image_print

మహర్షిణి “మదాలస”

మహర్షిణి “మదాలస” -యామిజాల శర్వాణి ప్రాచీన కాలానికి చెందిన ప్రసిద్ధ బ్రహ్మవాదిని, మహర్షిణి మదాలస. విశ్వావసుడు అనే గంధర్వ రాజు కూతురు అతిలోక సుందరి. మదాలస ఈవిడ హిందూ ధర్మములో ఒక పురాణ సంబంధమైన తల్లి ఎందుకంటే తన సంతానాన్ని జ్ఞానమార్గంలో నడిపించి న వ్యక్తి ఈవిడ. ఆదర్శవంతమైన భార్యగా తల్లిగా, వేదాంతపరమైన విషయాలలో, చర్యల లో ఆరితేరిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది. పాతాళకేతుడు అనే రాక్షసుడు ఆమె అందాన్ని చూసి మోహించి ఆమెను బలవం తంగా […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-11 వృక్ష-రసాయన శాస్త్రవేత్త ఆషిమా ఛటర్జీ (1917-2006)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-11 వృక్ష-రసాయన శాస్త్రవేత్త ఆషిమా ఛటర్జీ (1917-2006) – బ్రిస్బేన్ శారద ఆయుర్వేదం, యునాని వంటి వైద్య పద్ధతులకి భారతదేశం పుట్టినిల్లు. మొక్కలు, వృక్షాలూ, ఆకులూ, వేర్లూ, అన్నిటిలో మనిషులకొచ్చే చాలా రుగ్మతలకి మందులున్నా యని ఈ వైద్య విధానాలు నమ్ముతున్నాయి. అయితే ఆయుర్వేదం లాటి వైద్యవిధానా లు ఏ మొక్కా, లేక ఏ ఆకు ఏ జబ్బు నయం చేస్తుందో చెప్పగలవే కానీ, ఆయా ఆకుల్లో వున్న రసాయనాలకూ, వాటి లక్షణాలకూ వున్న సంబంధాన్ని […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-10 మొట్ట మొదటి ఈజిప్షియన్ మహిళా శాస్త్రవేత్త సమీరా మూసా (1917-1952)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-10 మొట్ట మొదటి ఈజిప్షియన్ మహిళా శాస్త్రవేత్త సమీరా మూసా     (1917-1952) – బ్రిస్బేన్ శారద అణు ధార్మిక శక్తి (న్యూక్లియర్ ఎనర్జీ) వల్ల ప్రపంచానికి రాబోయే పెను ముప్పుల గురించీ అందరికీ కొంతవరకైనా తెలుసు. ఆ మధ్య విడుదలైన ఒపెన్‌హైమెర్ చిత్రం అణు బాంబు తయారీ, మాన్‌హాటన్ ప్రాజెక్ట్ గురించీ చర్చించింది. అయితే అణు ధార్మికతకు వైద్య శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాలని “న్యూక్లియర్ మెడిసిన్” అని పిలుస్తారు. కేన్సర్ చికిత్స […]

Continue Reading
Posted On :

వీర మంగై (సాహస నారీ) “రాణీ వేలు నాచ్చియార్”

వీర మంగై (సాహస నారీ) “రాణీ వేలు నాచ్చియార్” -యామిజాల శర్వాణి 1790 వరకు శివగంగ సంస్థానాన్ని పరిపాలించిన రాణి వేలు నాచ్చియార్. ఈవిడ భారత దేశాన్ని ఏలుతున్న ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పై యుద్ధం చేసిన మొదటి రాణిగా ప్రసిద్ధి కెక్కింది. తమిళులు ఈవిడను “వీర మంగై ( సాహసనారీ)” అంటారు. ఈవిడ హైదర్ అలీ సైన్యం, భూస్వాములు, మరుత్తు సోదరులు దళిత కమాండర్ల అండ తో మరియు తాండవరాయన్ తో కలిసి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-9 తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-9 తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981) – బ్రిస్బేన్ శారద నేను ఈ శీర్షికన మహిళా శాస్త్రవేత్తల గురించి వ్రాయడం మొదలు పెట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని ఖండాల నుంచి కనీసం ఒక్కొక్కరినైనా పరిచయం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా, వివక్ష స్వరూపాలు ఎటువంటివైనా, దానికి ఎదురుతిరిగి అనుకున్నది సాధించేవారి వ్యక్తిత్వాలూ, తీరు తెన్నులూ ఒకేలాగుంటవి. ఆ క్రమంలో ఐరోపా, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా ముగించి న్యూజీలాండ్ వైపు […]

Continue Reading
Posted On :

కథా కథనం వొక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథపై పరామర్శ

కథా కథనం ఒక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథ పై పరామర్శ)   -ఎ. కె. ప్రభాకర్           ఇక్కడ చాలా మంది కథను చదివారు, ఇప్పుడు విన్నారు.  కానీ నేనైతే చూశాను. గీత ముఖంలో ప్రతిక్షణం కదలాడిన ఫీలింగ్స్,  వాటి వ్యక్తీకరణ రీతి, చదివేటప్పుడు గొంతులో వినిపించిన ఉద్వేగం, మాటల్లో యెక్కడయెంత అవసరమయితే అంత వూనిక, ఆ మాట వైఖరి … యిలా యిదంతా ఒక పెర్ఫార్మెన్స్. […]

Continue Reading
Posted On :

యాత్రాసాహిత్యంలో నవచైతన్యం

యాత్రాసాహిత్యంలో నవచైతన్యం -దాసరి అమరేంద్ర తెలుగువారు తమ ప్రయాణాల గురించి రాయడం మొదలెట్టి 185 సంవత్సరా లయింది (ఏనుగుల వీరాస్వామి, కాశీయాత్ర చరిత్ర, 1938). ఇప్పటి దాకా సుమారు 200 యాత్రాగ్రంథాలు వచ్చాయి. వేలాది వ్యాసాలు వచ్చాయి. ప్రయాణాల గురించి రాయా లన్న ఉత్సాహం ఉన్నవాళ్ళ దగ్గర్నించి పరిణితి చెందిన రచయితల వరకూ యాత్రా రచనలు చేసారు, చేస్తున్నారు. మొట్ట మొదటి యాత్రా రచనే చక్కని పరిణితి ప్రదర్శిం చినా నిన్న మొన్నటి దాకా యాత్రారచనలు చాలా […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-8 వృక్ష శాస్త్రవేత్త ఇసాబెల్ క్లిఫ్‌టన్ కూక్‌సన్ (1893-1973)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-8 వృక్ష శాస్త్రవేత్త ఇసాబెల్ క్లిఫ్‌టన్ కూక్‌సన్ (1893-1973) – బ్రిస్బేన్ శారద ఏ ప్రాంతంలో ఏ శాస్త్రం వృద్ధిలోకొస్తుందన్నది ఆ ప్రాంతపు భౌగోళిక, నైసర్గిక స్వరూపాల పైన ఆధారపడి వుంటుంది కాబోలు. ఆస్ట్రేలియా విశాలమైన భూ భాగం. రకరకాల వృక్షాలకీ, పశుపక్షజాతులకీ ఆలవాలం. సహజంగానే ఆస్ట్రేలియాలో వృక్ష శాస్త్రంలో చాలా పరిశోధనలు జరిగాయి. అందులోనూ దాదాపు ఇరవయ్యో శతాబ్దం మొదటి వరకూ ఆస్ట్రేలియాలో జనావాసం చాలా తక్కువ. అందువల్ల అడవులూ, చెట్లూ, పక్షులూ, జంతువులూ యథేచ్ఛగా […]

Continue Reading
Posted On :

స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

 స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’   -డా. కొండపల్లి నీహారిణి           కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-7 కెనెడాకి చెందిన మొదటి మహిళా శాస్త్రవేత్తహేరియట్బ్రూక్స్ (1876-1933)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-7 కెనెడాకి చెందిన మొదటి మహిళా శాస్త్రవేత్తహేరియట్బ్రూక్స్ (1876-1933) – బ్రిస్బేన్ శారద రేడియో ధార్మికశక్తి ప్రపంచాన్ని చాలా రకాలుగా మార్చివేసిందనడంలో అతిశయోక్తి లేదు. అణు విద్యుత్ కేంద్రాలూ, వైద్య సాంకేతికలో పెను మార్పులూ, కేన్సర్ చికిత్సా, ఒకటేమిటి ఎన్నో విధాలుగా రేడియోధార్మిక శక్తినీ, రేడియోధార్మిక పదార్థాలనూ ప్రయోగి స్తారు. రేడియోధార్మిక శక్తిని కనుగొన్నది హెన్రీ బేక్విరల్ అయితే, దాన్ని ముందుకు తీసికెళ్ళింది రూథర్ఫోర్డ్, మేడం క్యూరీ మొదలగు వారు. వీళ్ళే కాకుండా రేడియోధార్మిక శక్తీ, […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-6 స్వయంసిద్ధ గణిత మేధావి సోఫియా కొవలెవ్‌స్కీ (1850-1891)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-6 స్వయంసిద్ధ గణిత మేధావి సోఫియా కొవలెవ్‌స్కీ (1850-1891) – బ్రిస్బేన్ శారద భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి గణిత శాస్త్రం అవసరం గురించి మనం నెదర్ గురించి మాట్లాడుకున్నప్పుడే ప్రస్తావించుకున్నాం. నేను ఎమ్మెస్సీ చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్లు రెండు పేజీల జవాబుకంటే, ఒక సమీకరణమూ, దాన్ని గురించిన రెండు పేరగ్రాఫుల వ్యాఖ్యా, ఆ సమీకరణాన్ని సూచించే ఒక గ్రాఫూ- రాస్తే ఎక్కువ మార్కులిచ్చేవారు. అంటే రెండు పేజీల వివరణ కంటే ఒక్క సమీకరణంలో […]

Continue Reading
Posted On :

భారతీయతలో- జడ – ముడి

భారతీయతలో- జడ – ముడి – రంగరాజు పద్మజ వేల సంవత్సరాల నుండి ఆధ్యాత్మికంగానైనా, అందానికైనా స్త్రీ మూర్తుల జడకొక విశిష్టత, ప్రాముఖ్యత, పరమార్ధం ఉన్నదన్నదని అన్నదానికి మనకు పూర్వ కావ్యాలలో ఎన్నో ఉదాహరణలు కనపడతాయి! నేను ఎక్కువ కావ్యాలు చదవలేదు తెలిసిన నాలుగు విషయాలు ముచ్చటిద్దామని అంతే! ఋష్యశృంగ మహాముని ‘మాలినీ శాస్త్రాన్ని’ రచించాడట. విచిత్ర విషయమేమి టంటే ఆ ముని అవివాహితుడే కాక స్త్రీ పురుష భేదం తెలియకుండా పెరిగిన ముని. అటు వంటి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-5 ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-5 ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997) – బ్రిస్బేన్ శారద కొందరుంటారు. వాళ్ళని ఆపాలని ప్రయత్నించటం నిష్ప్రయోజనం. నేలకేసి కొట్టిన బంతి రెట్టింపు వేగంతో ఎలా పైకొస్తుందో అలాగే వాళ్ళని ఆపాలని ప్రయత్నించిన కొద్దీ ముందుకెళ్తారు. వారిని చూసి ఆరాధించి, అబ్బురపడి, స్ఫూర్తిని పొందడమే మన వంతు. అటువంటి వైజ్ఞానికవేత్త మన దేశానికి చెందిన కమలా సొహొనీ. భారత దేశంలో పీహెచ్‌డీ పట్టా చేజిక్కించుకున్న మొట్టమొదటి మహిళ కమలా సొహొనీ. ఆడవారికి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-4 జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-4 జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958) – బ్రిస్బేన్ శారద రచయిత సిద్ధార్థ ముఖర్జీ  “ది జీన్”  (The Gene) అనే తన అద్భుతమైన పుస్తకంలో విజ్ఞాన శాస్త్రం లో వచ్చిన గొప్ప మలుపులు- అణువు, జన్యువు, కంప్యూటర్ బైట్ (atom, gene, byte) అంటాడు. అణువు- భౌతిక పదార్థం యొక్క మౌలిక (లేదా ప్రాథమిక) పదార్థం అయితే, జన్యువు-జీవ పదార్థానికి ప్రాథమిక మూలం, కంప్యూటర్ బైట్ సమాచారానికి మౌలికమైన అంకం అనీ ఆయన అభిప్రాయపడ్డారు. […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-3 మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-3 మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852) – బ్రిస్బేన్ శారద విజ్ఞాన శాస్త్రం అంటే సాధారణంగా, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం, జీవ శాస్త్రాలు అని అనిపిస్తాయి. ఎందుకంటే, ఈ శాస్త్రాలు మన చుట్టూ వున్న, అనుభవంలోకి తెచ్చుకో గలిగే జీవితాన్నీ, జీవరాసుల్నీ అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి కనక. ఈ అర్థం చేసుకోవాల్సిన ప్రపంచం కంటికి కనిపించే జగత్తయినా కావొచ్చు, కంటికి కనిపించని పరమాణు శక్తులైనా కావొచ్చు, గ్రహరాశుల కూటమి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-2 జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-2 జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717) – బ్రిస్బేన్ శారద మనిషికి జిజ్ఞాస ఎక్కువ. చుట్టూ వున్న ప్రపంచాన్ని తెలుసుకోవాలనీ, అర్థం చేసుకోవాలనీ, వీలైతే తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆశలు మనిషిని ప్రపంచాన్ని వీలైనంత దగ్గరగా చూడమని ప్రేరేపిస్తూ వుంటాయి. ఆ మాట కొస్తే, చూడగలిగే ప్రపంచాన్నే కాదు, కంటికి కనిపించని పరమాణు రూపాన్నీ, ఖగోళ రాసుల్నీ కూడా తెలుసుకోవాలని నిరంతరమూ ప్రయత్నిస్తూనే వుంటుంది మానవ మేధస్సు. అలాటి ఒక శాస్త్రమే జీవ […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-1 ఉపోద్ఘాతం & ఎమ్మీ నెదర్

విజ్ఞానశాస్త్రంలో వనితలు-1 ఉపోద్ఘాతం & ఎమ్మీ నెదర్ – బ్రిస్బేన్ శారద నడిచొచ్చిన బాట ఎప్పుడూ మరవకూడదన్నారు పెద్దలు. గతాన్ని తవ్వుకోవడమంత వృథాప్రయాస ఇంకోటుండదు, అని అనిపిస్తుంది మనకి. కానీ అలా గతాన్ని పునరావృతం చేసుకున్నప్పుడే మన ముందు తరాలు మన బాటని సుగమం చేయడాని కెంత శ్రమ పడ్డారో, ఎన్ని కష్ట నష్టాలకోర్చారో, దానికై ఎంత పాటు పడ్డారో మనకి అవగత మవుతుంది. అప్పుడే మనం అనుభవిస్తున్న స్వేఛ్ఛాస్వాతంత్రయాలనీ, జీవన విధానంలో లభిస్తున్న సౌకర్యాలనీ గౌరవించగలం. […]

Continue Reading
Posted On :

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం! -కొండేపూడి నిర్మల డా.కె.గీత ఇటీవల వెలువరించిన అపరాజిత స్త్రీవాద కవితా సంకలనంలో 93మంది కవయిత్రులు వెలువరించిన 168 కవితలు ఉన్నాయి. 85 నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీల కవితలు- స్త్రీవాద కవితలు మధ్య వున్న చిన్నసరిహద్దు గీత స్పష్టంగా ఎవరికీ అర్ధంకావడం లేదు. అపరాజితతో బాటూ, ఇంత క్రితం వచ్చిన గురిచూసి పాడే పాట , నీలిమేఘాలు సంకలన సందర్భాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ గతం ప్రస్తావించకపోతే […]

Continue Reading
Posted On :

ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్

ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్ -నీలిమ వంకాయల           సినిమా రంగానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డుల రేసులో  తెలుగు సినిమా నిలవాలి అనేది తెలుగువారందరి తపన. ఈసారి ఆ అవకాశం ‘ఆర్. ఆర్.ఆర్’ దక్కించుకుంటుంది అనే ఆశ నిరాశ అయినప్పటికీ మన తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మించిన చిత్రం   ‘జాయ్‌లాండ్’ ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైంది.           అపూర్వ హైదరాబాద్‌లో పుట్టి […]

Continue Reading
Posted On :

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం -డా. ప్రసాదమూర్తి ‘ఒకడు ప్రోత్సహింప..ఒకడేమొ నిరసింపఒకడు చేర బిలువ ఒకడు తరుమమిట్టపల్లములను మెట్టుచునెట్టులోపలుకులమ్మ సేవ సలిపినాడ” – జాషువా.           తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వాడు, కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వాడు మహాకవి గుర్రం జాషువా. ఈరోజు జాషువా జయంతి. జాషువా రచనా ప్రస్థానం సాగిన కాలాన్ని, ఆ చరిత్రను పరిశీలించి అతి జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సాహిత్య […]

Continue Reading
Posted On :

దేశ బాంధవి, “దువ్వూరి సుబ్బమ్మ”

దేశ బాంధవి, “దువ్వూరి సుబ్బమ్మ” -యామిజాల శర్వాణి మనదేశానికి స్వాతంత్య్రము అనేక త్యాగమూర్తుల ఫలితము. ఎంత మందో వారి ఆస్తులను సంసారాలను వదలి జైళ్లలో మగ్గి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని అమరు లైనారు నేటి తరానికి అటు వంటి త్యాగధనుల పేర్లు చాలా మటుకు తెలియదు. స్వాతంత్య్ర పోరాటనికి నాయకత్వము వహించిన గాంధీ, నెహ్రు లాంటి నాయకుల పేర్లు చరిత్ర పాఠాల్లో ఉండటం వల్ల తెలుస్తున్నాయి. కానీ, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధుల […]

Continue Reading
Posted On :

వైదేహి వేదనాశ్రువు చెప్పిన కథ (డా. లక్ష్మీపార్వతి గారి నవలపై ప్రత్యేక వ్యాసం)

వైదేహి వేదనాశ్రువు చెప్పిన కథ (డా. లక్ష్మీపార్వతి గారి నవలపై ప్రత్యేక వ్యాసం) -డా.సిహెచ్.సుశీల “ప్రకృతి నుంచి ఆవిర్భవించిన పంచభూతాలు తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడి చేసినట్టు –  స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు. తరాలు గడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతరార్థం ఒక్కటే. నాటి వైదేహి నుంచి నేటి నిర్భయ వరకు జరుగుతున్న చరిత్ర ఇదే…” అంటూ  శ్రీమద్రామాయణం లోని “సీత” పాత్రలో ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని ” వైదేహి” […]

Continue Reading
Posted On :
rajeswari diwakarla

బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు

బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు -రాజేశ్వరి దివాకర్ల బసవేశ్వరుడు తలపెట్టిన, సామాజిక,ఆర్థిక, ధార్మిక ప్రగతికి ఆతని ఇల్లే కార్యక్షేత్రం అయింది. ఆతని ఆశయ సిద్ధికి, భార్యలైన గంగాంబిక, నీలాంబిక, ఆతని సోదరి అక్క నాగమ్మ అండగా నిలిచారు. ఆనాటి విప్లవ నాయకుని జీవితంలో ఈ మూవురు మహిళలు పోషించిన పాత్ర అసమానమైనది. బసవేశ్వరుడు శరణులకు సమకూర్చిన “మహామనె” (మహాగృహం)లో ప్రతి రోజు లక్షా తొంభై ఆరువేల జంగములకు సత్కారం జరిగేది. వారికి పై ముగ్గురు వండి వడ్డించే […]

Continue Reading
Posted On :

మహమ్మద్ ఘోరిని ఓడించిన వీరాంగన “రాణి నాయికి దేవి”

మహమ్మద్ ఘోరిని ఓడించిన వీరాంగన “రాణి నాయికి దేవి” -యామిజాల శర్వాణి గ్రీకు చరిత దగ్గరనుంచి ప్రపంచ చరిత్రలో ఎందరో వీరనారుల చరిత్రలు చదువుతాము వీళ్ళు పురుషులకు ఏ మాత్రము తీసిపోకుండా యుద్దాలు చేసి ఘనత వహించారు పరిపాలనలోను శత్రువులను ఎదుర్కోవటము లోవారిదైనా ముద్ర వేశారు.కానీ మన దేశ చరిత్రలో అటువంటి వారిని తక్కువగా కీర్తించి విదేశ ఆక్రమణదారులను గొప్ప హీరోలుగా చిత్రకరించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇదంతా మనము ఎక్కువకాలం బ్రిటిష్ వారి పాలనలో ఉండటమే వాళ్ళు చరిత్రను వాళ్లకు అనుకూలముగా వ్రాసుకున్నారు నేటికీ ఆ చరిత్రనే […]

Continue Reading
Posted On :
lavudya

లంబాడీ మూఢనమ్మకాలు-‘కాక్లా’ కథ (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

లంబాడీ మూఢనమ్మకాలు-‘కాక్లా’ కథ (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -డా.లావుడ్యా సుజాత ఆదివాసీ సమాజంలో ఒక్కో తెగ విశిష్ట క్షణాు ఒక్కో విక్షణరీతిలో ఉంటాయి. భారతదేశంలో నివసిస్తున్నా  గిరిజన తెగన్నీ విడివిడిగా ప్రత్యేకంగా తమ జీవన విధానాు, విశ్వాసాు, నమ్మకాు, మూఢనమ్మకాను కలిగి ఉంటాయి. దైవాలే కాదు వారి సంస్కృతు కూడా విడివిడిగానే ఉంటాయి. ఈ మూఢనమ్మకం నేపథ్యంగా మెవడినదే ‘కాక్లా’ కథ. ‘కాక్లా’ కథా రచయిత డాక్టర్‌ భూక్యా తిరుపతి. […]

Continue Reading
Posted On :

సమ్మోహన ఇంద్రచాపం

సమ్మోహన ఇంద్రచాపం -డా.దిలావర్ శేషేంద్ర బడి నుండి బుడి బుడి అడుగులతో మొదలై సొంత ‘కళా శాల ‘వరకూ సాగింది రఘు కవిత్వ  ప్రస్థానం.అగరొత్తుల ధూపం నిలువెల్లా కమ్ముకోవడం ఎప్పుడైనా అనుభవించారా?మనసును పులకింప జేసే హరిచందన గంధాన్ని ఎప్పుడైనా ఆఘ్రాణించారా?మత్తు గొలిపే అత్తరుల గుబాళింపును ఎప్పుడైనా అనుభూతించారా…?లేదా…?ఐతే…రఘు కవిత్వంలోకి డైవింగ్ చేయడానికి సంసిధ్ధంగా ఉండండి….రఘు కవిత్వం ఒలికే వెన్నెల సోనల్ని ఆస్వాదించండి. ధ్వనికి రంగును,రంగుకు వాసననూ,వాసనకు రుచినీ భ్రమింప జేశారు ఫ్రెంచ్ సింబలిస్ట్ కవులు.గజి బిజిగా ఉందా? […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

సాహిత్య రంగంలో సామాజిక మాధ్యమం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

సాహిత్య రంగంలో సామాజిక మాధ్యమం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -టి. హిమ బిందు రోజు రోజుకు కొత్త మార్పులు కొత్త హంగులతో ఎంతో వేగంగా అందరికీ అందుబాటులోకి వస్తున్న సాంకేతికత దాని అంతర్భాగమైన సామాజిక మాధ్యమాలు సమాజంలో భౌతికంగా మానసికంగా ఎంతో భిన్నమైన ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేకమంది రచయితలు తమ తమ రచనలను, భావాలను సామాజిక మాధ్యమాలలో పంచుకోవటం వలన అనేకమంది వీక్షించి చదివి […]

Continue Reading
Posted On :

డా||కె.గీత కథ “ఇవాక్యుయేషన్”పై సమీక్ష

 డా|| కె.గీత కథ “ఇవాక్యుయేషన్”పై సమీక్ష -వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఇది ప్రత్యేకమైన కథ. తీసుకున్న వస్తువు కాలిఫోర్నియాలోని శాన్ప్రన్సిస్కోలో తీర ప్రాంతపు కాలనీలకు వాటిల్లే పెను విపత్తు గురించి. అది భీకరమైన అగ్నిప్రమాదానికి చెందినది.కష్టపడి సంపాదించి పొదుపుచేసి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు కొన్ని గంటల్లో అగ్ని కి గురి కాబోతోంది. ఇవాక్యుయేషన్ హెచ్చరిక వచ్చింది. ఎవరైనా సరే ఉన్నఫళంగా గంటలో ఇల్లు వదిలిపోవలసి వస్తే వారి మానసిక పరిస్థితి ఏమిటి ఊహించగలమా?!అనుభవిస్తే తప్ప తెలియదు.అసలే కరోనా […]

Continue Reading
Posted On :

తెలుగు కథ – వృద్ధుల సమస్యలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

తెలుగు కథ – వృద్ధుల సమస్యలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -డా .గురజాడ శోభా పేరిందేవి సామాజిక దృక్పథంతో ముందుకు సాగుతూ వచ్చింది నాటి నుండి తెలుగు కథ. కులాధిపత్యంతో అణచివేతకు గురైన ప్రాంతం నుండి ఆర్తి కథలు,ఆకలి కథలు,అన్యాయాన్ని ఎదిరించిన కథలు వచ్చాయి.  పాతకాలం నాటి సామాజిక దృక్పథంతో ఉండి సమాజాన్ని ఓ కంట కనిపెడుతూ ఉన్నాయి.కంటకింపుగా ఉన్నవాటిని గూర్చి ప్రశ్నిస్తూ పరిస్థితి మారాలని ఘోషిస్తున్నాయి. కందుకూరి వారి […]

Continue Reading
Posted On :

అంతర్జాల మాస పత్రికలు – అవలోకనం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

అంతర్జాల మాసపత్రికలు – అవలోకనం -డా . జడా సుబ్బారావు ఉపోద్ఘాతం: అంతర్జాలం ఒకప్పుడు అందని ద్రాక్ష. ఇప్పుడు మాత్రం అంగిట్లో ద్రాక్ష. కేవలం ఇంగ్లీషు మాత్రమే చెలామణిలో ఉన్న అంతర్జాలం స్థితి నుంచి తెలుగుభాషామానుల కృషి ఫలితంగా తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకునే స్థితికి ఎదగడం అభినందనీయం. తెలుగులో ఎన్నో వెబ్సైట్లు మొదలవడమే కాకుండా విఙ్ఞానసర్వస్వంగా పేరుపడిన వికీపీడియా కూడా విజయవంతంగా ప్రారంభించబడి దేశభాషలన్నిటిలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. అంతర్జాలం వల్ల తెలుగుభాషా సాహిత్యాల […]

Continue Reading
Posted On :
archarya

ఆధునిక మహిళ చరిత్రను పునర్నిర్మిస్తుంది

ఆధునిక మహిళ చరిత్రను పునర్నిర్మిస్తుంది -ఆచార్య శివుని రాజేశ్వరి స్త్రీలు తమచుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా వారిని వారు ఎలా అర్థం చేసుకోవాలి? వారిఫై వారికిగల అధికారాన్ని ఎలా నిలుపుకోవాలి? అన్ని రకాల అధికారాలలోంచి, భ్రమ (మిథ్)ల నుంచి ఎలా విముక్తి పొందాలి? తమ అంతరంగ జ్ఞానం ద్వారా తమ వ్యక్తిత్వ పరిణామాన్ని ఎలా పెంపొందించుకోవాలి? తద్వారా తమను ఎలా స్థిరీకరించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించినవి గురజాడ రచనలు. గురజాడ మేధస్సు […]

Continue Reading
Posted On :

అస్తిత్వ కేతనం – లక్ష్మీ సుహాసిని

 అస్తిత్వ కేతనం – లక్ష్మీ సుహాసిని -వి. శాంతి ప్రబోధ ఆమె చందమామలా నవ్వుతుంది   గాలితో ఈలలు వేయిస్తూ పాడుతుంది ఆశ మనిషికి శ్వాస కావాలంటుంది భిన్నత్వాన్ని గౌరవిస్తుంది .  అస్తిత్వాలేవైనా మనుషులందరినీ ఒకే లాగా చూస్తుంది.   ప్రేమ వెన్నెల చిలకరిస్తుంది.   గాలి వీస్తే, వాన వస్తే, వరద పొంగితే, ఉత్పాతం వస్తే చెదిరిపోదు. కదిలిపోదు. మరింత రాటుదేలుతుంది. తనను తాను నిలబెట్టుకుంటుంది.   అసమానతల వలయంలోంచి  అస్తిత్వ కేతనం ఎగురవేస్తుంది.  ఆవిడెవరో కాదు సమాజానికి పత్ర చిత్రకారిణిగా, కళాకారిణిగా, సాహితీ సృజనశీలిగా, అధ్యాపకురాలిగా, సామాజిక కార్యకర్తగా బహు ముఖాల్లో చిరపరిచితమైన లక్ష్మీ సుహాసిని. ఆమె ఏ పని చేసినా ఆ పనితో చీకట్లను తగలేసి వెలుగు బావుటా […]

Continue Reading
Posted On :
karimindla

తెలంగాణ కవయిత్రులు

 తెలంగాణ కవయిత్రులు -డా. కరిమిండ్ల లావణ్య తెలంగాణలో మహిళలు రాసిన కవిత్వం 19వ శతాబ్దం పూర్వార్థం నుంచే కనబడుతున్నది. నిజాం పరిపాలన ప్రభావం మహిళల విద్యపై ఉన్నప్పటికీ చదువుకున్న మహిళలు వారి కవిత్వం ద్వారా మహిళలను చైతన్యపరచాలనే ప్రయత్నం ఆనాటి కవిత్వంలో కనిపిస్తున్నది. 19వ శతాబ్దానికి పూర్వం క్రీ॥శ॥ 1230-1300 ప్రాంతంలో నివసించిన కుప్పాంబిక రంగనాథరామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి కూతురు. ఈమె రాసిన పద్యాన్ని అయ్యలరాజు సంకలనం చేసిన గ్రంథంలో ఉన్నదని “తొలి తెలుగు కవయిత్రి […]

Continue Reading
Posted On :

సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు

 సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు -సాయి వెంకట రాజు.బి కన్నీళ్ళు పెట్టిన కళ్ళే తప్పా, కాంతులు సూన్యం అయిన బతుకులు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళా సంక్షోభం తప్ప, సంక్షేమం సరైన రీతిలో లేదు అని అన్నదే వాస్తవం.కరోనావైరస్ మహమ్మారి ప్రారంభం నాటినుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఏడాది గడిచినప్పటికీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడటం లేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం 2020-21 దేశ జీడీపీపై తీవ్రంగా ప‌డింది. 2021 ఆర్థిక […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ  ప్రత్యేక రచనలకు ఆహ్వానం: నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవం (జూలై 10, 2021) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. అందులో నుంచి ఒక ఉత్తమమైన రచనకు రూ.1000 (వెయ్యి రూపాయలు) పారితోషికంతో బాటూ “నెచ్చెలి ఉత్తమ రచన […]

Continue Reading
Posted On :

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో)

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో) -శాంతారామ్ ఇలాటి తాతయ్య వుంటే బావుండు అనిపించేలా , తాతయ్య లేనివాళ్లకు అసూయ పుట్టించేలా కాళీపట్నం రామారావు గారి మనవడు  శాంతారామ్ గారి స్మృతులు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. (సేకరణ: ఫేస్ బుక్  నుండి)    తాతగారు 4-6-2021 ఉదయం 8:20కి వెళ్ళిపోయారు. పొద్దున్నలేచి టీ తాగి అత్తతో ప్రేమగా మాట్లాడి, అత్త చేతిలో వెళ్ళిపోయారు. ఆయన వయసు 97 అయినా, తాతగారు […]

Continue Reading
Posted On :

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం -ఎన్.ఇన్నయ్య భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నాయకులను నిర్బంధించిన సంవత్సరంలో, 1975 మదర్ తెరీసా హైదరాబాద్ పర్యటించారు. పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల కార్యక్రమానికి వచ్చిన ఆమెను, ఆంధ్రజ్యోతి ఛీఫ్ రిపోర్టర్ గా కలసి ఇంటర్వ్యూ చేశాను. ఏది అడిగినా అంతా దైవేచ్ఛ అని సమాధానం యిచ్చిన ఆమె నుండి, ఎలాంటి ఉపయోగకర విషయం సేకరించలేక, నిరుత్సాహపడ్డాను. కనీసం ఫోటో తీసుకోలేదని తరువాత అనుకున్నాను. మెసిడోనియా దేశానికి చెందిన తెరీసా, అల్బేనియా దంపతుల […]

Continue Reading
Posted On :

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)  -మణి కోపల్లె నేడు ఇంటర్నెట్ అతి వేగంగా దూసుకుపోతూ  సెల్ ఫోన్ లలోనూ ఇంటర్నెట్ లభ్యమవ్వటంతో ప్రింట్ మీడియాలో వచ్చే అన్ని  పత్రికలు  నేడు ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి .  అంతర్జాలం ఆవిర్భవించిన తొలినాళ్లలో  అంటే  1999 కి ముందు వున్న నెట్ ని (రీడ్ ఓన్లీ)వెబ్ 1.0 గా వర్ణించారు.  ఆ సమయంలో ప్రముఖ పత్రికలు వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే ఖతులను […]

Continue Reading
Posted On :

నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట)

నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట) -జఘనరాణి శర్మ ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు, సాహితీ ప్రియులు ఐన శ్రీ చిర్రావూరి సర్వేశ్వర శర్మగారి శతజయంతి ప్రారంభోత్సవ వేడుక ఈ నెల ఫిబ్రవరి 17 న అంతర్జాల వేదిక ద్వారా జరిగింది. ఆ సందర్భంగా వయోలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారు ఆవిష్కరించిన “నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” పుస్తకం లో ప్రచురితమైన వారి పెద్ద కుమార్తె వ్రాసిన “నా జ్ఞాపకాల్లో నాన్నగారు” అన్న […]

Continue Reading
Posted On :

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -యామిని కొళ్లూరు ఏ రచన అయితే మనల్ని మనం సంస్కరించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రేరణనిస్తుందో ఏ రచనను అధ్యయనం చేయడం వల్ల  సామాజిక స్పృహ , చైతన్యం మనలో అంకురిస్తాయో ఏ రచన మనలను కర్తవ్యోన్ముఖలను చేస్తుందో ఆ రచన ద్వారా వెలుగు చూసిన సాహిత్యాన్ని మంచి సాహిత్యం లేదా ఉత్తమమైన సాహిత్యం అనవచ్చు. ఒక […]

Continue Reading
Posted On :

హేమలతా లవణం

హేమలత (1932-2008) అనన్య సామాన్యకృషి -ఎన్.ఇన్నయ్య  ఆంధ్రప్రదేశ్‌లో తెంగాణాలో చిరకాలంగా ఆచరణలో వున్న దేవదాసి, జోగిని పద్ధతులను తొలగించడంలో హేమలత ఎదురీది సాధించారు. దేవుడి పేరిట అట్టడుగు వర్గాల స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టిన దురాచారమే జోగిని పద్ధతి. తెలంగాణాలో నిజామాబాద్‌ జిల్లాలో నాటుకుపోయిన ఈ దురాచారం చిరకాంగా, ఎవరూ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. అటువంటి దశలో హేమలత రంగప్రవేశం చేసి, ఎదురీది చాలా వరకు జోగిని దురాచారాన్ని ఆపించగలిగింది. హేమలత సుప్రసిద్ధ కవి గుర్రం జాషువా కుమార్తె. […]

Continue Reading
Posted On :
karimindla

వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. కరిమిండ్ల లావణ్య మనిషి జీవితంలో బాల్యం అత్యంత ముఖ్యమైనదశ. ఈ దశపైనే వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటుంది. అందుకు గేయ సాహిత్యం తోడ్పడుతుంది. దీనివల్ల బాలల్లో మానవ  విలువల పరిరక్షణ పెరుగుతుంది. సృజనాత్మకత పెంపొందించబడుతుంది. భావ పరిపక్వత, మనోవికాసం కలుగుతుంది. మానవత్వ వికాసమే సాహిత్యపు ప్రధాన కర్తవ్యం. గేయ సాహిత్యం సామాజిక, సాంస్కృతిక వికాసంతో పాటు శాస్త్రసాంకేతిక విజ్ఞానాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ గేయాల్లో బాలసాహిత్యానికి […]

Continue Reading
Posted On :
archarya

తిలక్ కథలు – చెహావ్ ప్రభావం

తిలక్ కథలు – చెహోవ్ ప్రభావం -ఆచార్య యస్. రాజేశ్వరి కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాల వంటి- వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల వంటి నిశిత పరిశీలనతో నిలిచిన మణి దీపాల వంటి- తిలక్ కథలు 20 సేకరించి 1967లో ప్రచురించారు ప్రకాశకులు. వాటికి మరి 9 కథలు కలిపి 1983 ద్వితీయ ముద్రణ వెలువరించారు. 1921లో పుట్టిన తిలక్ 11వ ఏటనే కథలు రాయడం మొదలుపెట్టాడు. తాను 1966 లో తనువు చాలించే వరకు కథలు, […]

Continue Reading
Posted On :

డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. గడ్డం శ్యామల అత్యాధునిక తెలుగు సాహిత్యంలో సదస్సు (సెమినార్‌) అంటే పెద్ద సాహసమే. సాహిత్య వృక్షం, కొమ్మలు, రెమ్మలు, పూవులు, కాయలు, పళ్ళతో విస్తరిస్తున్న సమయం 2000-2020. ఒక విధంగా చెప్పాంటే 1980 వరకు వచ్చిన తెలుగు సాహిత్యం ఒక ఎత్తు – 80 తరువాత వచ్చిన సాహిత్యం మరొక యెత్తు. 2000-2020 మధ్య వెలువడిన సాహిత్యం సముద్రం. అందులో రత్నాలు ఉంటాయి. రాళ్ళూ ఉంటాయి, […]

Continue Reading
Posted On :

గోడమీద అడవి

గోడమీద అడవి -దేవనపల్లి వీణావాణి అటవీ శాఖ పనుల తనిఖీ కోసం ఈ రోజు మా బృందం ఏటూరునాగారం నుంచి గోదావరి నదికి కింది వైపు ఉన్న అడవికి వెళ్లాం. దారిలో చిన్న చిన్న గ్రామాలు. గోదావరి నదికి ఆనుకొని ఉన్న  గూడాలను 1986 ప్రాంతంలో వచ్చిన వరదల కారణంగా నదికి దూరంగా అడవిలో నివాసం కల్పించినందు వల్ల  ఈ గ్రామాలు ఏర్పడ్డాయి.  గత ముప్పై ఏళ్లుగా అడవిలో దొరికే మట్టి కర్రలను ఉపయోగించి కట్టుకున్న కుటీరాలే […]

Continue Reading
Posted On :

జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -సోనబోయిన సతీష్ జానపద విజ్ఞానాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించినట్లయితే తరతరాల స్త్రీల సామాజిక ఆర్థిక పరిస్థితులే కాక పురుషాధిపత్య సమాజం స్త్రీ జీవితాన్ని ఏ విధంగా అణచివేసిందో, స్త్రీల సమస్యలు ఏ విధంగా అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయో అవగతమవుతుంది. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యానిదొక పెద్ద శాఖ. మానవ సంబంధాల […]

Continue Reading
Posted On :

సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -రాఘవేందర్ రెడ్డి బెంకి పరిచయం: మానవ సమాజం ఆదిమానవుని దగ్గర మొదలుకొని నేటి ఆధునిక, అత్యాధునిక యుగం వరకూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ పరిణామంలో ఎన్నో మార్పులను చూస్తూ వస్తుంది. ఆ మార్పులలో చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైనవి. వాటన్నింటినీ సాహిత్యం రికార్డు చేస్తూ, విశ్లేషిస్తూ, […]

Continue Reading
Posted On :

తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

 తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -రోహిత్ ఆదిపూడి తెలుగు భాషాచరిత్రలో మనకు లభ్యముగా ఉన్న వాంజ్మయంలో పద్యకవిత్వం అత్యంత దృఢమైన స్థానం సంపాదించుకుంది. అతిప్రాచీన కాలం నాటినుండి, ఆదికవిగా పేరు గాంచిన నన్నయభట్టారకుని ఆంధ్రమహాభారతముతో మొదలుకొని, పోతన ఆంధ్రమహాభాగవతమూ, కవిసార్వభౌమునిగా బిరుదుగొన్న శ్రీనాథుని భీమఖండము, శృంగారనైషథము, కవిత్రయము లో చోటు సంపాదించుకొన్న తిక్కన, యెర్రాప్రగడా మహాభారత స్వేచ్ఛానువాదఘట్టములు, […]

Continue Reading
Posted On :

మణిబెన్ కారా

మణిబెన్ కారా (1905-1999) -ఎన్.ఇన్నయ్య   1905లో బొంబాయిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మణిబెన్, సెయింట్ కొలంబియా హైస్కూలులో చదివి, బర్మింగ్ హాంలో సోషల్ సైన్స్ డిప్లొమా పొందారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బొంబాయిలో సేవామందిర్ స్థాపించి, ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.  బొంబాయి రేవు కార్మికోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నేత కార్మికులకు సేవ చేశారు.  బొంబాయిలో లేబర్ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొని, సమ్మెలు నిర్వహించారు.  స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ విదేశీయుల సహాయం స్వీకరించే పనుల్లో పర్యటనలు […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-7

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-(చివరి భాగం)  -డా.సిహెచ్.సుశీల   స్త్రీకి విద్య కావాలి , స్వేచ్ఛ కావాలి , గౌరవం కావాలి , సమానత్వం కావాలి అంటే – ఎవరు ఇవ్వరు . ఒకరు ఇస్తే తీసుకునవి కావవి. అందుకే పదునైన సాహిత్యంతో కవితలు కథానికలు నవలలు సాధనంగా హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి సంస్కరణను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్త్రీలు భావించి ఆచరణలో పెట్టారు .  స్త్రీ సముద్ధరణకైై స్త్రీలు పోరాడటం కేవలం ఆత్మ రక్షణకై పరిమితమవుతుంది కొన్నిసార్లు .      […]

Continue Reading
Posted On :

సరోజినీ నాయుడు

ఉత్తమ ఉపాధ్యాయురాలు – ఆన్ సులివాన్ -శర్వాణి ఒక ఆణిముత్యాన్ని లోకానికి అందించిన ఉపాధ్యాయురాలు “ఆన్ సులివాన్”.  ఆ ఆణిముత్యం మరెవరోకాదు  ప్రపంచములో ఆత్మవిశ్వాసముతో అంగ వైకల్యాన్నిజయించి జీవించి చూపిన మహత్తర మహిళ “హెలెన్ కెల్లర్” . ఆవిడ పేరు విననివారు సామాన్యముగా వుండరు ఆవిడ  వికాలుంగుల సంక్షేమార్థము నిరంతరముశ్రమించిన మహిళా కెల్లర్. అంగవైకల్యముతో కృంగిపోయిన వారిలోఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కర దీపికగా కేల్లర్ నుఅభివర్ణిస్తారు కానీ ఆశ్చర్యము ఏమిటి అంటే కెల్లర్ వంటి దీపాన్నివెలిగించిన కొవ్వొత్తి […]

Continue Reading
Posted On :

రచయిత్రుల కథానికల్లో వెనుకబాటుతనం ప్రభావం

రచయిత్రుల కథానికా సాహిత్యంపై వెనకబాటుతనం ప్రభావం -శీలా సుభద్రా దేవి భౌగోళిక, రాజకీయ కారణాల వలన రాష్ట్రమంతటా ఇటీవలకాక యింతకు పూర్వం చాలాకాలంనుండీకూడా అభివృద్ధి ఒకే రకంగా లేదు. తెలుగు మాట్లాడే ప్రాంతం కొంత ఆంగ్లేయుల పాలనలోనూ, మరికొంత నవాబుల పాలనలోనూ వున్న కాలంనుండీకూడా అభివృద్ధి ఎగుడుదిగుడులుగానే వుంటూ వస్తోంది. భౌగోళికంగాకూడా రాష్ట్రం మొత్తం సమతలంగా లేదు. సుమారు సగభాగం దక్కను పీఠభూమిగా వుండి రాళ్ళూ రప్పలతో పూర్తి మెరకప్రాంతంగా వుంది. సముద్ర తీర ప్రాంతం పల్లంలో […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-6 సలీం కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.  ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.   […]

Continue Reading
Posted On :

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం -శీలా సుభద్రా దేవి వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, నా పరిశీలనాంశాలనూ ఈ వ్యాసంలో ప్రస్తావించదలిచాను. ఏ కాలంలో జీవిస్తున్న రచయిత్రి రచనలపై ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రతిబింబించటం సహజం అనేది ప్రతితరంలోనూ గమనించగలం. తొలితరం కథారచయిత్రులు సుమారు పదిహేనుమంది వరకూ ఉన్నట్లు […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5 పాపినేని శివశంకర్ కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.  ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.   […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -కథానికలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -డా.సిహెచ్.సుశీల ఆచార్య ఇనాక్ గారు ఈతరం సాహిత్యవేత్తలలో  కొన్ని ప్రముఖమైన వాదాలను వేదాలు గా మార్చాలని కలలు కంటున్న స్వాప్నికుడు. ఆయన వినిపించిన కొన్ని నివేదనలు – నివేదనలు గాక, పరివేదనలుగా సంఘంలో వెలుగుచూస్తున్నాయి. దళిత వాదానికి వకాల్తా పుచ్చుకున్న ప్రముఖుల్లో ప్రముఖునిగా, స్త్రీవాదాన్ని ముట్టీ ముట్టనట్లు ముట్టుకొని, అనాచారాల అరాచకాలని మక్కెలు విరగొట్టడం ఆయనకే చెల్లింది.  పీడిత ప్రజల పక్షం వహించి పెద్దల, అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-7 ఈ- పత్రికలు

తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు  -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక “లేఖిని” వంటి సాధనాలతో ఆన్ లైన్ లో తెలుగు సులభంగా రాయడం వంటివి సాధ్యమయ్యేయి. ఇందువల్ల అంతకు ముందు వరకూ యాహూ గ్రూపు, గూగుల్ గ్రూపు వంటి చర్చావేదికల్లో RTS పద్ధతిలో తెలుగుని ఇంగ్లీషులో […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3 ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -డా.సిహెచ్.సుశీల ఎండ్లూరి సుధాకర్ సుధామయ కవిత్వం గోదావరి తరంగిణీ శీతలత్వాన్ని , సామాన్య పాఠకుడికి కవితా కమ్మదనాన్ని అందిస్తూ, దళిత కవిత్వంతో నిప్పురవ్వల్ని రగిలించడమేకాక “స్త్రీవాదాన్ని” కూడా నిజాయితీగా నిలిపారు. స్త్రీల సమస్యలను సౌమనస్యంగా ఆవిష్కరించారు.   “నాన్న కొట్టినప్పుడు ఒక మూల    ముడుచుకొని పడుకున్న    “అమ్మ”లా ఉంటుంది ….”అన్నప్పుడు ఇది ఏదో దైనందన సమస్యలా తోచవచ్చు. కానీ ఇది అన్ని ఇళ్లల్లో పురుషాహంకారానికి స్త్రీలు ఒగ్గి, […]

Continue Reading
Posted On :

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం గణేశ్వరావుగారి వ్యాఖ్య & చేకూరిరామారావు గారి ముందుమాట -జ్వలిత ‘నీలి మేఘాలు’ తర్వాత  జ్వలిత సంపాదకత్వం వహించిన ‘పరివ్యాప్త’ వచ్చి దశాబ్దం అవుతోంది.  ఆ స్థాయిలో, అంత విస్తృతంగా వున్నా మరో కవిత సంకలనం వచ్చినట్లు లేదు. 110 మంది కవులు, ప్రధానంగా స్త్రీల సమస్యలున్నా, స్త్రీలే కాకుండా పురుషులు రాసిన కవితలు, ప్రసిద్ధులతో పాటు అప్రసిద్ధులు, పాత కొత్తల మేలు కలయిక, సంప్రదాయత తొ పాటు నవ్యత, మెరుపుల్లాంటి వస్తువు […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-9 ( జోర్డన్ ఆండర్సన్ & గ్రేటా థూన్ బెర్)

ఉపన్యాసం-9 మీకెంత ధైర్యం? వక్త: గ్రేటా థూన్ బెర్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: మూడు రోజుల క్రితం …… సెప్టెంబర్ 23 న ….. అమెరికా ….. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన “క్లైమేట్ ఆక్షన్ సమ్మిట్” లో ……. ముక్కుపచ్చలారని పదహారేళ్ళ స్వీడిష్ అమ్మాయి ….. గ్రేటా థూన్ బెర్ …. వందలాది ప్రపంచ దేశాధినేతలకు హెచ్చరికలు జారీచేసింది! కేవలం ఓ సంవత్సరం క్రితం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఈ అమ్మాయి […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-2

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-2 -డా.సిహెచ్.సుశీల డాక్టర్ శివారెడ్డి కవిత్వం లో “ఆమె” ఒక ప్రధాన అంతః స్రోతస్విని. ఈ “ఆమె” స్త్రీయే. తల్లిగా తన పాత్ర నిర్వర్తించిన మహనీయురాలు. భార్యగా తన వంతు నిండుగా నిర్వహించిన సహచరి. కూతురుగా గారాలు పోయింది. తోబుట్టువుగా అనురాగాన్ని పంచింది. కానీ ఆమె  ప్రాధాన్యాన్ని పక్కకు నెట్టి అన్ని విధాల అణగదొక్కుతుంటే ఎంతకాలం ఆమె సహిస్తుంది! పరిస్థితి చేజారిపోతోంది. స్త్రీవాదం మొదలైంది. చిగురించింది. ఉధృతరూపం దాల్చింది. ఈ స్త్రీవాదం ఇలా ఉద్ధృత […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-8 (మోహన్ దాస్ కరంచంద్ గాంధి & షేక్స్పియర్)

ఉత్తరం-8 నీ చర్యలు రాక్షసంగా వున్నాయి రచయిత: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: గాంధీ ….. హిట్లర్ కు రాసిన ఉత్తరంలో ఇది రెండవది. ఆయన రాసిన ఈ రెండు ఉత్తరాలు హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు అడ్డుపడ్డారు. నాయకుడుగా ఎదుగుతున్న దశలో హిట్లర్ కు ఆదర్శం ….. అప్పటి ఇటలి ప్రధానమంత్రి, ముస్సోలిని! ముస్సోలిని ఫాసిస్ట్ చర్యలు హిట్లర్ కు ఎంతగానో నచ్చాయి! హిట్లర్, ముస్సోలిని […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1 -డా.సిహెచ్.సుశీల వాగర్థా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మహాకవి కాళిదాసు ప్రార్థించి నట్లు ‘వాక్కు’ లేకుండా ‘అర్థం’ లేదు ‘అర్థం’ ‘వాక్కు’ను వదిలి ఉండలేదు. ఇవి పరస్పరం ఆధార ఆధేయాలు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఎలా అర్థనారీశ్వరులో ఎలా అవిభక్త జాయాపతులో  అలానే స్త్రీపురుషులు అవిభక్తాలు. కానీ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి పురుషులతో పాటు సమాన స్థాయి సంపాదనలో సాధ్యాసాధ్యాలు చర్చించే అరుదైన వేదిక […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-7 (ఎం.కె.గాంధీ & సుభాష్ చంద్ర బోస్)

ఉత్తరం-7 నీవొక్కడివే యుద్ధాన్ని ఆపగలవు రచయిత: ఎం.కె.గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు. కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ యుద్ధానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్. ఆ యుద్ధ మేఘాలు అలుముకొన్న దశలో … యుద్ధ ప్రారంభానికి కొద్దికాలం ముందుగా … యుద్ధం మానివేయమని సలహా ఇస్తూ గాంధిజీ హిట్లర్ కు రాసిన […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-6 (విలియం లియాన్ ఫెల్ప్స్)

ఉత్తరం-6 సింగపూర్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు రాసిన లేఖ  మూలం: ఇంగ్లీష్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: ఈ ఉత్తరం ……. ఒకరకంగా ….. నా ఆవేదన! ఓ సింగపూర్ ప్రిన్సిపాల్ ……. తల్లిదండ్రులకు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ ఉత్తరం చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇది నకిలీ ఉత్తరం. ఏ స్కూల్ ప్రిన్సిపాల్ రాసినాడో వివరాలు ఎక్కడా లేవు. కాబట్టి, అనుభవజ్ఞులు దీనిని నకిలీదిగా తేల్చిచెప్పారు. ఇందులోని భాషతో పాటు […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-5 (అబ్రాహం లింకన్ & స్వామి వివేకానంద)

ఉత్తరం-5 “స్కూల్ టీచర్ కు అబ్రహం లింకన్ రాసిన ఉత్తరం” ఆంగ్ల మూలం: అనానిమస్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: అమెరికా 16 వ అధ్యక్షుడు, అబ్రహం లింకన్ తన కుమారుని స్కూల్ టీచర్ కు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ లేఖ ఇంటర్నెట్ లో…. సోషల్ మీడియాలో చాల ప్రాచుర్యం పొందింది. కానీ…. అమెరికాలోని పేరొందిన పత్రికలకు వ్యాసాలు రాసే ప్రముఖ పాత్రికేయుడు ….. జోనాథన్ మిటిమోర్ …. ఈ ఉత్తరం లింకన్ […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-4 (అబ్రాహం లింకన్ & చెహోవ్)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-4 స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ఉపన్యాసం-4 గెట్టీస్ బర్గ్ సందేశం నేపథ్యం: అబ్రహాం లింకన్ …… అమెరికా 16 వ అధ్యక్షుడు …… అమెరికా అంతర్యుద్ధం (1861-65) ముగిసిన తర్వాత … పెన్సిల్వేనియా లోని గెట్టీస్ బర్గ్ అనే చోట …. నవంబర్ 19, 1863 రోజున చేసిన ప్రసంగం ‘గెట్టీస్ బర్గ్ సందేశం’ గా ప్రసిద్ది చెందింది. ఆ యుద్దంలో ….. ఇరువైపులా చనిపోయిన అమర జవాన్ల స్మృతిలో …… ఏర్పాటు చేయబడిన […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-3 ( మలాల యూసఫ్ జాయ్ & సుధా మూర్తి)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-3 ఉత్తరం-3 స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ “ఈ అమ్మాయే జె.ఆర్.డీ కి ఉత్తరం రాసింది!” నేపథ్యం: రచయిత మాటల్లోనే …………సంక్షిప్తంగా…. *** “బహుశా అది 1974 లో అనుకొంటాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. ఓ రోజు లెక్చర్ హాల్ నుండి హాస్టల్ కు వెళ్ళే దారిలో నోటీస్ బోర్డ్ పై టెల్కో(ఇప్పుడు టాటా మోటార్స్) అడ్వర్టైజ్మెంట్ చూశాను. వారికి తెలివైన యువ ఇంజనీర్స్ కావాలనేది దాని సారాంశం. […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-6

తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు  -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక “లేఖిని” వంటి సాధనాలతో ఆన్ లైన్ లో తెలుగు సులభంగా రాయడం వంటివి సాధ్యమయ్యేయి.  ఇందువల్ల అంతకు ముందు వరకూ యాహూ గ్రూపు, గూగుల్ గ్రూపు వంటి చర్చావేదికల్లో RTS పద్ధతిలో తెలుగుని ఇంగ్లీషులో […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-2( రోహిత్ వేముల & విలియం ఫాల్కనర్)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-2 ఉత్తరం-2: నా పుట్టుకయే నాకు మరణశాసనం ఆంగ్ల మూలం: రోహిత్ వేముల స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: రోహిత్ వేముల పూర్తి పేరు- రోహిత్ చక్రవర్తి వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్! అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యునిగా చురుకైన పాత్ర వహించాడు! సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ….. జనవరి 17, 2016 రోజున రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు! ======= అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్-అఖిల భారత విద్యార్థి పరిషత్ ల మధ్య […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-1( జే.ఎన్.సాల్టర్స్ & నెపోలియన్ బోనపార్టే)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-1 ఉత్తరం-1: మా అమ్మ కోసం (జే.ఎన్.సాల్టర్స్) రచయిత: జే.ఎన్.సాల్టర్స్ స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్  నేపథ్యం: అమెరికాలో….. ఈస్ట్ కోస్ట్ లో పుట్టి, వెస్ట్ కోస్ట్ లో జీవిస్తున్న జే.ఎన్.సాల్టర్స్ స్త్రీవాద రచయిత,  యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పీ.హెచ్.డీ విద్యార్థిని. జాతి, లింగ, లైంగికత, మీడియా, రాజకీయాల పైన రచనలు చేస్తున్నారు. మదర్స్ డే ను పురస్కరించుకొని వ్రాసిన ఈ ఉత్తరం  “A Love Note to Black Mothers on Mother’s […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-5

ఆన్ లైన్ – తెలుగు విస్తరణ -డా||కె.గీత తెలుగుభాష  కంప్యూటర్ల మీద వాడుకలోకి వచ్చిన 90’వ దశకం పూర్వార్థం నుండి ఇప్పుడు 2020వ దశకం ప్రారంభం వరకూ తెలుగు ప్రస్థానంలో విప్లవాత్మకమైన మార్పు యూనికోడ్ వచ్చిన తర్వాతే జరిగింది. తెలుగుకి సంబంధించి తొలిదశలో ప్రారంభమైన ఎన్నో సైట్లు యూనికోడ్ లేకనే విఫలమయ్యాయని చెప్పవచ్చు. “ఆన్ లైన్” అంటే కంప్యూటరు తో కంప్యూటరు, నెట్ వర్కు తో నెట్ వర్కు “అనుసంధానం” అయి ఉండడం. ఇలా అనుసంధానంలో  విజయవంతంగా […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-4

తెలుగు ఫాంట్లు – డా||కె.గీత తెలుగు ఫాంట్లు రకాలు తెలుసుకునే ముందు అసలు “ఫాంట్” అంటే ఏవిటో చూద్దాం.  “ఫాంట్” అంటే రాత పద్ధతిలో స్టైల్  అని చెప్పవచ్చు. ఉదాహరణకి 80’లలో ప్రభంజనమైన బాపూగారి  చేతిరాత ఒక స్టైల్ .  అందంగా, గుండ్రంగా, పొందిగ్గా రాయడం మరో  స్టైల్ . కుడివైపుకో, ఎడమ వైపుకో అక్షరాలు వాల్చి రాయడం మరో స్టైల్. ఇలా రకరకాల పద్ధతుల్లో  స్టైల్స్ తో రూపొందించిన కంప్యూటర్ రాతపద్ధతే “ఫాంట్” అన్నమాట. ఎవరి […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-3(యూనికోడ్ – తెలుగు)

యూనికోడ్ – తెలుగు  -డా||కె.గీత  కిందటి నెలలో తెలుగు టైపు ప్రాథమిక దశ గురించి చెప్పుకున్నాం కదా! కీ బోర్డుల గురించి ప్రధాన విషయాలు తెలుసుకోవడానికి ముందు తెలుగు టైపులో యూనికోడ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. అసలు యూనికోడ్  అంటే ఏవిటి, అవసరం ఏవిటి అనేది చూస్తే తెలుగు లిపిని టైపు రైటర్ల మీద టైపు కొట్టినట్టు కంప్యూటర్ లో టైపు కొట్టగలిగినా ఇంతకు ముందు చెప్పినట్లు ఒక చోట టైపు చేసి ఫైళ్లలోదాచుకున్నది మరో […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-2(తెలుగు టైపు ప్రాథమిక దశ)

కంప్యూటర్ భాషగా తెలుగు  తెలుగు టైపు ప్రాథమిక దశ   -డా|| కె. గీత “1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి శ్రీ దిడుగు వెంకట నరసింహారావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశారు.  ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని నిజాం రాజ్యంలోని భువనగిరి దగ్గర గ్రామమైన కొండగడప […]

Continue Reading
Posted On :

గద్వాల రాజసం… రాచరీకము

గద్వాల రాజసం… రాచరీకము -విశాలి పేరి గద్వాల్…  ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేది చీరలు, ఆ తరవాత ఈ మద్యన వచ్చిన అరుందతి సినిమా!  కానీ ఆ గద్వాల… అంటే విద్వద్ గద్వాల అని సాహీతీ సుమాల మాల అని పట్టుచీరల జరీ రెపరెపల… కృష్ణమ్మ పరవళ్ళ గలగలల గద్వాల్ అని మీకు తెలుసా? (ఎంత మందికి తెలుసు..?) చరిత్ర : ఈ గద్వాల చరిత్ర ఒకసారి తెలుసుకుందాము. గద్వాల సంస్థానము తుంగభద్ర మరియు […]

Continue Reading
Posted On :

జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి

జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి -సాయి పద్మ  All you have shall someday be given; Therefore give now, that the season of giving may be yours and not your inheritors – Kahlil Gibran – నీ దగ్గరున్నదంతా ఏదో రోజు ఇవ్వబడుతుంది; కాబట్టి ఇప్పుడే ఇచ్చేయి, ఇచ్చే సందర్భం నీదిగా మలచుకో, వారసత్వంగా వదలకు. –ఖలీల్ జిబ్రాన్ — పై సూత్రం మాత్రమే […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-1 (ఉపోద్ఘాతం- కంప్యూటర్ వ్యవస్థ)

కంప్యూటర్ భాషగా తెలుగు-1  ఉపోద్ఘాతం– కంప్యూటర్ వ్యవస్థ -డా|| కె. గీత తెలుగుభాష  కంప్యూటర్ల మీద వాడుకలోకి 1991-92 ప్రాంతంలో వచ్చింది. అప్పటివరకు ఇంగ్లీషు మాత్రమే అన్ని టెక్నాలజీలకీ మొదటి మాధ్యమమైనట్టే కంప్యూటర్ రంగంలోనూ ఇంగ్లీషుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అవి WWW (World Wide Web) కొత్తగా ప్రపంచానికి పరిచయమైన రోజులు. “కంప్యూటర్లకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే ‘వరల్డ్ వైడ్ వెబ్’ అంటారు. వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు

కంప్యూటర్ భాషగా తెలుగు  -డా|| కె. గీత ప్రపంచ భాషల్లో  కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని  సాధించిన భాషల దిక్కుగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా  ప్రయాణం సాగించడం చెప్పుకోదగిన విషయమే కాదు, తెలీనివారందరూ తెలుసుకోదగిన విషయం కూడా. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని తెలుగులో కమ్యూనికేషను అందరికీ అవసరమైన యుగంలో ఉన్న మనకు తెలుగు భాష ని కంప్యూటరీకరించడం వెనుక దాగున్న అనేక ఆసక్తికర అంశాల్ని పరిచయం చేస్తే బావుణ్ణన్న […]

Continue Reading
Posted On :