చిత్రం-13

-గణేశ్వరరావు

 

నిత్య జీవితంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాల్లో అత్యంత ఆకర్షణీయమైనవి – సూర్యాస్తమయాలు! సూర్యాస్తమాయల దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటాన్ని మించినది – పగిలిన అద్దం లో సూర్యాస్తమయ ప్రతిబింబాన్ని చూడటం! ఇదో అపురూప అనుభవం.. అమెరికన్ ఫోటోగ్రాఫర్ బింగ్ రైట్ కి అస్తమిస్తున్న సూర్యుడి అందo అద్దం ముక్కల్లో ప్రతిబింబిస్తూన్నప్పుడు తన కెమెరా కన్నుతో చూస్తూ బంధించడం అంటే మోజు, తానూ తీసిన సీరీస్ కు ‘పగిలిన అద్దం : సాయం సంధ్యలో ఆకాశం’ అనే పేరు పెట్టాడు. అద్దంలో ఆర్ట్ ఎఫెక్ట్ తేవడానికి అతనికో పద్ధతి వుంది. ముందుగా అతను సూర్యాస్తమయాన్ని ఫోటో తీస్తాడు. తన స్టూడియోలో వాటిని అద్దం ముక్కలపై ప్రతిబింబాలుగా చూపిస్తాడు, ఈ ప్రక్రియలో అసలు దృశ్యాలు నైరూప్య చిత్రాలుగా భాసిస్తాయి.

అన్నట్టు మనకూ అలాటి ఏస్ ఫోటోగ్రాఫర్ – శోభ మొక్కపాటి – ఉన్నారు. కావాలంటే ఆమె తీసిన ఫోటో చూడండి. మీకే తెలుస్తుంది.

*****

Leave a Reply

Your email address will not be published.