల వెక్కిరింతలూ పలకరించవునివురుగప్పిన నిశ్శబ్దపు స్పర్శ తప్పఏ ఏ ఏ కార్యాకారణ సచేతన ఫలితాలూ ప్రకటించబడవుధైర్యపు దూరత్వ భారత్వం తప్ప అందుకే….పరపరాగ సంపర్కంనాలోనుంచినా……లోలోనికి….. […]

Continue Reading
Posted On :

నివారణే ముద్దు ( కవిత)

నివారణే ముద్దు( కవిత) -జినుకల వెంకటేష్ కాంతిని కమ్మినకరిమబ్బు లాగకరోనా క్రిమిదేహాల్లో దాగివున్నది క్షణ క్షణంకరోనా కలవరంతొడిమతో సహా తుంచేస్తుందిమనోధైర్య కుసుమాన్ని పిరికితనంతోవాడిపోవడమెందుకు రాలిపోవడమెందుకుటీకా వసంతమై వచ్చిందిగాచిగురించాలి మెండుగాపుష్పించాలి నిండుగానివాళుల దాకా వద్దునివారణే ముద్దు ***** జినుకల వెంకటేష్ కవి, రచయిత. నివాసం కరీంనగర్.

Continue Reading
Posted On :

కాసింత ఉపశమనం (కవిత)

కాసింత ఉపశమనం (కవిత) -గవిడి శ్రీనివాస్ అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే  రెప్పలు  వాల్చి నవ్వులు  పూసిన  తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా లేచి పరిమళం లోకి  జారుకుంటాయి . గాలి రువ్విన బతుకుల్లో చీకటి దీపాలు వొణుకుతుంటాయి . ఏదీ అర్ధం కాదు బతుకు రెక్కల మీద భ్రమణాలు జరుగుతుంటాయి . నేటి దృశ్యం రేపటి ఓ […]

Continue Reading
Posted On :

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -షేక్ మహమ్మద్ షఫీ కష్టపడేతత్వంకనుమరుగు !ఉచితాల కోసంజనం పరుగు!! ***** నా పేరు షేక్ మహమ్మద్ షఫీ. నేను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో Health educator(ఆరోగ్యబోధకుడు) గా పనిచేస్తున్నాను. మాది అనంతపురం. కవితలు రాయడం నా హాబీ.  నా కవితలు కొన్ని వివిధ ఫేస్బుక్ గ్రూపులలో విజేతలుగా నిలిచాయి.

Continue Reading
Posted On :

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -వాడపర్తి వెంకటరమణ న్యాయానికి నిలువెల్లా సంకెళ్ళు వేసి అన్యాయం తురగమెక్కి వికటాట్టహాసంతో విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నప్పుడు ధర్మాన్ని ధైర్యంగా గోతిలో పూడ్చేసి అధర్మం అవినీతి చెంతన ధ్వజస్తంభమై దర్జాగా నిలుచున్నప్పుడు మంచితనాన్ని అథఃపాతాళానికి తొక్కేసి చెడుగాలి జడలువిప్పి రివ్వుమంటూ ఉన్మాదంతో విరుచుకుపడుతున్నప్పుడు నువ్వు ఎక్కుపెట్టి వదిలిన ప్రశ్నల శరాలు అన్యాయ అధర్మ చెడుగాలుల గుండెల్లోకి జ్వలించే నిప్పు కణికలై దూసుకుపోవాలి! ***** […]

Continue Reading
Posted On :

కవిత్వం ఎలా ఉండాలి? (కవిత)

కవిత్వం ఎలా ఉండాలి? -చెళ్లపిళ్ల శ్యామల కవిత్వానికి చేతులు ఉండాలిపక పక నవ్వే పాల బుగ్గలనిఎంగిలి చేసిన  కందిరీగలనితరిమి కొట్టే చేతులుండాలి కిలకిల నవ్వుల పువ్వులనికాలరాసే కాల నాగులనిఎదురించే చేతులుండాలి తలరాతని  తల్లకిందులు  చేసేతోడేళ్లని  మట్టుబెట్టే చేతులుండాలి ఆపదలో  అండగా నిలిచిఅన్యాయాన్ని   ధైర్యంగా ఎదురించేచేవగల చేతులు ఉండాలి కవిత్వానికి  కాళ్ళు ఉండాలికన్నీటి కథలని  కనుక్కుంటూమట్టి బతుకులని తెలుసుకుంటూగూడేల  వెతలని  వెతుక్కుంటూ… కాళ్ళుమైదానం నుంచి మట్టిలోకిమట్టి  లోంచి అరణ్యంలోకినడుచుకు పోవాలి కవిత్వానికి చూపు ఉండాలివాస్తవాలను వెతికి పట్టుకో గలనేర్పు […]

Continue Reading
Posted On :

సృష్టికి మూలం గమనం! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

 సృష్టికి మూలం గమనం! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -రాయపురెడ్డి సత్యనారాయణ జనన మరణాల నడుమ సాగే ఈ ‘జీవన ప్రస్థానం’లో……గమ్యాన్ని చేరేందుకు నిత్యం నువు వేసే ప్రతి అడుగూ, తీసే పరుగూ ఓ ‘గమన’మే కదా!’అమ్మ’ ప్రేగును త్రెంచుకొని అమాంతం భూమమ్మీద పడాలని….’పసిగృడ్డు’ చేసే పోరాటంలో ‘గమనం’ కనలేదా?’మట్టి’ని చీల్చుకొని మొలకెత్తాలని ‘విత్తు’ పడే ఆరాటంలో ‘గమనం’ కనరాదా?చీకటి గుండెల్ని చీల్చుకొని పొడిచే వేకువ పొద్దులో ‘గమనం’!గాలి అలలపై […]

Continue Reading
Posted On :

స్నేహహస్తం (కవిత)

 స్నేహహస్తం -డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం ఎన్నుకున్నావో ? ఎదురొచ్చానో! శూన్యం నిండిన నా ఎదలోనికి సంపెంగల తావివై తరలివచ్చావు స్నేహ సుగంధమై పరిమళించావు. మమత కరువై బీటలు వారిన నా మనసుపై ప్రేమ జల్లువై కురిసావు ముద్ద ముద్దలో మమకారం రంగరించి మధువు తాపి మాలిమి చేసుకున్నావు ఆకాంక్షల కౌగిలివై కమ్ముకున్నావు వ్యామోహపు మత్తువై హత్తుకున్నావు నీ ఆలింగనంలో మైమరచిన నన్ను నిస్సంకోచంగా నెట్టివేసావెందుకు? నీవు నేను మమేకమనుకున్నా నా గుండె ఆలాపన వింటున్నావనుకున్నా నీ నీడ […]

Continue Reading
Posted On :

వ్యసనం (కవిత)

వ్యసనం -డా.కాళ్ళకూరి శైలజ గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుందిస్వేదం తో  దేహం తడిసిపోతుంది.ఎండిన గొంతు పెదవులను తడుముకుంటేశక్తి చాలని కండరాలువిరామం కావాలని మొర పెట్టుకుంటాయి.ఆగావా? వెనుకబాటు,కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలుఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు? బతుకు జూదంలో అనుబంధాలను పందెం కాసిజవాబు దొరకని ప్రశ్నలు పావులుగా,పేరుకున్న నిశ్శబ్దాన్ని గడ్డపారతో ఎత్తిపోస్తూస్వీయచిత్రం కోసం చిరునవ్వు అతికించుకుని తుడిచేసుకునే క్షణాలు ఆక్రమించిన బ్రతుకు.ఎందుకీ పోటీ? ఎందాకా ఈ పరుగు? పిండి కొద్దీ రొట్టె లా పెట్టుబడి కొద్దీ వ్యాపారంతలపులు […]

Continue Reading
Posted On :

మొగ్గలు వికసించే చోటు (కవిత)

మొగ్గలు వికసించే చోటు -డి. నాగజ్యోతిశేఖర్ ఆ చోటు అనగానే వేల వర్ణాలు కలలై నన్నల్లుకుంటాయి!ఆ చోటు రాగానే వెన్నెలతీగలు వరమాలలైచుట్టుకుంటాయి! నిన్నేగా భారపు హృదయాన్నిక్కడ పాతిపెట్టాను…నిన్నేగా కన్నీటి లోయొకటితవ్వాను!ఏవీ ఆ ఆనవాళ్లు…. పూల ఋతువేదో నా వేదనల్ని అపహరించింది!వెన్నెల దీపమేదోనా నవ్వులను వెలిగించింది! గాయాలను మాన్పే అగరు పూల పరిమళమేదోఈ స్థలిలో దాగుంది!గేయాలను కూర్చేసాంత్వనవేణువేదోఈ చోటులో మాటేస్తుంది! అందుకే ఆ నిశ్శబ్ద జాగాలో  నన్ను కుప్పగాపోసుకొని….తప్పిపోయిన తలపుల్ని వెతుక్కుంటాను!నన్ను నేను తవ్వుకుంటుంటాను! కలత రేయి తెల్లవారేలోగా….నా శిరస్సు శిశిరం వీడినవనశిఖరమై మెరుస్తుంటుంది!గుండె కవితై విరుస్తుంటుంది! ఆ “అక్షరమొగ్గలు”వికశించే చోటు….మీకూ తరచూ దర్శనమిస్తుంది కదూ….అపుడు నాకూ మీ ఇంటి […]

Continue Reading
Posted On :
పి.సుష్మ

అస్థిత్వపు ఆనవాళ్ళు (కవిత)

అస్థిత్వపు ఆనవాళ్ళు -పి.సుష్మ మీరంతా వేరువేరుగా విడిపోయిండొచ్చు  ఆమె ఎప్పటిలాగే ఒక్కటిగానే ఉంది ఒంటరిగానే, ఓడుతూనే  ఉంది సమానత్వపు,అస్తిత్వపు పొరల్లో అరచేయి పిడికిలి అర్ధభాగం తేలి వర్ధిల్లాలంటూ అసలు కారణాలు పక్కకు పెట్టి నాగరికతకు నడుమ్మీద అనాగరికపు కొలతలు కొలవకు ఆకాశం, అవనిలా రూపురేఖలు మారుతున్నా అరచేయి రేఖల్లో కూడా కొత్తదనం లేని ఆమె జీవితంలో సగభాగాల వాటాలంటూ మోసం చేసిందెవరు  నాలుగు గోడల మధ్యనైతేనేమి, నాలుగు దిక్కులు నడుమనైతేనేమి అడుగడుగున గీత గీసి, ఆమె  స్వేచ్ఛను […]

Continue Reading
Posted On :

సన్నద్ధమవండి (కవిత)

సన్నద్ధమవండి -పద్మావతి రాంభక్త ఋుతుచక్రపు నడకకుఒక దుర్మార్గపుక్రీడముళ్ళకంచై అడ్డం పడుతోందిలోపలెక్కడోరహస్యంగా పూసిననెత్తుటిపువ్వును పసిగట్టిమతపుగద్దఅమానుషంగా పొడుచుకు తింటోందిజరిగిన ఘాతుకానికితలెత్తలేనంత అవమానంతోవిరిసీ విరియని మొగ్గలముఖాలుభూమిలోకి కుంగిపోయాయిసిగ్గుతో చితికిపోయికళ్ళ నిండా పొంగుతున్న సముద్రాలనుబలవంతంగా అదిమిపెట్టుకున్నాయిమెలిపెట్టే నెప్పి కన్నాఈ దుఃఖం వాటినిమరింత పగలగొడుతోందిఆమెలంటేఈ లోకానికిఎందుకంత చులకనకొన్ని ప్రాణాలకు ఊపిరిపోయడానికే కదాఆమె నెలనెలా ఎర్రనివరదైప్రవహిస్తోందిధరిత్రిలా తొమ్మిదినెలలూకొండంత భారాన్ని మోసిపేగులు తెంపుకునిశ్వాసను పణంగా పెట్టిఆకాశాన్ని ఆనందంగా ఎత్తుకుంటోందిఈ వికృతచర్యను దేశంకథలుకథలుగా చెప్పుకుంటోందిసహజాతిసహజంగాప్రతీ ఇంట్లో పారే రక్తనదిలోంచేకదా నువ్వూ నేనూఈ ప్రపంచమూ మొలకెత్తినదిమరి ఏమిటీ శల్యపరీక్షఆడతనానికి ఈ […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మనిషికీ మనిషికీ మధ్య మతం కత్తులవంతెన నిర్మిస్తోంది ఆత్మీయంగా హృదయాల్ని పెనవేసుకునే స్నేహాలింగనాల్ని మర్చిపోతున్నాం మనసును మైమరిపింపజేయాల్సిన వెన్నెల రాత్రులలో సైతం యుద్ధసెగ స్నేహపరిమళాల్ని కాల్చేస్తోంది ఇకపై జీవన యానమంతా ఎర్రని క్రోధాగ్నులతో కాలే ఎడారి భూములు మీదనేనేమో మనసు తెరచి అభిప్రాయ ప్రకటన చేయటానికి అనుమానం బురఖాలో ముఖాన్ని దాచుకోవాల్సిన పరిస్థితి! జనాలమధ్య అంతరం అగాధంగా మారిపోతున్న దుస్థితి! ప్రశాంత సాగరాన్ని కల్లోలపరుస్తోన్న […]

Continue Reading
Posted On :

మిణుగురులు (కవిత)

మిణుగురులు -సాహితి ఒత్తిడిలోమనిషి శత్రువుమనసు ఒంటరిలోమనసు మిత్రుడుమనిషి **** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.

Continue Reading
Posted On :

వసివాడే ‘పసి’కూనలు! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

వసివాడే ‘పసి’కూనలు! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -రాయపురెడ్డి సత్యనారాయణ మానవ జీవితాన మరువలేని, మరపురాని ‘మధురస్మృతి’ బాల్యం!ఏ బాదరబందీ లేని, బరువు బాధ్యతలు కనరాని, తిరిగిరాని  ‘సుందర స్వప్నం’ బాల్యం!!ఆ బాల్యం ‘బలి’యౌతోంది నేడు, ఆధునిక జీవన రథచక్రాల క్రింద నలిగి!ఆ ‘పసి’ మనసు అగ్నిపర్వతమై లోలోన రగులుతోంది చూడు…అదుపులేని ‘ఆంక్షల’ నడిసంద్రపు ‘సుడిగుండా’ల్లో పడి!!చీకటి ప్రొద్దున లేవాలి! నిదుర కళ్ళతో చదవాలి!!బండెడు ‘పుస్తకాల […]

Continue Reading
Posted On :

కొత్తేమీ కాదు (కవిత)

కొత్తేమీ కాదు –కె.మునిశేఖర్ త్వరలో యాభైవేల ఉద్యోగాలుభర్తీ అనంగనే సచ్చినపాణం  లేసొచ్చినట్లయిఆగబేగ పట్నం పైనమైనం ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అనంగనేకన్నవారిని కళ్ళల్లో  పెట్టుకునేరోజులొచ్చెనని తెగసంబురపడ్డాం ఖాళీల లెక్క తేల్చండనిఅధికారులకు ఆదేశాలొస్తే..తప్పిన మా జీవితపు లెక్కనుసరిచేసుకోవచ్చనుకున్నం కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లుకు తడిసిపోవడం మాకుకొత్తేమీ కాదు గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ‌..కొన్నాళ్ళకు నిరాశ చెందిన గాలొదిలినబెలూన్ అవ్వడం మాకు అలవాటేకానీ…చిన్నఆశ మా ఆశలు, ఆశయాలు సర్కారుపక్షపాతపు కొక్కానికి వేలాడుతుంటే చూసి..కనబడనికన్నీళ్ళ మూట‌లు మోస్తున్నబతుకులు మావి పోయినంత దూరం తలూపడానికిమీ పెరట్లో పాలేరులం కాదు.!రేపటి మీ ఉనికిని ప్రశ్నించేపట‌్ట‌భద్రులం ***** కె.ముని శేఖర్ కవి, […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-4 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-4 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి రెక్కవిప్పని పక్షిలా తనలోకి తానే ముడుచుకొని నిద్రిస్తున్న భూమి! కలత నిద్రలోనో దొంగనిద్రలోనో అరవిచ్చిన కనురెప్పల్లోంచి తొంగిచూస్తోన్న నెలవంక కంటిపాపలో ఆకాశం మధ్య రెప్ప వాలనీయని భయం కోరలకి వేలాడుతూ జనం! సంవత్సరాల తరబడి తపోదీక్షలో ఉండి అర్ధనిమీలిత నేత్రాలగుండా కరుణామృతాన్ని కురిపిస్తూ అరవిరిసిన పెదాల అంచులనుంచి జాలువారుతున్న చిరునవ్వుని ఫిరంగులు తూట్లు పొడుస్తున్నా చెక్కుచెదరని శాంతిమూర్తిని మందుగుండ్లతో పేల్చి గుండెని ఛిద్రం చేసినపుడే మొదలైంది […]

Continue Reading
Posted On :

మజిలీ (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ఏప్రిల్ 6, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

మజిలీ (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ఏప్రిల్ 6, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) – క్రాంతి కుమార్ అమ్మ కడుపులో ఆవిరైన ప్రాణాలు…ఆశల ఊహల్లో కరిగిపోయిన కలలు… అపార్థాలు మధ్య నలిగి పోయిన జీవితాలు…అవసరాల మధ్య కనుమరుగైన బంధాలు… చదువు కారాగారంలో బందీ అయిన బాల్యం…కామపు కోరలలో చితికి పోయిన అతివ భవితవ్యం… భయాల మధ్య అంతరించిన ప్రేమలు…పరువు బరువుతో గాయపడిన హృదయాలు… ఎన్నెన్నో చూస్తున్నా లెక్కకు అందని తప్పులు….మరెన్నో వింటున్నాలెక్కలేనన్ని ఘోరాలు…. మార్చాలని చూస్తున్నా… నే మార్చలేక నిలుచున్నా…మార్పు […]

Continue Reading
Posted On :

యుగధర్మం (‘పరివ్యాప్త’ కవితలు)

యుగధర్మం  -ఐతా చంద్రయ్య మగధీరా ! మేలుకో యుగధర్మం చూసుకో అబల కాదు అగ్నికణం భరత నారి తెలుసుకో ఓర్పులోన భూదేవి నేర్పు గల శాంతి స్వరూపం బలహీనత కాదు అది భలే క్రాంతిదర్శనం హక్కులు, బాధ్యతలు ఏమిటి అన్నింటా సగం సగం సహనమును పరీక్షిస్తే సమరానికి సిద్ధం కట్నకానుకల కోసం కాల్చుకు తినకు తిరగబడితే వెళ్తావు కటకటాల వెనుకకు ఇలవేలుపు అవుతుంది కాలు కింద పురుగంటే కాలసర్పమవుతుంది రాజకీయక్షేత్రమేమి  రక్షణ రంగములో అతివలకిక సాటి లేదు […]

Continue Reading
Posted On :

అమ్మను పోల్చకు (కవిత)

అమ్మను పోల్చకు – భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మను పోల్చకు అమ్మను ప్రకృతితో పోల్చకు. ప్రకృతికి కోపంవస్తే కన్నెర్ర చేసి ప్రళయాన్ని పంపిస్తుంది. కానీ,అమ్మకు కోపం వస్తే తన కనులను మాత్రమే జలమయం చేసుకుంటుంది. ఓర్చుకునేదీ తానే,ఓదార్చుకునేదీ తనకు తానే, ప్రకృతికి ఇవి రెండూ తెలియవు. అమ్మని దైవంతో పోల్చకు. దైవం పాలలో వెన్నలాంటిది, కఠినమైన ప్రయత్నంతో తప్ప కరుణించదు. అమ్మ వెన్నలో నెయ్యి వంటిది, ఒక్క పిలుపుకే కరిగి కల్పవృక్షమౌతుంది. దైవం తామరాకుమీద నీటి […]

Continue Reading
Posted On :

చెరగని చిరునవ్వులు (కవిత)

చెరగని చిరునవ్వులు -డా. కె. దివాకరా చారి సృష్టిలో వెలకట్టలేని కొనలేని అరుదైనది ఏమిటో తెలుసా? ప్రేమతో పలకరిస్తేనే చాలు ప్రతిగా దొరికే అపురూపమైన మురిపాల ముద్దులొలికే మన చిట్టి పసిడి కూనల అలౌకిక చిరునవ్వులే కదా ? జీవిత అనుభవాలను పండించుకుని తిరిగి పసితనాన్ని వెలిగించే పండు ముసలి బోసి నోటి ఆనందాల ముసి ముసి నవ్వులని చూసి మురిసిపోలేదా? మౌనంగా రేఖల్ని విప్పుకుంటూ మొగ్గలన్నీ విచ్చుకుంటూ సుగంధాలు పరిమళిస్తూ పువ్వులుగా నవ్వటం కనలేదా ? మట్టిని తొలుచుకుని […]

Continue Reading
Posted On :

ఆత్మ వినాశనం (కవిత)

ఆత్మ వినాశనం -దుర్గాప్రసాద్ అవధానం మరణం కాలరాసిన శకలం గతం గతమెప్పుడు మనోభావాల లోతుల్లో మిగిలిపోయే ముల్లు తలపోసే కొద్ది తలంపునొప్పుల్లో రచ్చ పెద్దల తీర్పుల చర్చ అడుగు తర్వాత అడుగు వివాదం తర్వాత వివాదం పగటి రాత్రికి మధ్య ప్రతీకార వాంఛల పగలో ఉత్కంఠ ఉత్సుకత ఊపిరి తీసుకోలేని భయం భయం రాజకీయ సంకేతంలో తీర్పు ఓ మృత్యువు హింస విరామంలో మరోయుద్ధచ్ఛాయ తీర్పు గిరగిరా తిరుగుతూ పెను చీకటి బానిసత్వం కనుగుడ్డును కమ్మేస్తూన్న కాలం […]

Continue Reading
Posted On :

ఓ పసిపాపా (కవిత)

ఓ పసిపాపా! -పారనంది శాంతకుమారి అందానికి అల్లరి తోడైతే అది నీవు, అల్లరికి అమాయకత్వం నీడైతే అది నీవు, అమాయకత్వానికి ఆత్మీయత జాడైతే అది నీవు, ఆత్మీయతకు ఆనందం జోడైతే అది నీవు, సంబంధానికి అనుబంధం తోడైతే అది నీవు, అనుబంధానికి అనురక్తి నీడైతే అది నీవు, అనురక్తికి ఆప్యాయత జాడైతే అది నీవు, ఆప్యాయతకు ఆలంబన జోడైతే అది నీవు. ***** ఇల్లే నాకు సర్వం,ఇంట్లో ఉండి అందరికి వీలైనంత సేవ అందించటం లోనే ఆనందం […]

Continue Reading
Posted On :

గడ్డి పువ్వు (కవిత)

గడ్డి పువ్వు -కె.రూపరుక్మిణి ఒంటరి  మనసు  వేసే ప్రశ్నలో ఆమెను ఆమేగా మలచుకుంటున్న వేళ  మనస్పూర్తిగా  నువ్వు ఎలావున్నావు అని అడిగే వారు లేనప్పుడు ! పడుచు ప్రాయానికి స్త్రీ అందమో, సంపదనో,చూసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు!! తప్పటడుగుల జీవితంలో తారుమారు బ్రతుకులలో నిన్ను నిన్నుగా చూస్తారు అని ఆశపడకు ఆడది ఎప్పుడు ‘ఆడ’  మనిషే అవసరమో,  మోహమో నీఆర్ధికస్థితో అవసరానికి అభిమానానికి మధ్య పెద్ద  గీతగా చేరుతుంది నీది కాని ప్రపంచం నీ చుట్టూ   అలుముకుంటుంది    మేఘాల దుప్పట్లు  పరుచుకుంటాయి,   మెరుపుల వెలుతురూ చూసి ఇంద్రలోకంగా భ్రమిస్తావు  అక్కడ […]

Continue Reading
Posted On :

పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు

పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు -నాగరాజు రామస్వామి  పరామర్శ  ( Visit ) హాస్పిటల్. కాళీమాత రక్తవర్ణ నోటిచొంగ లాంటి ఎర్రెర్రని దుస్తుల్లో ఆయాలు. క్రిక్కిరిసిన వరండాలలో కోలాహలం; కడుగుతున్న బెడ్ పాన్ల గణగణలు, ఓదార్పుల, దూషణల రణగొణలు, అన్ని చికాకుల నడుమ ఆమె గదిలో బట్టలు వేలాడుతుంటవి, గృహకలతలు చెలరేగుతుంటవి, పెళ్ళి ముచ్చట్లు కొనసాగుతుంటవి, పరామర్శకులు పద్యాలు పాడుతుంటరు, ఆమె ఓ వృద్ధవర్షీయసి, ఆమె కోర్కెలు తెగిన పతంగులు, తొంటి విరిగినా తీరని మరణేచ్ఛ; వచ్చిన వాళ్ళందరు రాని మృత్యువును కోరుకుంటరు, అమెరికన్ యాసల మనుమలు ఆమె పాదాలకు మొక్కుతుంటరు, ఆంటీలు లోనికీ బయటకూ వస్తూపోతుంటరు, వేట కుక్క వంటి ఇంటి డాక్టరు రీడింగులు తీస్తుంటడు. మా నాన్న గారి మంచి మనసు అస్పష్ట అవగాహనను శంకిస్తుంటుంది.                  నిర్గమనం                    (Departure) ఆమె లేచి మంచంలో కూర్చుంది, చర్మం బాధల ఉలిపిరి కాగితం, జుట్టు కోమల తెలిపుష్ప దళం […]

Continue Reading
Posted On :

తల్లిలా….తండ్రిలా… (కవిత)

తల్లిలా….తండ్రిలా… -సాహితి ఇంటి గుండె చప్పుడు హృదయాలకు జోలపాట   నాలుగు గోడలే దిక్కులుగా పై కప్పే ఆకాశంగా ఇంటి కౌగిలిలో హాయిగా కమ్మని నిద్ర.   ఒద్దికగా అమరిన వస్తువులు మౌనంగా మాట్లాడే నేస్తాలు. కలల ప్రతిరూపాలుగా ఇంటికి అలంకారాలు.   పై కి కనిపించే గోడ, తలుపు, మెట్లు మా బహిప్రాణాలు..   లోపల జీవించే ఇటుకు, సిమెంట్, ఇసుక మా అంతర్జీవాలు.   తల్లిలా కడుపులో పెట్టుకునే వంటళ్లు అక్షయపాత్ర.   తండ్రిలా […]

Continue Reading
Posted On :

నవ్వుల్ని పూయించడం! (కవిత)

నవ్వుల్ని పూయించడం! -డా. కె. దివాకరా చారి పసి పాపల నిర్మల నవ్వులు ప్రకృతికి ప్రతిరూపాలు కొత్త చిగురులా కొంగ్రొత్తగా తొడిగే మొగ్గలా నునులేత కిరణంలా లేలేత వర్ణాలతో విరిసే సుకుమారపు పువ్వులా కొత్తగా మొలిచిన పసరు రెక్కలతో ఆకాశాన్ని అందుకునేందుకు ఎగిరే పక్షి కూనలా ఏ వర్ణనలకు సరితూగని ఏ కాలుష్యం సోకని కల్మషం లేని ఆ నవ్వు ఇంకెవరికీ సాధ్యం కానిది ఈ లోకాన! కూర్చున్న చోటనుండి కదలకుండానే అలా అలలా ప్రతిగుండె పై […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-3 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-3 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్వప్నాలుకాలిన నుసిమీద హృదయ పుష్పాలు శ్రద్ధాంజలులు ప్రకటిస్తున్నాయి రేపటి వెలుగు కిరణంకోసం కూలిన సౌధాల అడుగున గుండె ఎక్కడో జారిపోయింది అరాచక శక్తుల సూక్ష్మక్రిములు జన్యువుల్ని తిని రోగాల్ని త్రేనుస్తున్నాయి ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవటం మర్చిపోతున్నాయి చలువగదులు కూడా ఎర్రని ఎడారి స్వప్నాలతో చెమట చిత్తడులై సోలిపోతున్నాయి స్వేచ్ఛాదేవత విగ్రహంమీద పిండిరేణువుల్ని మోసుకెళ్తున్న చీమల్ని చూసి ఘనత వహించిన ఆధిపత్య సర్పం వణికిపోతోంది ఎక్స్‌రే కళ్ళు […]

Continue Reading
Posted On :

నా బాల్యంలో భూతల స్వర్గం (కవిత)

నా బాల్యంలో భూతల స్వర్గం -సుగుణ మద్దిరెడ్డి బుధవారం సంతచుట్టున్నాపల్లె సరకుల మోత పేటకి. సంతలో దొరకందిలేదు. కూరగాయల తట్టలుబెస్త పల్లె చేపల గంపలుఈడిగపల్లె తమలపాకులుదుగ్గుమూటలుచెంగనపల్లి నుంజలుపాతపాళ్యం సదువుశెట్టి వాళ్ల పూలుఐలోలపల్లి అనపకాయతట్టలుకొలిమి గంగన్న చేసే కొడవలి. పార. తొలికె. గొడ్డలి. గడ్డపార. తయ్యూరోళ్ల సరకుల అంగడిలో చాచిన చెయ్యి వెనక్కి తీయాలంటే ఓ గంటరైస్ మిల్లు లో  ఓపక్కవొడ్లుబోస్తే  ఇంకోపక్కబియ్యం  మరోపక్క తౌడు అబ్బో…. ఏమి కరెంటో…. ఏంమిసన్లో…. ఆపక్కనే గింజలుబోస్తేఈపక్కనూనొఛ్చే మిసిను. ఏమి అద్భుతాలో…. ఐరాలమద్యలో జూసిన గౌరుమెంట్ ఆసుపత్రి. ఆవుకి సూదేసే ఆస్పత్రికూడాకోనేటికాడుండే బాంకుదాని […]

Continue Reading
Posted On :

సరి లేరు నీకెవ్వరు!! (కవిత)

సరి లేరు నీకెవ్వరు!! -సుభాషిణి ప్రత్తిపాటి నీ కన్నీటిని దొర్లించటానికో… పాత్ర కావలసినప్పుడు,మ నీ వ్యధో,బాధో వెలికిబెట్టుకోడానికో… గురి అవసరమైనప్పుడూ.., నీ గుండె గాయాలకు… మాటల మలాము కావలసినప్పుడు, నీ కడగండ్ల కడలినీదే తెరచాప అవసరమైనప్పుడు, నీలోపలి సొదేదో వినడానికో చెవి కావలసినప్పుడు, నీ స్వోత్కర్షల నాదస్వరానికి ఊగే తల అవసరమనుకున్నప్పుడు, నీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు బలపరచుకునే భజనపరులు కావలసినప్పుడు… నీకు ఆసరాకో భుజం, చెక్కిలి జారే నీటిని తుడిచే చేయి, ఓ మాట , ఓ […]

Continue Reading
Posted On :

మరొకరుండరు… (కవిత)

మరొకరుండరు -చందలూరి నారాయణరావు నీకై పుట్టిన పదాలు నోరు విప్పి నీ పెదాల వాకిట ఓ మాటను జంట చేయమని పడికాపులు కాస్తుంటే…. కళ్ళ ముందే అర్థాలు గెంటివేయబడి కన్న కలే మనసును చిదుముతుంటే.. ఊపిరనుకున్న ఆ ఒక్కరు ఊరకుండిపోతే ? ఒకరికి చెప్పితే మరొకరు తీర్చిది కాదు ఆ బాధ. ఒకరు కాదంటే మరొకరి ఇచ్చేది కాదు ఆ ప్రేమ **** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

    ఖాళీ -డా.సి.భవానీదేవి ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు చదువు..సంస్కారం ప్రసరించినగురువుల ప్రశంసల ఆశీస్సులు బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించినఅనేకానేక రచనల సమాహారాలు చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీనా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళుదగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలుమనసుగదిలో […]

Continue Reading
Posted On :

ప్రేమ (కవిత)

  ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

Continue Reading
Posted On :

దినచర్య (కవిత)

దినచర్య -పద్మావతి రాంభక్త బహుశా మీరనుకుంటారేమో నా ఖాళీ సమయాలన్నీ అక్షరాలుగా తర్జుమా అవుతుంటాయని ఉదయం లేచీ లేవగానే నా మెదడు నిండా అంటుకున్న కలల శకలాలను దులిపి వాస్తవాన్ని కౌగిలించుకున్నప్పుడు నిన్నటి జ్ఞాపకమేదో నా మనసులోకి వద్దన్నా జొరబడి వంటింట్లోని  పోపుగింజలా అక్షరమై చిటపటలాడుతుంది లోపల వర్షం బయట వర్షంతో జతగూడినపుడు నేను తడిమేఘమై కురిసిపోతుంటాను కిటికీలోనుండి ప్రవేశిస్తున్న రవికిరణాలలోని వెచ్చదనాన్ని కట్టగట్టినపుడు ఒక నులివెచ్చని వాక్యమై వాలిపోతాను గడ్డకట్టిన కాలం కన్నీటి సంతకాలతో తుపానులతో […]

Continue Reading
Posted On :

స్వేచ్ఛ (కవిత)

స్వేచ్ఛ -పి.సుష్మ వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు విరిగిపోయిన రెక్కలు ఈకలై ఎగిరిపోవడం చూసే ఉంటావు అది ఎవరికీ భయపడని స్వేచ్ఛ ఈకలన్ని చదివే ఉంటాయి ఆకతాయి గాలి చేష్టలు అయ్యో అంటూ అక్కున చేర్చుకున్న బండరాయి సందులో కొన్ని ముళ్ళకంపలో కొన్ని ఇలా అక్కడక్కడా […]

Continue Reading
Posted On :
sailaja kalluri

మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మచ్చలు -డా.కాళ్ళకూరి శైలజ ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి తిరిగి రాని ఊసులు చెపుతుంది.పాలు చీకిన ముచ్చికలు,పసి అంగుడి కోసిన పగుళ్ళతోఉసూరు మంటాయి.      రోకళ్ళు,చీపుర్లు కదుము కట్టిన చేతులుఎగుడు దిగుడు గుట్టలు.గుండిగలు తోమి మకిలి ఇంకిన వేళ్ళు  పంట కొడవలి గంట్లకి రెల్లు గడ్డిలా […]

Continue Reading
Posted On :

నైజం (కవిత)

నైజం -గిరి ప్రసాద్ చెల మల్లు అమ్మున్నంత కాలం ఎగబడ్డాయి పక్షులు అమ్మ పోయింది పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి  అమ్మ వున్నప్పుడు ఎంగిలిచేతిని విదిలించని ఇళ్ళపై వాలుతున్న పక్షులు విదిలిస్తారని ఆశతో ఈసడించిన చేతులవైపు  అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతంముక్కున కర్సుకుపోయిన  పక్షులు మరోవైపు  అమ్మ చేతి వంట తిన్న పక్షులు మర్చి మరబొమ్మల్లాతారాడుతున్నాయి  బెల్లమున్నప్పుడే ఈగలుఅమ్మ చెబుతుండేదెప్పుడూ కాని అమ్మే గుర్తెరగలేదనేది నేడు కన్పిస్తుంది కళ్ళముందు  గూటిపక్షులువలస పక్షులు అన్నీ అవే కోవలోఇసుమంతైనా తేడా లేదు సుమీ ! ముసిముసినవ్వుల వెనుక దాగిన మర్మం విషం గడపలో ఓ కుక్క విశ్వాసంగా అప్పుడూ ఇప్పుడూ **** పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష […]

Continue Reading
Posted On :

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు)

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు) -అమ్మంగి కృష్ణారావు ఇది ఒక జీవన రంగస్థలి పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి అచ్చం అమ్మ ఒడిలోకి చేరుకున్నట్లు కోడి పిల్లలను డేగ కన్ను నుండి కాపాడుకుంటుంది ఎగిరెగిరి ఎదిరించి పోరాడే పటిమతో గంతులేస్తున్న లేగదూడకు తల్లిఆవుపొదుగు పాలిస్తుంది లాలించి తాగించి నట్టుగా పుడమి తల్లిలా నేలంతా పచ్చదనాన్ని పులుముకుంటుంది జగమంతా తనదే అన్నట్లుగా అంతా అమ్మ తత్వమే అమ్మా భూమ్మీద పడగానే ఎంత ఆనందించావో నాకు ఊహ తెలియకముందే వెళ్ళిపోయావు కదమ్మా […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-2 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-2 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మానుషత్వానికీ అమానుషత్వానికీ అక్షరతేడా ఒకటి మాత్రమే ఆచరణ అనంతం సంబంధ బాంధవ్యాలను సమూలంగా సమాధిచేస్తూ సంస్కృతీ శిఖరాలను భుజాలకెత్తుకుంటూనే సంఘజీవనాన్ని అపహాస్యం చేస్తూ నేలనున్న చిరుమొలకలని విస్మరిస్తున్నారు ఆలోచనల్ని కత్తిరించేసిన తొందరపాటు వివేకాన్ని విస్మరింపచేసిన ఆవేశం మనిషిలో మానవత్వాన్ని నిక్షిప్తంగా తొక్కేసి రాక్షసమాస్కుని ముఖానికి తగిలించుకొని ప్రపంచ శాంతి కుటీరంలో విధ్వంసక వీరంగం చేస్తోంది బిత్తరపోయిన పావురాలు ప్రతిదేహానికీ అతిథి కావాలని ఆకాశ విహారానికి బయల్దేరి […]

Continue Reading
Posted On :

కొత్త పేజీ మొదలు (కవిత)

కొత్త పేజీ మొదలు -సముద్రాల శ్రీదేవి గతం చేతి వేళ్ళను సుతిమెత్తగా వదిలి పెడుతూ, నేటి నిజం, గెలుపు భవితవ్యాన్ని అందుకోవాలని ప్రయత్నం. జ్ఞాపకాల నెమలీకలను భద్రంగా దాచి, గుండె గుమ్మంలో ఎదురుచూస్తుంది  కొత్తదనం కోసం. నిన్నటికి,రేపటికి సంధి వారధిలా నూత్న ఒరవడులకు సారథిలా ఎదురు వస్తుంది కొత్త వత్సరం. ఊహాల కుంచెతో బొమ్మలు గీస్తూ, వూపిరి నింపిన కలల శిల్పం చెక్కుతూ, ఘడియ అనే రాత్రి రెప్పలను తెరుచుకొని, వెన్నెల పలువరుసతో  ఆహ్వానిస్తోంది కాలాల తలుపుల […]

Continue Reading
Posted On :

అన్నీ తానే (కవిత)

అన్నీ తానే -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాకై పూసే శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని అడిగేది లేదు. ప్రేయసి పాదముద్రలో సంతోషాలే అన్నీ. వానలో తడిసేది లేదు. జ్ఞాపకాల జల్లుతో తేమకు కరువేలేదు. ***** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం […]

Continue Reading
Posted On :

ఎముకలు విరిగిన నీడ (‘పరివ్యాప్త’ కవితలు)

ఎముకలు విరిగిన నీడ  -డాక్టర్ నాళేశ్వరం శంకరం ఆమె భర్త గుహను ధ్వంసం చేసే లోపునే  ఇనుప చువ్వల చూపుల్ని నాటే  ప్రేమ చక్షువులు కూడా  మృగ పాదాల్ని మోపి తొలగిపోయాయి  ఆమె ఇప్పుడు కాలం గడియారం మీద  కొట్టుకునే ముల్లు మాత్రమే  గతించిన దృశ్యాలు  బింబాలు బింబాలై ద్రవించి నప్పుడల్లా  గాయాలు జీర్ణమై గుండెబండై కళ్ళు గోలి బిళ్ళలై చిట్లిన పత్తిమొగ్గ అవుతోందప్పుడప్పుడు పుట్టిల్లు  ముక్కుకు చెవులకు సౌందర్య తూట్లు పొడిపించినట్లే మెట్టిల్లూ, ఆనవాళ్లే లేని గాయాలతో […]

Continue Reading
Posted On :

రంగవల్లి (కవిత)

రంగవల్లి -అశోక్ గుంటుక తెలుగు లోగిలి ప్రతి వాకిలి ఆనందం ఆకృతి దాల్చిన రంగవల్లి… ముగ్గునగొబ్బిపూలు ఎగురుతున్న గాలిపటాలు హరిదాసులు బసవన్నలు; ప్రతి ఇంటా పరుచుకున్న వసంతం… ప్రకృతి పల్లె చేరి  పరవశం… ఆకాశం రాలిన నక్షత్రాలు.. ఆ వెంటే విరిసిన ఇంద్రధనుస్సులు… అతనొచ్చి ఓ ముగ్గు చుక్కపెట్టి సెల్ఫీ యై… అహాన్ని చల్లార్చుకున్నా ఆకాశంలో సగం అంటూ సగాన్ని మిగుల్చుకున్నా… నిజానికి ఇక్కడ అతనుశూన్యం… పండుగ వేళ – వాకిలి క్యాన్వాస్ పై తీర్చిదిద్దిన కళాకృతులు…… […]

Continue Reading
Posted On :

చూడలేను! (కవిత)

చూడలేను! -డి.నాగజ్యోతిశేఖర్   కరగని దిగులుశిల పగిలిన స్వప్న శిఖరంపై  సాంత్వన తడికై కొట్టుకులాడుతున్నది! మలిగిన ఆశా మిణుగురులు రెక్కల సడి వెతల దిగంతాల అంచుల్లో నిశ్శబ్ధాన్ని ప్రసవిస్తున్నది! కన్నీళ్ల మేఘసంచులు చిల్లులుపడి కంటిఆకాశం దుఃఖ వర్ణం పూసుకుంటున్నది! ఇప్పుడిప్పుడే విచ్చుకున్న అస్తిత్వ రెక్కలకు ఆధారమివ్వని ఈనెల మనస్సులు  వివక్షతను ఈనుతున్నవి! మేధస్సు చంద్రునిపై వెన్నెల సౌధాలు నిర్మిస్తున్నా… ఆంక్షల రాహువులు చీకటి అమవాసలై చుట్టేస్తున్నవి! మాటల్లో ఆకాశంలో సగమైనా…. చూపుల్లో వంకరతనపు   ప్రశ్నాచిహ్నమై స్వేచ్చా హృదయం […]

Continue Reading
Posted On :

అమ్మతనాలు (కవిత)

అమ్మతనాలు -పద్మావతి రాంభక్త ఏ దేశమేగినా ఎడారిలో ఒంటరిగా నిలబడి సతమతమవుతున్నపుడు నువ్వు అక్కడ ఎగరేసిన అమెరికా టికెట్టు నా భుజంపై పిట్టలా వాలింది నేను ఉత్సాహపు ఊయలలో ఊగుతూ తూగుతూ ఊరంతా దండోరా వేసేసాను నీకు నాపై ఉన్న ప్రేమ ఎవరెస్టు శిఖరమంత ఎత్తుగా అగుపించింది నిరంతరం ఎన్నో కలలలో తేలి తూలిపోయాను రోజులు యుగాల రూపమెత్తి కదలక మెదలక కలవరపరుస్తున్నట్టే అనిపించింది కళ్ళు కాలెండర్ కు అతుక్కుని దిగాలుగా వేళ్ళాడుతున్నాయి నిరీక్షణ నిస్సహాయతను తొడుక్కుని […]

Continue Reading
Posted On :
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలనుఅశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!    ***** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-1 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-1 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి బాధ సన్నటి సూదిములుకై రక్తంలో ప్రవేశించింది నరాల్ని కుట్టుకుంటూ రక్తంతోబాటుగా శరీరమంతటా ప్రవహించటం మొదలైంది శరీరంలో ఎక్కడో ఒకచోట ఉండుండి ప్రవాహమార్గంలో సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ స్పందనల్ని మీటుతూ చురుకు చురుకు మనిపిస్తూనే ఉంది హాహాకారాల్ని ఆహ్లాదంగా పరిగణించలేంకదా ఆక్రందనల్ని ఆనందంగా ఆస్వాదించలేంకదా చాటున మాటేసి పంజా విసిరినా పంజాదెబ్బ పడేది అమాయకులమీదే గాయం అయ్యేది తల్లి గర్భంపైనే ఆకాశం పిడుగై వర్షించినా పక్షులకు […]

Continue Reading
Posted On :

వాన (కవిత)

వాన -సంధ్యారాణి ఎరబాటి ముసురుపట్టిన వాన కురుస్తుఉంటే గుండెల్లో ఎదో గుబులైతాది గరం గరంగా తిందామంటూ నోరేమో మొరబెడుతాది దోమనర్తకీలు  వీధుల్లో భాగోతాలు మొదలెడతాయి మ్యాన్ హోలులు సొగసరిప్రియురాళ్లలా నవ్వుతూ నోరంతా తెరుస్తాయి గుంతలన్నీ నిండి నిండుచూలాలవుతాయి వీధులన్నీ గోదారిలా వయ్యారాలు పోతాయి.. రోడ్డులన్ని పుటుక్కున తెగిపోతాయి దారులన్నీ కర్ఫ్యూ పెడతాయి.. మురికి కాలువలన్నీ ఒక్కసారే ఉరికి ఉరికి పారుతాయి వీధి చివరి బజ్జీల బండి తీరిక లేకుండా వెలుగుతుంది మూలన ముదురుకున్న ముసలమ్మ  మరికాస్త ముడుచుకుంటుంది […]

Continue Reading
Posted On :

ఉరితాళ్ళే గతాయే (కవిత)

ఉరితాళ్ళే గతాయే -నల్లెల్ల రాజయ్య అహో ! నా పాలక వర్గమా మా కడుపులు నింపే అన్నదాతని అందలమెక్కించి అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ ! దేశానికే ఎన్నెముకలు. నా రైతన్నలని అదేపనిగా అంటుంటవ్ ! కని మీ మనసు నిండా అన్నదాతల ఎన్నెముకల్లోని మూలుగను సైతం లేకుండా పీల్చుకతినే నయవంచక ఎవ్వారం నీది. నీ మాటల్లో మర్మముంటది చేతల్లో చెప్పలేనంత సత్తెన నాశన కార్యాలు జరిపిస్తుంటవ్ ! గిట్టుబాటు ధరలివ్వని గిదేం రాజ్యమనీ ఆగ్రహించిన అన్నదాత ఆక్రోషిస్తే […]

Continue Reading
Posted On :

మన’వరాలు’ (కవిత)

మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  విషయం ఒకటుంది. పెంటకుప్పమీద దొరికిన పసికందు అన్ని సందర్భాలలోనూ ఆడపిల్లే.  ఆసుపత్రుల మీద దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ మరణించింది మగబిడ్డే. ఆడ శిశువు మరణిస్తే సంబంధిత బంధువులు ఏ గొడవా చేయకుండా నిశ్శబ్దంగా […]

Continue Reading
Posted On :
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సిగ్గుతో ఎర్రబారే చెంపలానో సాటి వారి మీద ప్రేమ ప్రకటించే నోరులాగనో దేహం మీద బాహాటంగా కనిపించక ఎముకల గూడు మధ్య ఏ మూలనో చిమ్మ చీకట్లో దాక్కున్నావెందుకని ? నేనీ […]

Continue Reading
Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని ప్రాణాల చెంత జేర్చ, అనుమానాలు చెప్పే బాధల గాధల్ని అననుకూల భావాలకూర్చి, కళ్ళసామ్రాజ్య సింహభాగాన సింహాసనమెక్కి , అట్లా…… అవునూ, నీదీ నాదీ ఒక్కచూపుల పొద నీదీ నాదీ ఒక్కమాటల సొద కలలతీరాన కనరాని […]

Continue Reading
Posted On :

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే సొంతం మనసుంది కదా తనకు చిన్నా పెద్దా మాటలతో గాయపరుచుకునేందుకు ఒకటో రెండో గదమాయింపుల గద్దెల్ని ఎక్కేందుకు పొలిమేర దాటని తనను ఊరుకాని ఊరుకు తరిమినా మిన్ను విరగనట్టు విర్రవీగేందుకు ఎన్ని కష్టాల్ని దాపెట్టిందో […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది ! కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు ఆనక, […]

Continue Reading
Posted On :

ప్రకృతి (కవిత)

ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా గుండెలపై వెచ్చని రామగుండం స్పర్శ శేషాచలం కొండల కనుబొమ్మల మధ్య గుండ్రని చందవరం స్థూపం లాంటి తిలకంలో నా రూపు శాశ్వతం ఫణిగిరి లాంటి నల్లని వాలుజడ పిల్లలమర్రి ఊడల్లా ఊగుతుంటే మదిలో ఏటూరు […]

Continue Reading
Posted On :

అక్కమహాదేవి (కవిత)

అక్కమహాదేవి -గిరి ప్రసాద్ చెలమల్లు అక్కమ్మా! ఎప్పుడో ఏనాడో నీ నుండి జాలువారిన  వచనం మా సమాజాన్ని సూటిగా, నగ్నంగా ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా నీ కాయం నీ ఇష్టం ఎవ్వరికి అర్పిస్తావో ఎవ్వరి దురాక్రమణకి లొంగక అణువణువూ చెన్నకేశవ చెంత దిగంబరమో నీ మనోభీష్టమో స్పర్శయో సాన్నిహిత్యమో తలంచినదే తడవుగా ఎక్కుబెట్టిన విమర్శనావచనం జీర్ణించుకోలేని ఆధిక్యత నీ గుహ ఎన్నో మనోనిగూఢాల వేదిక నీ మేను ప్రవచించిన కేశాల అల్లిక నాడే ఎలుగెత్తిన నీవే మా చలం కన్నా […]

Continue Reading
Posted On :

హథ్రాస్ (కవిత)

హథ్రాస్ -వసీరా సూర్యుడి తేజాన్ని మట్టిబలాన్ని చెమటలోని ప్రేమని తాగి పెరిగిన గోధుమ గింజ రక్త సిక్తమైంది చిన్నారి గోధుమ గింజ రక్తకన్నీరుతో తడిసి నేలలోకి వెళ్లపోయింది. నేల లోపల అణుప్రకంపనలు గంగాతీర మైదానాలు కంపిస్తున్నాయ్ కంకుల్లోని గింజలు నిప్పుల పాలుపోసుకుని గ్రెనేడ్లవుతున్నాయి కంకులు బులెట్లని కాస్తున్నాయి తరతరాలుగా నీదయిన నీ నేల రణరంగమవ్వడానికి సిద్ధమవుతోంది. విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది. సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో కొత్త ఆయుధాలు ధరించి పరపరా సరసరా నాలుకలు […]

Continue Reading
Posted On :

కనుక్కోండి (కవిత)

కనుక్కోండి -దిలీప్.వి ఆకలైతే కాదు నన్ను చంపింది పస్తులుoడి ఆకలితో అలమటించిన దినములెన్నో… పేదరికం కాదు నన్ను వల్లకాటికి చేర్చింది అయితే.. ఇన్నేళ్ల నుండి దానితోనే కదా సావాసం చేస్తున్నది కరోనాకా నేను బలిఅయినది? కాదు కాదు… అసలే కాదు దేనికి నేను బలి అయిందో తెలియదా మీకు? ఇంటికి చేరుతానని ఇంటికి దీపమైతానని నన్ను నడిపించిన ఆశ విగతజీవిగా మారి కన్నవారికి మిగిల్చిన నిరాశ కారకులెవరో కనుక్కోండని ప్రశ్నగా మారి వెళుతున్న… ***** నా పేరు […]

Continue Reading
Posted On :

అస్థిమితం….. (కవిత)

అస్థిమితం….. -సుధామురళి ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పుఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటాఆ రెప్పల చాటులో నుంచికనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీవేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది….. ఓ అక్షర తూటాని లాగి పెట్టి విడవాలనుకుంటాఆ చేదు తేనెల కలయికల మధ్యలోనుంచినరంలేని అర్ధమందపు నాలుక నాకేం పట్టింది అనుకుంటుందో ఏమోగానీఅసలు అనుకోని పదాలను వల్లెవేస్తుందిఅది నేనేనా అన్నదనే భ్రమను నాకప్పగిస్తూ…. శూన్యం నిండా ఏదో నిండుకుని ఉంటుందివెలితిలేని […]

Continue Reading
Posted On :

ఇక్కడ- అక్కడ (కవిత)

ఇక్కడ- అక్కడ  -కుందుర్తి కవిత పెళ్ళైన కొన్నాళ్ళకే  పుట్టింటి మీద బెంగొచ్చి వచ్చా ఇక్కడ…. చిన్ననాటి స్నేహితురాళ్ళంతా కలిసి చాన్నాళ్ళయిందని వచ్చి చుట్టూ చేరారు … రుసరుసలాడుతూ, తమలోతాము గుసగుసలు చెప్పుకుంటున్నారు ఏదో నిర్ధారణకి వచ్చినట్టుగా నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గా నా ఆత్మగౌరవం నన్ను నిలదీసింది నీకసలు ఆత్మసాక్షి అంటూ ఉందా అని చిన్నప్పటినుండీ వేలు వదలకుండా  నీతోనే నడిచిన నీ చిరకాల స్నేహితురాలిని ఈరోజు ఎవరెవరి కోసమో వదిలెళ్ళిపోతావా అని ఎవరో కాదు నా వాళ్ళే అని సంకోచంగానే నాకు నేను సర్ది చెప్పుకున్నాను కనీసం అప్పుడప్పుడైనా పలకరించవేమని చిందులు తొక్కుతూ  చటుక్కున చక్కా పోయిందది , నామీద కాసింతైనా  మర్యాద లేకుండా !!  అచ్చం అక్కడి గర్వం లాగే !! నా ఆత్మ విశ్వాసం నన్నూ నీతో తీసుకుపొమ్మంది నీకక్కడ సరిపడినంత చోటు ఉండకపోవచ్చు అంటే… ఈ ఇంటికంటే ఆ ఇల్లు పెద్దదికదా అని ప్రశ్నించింది అవునో కాదో నాకే తెలీనట్టు తలూపాను దాని అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకున్నాను ఇరుకు ఇంట్లో కాదు,  మనుషుల మనసుల్లో అని  నోటిదాకా వచ్చినా, చచ్చినా వద్దనుకొని దాని నోరే, సులువు కదాని నొక్కేసాను విశ్వాసం లేని చూపులు విసురుతూ  విరవిరా వదిలి వెళ్ళిపోయింది !!  అచ్చం అక్కడి స్వార్ధం లాగే!! వెనుకనుంచి భుజంమీద తట్టి నన్ను మర్చిపోయావా, అనింది నా ఆత్మాభిమానం నాకోసం కాసింతైనా పోరాడాలనిపించలేదా  […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది !   కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు […]

Continue Reading
Posted On :

మార్పు (కవిత)

మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు వెళ్లిపోయాయి…. గ్రీష్మపు సాయంత్రాలు…కూడారూక్షత్వపు ఆహ్లాదపులయ్యాయి ఋతువులు మారిపోయాయి వర్షం ఎపుడో స్నిగ్ధత్వం  మరచింది పచ్చదనం…ఖచ్చితంగా…..చిన్నబుచ్చుకుంది..ఈ మహానగరంలో  పేక మేడల్లాంటి ఈ  కట్టడాలపునాదుల్లో.. హరితం  మౌనంగాసమాధి అయింది…. పక్షిలా ఎగిరే నా భావాలన్నీ…. విశాలగగనం లో విహరించక ఎన్నాళ్ళయిందో అగ్గిపెట్టేల్లా కట్టిన కాంక్రీట్  అడవిలోఆకాశం కనిపించడం లేదు నాకు పక్షుల […]

Continue Reading
Posted On :

నీవు లేని రోజు (కవిత)

నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ  ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? ఒక రోజు నీవు దూరమైతే ఇన్ని ప్రశ్నలా? ఇన్ని అనుమానాలా? ఇంత అవమానమా? ఇక తట్టుకోలేను తల్లడిల్లుతున్నా ఎప్పుడూ భరింపలేను ఎడబాటును క్షమించు కరుణించి రక్షించు క్షమించి నీ ఒడిని వీడితే లోకం ఇంత […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె -సాహితి అతడి ధైర్యం నిజం. ఎంత ఎండకైనా మాడిపోడు. మసిలి మసిలి సహనంగా ఆవిరౌతాడు. ప్రేమతో మేఘమై పుట్టి మళ్ళీ కురుస్తాడు పగలు రేయి కుండపోతగా. పచ్చిక ఒడిలో మంచు బిందువులో ఒదిగిచూస్తాడు మొగ్గల బుగ్గ చాటున తొంగిచూస్తాడు. అతని నిజం ధైర్యం. ఆమె కురుల పరుపు కోరి కునుకు తీస్తాడు. ఆమె కనుల చాటుగా దూరి కలను దోస్తాడు. ఆమె కలల కౌగిట చేరి కలుసుకుంటాడు. అతడి నిజం ధైర్యం ఆమే. ***** ఆర్ట్: […]

Continue Reading
Posted On :

అష్టభుజి (కవిత)

అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల రెక్కలనెలాకట్టగలవు??అరచేతితో..అర్కుని ఆపగలవా…???జ్వలించే కవనోదయానికైఏదో ఓ ఉదయంనేను అష్టభుజిగా..అవతరిస్తాను.అక్షర సేవకై సరికొత్త అవతారికవ్రాసుకుంటా నా నవ జీవితానికి!! ***** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. […]

Continue Reading
Posted On :

నిశిరాతిరి (కవిత)

నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ దాఖలాలూలేవు. మృత్యువు ధారాపాతనడకతో వీధుల్ని శవాలుగా ముంచెత్తుతూ ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? సందులు గొందులు మూగవడినవి పనిముట్ల సందోహాలు మూలబడినవి చిక్కాలతో మూతులుముక్కులు ఆలింగనాలు లేని దూరాలవలెనేనన్న ఆనవాళ్ళ చిట్టాలిప్పలేకపోతున్నదంటూ… ఈ నిశిరాతిరి […]

Continue Reading
Posted On :

బాపట్ల నానీలు (కవిత)

బాపట్ల నానీలు – డా.సి.భవానీదేవి నీవాళ్ళు దూరమయ్యారా ? చింతించకు .. మేలు చేసుంటావు అందుకే ! అమ్మ.. నాన్న.. వెళ్లిపోయారు మట్టి మరోరూపందాల్చినా గుర్తించలేం  కదా.. శతాధిక నాటకాల పేటి కొర్రపాటి …. నాటక రచనలో ఘనాపాఠి ! సాహితీ రుద్రమ కప్పిన తొలిశాలువా నాకది బాధ్యతా పులకరింత ! బతుకంతా  నడకైనా కాళ్ళనెప్పుల్లేవు ఆరిపాదాలకు మా ఊరిమట్టి ! కిలో బియ్యం లీటర్ కిరోసిన్ కోసం రోజంతా క్యూలో … తుఫాన్ కు అంతా […]

Continue Reading
Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా చెక్కబడుతున్న శిల్పంప్రేమ సహచర్యాన్ని ఓర్వలేని కులంతెగనరికి ప్రేమంటుంటేశిలపై ఉలి మొరాయిస్తూసమ్మెటకే ఎదురుతిరిగి వెలివాడల్లో ప్రేమకోసం పరుగులెత్తుతుంటే అడుగుల్లో నవవాక్యం కనబడుతుంది ***** పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి దశలో ఎస్. […]

Continue Reading
Posted On :

తొలకరిజల్లుతో చెరువు (కవిత)

 తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు!  చెరువులో చెట్ల మధ్యన ఆడిన  దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో!  చెరువునిండాక నీటి కోళ్ల  తల మునకలు రెక్కలు ఇదిలించే నీటి తుంపరలు నీటి పాముల  సొగసైన ఈతలు! చెరువుగట్టు అడుగున ఎండ్రకాయ బొక్కలుజూసి వాటిలో పుల్లలతో కలబెట్టి అవి బొక్కనుంచి బయటకొస్తే ఆనంద డోలికలూగినవేళ! ఆవులు, […]

Continue Reading
Posted On :

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల మహోత్తుంగ జలపాతాన్ని నేను! సంపాదనలో నీ కన్నా మెరుగ్గా ఆర్జిస్తూ నీతో బాటు […]

Continue Reading
Posted On :

స్వప్న వీధిలో… (కవిత)

స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి… మనస్సు మూట విప్పుతుందో వినువీధి! ఆ వీధి మధ్యలో పచ్చటి చెట్టయి నవ్వుతుంటుంది నా మస్తిష్కం.! ఆ సందు చివర కురులారాబోసుకుంటుంది నా నవ్వుల వెన్నెల కెరటం! నడి వీధిలో నవ్వేెంటనే ఆధిపత్యపు స్వరాలు లేవు! ఆకాశపు అంచుల్లో నువ్వేెంటనే అమావాస్యపు […]

Continue Reading
Posted On :