image_print

చిత్రం-53

చిత్రం-53 -గణేశ్వరరావు  ఫోటోగ్రఫీ అంటే కేవలం ఫోటోలు తీయడం కాదు, ‘అదొక సృజనాత్మక ప్రక్రియ, అనుభూతి.. అనుభవం, ప్రేరణ, ఉద్వేగం.. ఇది కళ, ఇది జీవితం! ఈ రకం ఫొటోగ్రఫీలో – ఆలోచన నుంచి ఆచరణ వరకూ అన్నిటినీ ఆస్వాదిస్తాను’ అంటాడు. మైకేల్.           మైకేల్ డేవిడ్ ఆడమ్స్ న్యూ యార్క్ లో పేరు పొందిన ఫ్యాషన్ & ప్రకటనల ఫోటోగ్రాఫర్. అండర్ వాటర్ ఫోటోగ్రఫీలో ఆయన తర్వాతే మరెవరినైనా చెప్పుకోవాలి. ఆయన […]

Continue Reading
Posted On :

చిత్రం-52

చిత్రం-52 -గణేశ్వరరావు  ‘పుష్పాలంకరణ’ కోసం అన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. . మీరు కోరుకున్న పద్ధతిలో పూలతో వేదికను …పెళ్ళి కూతుర్ని అలంకరిస్తారు, సందర్భానుసారంగా పూలతో ఏ అలంకరణ అయినా ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థల సృజనాత్మక శక్తికి పరిమితి లేదు, రక రకాల రంగు రంగుల పూలను ప్రత్యేకంగా ఏర్చి కూర్చి ఒక కొత్త అందాన్ని కళ్ళ ముందు నిలబెడతారు. నవ్యతతో అందరినీ అవి ఆకర్షిస్తాయి. పూలు చెట్టుకి అందాన్నిస్తాయి, కోసిన పూలను […]

Continue Reading
Posted On :

చిత్రం-51

చిత్రం-51 -గణేశ్వరరావు  ఎనభైవ దశకంలో సావిత్రి అనే ఒక  చిత్రకారిణి  మద్రాస్ లో ఉండేది. ఆమె వృత్తి రీత్యా బ్యాంకు ఆఫీసర్. ఆమె హాబీ చిత్రకళ. ఆమె ప్రత్యేకత నగ్న చిత్రాలను గీయటం, ఆ నగ్న చిత్రాలు తనవే కావడం. కొంత కాలం క్రితం వార్తలలోకి ఎక్కిన వ్యక్తీ  – ఇంద్రాణి ముఖర్జీ. ఆమె తన సొంత కూతురిని అందరికీ చెల్లెలిగా పరిచయం చేసేది. Tamara de Lempicka అనే సుప్రసిద్ధ చిత్రకారిణి సావిత్రి, ఇంద్రాణి చేసిన […]

Continue Reading
Posted On :

చిత్రం-50

చిత్రం-50 -గణేశ్వరరావు  ఇది ఒక అపురూప నీటి రంగుల చిత్రమా? Iceland ఫోటో యా? ఫోటో అయితే, ఎక్కడ తీశారు? స్విట్జర్లాండా? ఇండియాలో ఇలాటి దృశ్యాలు ఉన్నట్టు లేవే! కంగారు పడకండి. ఇది అచ్చంగా ఫోటో యే! ఇండియాలో తీసిందే .. అంతే కాదు, మన కడపలో తీసిందే, తెలుగు గంగ ఫొటోయే! ఇంత అద్భుతమైన ఫోటో ఎవరు తీసారు? ఆగండి, ఆలోచించండి..           ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడం ఒక పెద్ద […]

Continue Reading
Posted On :

చిత్రం-49

చిత్రం-49 -గణేశ్వరరావు  ఒక దానిలో రెండు ఫోటోలు, ఒకటే భావం. దీన్ని ఒకసారి కాదు, ఎన్నోసార్లు చూడాలి. పరిశీలిస్తే అంతరార్థం అవగాహనవుతుంది.           అమెరికాకు చెందిన డేనియల్ ఎగ్యూయా బృందం ఆర్ట్ స్కూల్ ఇలాటి ఫోటోలు తరచూ పోస్ట్ చేస్తుంటుంది.. దీనికి పెట్టిన పేరు ‘మాతృమూర్తి’. వాళ్ళ దృష్టిలో ఇది తల్లి ప్రేమే! ఒక తల్లి పాలివ్వడం కోసం పై దుస్తులను తొలగిస్తుండగా ఒక ఫోటో తీసారు, ఇక రెండో ఫోటో సముద్రాన్ని […]

Continue Reading
Posted On :

చిత్రం-48

చిత్రం-48 -గణేశ్వరరావు  ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ ఫోటోగ్రాఫర్ ఆడమ్ బర్డ్. కి నగర జీవితం అంటే విసుగు. వీలైనప్పుడల్లా అడవికి వెళ్తుంటాడు. ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించడానికి అక్కడ అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటాడు. అప్పటికే తనకు తెలిసిన కథల పైన దృష్టి పెడతాడు. తాను ఎంపిక చేసిన మోడల్స్ ను అక్కడకు తీసుకెళ్తాడు. అవసరమైన సామగ్రిని చేరుస్తాడు. ఇంచు మించు ఒక సినిమా తీసినంత సందడి చేస్తాడు. కథా నేపథ్యం వివరించి తన మోడల్స్ చేత వాటిలోని […]

Continue Reading
Posted On :

చిత్రం-47

చిత్రం-47 -గణేశ్వరరావు  అమెరికన్ చిత్రకారిణి ఐరిన్ (Irene Georgopoulon) వస్తువుల సమూహాన్ని, మూర్తి చిత్రాలను పాస్టెల్ రంగుల్లో చిత్రిస్తుంది. పాస్టెల్ రంగుల మాధ్యమంకు మాయాజాలం ఉంది, అది వెలుతురును ప్రతిబింబచేస్తూ, చిత్రం యొక్క ఉపరితల కాంతిని ప్రసరించే టట్లు చేయగలదు. తనకు నచ్చిన వస్తువులను ఐరిన్ సొంతంగా సేకరిస్తుంది, తన సృజనాత్మక శక్తి కి వాటి నుంచి స్ఫూర్తి పొందుతుంది. అత్యంత సామాన్యమైన వస్తువు లను ప్రకాశవంతమైన మూర్తి ( స్టిల్ లైఫ్) చిత్రాలుగా రూపొందిస్తుంది. వ్యక్తుల […]

Continue Reading
Posted On :

చిత్రం-46

చిత్రం-46 -గణేశ్వరరావు  మనసులో మాట ముందు చెప్తాను. ఈ ఫోటో నా కెంతో నచ్చింది, దాని నేపథ్యం నచ్చింది, ఫోటోగ్రాఫర్ కనబరచిన సాంకేతిక నైపుణ్యం నచ్చింది.          మెక్సికో నుంచి ఒక పత్రిక వస్తుంది. అందులో అలౌకికమైన డిజిటల్ ఫోటోలు ఉంటాయి, స్వాప్నిక జగత్తులోకి తీసుకెళ్తాయి. ఫోటోల క్రిందనిచ్చే వ్యాఖ్యలు ఆ ఫోటో లకు ఏ మాత్రం తీసిపోవు.          ఉదాహరణకు దీన్ని తీసుకోండి… ‘నీటిలో అమ్మాయి… ఆమె మంచు గడ్డ […]

Continue Reading
Posted On :

చిత్రం-45

చిత్రం-45 -గణేశ్వరరావు  ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడిని నిద్రలోంచి భటులు లేపే దృశ్యానికి సహజ చిత్రకారుడు బాపు అద్భుతమైన రూప కల్పన చేశారు. ట్రిక్ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ రవికాంత్ నగాయిచ్ కు ‘గలివర్స్ ట్రావెల్స్’ సినిమా స్ఫూర్తి కలిగించే ఉండవచ్చు. ఆ చిత్రీకరణ రహస్యాలను ఎవరైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు, చేసి చూపించమంటే మాత్రం చూపించగలరు.          ఇక పోతే ఇది ఫోటో యే, తైల వర్ణ చిత్రం కాదు. ఫోటోగ్రఫీ లో అనూహ్యమైన సాంకేతిక […]

Continue Reading
Posted On :

చిత్రం-44

చిత్రం-44 -గణేశ్వరరావు                     ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేధిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు.                    ఈ బొమ్మ నేటి కాలానికి […]

Continue Reading
Posted On :

చిత్రం-43

చిత్రం-43 -గణేశ్వరరావు  మాఁలీ క్రేబ్ఏపిల్ కోపం, కసి నిండిన మహిళా చిత్రకారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్రకారుల్లా తాను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీకరిస్తూ Wall street అక్రమణ వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్య గీతంగా మారింది –  Guantanamo ఖైదీలను, లిబియా పోరాట వీరుల ను, బైరూట్ శరణార్ధులను, ఫెర్గూసన్ పోలీసుల బాధితులను నల్లని రేఖా […]

Continue Reading
Posted On :

చిత్రం-42

చిత్రం-42 -గణేశ్వరరావు  11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుడు తన కుమారునికి కన్యను వెతుకుతూ కొడుకు చిత్రాన్ని పొరుగు రాజ్యాలకు పంపి అక్కడి కన్యల చిత్రాలు తెప్పించుకొని చూసేవారట, అలా ఒక రాచకన్య చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని తన కోడలుగా చేసుకోటానికి బదులుగా తానే చేసుకున్నట్టు వినే ఉంటారు.           ‘చంద్రహారం’ సినిమాలో చందన రాజు తన ఊహా సుందరి చిత్రాన్ని గీయటం చూసే ఉంటారు. ‘ఇది నా […]

Continue Reading
Posted On :

చిత్రం-41

చిత్రం-41 -గణేశ్వరరావు  ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేదిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు. రెండో బొమ్మ నేటి కాలానికి సంబంధించినది, వేసింది: లారా కసెల్( కెనడా) ఆమె చిత్రాలలో ఒక ప్రత్యేకత ఉంది, అది: గతాన్ని వర్తమానంతో కలుపుతూ గీసిన అపురూపమైన చిత్రకళా […]

Continue Reading
Posted On :

చిత్రం-40

చిత్రం-40 -గణేశ్వరరావు  కొందరికి చనిపోయిన తర్వాత గుర్తింపు వస్తుంది, అమెరికన్ ఫోటోగ్రాఫర్ డీయన్ ఏర్బస్ (Diane Arbus) 1971లో ఆత్మహత్య చేసుకున్నాక గుర్తింపు పొందింది. ఆమె ధనిక కుటుంబంలో పుట్టింది, వాళ్ళు ఫాషన్ వస్తువులు అమ్మే వారు, అయినా ఆమె మాత్రం ఎటువంటి మేక్ అప్ వేసుకునేది కాదు, సెంట్ వాడేది కాదు, మెడలో ఒక కెమెరా మాత్రం వేలాడుతూ వుండేది. భర్త ఎలాన్ తో ఫాషన్ యాడ్స్ ఫోటోలు తీసేది. స్టూడియో పని విసుగెత్తి, ఔట్ […]

Continue Reading
Posted On :

చిత్రం-39

చిత్రం-39 -గణేశ్వరరావు  షెరాన్ రూథర్ ఫర్డ్ రూప చిత్రకళను అధ్యయనం చేశారు. ఈ తైలవర్ణ చిత్రంలోని వనిత, కెన్యా ప్రాంతంలోని ఒక తండా నాయకుడి భార్య, తన ఫోటో తీస్తున్నప్పుడు, చిత్రం గీస్తున్నప్పుడు ఆమె విరగబడి నవ్వుతూనే ఉందట. ఈ చిత్రంలో కూడా ఆమె నవ్వు మొహాన్ని చూడొచ్చు. తన ఫోటో తీసిన షెరాన్ కు ఆమె తన మెడలోని పూసల దండ బహూకరించింది. ఆ పూసల దండలోని రంగులనే వాడి షెరాన్ ఈ చిత్రాన్ని చిత్రించారు.   […]

Continue Reading
Posted On :

చిత్రం-38

చిత్రం-38 -గణేశ్వరరావు  కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద రావి. శాస్త్రి కథలు రాసి పారేశారు. ‘కథలు ఇలా ఉండాలి’ అనీ ఒకరంటే ‘కథలు ఇలా కూడా రాయొచ్చు’ అని మరొకరంటారు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి అనుభవాలు వారివి అన్నట్లు కళలు కూడా ఏదో […]

Continue Reading
Posted On :

చిత్రం-37

చిత్రం-37 -గణేశ్వరరావు  19 వ శతాబ్దానికి చెందిన జేమ్స్ మెక్నీల్ విజ్లర్ వేసిన ఈ సమస్యాత్మక తైలవర్ణ (నలుపు-బూడిద రంగు) చిత్రం ‘చిత్రకారుడి తల్లి’ మోనాలిసా లాంటి చిత్రాల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిoది..           సీదా సాదాగా కనిపిస్తున్న ఈ చిత్రం విలువ 700 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఈ చిత్రం చూడడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనకు వెళ్ళాడు, అమెరికా ప్రభుత్వం దీన్ని సంస్కృతి సంపద గా భావించి ఒక […]

Continue Reading
Posted On :

చిత్రం-36

చిత్రం-36 -గణేశ్వరరావు  ఇది తైలవర్ణ చిత్రం అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. మిమ్మల్ని తప్పు పట్టను. తర్వాత తెలిసింది. ఇది ఫోటో అని. ఈ ఫోటో నా కంట పడగానే ఆశ్చర్యంతో ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఒకటి రెండు.. . ఫోటోలను బ్లెండ్ చేస్తుంటారని తెలుసు. ఈ ఫోటోలో మాత్రం కొన్ని ఫోటోలు కలిసిపోయి, ఒక అధివాస్తవికత తైల వర్ణ చిత్రంలా అయింది ! దీన్ని ఎన్నో కోణాల నుంచి చూసినప్పుడు గాని, అది […]

Continue Reading
Posted On :

చిత్రం-35

చిత్రం-35 -గణేశ్వరరావు  కలలు నిజమౌతాయా? కల ఆధారంగా పరిశోధన జరిపి ఓ హత్య కేసుని ఛేదించ వచ్చా? దర్శకుడు తాను కన్న కల ‘118’ తో కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేశాడు. . సినిమావాళ్ళకి కలలు అవసరమేమో కానీ జనం పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చుంటారా? మహా అయితే దీపూ పాడిన ‘కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిలో తేలుతూ ఉంటున్నానే’ పాట వినమంటే వింటారు. కలలు మనస్తత్వంతో […]

Continue Reading
Posted On :

చిత్రం-34

చిత్రం-34 -గణేశ్వరరావు  ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించాక కూడా తలపైన టోపీని , నల్ల కళ్ళద్దాలని ఉంచేశారు. కారణం ఊహించగలరు. చనిపోయాక కూడా పార్థివ శరీరం చూడాటానికి బాగానే వుండాలన్న ఆలోచనలో తప్పులేదు. జగదేక సుందరి క్లియోపాత్రా శత్రురాజుకి చిక్కకుండా ఉండటం కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటుంది, ఆ మరణం అనాయాసంగా ఉండాలని మరణించాక కూడా తన అందం చెక్కు చెదరకుండా ఉండాలని ముందుగా మరణ శిక్ష పొందిన ఖైదీలపై పరిశోధనలు జరిపిస్తుంది, ఒక అంగుళం పొడుగు ఉన్న […]

Continue Reading
Posted On :

చిత్రం-33

చిత్రం-33 జాన్ సింగర్ సార్జెంట్ -గణేశ్వరరావు  సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, సన్నని నడుము. ఇసుక గడియారం లాంటి వంపు సొంపులున్న ఆకృతి – ప్రతీ చిత్రకారుడికి ఆమె బొమ్మ గీయాలని, పాలరాతిపై శిల్పం చెక్కాలనీ అనిపించేది . సార్జెంట్ ఆమె వ్యామోహంలో పడ్డాడు. ఆమె చిత్రం […]

Continue Reading
Posted On :

చిత్రం-32

చిత్రం-32 -గణేశ్వరరావు  ‘ధనమేరా అన్నిటికి మూలం’ అనే పాట ఉంది, అన్నిటికీ ‘ఆడదే’ ఆధారం అంటూ మొహమ్మద్.అఫ్సర వలీషా ఒక కవిత రాశారు. ఆడదే లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రంగం ఉంటుందా? టోనీ లాంటి రూప చిత్రకారులు ఉండేవారా? ‘తల్లి ప్రేమ’ లాంటి చిత్రాన్ని చూడగలిగే వాళ్ళమా? టోనీ ప్రో, కాలిఫోర్నియా కు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహం తో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, […]

Continue Reading
Posted On :

చిత్రం-31

చిత్రం-31 -గణేశ్వరరావు  ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు […]

Continue Reading
Posted On :

చిత్రం-30

చిత్రం-30 -గణేశ్వరరావు  ఇది పాల్ గాగెన్ వేసిన చిత్రం. పేరు : ‘ఇవాళ మేం మార్కెట్ కి వెళ్ళం!’. పాల్, విన్సెంట్ వాంగో మిత్రుడు, అతనిలాగే తన జీవితకాలం లో గుర్తింపు పొంద లేదు, తోటి చిత్రకారులను ప్రభావితం చేసాడు. అయన మరణం తర్వాత, ఒక ఆర్ట్ డీలర్ చొరవ వలన ఆయన వేసిన చిత్రాలు అమ్ముడయాయి, క్రమంగా గుర్తింపు లభించింది. అది అలా ఉంచితే, ఈ చిత్రాన్ని – దాని వెనుక ఉన్న కథ తెలియకపోతే […]

Continue Reading
Posted On :

చిత్రం-29

చిత్రం-29 -గణేశ్వరరావు  మేరీ జిన్స్ మల్టీమీడియా ఆర్టిస్ట్( ఒహియో) యాభయ్యవ పడిలో అకాలమరణం చెందారు. కార్టూనిస్ట్ గా అంతర్జాతీయ బహుమతులు అందుకున్నారు. ఆమె తన విశ్వాసాలకు అనుగుణంగా నిబద్ధత తో కార్టూన్ లు గీసేవారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నేర్పడానికి ప్రయతించేవారు. వాదాలకు అతీతంగా స్పందించిన మానవతావాదికార్టూన్ అంటే నవ్వించేది అని మనలో కొందరు అనుకుంటారు. ఒక వ్యంగ్య చిత్రంగా దాని లక్ష్యం రాళ్లు రువ్వడం, అయితే అవి దేని గురించి అయినా అవ్వొచ్చు – […]

Continue Reading
Posted On :

చిత్రం-28

చిత్రం-28 -గణేశ్వరరావు  అన్నిటికీ ఆడదే ఆధారం!పొద్దు తిరుగుడు పువ్వు కథ విన్నారా?చార్లెస్ లా ఫొస్ 17వ శతాబ్ద నికి చెందిన ఫ్రెంచ్ చిత్రకారుడు, అతని చిత్రాల లోని రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి, అలంకారిక శైలిలో ఉంటాయి. ఆయన చారిత్రాత్మక కుడ్య చిత్రాలు కొన్ని ప్రసిద్ధి చెందాయి. ఆయన చిత్రాలు అప్పటిలో ప్రాచుర్యం ఉన్న కథల మీద ఆధారపడి ఉండటం మూలాన , అవి కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాక మనసును కూడా రంజింప చేస్తాయి. ఈ […]

Continue Reading
Posted On :

చిత్రం-27

చిత్రం-27 -గణేశ్వరరావు  కొందరు చిత్రకారులు ‘వస్తువు’ కు కాక ‘శిల్పానికి ‘ ప్రాధాన్యం ఇస్తారు. వారి చిత్రాలు రూప రహితంగా వుంటాయి. అవి అర్థం కావడం కష్టం. మనకు మొట్ట మొదట ఇలాటి చిత్రాలను పరిచయం చేసినది పద్మశ్రీ ఎస్వీ రామారావు. గుడివాడకు చెందిన వీరు అమెరికాలో స్థిరపడ్డారు. మన దేశం లోని చిత్రకారులు(ఉదా. రాజా రవి వర్మ) అలంకారిక చిత్రకారులు కాగా పాశ్చాత్య దేశ చిత్రకారులు (ఉదా. పికాసో) చాలా మంది నైరూప్య చిత్రకారులు. రామారావు […]

Continue Reading
Posted On :

చిత్రం-26

చిత్రం-26 -గణేశ్వరరావు  ఆస్ట్రేలియా లో ఉన్న క్యురేటర్ వసంతరావు ‘వసంతఋతువు’ మీద ఒక online చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసారు. అందులో పసుపులేటి గీత చిత్రానికి ఒక స్థానం కల్పించారు, అంతే కాదు, ఆమెనూ, ఆమె చిత్ర రచనని అద్భుతంగా పరిచయం చేసారు. వారి వ్యాఖ్యలు – తిరుగులేని తీర్పు లాటివి.పసుపులేటి గీత బహుముఖ ప్రజ్ఞావంతురాలు – పాత్రికేయురాలు, కవయిత్రి, చిత్రకారిణి..’వస్తువు’ కు చిత్రకారిణి గీత ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఆమె చిత్రంలో – ‘తీయని ఊహలు […]

Continue Reading
Posted On :

చిత్రం-25

చిత్రం-25 -గణేశ్వరరావు  స్మార్ట్ ఫోన్ ల ధర్మమా అని ఇప్పుడు ఐదేళ్ళ పిల్ల కూడా సెల్ఫీ లు తీసేస్తోంది. వీళ్ళ సంగతి అలా ఉంచితే, ఫోటోగ్రఫీ వృత్తి లో రాణించే వారిలో అసామాన్యులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. అందమైన వాళ్ళు ఎంత మంది లేరు? అయితే వీరిలో మోడలింగ్ రంగంలో పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు? సూపర్ మోడల్స్ ని ఒక ప్రత్యేక కోణం నుంచి చూపించే వారే ఫోటోగ్రఫీ లో విజయం సాధిస్తారు. ఇప్పుడు […]

Continue Reading
Posted On :

చిత్రం-23

చిత్రం-23 -గణేశ్వరరావు  ఇది బృందావన్ ‘క్వారంటైన్’ ఫోటో, వితంతువుల క్వారంటైన్. ‘అసుంటా’ ‘అస్పృశ్యత’ మడి-ఆచారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆటవిక దశనుంచే ఉన్నాయి.ఎవడిని తాకితే ఏమౌతుందో, దేన్నీ తాకితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆటవిక మానవుడు భయంతో తల్లడిల్లి పోయేవాడు. ఆటవికులు చచ్చిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళతో పాతేసే వాళ్ళు. మన మతాచారాలు ఆటవికుల భయం నుంచే పుట్టాయని అనిపిస్తోంది.ఇప్పుడు కరోనా భయంతో మనం పాటిస్తున్న నియమాలను భవిష్యత్తులో చరిత్రకారులు ఎలా తీసుకుంటారో ఊహించగలమా?ఈ ఫోటోలో గేటుకు […]

Continue Reading
Posted On :

చిత్రం-22

చిత్రం-22 -గణేశ్వరరావు  వివియన్ ఈ ఫోటో ను ఎలా తీసారన్నది మన ఊహకు అందని విషయం. దీనిలో ఎన్నో ఎంతో పొందికగా … చక్కగా అమరాయి.. ఫోటోలో reflection, silhouette, exposure, అన్నీ కలిసి ఉన్నాయి. పైగా అన్నీ కలిసి దీన్ని ఒక సృజనాత్మక ‘సెల్ఫీ ‘ గా చూపిస్తున్నాయి. ఇంకొన్ని అంశాలను గమనార్హం. షాప్ లోపల కూర్చున్న వ్యక్తులు .. గ్లాస్ విండో ముందు నిల్చుని తమని ఎవరో ఫోటో తీస్తున్న సంగతి గమనించినట్లు తెలుస్తోంది. […]

Continue Reading
Posted On :

చిత్రం-21

చిత్రం-21 -గణేశ్వరరావు  ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు […]

Continue Reading
Posted On :

చిత్రం-20

చిత్రం-20 -గణేశ్వరరావు  ఛాయా చిత్రాలు..ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ ధర్మమా అని అది ఎంత మారిపోయిందో!ఎవరైనా చెబుతారు – ఫోటోగ్రఫీ ప్రక్రియలలో నీటి అడుగున ఫోటోలు తీయడం (underwater ఫోటోగ్రఫీ) ఎంత కష్టమైనదో అని. కారణాలు ఊహించగలరు. ముందు మీకు ఒక ఆరితేరిన మోడల్ దొరకాలి, నీళ్ళలో మునిగినప్పుడు […]

Continue Reading
Posted On :

చిత్రం-19

చిత్రం-19 -గణేశ్వరరావు  ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరియన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో చూపుతుంది. […]

Continue Reading
Posted On :

చిత్రం-18

చిత్రం-18 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాన్గొ తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంలో. ఆ రోజుల్లో స్త్రీలకి విద్యా సంస్థ లలో […]

Continue Reading
Posted On :

చిత్రం-17

చిత్రం-17 -గణేశ్వరరావు  గత పదేళ్లలో ఆఫ్రికన్ చిత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇర్మా స్టెర్న్ చిత్రాలకు. చిత్రకళా ప్రపంచంలో ఆమె విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. 1966లో ఆమె మరణించింది. ఆ మధ్య   ఆమె గీసిన లేడి కళ్ళ భారతీయ వనిత బొమ్మ $3 మిలియన్ల కు అమ్ముడయింది. 2015 లో ఒక లండన్ ఫ్లాట్ లో వంట గదిలో నోటీస్ బోర్డు లా వాడుతున్న ఆమె చిత్రం బయట పడింది. మండేలా సహాయార్థం అది […]

Continue Reading
Posted On :

చిత్రం-16

చిత్రం-16 -గణేశ్వరరావు  ‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ వాటిని చిత్రించడం! అభయారణ్యంలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీ ముందు ఒక లేడి దూకడం చూస్తారు, చేతిలోని కెమెరా తో ఫోటో తీయడానికి ప్రయత్నిస్తారు. అదే మీరు ఒక చిత్రకారుడు అయితే..ఆ దృశ్యాన్ని కళ్ళల్లో […]

Continue Reading
Posted On :

చిత్రం-15

చిత్రం-15 -గణేశ్వరరావు  కళా హృదయం కలవారు తమ పరిసరాలలో వున్న వాటి నుంచి తరచూ సృజనాత్మక ప్రేరణను పొందుతుంటారు. వాటిని తమ కళా ప్రక్రియలలోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.రష్యన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టినా తన కెమెరా తీసుకొని ప్రపంచం అంతా పర్యటిస్తుంటుంది. ఫ్యాషన్, ఆర్కిటెక్చర్ రంగాలు కలిసే వుంటాయి. క్రిస్టినా తన ట్రావెల్ ఫోటోగ్రఫీ లో ఆ రెండూ ఎలా కలిసిపోతాయో చూపిస్తుంది.ఆమె అందమైన రూప చిత్రాలను ఎన్నో తీసింది, ఆ సిరీస్ లో సుందరమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో […]

Continue Reading
Posted On :

చిత్రం-14

చిత్రం-14 -గణేశ్వరరావు   లాండ్స్కేప్ పెయింటర్స్ ఉన్నప్పుడు సీస్కేప్ పెయింటర్స్ కూడా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అసలు  ప్రకృతి దృశ్యాలలో కనిపించేవే  మూడు ప్రధాన దృశ్యాలు : నేల , నీళ్లు, కొండలు!    ఈ  మూడిటినీ కలిపి గీసిన బొమ్మలు ఎన్నో ఉంటాయి. కేవలం కడలిని చిత్రించే చిత్రకారిణులు ఉన్నారు. వారిలో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ – ఫీబీ సొండెర్స్ . ఆమె చిత్రాల్లో కనిపించే అలల వయ్యారం మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. సముద్రం ఒడ్డున నిల్చున్న […]

Continue Reading
Posted On :

చిత్రం-13

చిత్రం-13 -గణేశ్వరరావు   నిత్య జీవితంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాల్లో అత్యంత ఆకర్షణీయమైనవి – సూర్యాస్తమయాలు! సూర్యాస్తమాయల దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటాన్ని మించినది – పగిలిన అద్దం లో సూర్యాస్తమయ ప్రతిబింబాన్ని చూడటం! ఇదో అపురూప అనుభవం.. అమెరికన్ ఫోటోగ్రాఫర్ బింగ్ రైట్ కి అస్తమిస్తున్న సూర్యుడి అందo అద్దం ముక్కల్లో ప్రతిబింబిస్తూన్నప్పుడు తన కెమెరా కన్నుతో చూస్తూ బంధించడం అంటే మోజు, తానూ తీసిన సీరీస్ కు ‘పగిలిన అద్దం : సాయం సంధ్యలో […]

Continue Reading
Posted On :

చిత్రం-12

చిత్రం-12 -గణేశ్వరరావు  ఈ  ‘అమ్మ’ ఫోటో తీసినది  అలేనా  అనసోవ. ఆమె   రష్యన్ ఫోటోగ్రాఫర్.  అనేక అంతర్జాతీయ అవార్డ్లు ఆన్డుకుంది. ఈ ఫోటో  కూడా అంతర్జాతీయ గుర్తింపు,  అవార్డ్ పొందింది. . 5 ఖండాలకు చెందిన 22 దేశాలనుంచి ఫోటోగ్రాఫర్ లు ఆ  పోటీలో పాల్గొన్నారు.  దృశ్య మాధ్యమంగా మనల్ని అబ్బురపరిచే చాయా చిత్రాల్లో దీన్ని అత్యుత్తమమైనదిగా న్యాయ నిర్ణేతలు గుర్తించారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ – మనం ముఖ్యంగా గమనించదగ్గది ఎలెనా ‘అమ్మ […]

Continue Reading
Posted On :

చిత్రం-11

చిత్రం-11 -గణేశ్వరరావు  ‘వాస్తవికత’ అనే పదమే ఎంతో అర్థవంతమైంది, దానికీ ఈ నాటి కళా ప్రపంచానికి లోతైన సంబంధం వుంది.ఒక్కో సారి ఫోటోను చూసి చిత్రం అని, చిత్రాన్ని చూసి ఫోటో అని భ్రమపడతాం. కారణం వాటిలో ఉన్న  వాస్తవికతే!జీవితంలోని ఒక క్షణాన్ని కళ సంగ్రహపరచ గలదు, దాని కన్నా లోతైన అవగాహనను  కల్పించగలదు, మన రోజువారీ జీవన పరిధి ని దాటి అర్థాన్ని అందించగలదు..అందరికీ కొన్ని పోలికలు ఉన్నట్టే కొన్ని తేడాలూ ఉన్నాయి, ఒక వ్యక్తీ మూర్తి […]

Continue Reading
Posted On :

చిత్రం-10

చిత్రం-10 -గణేశ్వరరావు  ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘అంతరించిపోతున్న జీవితం’. ఈ  చిత్రంలో కొత్తదనం వుంది. రంగుల ఎంపిక చూడండి, చిత్రమైన అనుభూతిని, వాతావరణాన్ని కలగజేస్తుంది. అమ్మకానికి డ్రాయింగ్ రూమ్ ల కోసం పెయింటింగ్ వేసే  వాళ్ళు అటవీ ప్రాంతాన్నీ వాటిలో సంచరించే లేళ్ళు దుప్పులనీ ఇలా చిత్రించరు! వాల్ పర్జిస్ మ్యూజ్ పేరుతో ఈ బొమ్మ గీసిన ఆమె చిత్రకళా ప్రదర్శనల్లో తరచూ పాల్గొంటూ ఉంటుంది.   ఆమె పెట్జకున్న జర్మన్ పేరుకు అర్థo – […]

Continue Reading
Posted On :

చిత్రం-9

చిత్రం-9 -గణేశ్వరరావు  కొరియన్ చిత్రకారిణి క్వాన్ క్యాంగ్ యప్ ఏకాంతాన్ని సున్నితంగా  తన చిత్రాలలో చూపిస్తుంది. ఈ చిత్రానికి పెట్టిన పేరు: ‘పట్టీలు ‘ . అలంకారిక కళ లో చిత్రించింది. ఈ బొమ్మను చూస్తున్నప్పుడు ఏ దేవతనో, అంతరిక్షవాసినో, కలలో కవ్వించే సఖినో చూస్తున్నట్టుంటుంది . బొమ్మలో శారీరక లోపాలు లేవు . మొహం ముత్యం లా తెల్లని తెలుపు రంగులో మెరిసిపోతూంది. ఎక్కడా మచ్చుకైనా ముఖంలో  ముడతలు లేవు. మెరుస్తూన్న శరీరాన్ని చూపించడం కేవలం […]

Continue Reading
Posted On :

చిత్రం-8

చిత్రం-8 -గణేశ్వరరావు  అమెరికాలో తరచూ చిత్రకళా ప్రదర్శనలు జరుగుతుంటాయి. అలాటి ఒక ప్రదర్శనకు నిర్వాహకులు పెట్టిన పేరు: ‘మాయా జీవుల చిత్ర ప్రదర్శన’. దీనిలో పాల్గొన్న లిబ్బీ స్మిత్ వికలాంగురాలు. ఆమెను ఒక విలేకరి ‘ఇదే మీ ఆఖరి చిత్రం అవుతుంది అని మీకు తెలిసినప్పుడు, మీరు ఏ బొమ్మ వేయడానికి ఇష్టపడతారు?’ అని ప్రశ్నించినప్పుడు, తడుముకోకుండా ఆమె ఇచ్చిన సమాధానం: ‘ఏముంది, దేవుళ్ళ బొమ్మలు గీస్తాను!’. దృష్టి లోపం వున్న లిబ్బీ ఎప్పుడూ ఏదో మాయలోకం […]

Continue Reading
Posted On :

చిత్రం-7

చిత్రం-7 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాంగో  తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంల,  స్త్రీలకి విద్యా సంస్థలలో, శిక్షణాతరగతుల్లో ప్రవేశమే దొరకని […]

Continue Reading
Posted On :

చిత్రం-6

చిత్రం-6 -గణేశ్వరరావు బ్రోర్ద్రిక్ గీసిన ఈ చిత్రం ఒక పోటీలో ప్రధమ బహుమతి పొందింది. బహుమతి ఎంపికకు జ్యూరీ నిర్ణయానికి వున్న కారణాలు ఏవైనప్పటికీ, ఈ చిత్రంలో ఒక విశేషం వుంది: అదే చిత్రంలో మరో చిత్రం. నేపథ్యంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పొలాక్ గీసిన చిత్రం వుంది. బ్రోర్ద్రిక్ చిత్రంలో ఒక విద్యార్థి బృందం చిత్ర కళా ప్రదర్శనలో ఒక కళా కృతిని చూస్తున్నట్టు చూపించబడింది. పొలాక్ ఆమెను ప్రభావింతం చేసాడు, అతను తనకు అందించిన స్ఫూర్తికి  […]

Continue Reading
Posted On :

చిత్రం-5

చిత్రం-5 –గణేశ్వరరావు  ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ ధర్మమా అని అది ఎంత మారిపోయిందో! ఎవరైనా చెబుతారు – ఫోటోగ్రఫీ ప్రక్రియలలో underwater ఫోటోగ్రఫీ ఎంత కష్టమైనదో అని. కారణాలు ఊహించగలరు. ముందు మీకు ఒక ఆరితేరిన మోడల్ దొరకాలి, నీళ్ళలో మునిగినప్పుడు […]

Continue Reading
Posted On :

చిత్రం-4

చిత్రం-4 లోయిస్ గ్రీన్ ఫీల్డ్ -గణేశ్వరరావు  ఈ అద్భుతమైన ఛాయా చిత్రాన్ని తీసిన  లోయిస్ గ్రీన్ ఫీల్డ్ నాట్య ఛాయాచిత్రకారిణిగా  సుప్రసిద్ధురాలు. ఆమె ఫొటోల్లో వస్తువు: కదలికలు, ఇతివృత్తo : సమయం. సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలు గా చేయడంలో   ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమలను తన కెమెరా ఫిల్మ్ లో బంధించి గలదు, ఆ కళాకారుల సృజనాత్మకతకు దీటైన సృజనాత్మకతను తన ఫోటోగ్రఫీలో  కనబరచగలదు. ‘ప్రతిబింబించు క్షణాలు ‘ […]

Continue Reading
Posted On :

చిత్రం-3

చిత్రం-3 -గణేశ్వరరావు  ప్రకృతి దృశ్యాలు చూస్తూ న్యూ ఇంగ్లండ్ లో పెరిగిన గ్రేస్ మెరిట్ వాటి నుంచి స్ఫూర్తి చెందడంలో ఆశ్చర్యం లేదు, ఆమె చిన్ననాటి అనుభవాలే ఆమెని ఒక ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ని చేసాయి. జీవితం అన్నాక ఎవరికైనా ఒడుదుడుకులు ఉండకుండా పోవు . గ్రేస్ కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే ఆమె సృజనాత్మక శక్తి , కష్టాలనుంచి ఆమెను త్వరగా కోలుకునేలా చేసింది, ఆమె కెమెరాకన్ను ఎప్పుడూ రూప నిర్మాణంపైనే వుంటుంది, […]

Continue Reading
Posted On :

చిత్రం -2

చిత్రం-2 -గణేశ్వరరావు ఈ చిత్రాన్ని వేసింది మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా  (ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ ను ఇండియన్ ఫ్రిడా  గా కొందరు విమర్శకులు గుర్తించారు). ఫ్రిడా మరణం తర్వాత ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.   ఆమె చిత్రాలు ‘అధివాస్తవికత’తో నిండి ఉంటాయి. ఈ ‘గాయపడ్డ లేడి’చిత్రంలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన భౌతిక, మానసిక బాధలను చూపరులతో పంచుకుంటుంది. చాలావరకు ఆమె గీసినవి స్వీయ చిత్రాలే. లేడి తల తన […]

Continue Reading
Posted On :

చిత్రం-1

చిత్రం -గణేశ్వరరావు జార్జియా కీఫ్, అమెరికన్ చిత్రకారిణి, ‘మనం పూలని సరిగ్గా చూడం, ఎందుకంటే అవి చిన్నవి. సరిగ్గా నేను చూసే పద్ధతిలో పెద్దవిగా చూపిస్తూ వాటి బొమ్మ గీస్తే? మీరు తప్పక చూస్తారు’ అంటుంది. 1928లో గస గసాల పుష్పం బొమ్మను (30″/40″) గీ సింది, ప్రకృతిని నైరూప్య కళలో ప్రదర్శించి కళ్ళముందుకు తెచ్చింది. రెండు పూలే కనిపిస్తాయి, వాటి వెనుక కొమ్మలూ రెమ్మలూ లేవు . రంగుల మేళవింపులోనూ, వేసిన పద్ధతిలోనూ ఆధునికమైన ఈ […]

Continue Reading
Posted On :