చిత్రం-28

-గణేశ్వరరావు 

అన్నిటికీ ఆడదే ఆధారం!
పొద్దు తిరుగుడు పువ్వు కథ విన్నారా?
చార్లెస్ లా ఫొస్ 17వ శతాబ్ద నికి చెందిన ఫ్రెంచ్ చిత్రకారుడు, అతని చిత్రాల లోని రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి, అలంకారిక శైలిలో ఉంటాయి. ఆయన చారిత్రాత్మక కుడ్య చిత్రాలు కొన్ని ప్రసిద్ధి చెందాయి. ఆయన చిత్రాలు అప్పటిలో ప్రాచుర్యం ఉన్న కథల మీద ఆధారపడి ఉండటం మూలాన , అవి కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాక మనసును కూడా రంజింప చేస్తాయి. ఈ తైల వర్ణ చిత్రం ఒక గ్రీకు ప్రాచీన గాథ ను తెలుపుతోంది. :
క్లేయిషి ఒక జల దేవత, హె లియస్ ని ప్రేమిస్తుంది, ఆయనే సూర్య దేవుడు, లూకోథి యా కోసం ఆమెను వదిలి పెడతాడు, ఆమె కోపంతో తన తండ్రి కి ఫిర్యాదు చేయడంతో, తండ్రి అయిన సముద్రుడు లూకోథి యా ను సజీవంగా ఇసుక లో సమాధి చేస్తాడు. అది తెలుసు కున్న సూర్యుడు క్లేయిషిని దూరం గా ఉంచటంతో, విరహవేదనతో ఆమె 9 రోజులు నగ్నంగా అన్నపానాదులు లేకుండా కొండ మీద అతని కేసి చూస్తూ నిలుచుని ఉండి పోవడం తో పొద్దు తిరుగుడు పువ్వు గా మారిపోతుంది, సూర్యుడు ఎటు తిరిగితే అటు వైపు తిరిగే దీన్ని సూర్య కాంతి పువ్వు అని కూడా పిలుస్తారు.
చిత్రకారుడు తన చిత్రాన్ని చిత్రించిన పద్ధతిని చూడండి. తనని విడిచి పెట్టిన సూర్యుడు తన రథంలో దూరంగా వెళ్లి పోయాడు. ఆమెకి దుఃఖం కమ్ముకొస్తోంది, అంధకారం చుట్టు ముడుతుంది. ఆమె తోటి దేవతలు చుట్టూ చేరుతారు, ఆ దేవుని మాయలు వారికి తెలుసు, ఓదార్చటానికి ప్రయత్నిస్తారు. ఆమె చుట్టూ విచ్చుకుంటున్న పసుపు రంగు పూలు ఆమె దుఃఖం ని పోగొట్టి జీవ చైతన్యం అందిస్తాయని వారికి తెలుసు, ఆమె తాపాన్ని అవి తపస్సుగా ,మారుస్తాయి. ఆమె కన్నీళ్ళను తుడిచి, ఆమె జీవితానికి ఒక అర్థం కల్పి స్తాయి. మరణంతో ఆమెకు శాశ్వత స్వర్గం ప్రాప్తిస్తుంది. పూవుగా పునర్జన్మ ఎత్తుతుంది. ఆ జాతి పూలు సూర్య కిరణాల బంగారు రంగుని సంతరించుకుంటాయి , సంధ్యా సమయంలో తలలు వంచి సూర్యుడికి భక్తి భావాన్ని కనబరుస్తూ అభివాదం చేస్తాయి.
ఫ్రాన్స్ వ ర్ సై అంతపురం లో మూడు వందల సంవత్సరాలుగా ఉంటున్న ఈ గ్రీక్ కథా చిత్రం – కళకు ఉన్న శాశ్వతత్వాన్ని స్పష్టం చేస్తోంది. దీన్ని చిత్రించిన కళాకారుడు, ఆతని ఆశలు, ఆశయాలు, జయాపజయాలు కనుమరుగై పోయినా అతని సృజనాత్మక చిత్రాలు సజీవంగా ఈ నాటికీ నిలిచే వున్నాయి.. మన పౌరాణిక గాథలని అనుసరిస్తూ గీసిన అద్భుత కళాఖండాలు కూడ మన సంస్కృతి కి వారసత్వం గా నిలిచి వున్నాయి
 
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.