image_print

చిత్రలిపి-నల్లని నవ్వుల చల్లని దేవుడు

చిత్రలిపి నల్లని నవ్వుల చల్లని దేవుడు -ఆర్టిస్ట్ అన్వర్  కష్టకాలంలో నేతాజీ ట్యూషన్ సెంటర్ ఎదురుగా రాముడు ఉన్నా ఏం లాభంలేక పోయింది. పొద్దున ప్రయివేట్ సెంటర్ లో అడుగుపెట్టే ముందే గుడిలోకి కాళ్ళు కడుక్కుని చల్లని నల్లని తడి బండల మీద తడికాళ్ళు ముద్రలేకుండా నడిచి దేవుడికి ఒక నమస్కార ముద్ర పెట్టుకుని. పూజారి ఇచ్చిన చిన్న గారె ముక్క తినుకుంటూ చూస్తే గుడి ఆవరణలో తెల్లగా పసుపు పచ్చగా ఇంతకన్నా అందమైన పూవు లేదనిపించే […]

Continue Reading

చిత్రలిపి-చిల్డ్రన్స్ డే

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  పండగలంటే పంద్రాఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగేగా. అదిగో తెల్లవారు ఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. పొయ్యి మీద నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి అప్పటికీ ఇరుగూ పొరుగూ అరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు తమ తమ యూనిఫాం లు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. “కొండలా కూచుంది ఎంతకీ తరగనంది […]

Continue Reading

చిత్రలిపి-దీపావళి

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  ఎవరు ఎవర్ని చంపారు? ఎంత వాతావరణ కాలుష్యం నింపారు? మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై అయిదు పండగలు వచ్చినా  ఈ దరిద్రం ఎప్పటికీ వదిలేది కాదు కాని వినండి. నాకు తెలిసి దీపావళి పిల్లల పండగ. నేనూ  ఒకప్పుడు పిల్లాడిగా ఉన్నా కదా! నాకు తెలీదా ఏం మా పిల్లల సంగతి ? తిక్క స్వామి ఉరుసుకోసం, రంగులు చల్లుకునే ఉగాది కోసం, హసన్ హుసన్ […]

Continue Reading

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే!

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే! –ఆర్టిస్ట్ అన్వర్  ఓ మధ్య ఊరికి వెళ్ళా. సమయం నాలుగు ముక్కాలు. నిజానికి నడిచే టైం కదా అని నడక మొదలెట్టా.  నడుస్తూ సంజీవనగర్ రామాలయం దగ్గరికి చేరుకున్నా. నిజానికి ఊరికి వెళ్ళడం బహు తక్కువ అయిపోయింది. వెళ్ళినా ఒక రోజు కు పైగా ఎక్కువ ఉండటం కూడా కష్టమే అయిపోయింది. కానీ ఆ తెల్లారు జామున నడుస్తుంటే ఎన్ని జ్ఞాపకాలో! నిజానికి ఊరు చాలా మారిపోయింది. అయినా బుర్ర మారలా […]

Continue Reading

చిత్రలిపి-కపివరుండిట్లనియే….

కపివరుండిట్లనియే….  -ఆర్టిస్ట్ అన్వర్  చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క ముక్కరాదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది హనుమాన్ చాలీసా వచ్చి ఉండేది , చిన్నప్పుడు దయ్యాలకు భూతాలకు భయపడేవాణ్ణి కాదు కావున హనుమాన్ చాలీసా నేర్చుకోవాల్సిన అవసరం అనిపించలా. నాకు లేదు కానీ నా […]

Continue Reading

చిత్రలిపి (గంగమ్మా గౌరమ్మా)

చిత్రలిపి -అన్వర్ ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, గౌరీ దేవి బొమ్మల్ని ఎదురెదురుగా కూచుని చెరో రోలు పుచ్చుకుని రోట్లో దంచడానికి సిద్దమై ఉంటారు. ఈ పీఠం పుచ్చుకున్న స్త్రీ కిందనుండి చేతులు ఉంచి ఆడించగానే ఇద్దరు సవతులు మర చేతులు ఊపుకుంటూ  […]

Continue Reading