image_print

చీకటి అవతలి వెలుగు (కథ)

చీకటి అవతలి వెలుగు – షర్మిల  “నిన్నటి నుంచి ఏమీ తినలేదు కాస్త ఉప్మా అన్నా తిను ” అంటూ వదిన ఇచ్చిన ప్లేట్ ని మాట్లాడకుండా తీసుకుని తినేశాను. తినను అంటే బతిమాల్దామనుకుందో ఏమో నేను మామూలుగా తింటుంటే కాస్త ఆశ్చర్యపోయినట్టు చూస్తూంది. నిద్రాహారాలు మాని ఏడుస్తూ వుండాల్సిన నేను ఇలా ఎలా వుండగలుగుతున్నాను? జీవితంలో రాటు తేలిపోయానా? తెల్లారింది ఇంట్లో జనాలు తిరుగుతున్నారు. ” ఆ ఫొటో తీసి హాల్లో టేబుల్ మీద పెట్టండి […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-24 రాక్షసుడు

పేషంట్ చెప్పే కథలు – 24 రాక్షసుడు -ఆలూరి విజయలక్ష్మి “అయ్యో! ఏమిటమ్మా యిది? ఈ దెబ్బలేమిటి?” ఆదుర్దాగా అడిగింది శృతి. “అటక ఎక్కబోయి జారి పడిపోయాను” బలవంతాన బాధను ఓర్చుకుంటూ జవాబిచ్చింది సావిత్రి. రక్తాన్ని దూదితో తుడుస్తూ, పరిశీలనగా గాయాల్ని చూస్తూ ఆలోచిస్తూంది శృతి. వారం క్రితం భర్తను వెంటబెట్టుకొచ్చిన సావిత్రి గుర్తుకొచ్చింది. రోజారంగు చెక్కిళ్ళు, చిరుసిగ్గుతో వాలిపోతున్న కళ్ళు, చూడగానే ఆకర్షిస్తున్న అలంకరణ, కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. సావిత్రి భర్త సోమేశ్వరరావు పదేళ్ళ నుంచీ […]

Continue Reading

నిన్నటి భవితవ్యం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

నిన్నటి భవితవ్యం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -ఎస్వీ. కృష్ణజయంతి ”విడిపోదామా..?” చాలా ప్రాచీనకాలం నుంచీ విన్పిస్తున్న తుది బెదిరింపు ఇది! యుగయుగాలుగా ఓడిపోతున్న భార్యల సాధుస్వభావం పై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న ‘మగ పటిమ’కి దొరికిన బ్రహ్మాస్త్రం… ఈ మాటొక్కటే! వెంటనే బదులివ్వలేదు నేను. అడిగిన వెంటనే ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అన్నది సహేతుకమైన విషయం. అది నిజంగా ఆలోచించి తీసుకునే నిర్ణయంతో సమానం అని నాకు అనుభవపూర్వకంగా ఈ మధ్యనే తెలిసిన సత్యం ! […]

Continue Reading

లేఖాస్త్రం కథలు-1 – అపరాధిని

లేఖాస్త్రం కథలు-1 అపరాధిని – కోసూరి ఉమాభారతి ప్రియమైన అమ్మక్కా, నీతో మాట్లాడి నాలుగేళ్ళవుతుంది. ఇన్నాళ్ళూ ఇలా తటస్థంగా ఉన్నందుకు కూడా నేను నిజంగా అపరాధినే. ఏమైనా, నాకు నీవు తప్ప ఎవరూ లేరన్నది నిజం. అందుకే  ధైర్యాన్ని కూడగట్టుకుని నా సమస్యలు, సంజాయిషీలు నీ ముందుంచుతున్నాను.  నువ్వూహించని పని ఒకటి చేయబోతున్నాను. నా జీవితాన్ని మార్చబోతున్నాను అమ్మక్కా.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కూడా నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకి  నీవే కారణమయ్యావు. ఐదేళ్ళప్పుడు అమ్మ బంధం, […]

Continue Reading
Posted On :

వెచ్చనిదానా రావే నా చెలి (కథ)

వెచ్చనిదానా రావే నా చెలి (కథ) – సింగరాజు రమాదేవి కనురెప్పలకి అల్లంత దూరానే ఆగిపోయి దగ్గరికి రాకుండా సతాయిస్తోంది నిద్ర. కిటికీ బయట పల్చటి వెన్నెల పరుచుకుని ఉంది. గాలికి సన్నజాజి పూలతీగ మెల్లగా కదులుతూ చల్లని గాలిని, సన్నని పరిమళాన్ని మోసుకుని వస్తోంది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. కానీ అవేవీ శరణ్యకి హాయిని కలిగించట్లేదు. భుజం దగ్గర మొదలయి.. మోచేతి మీదుగా అరచెయ్యి దాటి వేలి కొసల వరకూ అలలు అలలుగా జలజలా […]

Continue Reading

బామ్మ చెప్పిన బాటలో! (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

బామ్మ చెప్పిన బాటలో (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -కె.వి.లక్ష్మణరావు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటి కొచ్చేసరికి అలసట వచ్చేసింది. ఒక కప్పు కాఫీ తాగితే కానీ అలసట తగ్గదను కుంటూ గుమ్మంలోకి అడుగు పెట్టాను.           నేను రోజూ ఇంటికొచ్చే సమయానికి రుక్కు హాల్లో సోఫాలో కూర్చుంటుంది. కాసేపు టి.వి. తోనో, ల్యాప్టాప్ తోనో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. బీ.టెక్ కంప్లీట్ చేసింది కదా , సాఫ్ట్ వేర్ […]

Continue Reading

అప్పుడే మొదలైంది (కథ)

అప్పుడే మొదలైంది (కథ) – డా.కే.వి.రమణరావు తలుపు తెరిచి రూమ్మేట్స్ లోపలికొచ్చిన చప్పుడుకు సగం మగత సగం ఆలోచన ల్లో నుంచి మేలుకుంది తను. వాళ్ళ మాటలు గుసగుసల్లోకి మారాయి. ‘ఫష్ట్ షో సినిమా అప్పుడే ఐపోయిందా’ అనుకుంది. పక్కలు సర్దుకుంటున్నారు. సినీ విశ్లేషణ కొనసాగించబోయింది దివ్య. “ష్.. ప్రతిమ నిద్రలోవుంది. అసలే తనని పిలవకుండా వెళ్ళాం, యింక పడుకో” అంది నందన. వినయ చిన్ననవ్వు తర్వాత నిశ్శబ్దం అలుముకుంది. ఎప్పుడో నిద్రపట్టి తెల్లవార్ఝామునే మెలుకువొచ్చింది తనకి. […]

Continue Reading
Posted On :

ఆఖరి మజిలీ (హిందీ అనువాద కథ- సుభాష్ నీరవ్)

ఆఖరి మజిలీ  హిందీ మూలం- `आखिरी पड़ाव का दुःख’- సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు           రాత్రి ఎన్ని గంటలయిందో తెలియదు. కళ్ళలోంచి నిద్ర ఎగిరిపోయింది. మనస్సు లోంచి శాంతి అదృశ్యమైపోయింది. కాసేపు పక్కమీద నుంచి లేచి కూర్చుంటున్నాను. కాసేపు పడుకుంటున్నాను. కాసేపు `వాహే గురు-వాహే గురు’ స్మరించుకుంటున్నాను. గురుమీత్, హరజీత్ నిన్న మాట్లాడుకున్న మాటలు నాకింకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నా యి. నా […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-23 మెరవని తారకలు

పేషంట్ చెప్పే కథలు – 23 మెరవని తారకలు -ఆలూరి విజయలక్ష్మి ప్రకృతి చెక్కిలి మీద చీకటి చారిక పడింది. రుక్మిణి గుండెల్లో దుఃఖకడలి పొంగింది. ఒడిలో పాపాయి విలక్షణమైన ఏడుపు, విచిత్రమైన భంగిమ, కాంతిలేని కళ్ళు, వయసుతోపాటు ఎదగని శరీరం, మెదడు… తన బ్రతుకులో పెద్ద అపశృతి వికృతంగా వినిపించి కంపించింది రుక్మిణి హృదయం. తన రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డను చూస్తున్న కొద్దీ తెలిసి తెలిసి తాను చేసిన పొరపాటు కళ్ళముందు కదిలింది. అందర్నీ […]

Continue Reading

గులకరాళ్ళ చప్పుడు (కథ)

గులకరాళ్ళ చప్పుడు(కథ) -శ్వేత యర్రం           కెనాల్ కట్ట మీద నాగేశ్వరస్వామి గుడికాడ జనాలే లేరు ఆ రోజు. రాధమ్మ నవ్వులు మాత్రం ఇనిపిస్తున్నాయ్. వాళ్ళ నాయన రామిరెడ్డి, కూతురు రాధమ్మ నవ్వులు చూస్కుంట, బీడీలు తాగి సందుల మధ్య గారలు పట్టిన పళ్ళతోటి నవ్వుకుంట, కూతురు దోసిలిపట్టిన చేతులల్ల గులకరాళ్ళు పోస్తున్నాడు. రాధమ్మ దోసిలినిండా ఉన్న గులక రాళ్ళు జాగర్తగ పట్టుకొని, కట్టకు కిందికి దిగనీక ఉన్న మెట్లలో రెండు […]

Continue Reading
Posted On :

సీతాలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సీతాలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వెంకట శివ కుమార్ కాకు జోరున వర్షం పడుతోంది. పట్నంకి దూరంగా మారుమూలకి విసిరెయ్యబడిన పల్లెటూరు. చాలానే పూరి గుడిసెలు వున్నాయి. ఒక గుడిసె దగ్గర వున్న గొడ్ల చావడి నుంచి ఒక బర్రె అరుస్తూనే వుంది. అది అరుపు కాదు ఏడుపులా వుంది. ఆ ఊళ్ళో కరెంట్ పోయి చాలానే సమయం అయ్యింది. ఆ బర్రె ఏడుపు లాంటి అరుపులు విని మనెమ్మ లేచి కూర్చుంది. […]

Continue Reading

తడబడనీకు నీ అడుగులని (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తడబడనీకు నీ అడుగులని … (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అజయ్ కుమార్ పారుపల్లి “అమ్మా నేను వెళుతున్నా, తలుపు వేసుకో” అంటూ స్రవంతి బ్యాగ్ , కీస్ తీసుకుని బయటికి వచ్చి లిఫ్ట్ దగ్గరికి నడిచింది. జానకి తలుపు దగ్గరికివచ్చి కూతురు లిప్ట్ లోకి వెళ్ళేవరకు చూస్తుండి పోయింది. లిప్ట్ లోకి నడిచి తల్లికి చేయి ఊపుతూ టాటా చెప్పింది స్రవంతి. లిప్ట్ కిందికి వెళ్ళగానే తలుపు మూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది […]

Continue Reading

తెల్లవారింది! (హిందీ అనువాద కథ- డా. దామోదర్ ఖడసే)

తెల్లవారింది!  హిందీ మూలం -`सुबह तो हुई!’- డా. దామోదర్ ఖడసే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు [ముంబయి వాస్తవ్యులకి 25 జూలై 2005 మరువలేని రోజు. ఆరోజు నెలకొన్న ప్రళయ సదృశ వాతావరణంలో ఎన్నడూ కని-విని ఎరుగని విధంగా భయంకరమైన వర్షం కురిసింది. జనం `ఇటీజ్ రెయినింగ్ ఎలిఫెంట్స్ అండ్ హిప్పోపొటామసెస్’ అని భావించారు. మహానగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల్లో ఉండిపోయినవారు ఆ రాత్రికి సురక్షితంగా ఉండగా, ఇళ్ళకి బయలుదేరినవారు, […]

Continue Reading

మారాల్సిన దృశ్యం (కథ)

మారాల్సిన దృశ్యం(కథ) -డా. లక్ష్మీ రాఘవ “రా.. రా.. ఇప్పటికి వచ్చావు …” తలుపు తీస్తూ ఎదురుగా నిలబడ్డ సవిత చేతి నుండీ సూట్కేసు అందుకుని గెస్ట్ రూమ్ వైపు నడిచింది రజని. “ఈ ఊరికి మా హెడ్ ఆఫీసు షిఫ్ట్ అయ్యింది. నాకు ఇక్కడ ఆఫీసులో మూడు రోజుల పని ఉందంటే, వెంటనే నిన్ను చూడచ్చనుకుని బయలుదేరా..”అన్న సవితతో “పోనీ, నాకోసం వచ్చావు..”అంది రజని సంతోషంగా. “బయట నుండీ మీ ఇల్లు చాలా బాగుంది…మీ స్టేటస్ […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-22 సాలెగూడు

పేషంట్ చెప్పే కథలు – 22 సాలెగూడు -ఆలూరి విజయలక్ష్మి “ఇలా తప్ప మరోలా బ్రతకలేనా?” మరోసారి ప్రశ్నించుకుంది కళావతి. కోమల త్వాన్ని కోల్పోని ఆమె ముఖం వాడిపోయి వుంది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. “ఇంత పాడుబ్రతుకు బ్రతక్కపోతేనేం!” అని పొడిచినట్లుండే లోకుల చూపులు తనమీద పడిన ప్రతిసారీ తనను తానే ప్రశ్న వేసుకుంటుంది కళావతి. యెంత ఆలోచించినా, ఎంత తరచి చూసినా ఎప్పుడూ జవాబొక్కటే మిగులుతుంది. “ఇలా తప్ప మరోలా బ్రతికే మార్గంలేదు నాకు. ఇంత […]

Continue Reading

కప్పు (కథ)

కప్పు -ఉమాదేవి సమ్మెట భవిష్యా లాడ్జ్ నుండి హడావుడిగా ఇంటికెళ్తున్న నాత్యానాయక్ ని చూసి… “ఏంది నాత్యా.. ఉరుకుతున్నవ్ వజ్రమ్మ రమన్నదా?” ఏసోబ్ వెక్కిరింపుగా అన్నాడు. “ఏ ఆమె వజ్రమ్మ గాదూ. ఆమె ఆయనకు బాస్”నర్సయ్య అన్నాడు. “మంచామనే పట్టిండుపో ”భీమ్లా అంటున్నాడు. తన వెనుక నుండి వినబడుతున్న వెటకారపు మాటలకు..పోయి నాలుగు తందామన్నంత కోపాన్ని దిగమింగుకుని ఇంటికి చేరుకున్నాడు నాత్యా. “ఏందిగట్లున్నావ్? మల్లా ఏదన్నా ఒర్లుతున్నరా వాళ్ళు” వజ్రమ్మా అడిగింది. “ఎప్పుడుండే లొల్లేగానీ.. ఏంది వజ్రమ్మా! […]

Continue Reading
Posted On :

మాతృత్వం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

మాతృత్వం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -ఝాన్సీలక్ష్మి జాష్టి (శ్రీఝా) ఖాళీగా ఉన్నఉయ్యాలను చూసి నిర్వేదంగా నవ్వుకుంది భూమి. భూమి అని పేరు తనకు ఏ ముహూర్తాన పెట్టారోకానీ ఆ భూదేవిలాగానే ఏమి జరిగినా నోరుమెదపకుండా భరించాల్సి వస్తోంది, అయినా నోరుతెరిచి మాట్లాడితే మాత్రం ప్రయోజనం ఏముంది? మాటకు మాట ఎదురుచెప్తున్నావ్, ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది అంటూ ఎక్కడో దూరంగా ఉన్న తల్లిని కూడా మాట అనిపించడం తప్ప సాధించేది ఏముంది […]

Continue Reading

న్యాయపక్షం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

న్యాయపక్షం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -దామరాజు విశాలాక్షి “బాల్కనీలో కూర్చొని భానుమతి పరిపరివిధాల ఆలోచిస్తోంది”. తన కళ్ళారా చూసిన ఆ సంఘటన పరిపరి విధాల ఆలోచించేలా చేస్తోంది” ఏం చెయ్యాలి? ఈ విపరీతం ఎలా ఆపాలి? ఇందుకోసమై వీడు తనింట చేరాడా? వీడిని వెళ్ళగొట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? “సమస్యను సమూలంగా నాశనం చేయాలి… ఎంతో నమ్మకంతో సింహాద్రి పిల్లని తన వద్ద వదిలి వెళ్ళింది. తను ఆమెకు మాటిచ్చి తప్పుచేసిందా? […]

Continue Reading

శ్రీకారం (కథ)

శ్రీకారం (కథ) -పారుపల్లి అజయ్ కుమార్ అది జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. ఎనిమిదవ తరగతిగదిలో ‘జంతువులలో ప్రత్యుత్పత్తి’ జీవశాస్త్రం పాఠ్యబోధన జరుగుతున్నది. నల్లబల్ల మీద మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ,స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రమ్స్ వ్రేలాడదీసి ఉన్నాయి. ” ఆవులు దూడలకు జన్మనివ్వటం , మేకలు మేకపిల్లలకు జన్మనివ్వటం మీలో కొద్ది మందయినా చూసే వుంటారు కదా. తల్లి బిడ్డకు  జన్మనిస్తుంది. అలా జన్మనివ్వడంలో మగజీవి పాత్ర కూడా ఉంటుంది. ఒక పువ్వు నుండి  […]

Continue Reading

ప్రాయశ్చిత్తము (హిందీ అనువాద కథ)

ప్రాయశ్చిత్తము (హిందీ అనువాద కథ) -దేవీ నాగరాణి  తెలుగు అనువాదం : గాయత్రి లక్ష్మి  ఆమె చదువుకోలేదు. చదువు ఎలా ఉంటుంది? చదువుకుంటే ఎలా ఉంటుంది?అనే విషయం ఆ కోమలమైన మనసులో ఎవరూ నాటలేదు. ఆమెకున్న పరిస్థితులు కూడా ఆమెను చదువుకోనివ్వలేదు. ఒక చిన్న పల్లెలో అమాయకపు ఆడపిల్ల పొలం పనులు చేస్తూ పెద్దదయ్యింది. డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో, సుఖం అంటే ఏమిటో ఇవేమీ తెలియదు ఆమెకి. డబ్బు విలువ తెలియడానికి ఆమె చేతికి ఎవరైనా […]

Continue Reading
Posted On :

కోడలుగారు (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)

కోడలుగారు (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఆవిడని చిన్నా-పెద్దా అనకుండా అందరూ కోడలుగారు అనేవారు. ఆవిడ అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇలా తప్ప మరో పేరుతో ఆవిడని పిలవటం నేనెప్పుడూ వినలేదు. మేము ఉండే పెద్ద భవనానికి ఆవిడ యజమానురాలు. మూడు అంతస్తులు ఉన్న ఆ భవంతిలో పై అంతస్తులో మేము ఉండేవాళ్ళం. అన్నిటికన్నా కింది అంతస్తులో […]

Continue Reading

సరిలేరు నీకెవ్వరూ (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సరిలేరు నీకెవ్వరూ (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -జె.వి.ఎస్ లక్ష్మి తెల్లని సముద్రతీరాలు, మణిసముద్రం, నీలిమడుగులు, రంగు రంగుల సముద్ర జీవులు, అనేక తాటిచెట్లు, ఈభూతాల స్వరం మాల్దీవ్స్ కాక ఇంకేంటి. ఈ ప్రక్రుతి అందాన్ని వివరించటానికి ఉపమానాలు కూడా కరువైపోయాయి. చూసి ఆనందించక , వివరించాలనుకోవటం నా తప్పు. మోకాలిలోతులో వున్న సముద్రం యెంతదూరం నడిచినా అదేలోతు ఉండటం ఆశ్చర్యంవేసి.. “ఎవరబ్బా సముద్రంలోతు తెలుసుకోలేము అన్నది? మనం ఇలా ఎంత దూరమయినా అలవోకగా, […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-21 చివరి మజిలీ

పేషంట్ చెప్పే కథలు – 21 చివరి మజిలీ -ఆలూరి విజయలక్ష్మి ముడతలుపడ్డ నల్లటి ముఖం, రెండు కనుబొమ్మల మధ్య విభూది, ఊపిరి తీసు కుంటున్న గుర్తుగా కదులుతున్న ఛాతి, అగరొత్తులు వాసన. కబుర్లు చెప్పుకుంటూ సరస్వతమ్మ మంచం చుట్టూ కూర్చున్న ఆమె కూతుళ్ళు, కోడలు, మనవరాళ్ళు, మనుమలు… విశాలంగా వుండే గది ఎంతో ఇరుకుగా ఉన్నట్లుంది. ఎదురుగా నడవాలో కుర్చీలో పడుకున్నాడు సరస్వతమ్మ మామగారు రఘు రామయ్య. గాజు కళ్ళతో కోడలి వంక చూస్తున్న ఆ […]

Continue Reading
sailaja kalluri

ఒక నాటి మాట (కథ)

ఒక నాటి మాట -కాళ్ళకూరి శైలజ “మీ ఆయనకి నాలుగో తరగతి నుంచి పరీక్ష ఫీజులు నేనే కట్టానమ్మా. చిన్న మావయ్యా ! అంటూ నా చుట్టూ తిరిగేవాడు”. శిల్ప నవ్వుకుంది. రాహుల్ కూడా నవ్వాడు. ప్రేమ వివాహం అయ్యాక ఇరుపక్షాల వాళ్ళు ఇంకా వేడిగా ఉండటంతో రాహుల్ శిల్పని పూనాలో ఉన్న తన మేనమామ రాధాకృష్ణ గారింటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి లోనవ్లా వెళ్లాలని వాళ్ళిద్దరి ప్లాన్. తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉండటంతో రాధాకృష్ణ గారికి […]

Continue Reading

భయం (హిందీ అనువాద కథ- సూరజ్ ప్రకాష్ )

భయం (హిందీ అనువాద కథ) హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు శారద తిరిగి పనిలోకి వచ్చింది. ఒక్క నెల వయసున్న పసివాడిని తన ఒడిలో ఎత్తుకుని తీసుకొచ్చింది. తలుపు మిసెస్ రస్తోగీ తెరిచింది. ఆమెని చూస్తూనే సంతోషం వ్యక్తపరిచింది –“సంతోషం శారదా. మంచిదయింది నువ్వు వచ్చేశావు. నువ్వు పెట్టి వెళ్ళిన అమ్మాయి బొత్తిగా పనిదొంగ. పని ఎగ్గొట్టడం కూడా ఎన్నిసార్లని. ఏదీ చూడనీ, నీ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-20 భయం

పేషంట్ చెప్పే కథలు – 20 భయం -ఆలూరి విజయలక్ష్మి “ఇంత సాహసమెందుకు చేశారమ్మా? మీరు లేకపోతే ఈ పసివాల్లంతా ఏమైపో తారు?” తల్లి గండం గడిచి బయటపడిందో, లేదో తెలియక బిక్క మొహాలేసుకుని నుంచున్న పిల్లల్ని చూపిస్తూ అడిగింది శృతి. “తనలాంటి వాళ్ళకు చావడం సాహసం కాదు. బ్రతకడమే సాహసం” అనుకుంది కామాక్షి. మసకబారిన కళ్ళముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలు కదలసాగాయి. శృతి రాసిచ్చిన టానిక్ల లిస్టు వంక ప్రాణం లేనట్లు చూసింది […]

Continue Reading

ఇష్టసఖి (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఇష్టసఖి (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అరుణ చామర్తి ముటుకూరి నా జీవితంలో దానికో ప్రత్యేక స్థానం ఉంది. అసలు ఇది ఈ జన్మలోది కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు. నా లైఫ్ లో మలుపు తిప్పిన ముఖ్య సంఘటనలు అన్నిట్లో అదే ప్రముఖ పాత్ర వహించింది ఇంతకీ అదేమిటనేగా.. అదే నండి బస్సు ప్రయాణం. అదే నా ఇష్ట సఖి           ఎందుకంటే అమ్మ కి […]

Continue Reading

ది లెగసీ (కథ)

ది లెగసీ (కథ) -బి.భవాని కుమారి “వర్ధని ఆ౦టీ రమ్మన్నది, నువ్వు కూడా రారాదు” అన్నపూర్ణ కూతురుతో అన్నది. “దేనికి? లలిత ప్రశ్నించింది తల్లిని. వాళ్ళ అబ్బాయి, అమ్మాయి అమెరికా నుంచి వచ్చారట ” “వస్తే, మన౦ దేనికి?” “నిన్ను చూసి చాలా రోజులైందంటా, వాళ్ళ శ్రీజ రమ్మన్నదని చెప్పింది. “ తల్లికేసి జాలిగా చూసింది లలిత. తల్లి దేనికోసం ఆశ పడుతుందో ఆమెకి తెలుసు. ఆమెకి వర్ధనమ్మ సంగతి బాగా తెలుసు. ఇలా పిండివంటలు తల్లి […]

Continue Reading
Posted On :

నది – నేను (హిందీ అనువాద కథ- డా. రమాకాంత్ శర్మ)

నది – నేను (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నది తను ఉద్భవించే చోటునుండి వెలువడినప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలియదు. తను ఎంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి ముందుకు వెళ్ళాలో, ఏయే అనుభవాలను ఎదుర్కోవాలో, ఏ పరిస్థితులతో పోరాటం చేయాలో, చివరకు ఎక్కడ ఏ సముద్రం ఒడిలో కలిసిపోవాలో అనే ఆలోచన కూడా తన మనస్సులో […]

Continue Reading

చిట్టెమ్మ బొట్టు పెట్టుకుంది (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

చిట్టెమ్మ బొట్టు పెట్టుకుంది (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -జానకి కొత్తపల్లి చాలా కాలానికి గుమ్మం ముందు వేసిన పెళ్ళిపందిరి, ఆ పందిరికి కట్టిన పచ్చటి మామిడి తోరణాలు, అలికిన పచ్చని నేల మీద అందంగా పెట్టిన తెల్లటి ముగ్గులు కనువిందు చేస్తున్నాయి. విరిసిన తొగరు పూల సన్నని గుబాళింపుతో గాలి వీస్తోంది. చిట్టెమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. ఇన్నాళ్ళకు తన తమ్ముడికి పెళ్ళి జరుగుతోందని, అందునా తన పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది గనుక […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-19 రేపటి వెలుగు

పేషంట్ చెప్పే కథలు – 19 రేపటి వెలుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్!” వేకువలో జారిన తొలి కిరణంలా లోపలికి వచ్చింది మిస్ రోజీ. “గుడ్ మార్నింగ్” చిరునవ్వుతో ఆహ్వానించింది శృతి. విద్యాసంస్థలు వ్యాపార సంఘా లుగా మారి హాస్టల్ జీవితం తమ జీవితంలో ఒక పీడకలగా పిల్లలు భావించే స్థాయిలో వున్న బోర్డింగ్ స్కూల్స్ వర్థిల్లుతున్న తరుణంలో పదిమంది పిల్లల్ని తన యింట్లో ఉంచుకుని వాళ్ళకు సమగ్రమైన ఆహారంతోబాటు కాస్తంత ప్రేమనూ, ఆప్యాయతనూ పంచె […]

Continue Reading

ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -బి.కళాగోపాల్ బ్యాగ్ లో నుండి మరోసారి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ కాపీని చూసుకొని సర్దుకున్నాను. బాబు నుదుటి పై చెయ్యివేసి చూశాను. జ్వరం జారింది. వేసుకున్న టీషర్ట్ చెమటలు పోసి తడిచిపోయింది వాడికి. అటుకేసి తిరిగాడు. దిగులుపొర నా గుండెల్ని మెలి పెట్టింది. బి.టెక్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ డెంగీ జ్వరమొకటి వాడికి. ఇంకో రెండు పరీక్షలు రాయాలి. ఈ వేసవిలో మే ఐదు, ఆరు […]

Continue Reading
Posted On :

ఇద్దరు గొంగళిపురుగులు (కథ)

ఇద్దరు గొంగళిపురుగులు (కథ) -మమత కొడిదెల “నువ్వు చేసిన పనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నా.” ఎక్కడో మారుమూల నొక్కిపెట్టేసిన జ్ఞాపకాల్లోంచి హఠాత్తుగా ఎగిరొచ్చిందిసూదంటు రాయి ఒకటి. గట్టిగా ఊపిరి పీల్చుకుని తల విదిల్చింది శశి. కంప్యూటర్లో టైపు చేస్తున్న డాక్యుమెంట్ ను సేవ్ చేసి, కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి నడుస్తూ “మేఘా, తినడానికి ఏమన్నా తెచ్చివ్వనా?” అని హాలుకు అవతల వున్న మేఘ గదిలోకి  కేకేసింది. మేఘ 7వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ వల్ల సంవత్సరం నుంచి […]

Continue Reading
Posted On :

మనసంతా నువ్వే! (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

మనసంతా నువ్వే! (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ కొన్ని హిస్టరీలంతే- చెరిగిపోవడమే వాటికున్న అర్హత! ఆ విషయం నేను గ్రహించిన ఆ రోజు……. వెదకబోయిన తీగ కాలికి తగలడం అదో ఆనందం. కానీ వెదకాలనుకోని తీగ తగిలి, వళ్ళంతా కారం పూసినట్లయింది నాకు. తగిలింది కూడా మామూలు తీగ కాదు. మెరుపుతీగ! ఆ తీగ పేరు గీత. ఏడేళ్ళ క్రితం నా భార్య. ఐదేళ్ళ క్రితం విడిపోయాం. తర్వాత మళ్ళీ ఇదే […]

Continue Reading
Posted On :

ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ- డా. సోహన్ శర్మ)

ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. సోహన్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు లాస్ ఏంజలిస్ లో ఇది నా ఆఖరి సాయంత్రం. ఇంత పెద్ద నగరంలో సాయం కాలం నెమ్మది-నెమ్మదిగా జరుగుతూ దగ్గరికి వస్తోంది. నేను సాయంత్రానికి కార్యక్రమం ఏదీ ప్రత్యేకించి నిర్ణయించుకోలేదు. ఇంతకు ముందు అయిదారు రోజులపాటు సాయంత్రాలు నాకు తగిన ఏర్పాటులు చేసుకోవడంలోనే గడిచిపోయాయి. ఏదయినా కొనుక్కోదలుచుకున్నా, లేదా సామానులు […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-18 కొత్తగాలి

పేషంట్ చెప్పే కథలు – 18 కొత్తగాలి -ఆలూరి విజయలక్ష్మి “మీరు తల్లి కాబోతున్నారు” గర్భనిర్దారణ చేసింది శృతి. మెల్లగా ఎక్సామినేషన్ టేబల్ దిగివచ్చి శృతికి ఎదురుగా కూర్చుంది అమరేశ్వరి. శృతి ఊహించినట్లు ఆమె ముఖం సంతోషంతో విప్పారలేదు. అంత మంచి వార్తను విన్న ఉద్వేగంతో ‘థాంక్ యూ’ అనలేదు. శృతికి తెలిసినంత వరకు అమరేశ్వరి కొంచెం లేట్ గానే వివాహం చేసుకుంది. ఇన్నాళ్ళకు వివాహమయి తల్లి కాబోతుంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యే ఆడవాళ్ళనే చూసింది కానీ, […]

Continue Reading

వాడని నీడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

వాడని నీడలు  (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -ఝాన్సీ కొప్పిశెట్టి మొబైల్ నిర్విరామంగా మోగుతోంది. ఆ మోతలో ప్రశాంతత లేదు. అందులో ఆరాటం, దూకుడు నా సిక్స్త్ సెన్స్ కి సుస్పష్టంగా వినిపిస్తోంది. అయినా నేనుప్రశాంతంగానే “హలో” అన్నాను. “ఏమిటి, నువ్వు ఆల్ ఇండియా రేడియోలో కథ వినిపించనన్నావుట…” ఆవేశంలో మూర్తిగారి గొంతు అదురుతోంది. ఎటువంటి పలకరింపు లేకుండా వేడిగా, దురుసుగా అడిగారు. నాకు ఉన్న మగ స్నేహితులు ఒక చేతి వేళ్ళ లెక్కింపుకి […]

Continue Reading

గంట గడిస్తే చాలు (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

గంట గడిస్తే చాలు (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -భాగవతుల భారతి           అవును నెలరోజులు క్రితమూ ఇలాగే అయింది. కానీ ఏం చేయటం? పనిమానలేని పరిస్థితి. అయ్యపోయినప్పుడు… వారం రోజులు సెలవడిగితే సేటు. “వారం రోజులా? మూడు రోజులుండి వచ్చేయ్ “అన్నాడు.           మరి వెళ్ళినాక అమ్మఏడుపు చూడలేక, ఇంకోరోజు ఉండాల్సివచ్చే! మరి తిరిగి పనిలోకి వచ్చాక ….సేటుముఖం చూడాలీ! ముఖం […]

Continue Reading
Posted On :

కుమారి (కథ)

కుమారి (కథ) -దర్పణం శ్రీనివాస్ “ఇంగెంత  కష్టమొస్చే ఇంగెంత నష్టం జరిగితే ఆ దేవుడొస్చాడో! మనది  సిన్న కులమైతే! ఇట్టా మన పెండ్లాం బిడ్డల్ని ఆని పాల్జెయ్యాల్సిందేనా? మనమేం ఖర్మ సేసుకున్యామని ? పుట్టినాల్నుంచి మనట్టాటోళ్ళ కోసరం ఆ మాలోల నర్సిమ్మసామి రాకపోతాడా అని ఎదురు సూచ్చాండా! రాల్యా! అయినా ఎందుకొస్చాడులే! మనట్టా బీదోళ్ళ కోసరం ఎందుకు పుడ్తాడు? నాకు కష్టమొచ్చే ఆయప్ప వస్చాడనుకోవడం నా యెర్రి! నా మనవరాలి కష్టాన్ని తీరుస్చాడనుకోవడం అంతకన్నా యెర్రి ! […]

Continue Reading

ఇంకా చెప్పమ్మా (హిందీ అనువాద కథ- డా. రమాకాంత్ శర్మ)

ఇంకా చెప్పమ్మా (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “రా బాబూ, లోపలికి రా” – రవీష్ అమ్మగారు నా నమస్కారానికి జవాబిస్తూఅన్నారు. నేను నా బూట్లు బయటనే విడిచి గదిలోకి వచ్చాను. ఒక స్టూలు లాక్కుని కూర్చుంటూ అడిగాను – “రవీష్ లేడా అండీ? ఎక్కడికైనా బయటికి వెళ్ళాడా?” “వాడిని పెరుగు తెమ్మని పంపించాను. ఇవాళ మజ్జిగపులుసు చేద్దామనుకుంటు న్నాను. […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-17 పారిజాతాలు

పేషంట్ చెప్పే కథలు – 17 పారిజాతాలు -ఆలూరి విజయలక్ష్మి గాలి అల వేగంగా వచ్చి తాకింది. మంచు బిందువులు జలజలా రాలాయి. పారిజాతాలు పానుపు మీద మరిన్ని పారిజాతాలు రాలిపడ్డాయి. తెల్లటి రేకలు, ఎర్రటి కాడలు. ఎరుపు తెలుపు కలనేత తివాచీని చెట్టుకింద పరిచినట్లుగా వుంది. టెర్రస్ మీద నుంచుని పక్కింట్లోని పారిజాతాలు వంక తదేకంగా చూస్తూంది శృతి. ఇంద్రధనుస్సు లాంటి తన బాల్యం కళ్ళముందు కదిలింది. చీకటి తెరలు విచ్చిపో కుండానే పోటీగా ఒకరికంటే […]

Continue Reading

ధీర (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)

ధీర (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) – బ్రిస్బేన్ శారద ఆఫీసులో నా కేబిన్లో ఎప్పట్లానే పనిలో తల మునకలుగా వున్నాను. ఈ రిపోర్ట్ శుక్ర వారం కల్లా పంపాలి. వున్నట్టుండి మీటింగ్ అలర్ట్ మోగింది. పొద్దున్న తొమ్మిదింటికి ఏం మీటింగ్? చిరాగ్గా కంప్యూటర్ మీద కేలండర్ తెరిచి చూసాను. అంజనాతో మీటింగ్! అంజన నా టీంలో ఒక యేణ్ణర్థం కింద చేరింది. పర్సనల్ మీటింగ్ రిక్వెస్టు […]

Continue Reading
Posted On :

సముద్రం (కథ)

సముద్రం (కథ) – కె. వరలక్ష్మి           ఆ బస్టాండులో బస్సు దిగేసింది లసిమి.           ఎక్కడానికి తోసుకుంటున్న జనం మధ్య నుంచి బైటపడింది.           కాలికందనంత ఎత్తైన మెట్టెక్కి ప్లాట్ఫాం మీదికొచ్చింది, భయం భయంగా కాస్త ముందుకి నడిచి అక్కడున్న బెంచీ మీద కూర్చోబోయింది. అంతలో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆగిపోయి చుట్టూ పరికించింది.       […]

Continue Reading
Posted On :

పునర్నవి (కథ)

పునర్నవి (కథ) -బి.భవాని కుమారి           సీతకి నిద్ర రావటం లేదు. ప్రక్కనే వున్న సెల్ తీసి టైం చూసింది. రాత్రి రెండు. ఎంత ఆలోచించినా తన సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ ఇంట్లో తనకింక స్థానం లేదు. వెళ్ళిపోవాలి, యాభైఏళ్ళ వయసులో, తాను వుంటున్న ఈ గూడునీ, ఈ చిన్ని తోటని, తన అస్థిత్వాన్నీ కోల్పోయి వెళ్లిపోవాల్సిందేనా? దారిలేదు. ఎలా మురారిని వదిలి పోవటం? వెళ్ళిపోయి ఎవరి ఆశ్రయం పొందాలి? […]

Continue Reading
Posted On :

చిగురించిన సీత! (కథ)

చిగురించిన సీత! -అయ్యగారి శర్మ “నౌ యువార్ ప్రెగ్నెంట్…” అని డాక్టర్ వసుంధర చెప్పగానే చెప్పలేని అనుభూతికి లోనయింది సీత. సంతోషించాలా?  బాధపడాలా? రెండూ కలిసిన భావాల ఉధృతిని నిభాయించుకోవడం మూడు పదులు చూడని సీతకి కష్టమైంది. వెంటనే ఆమె కళ్లల్లో ఓ పొరలాగా చెమ్మ అల్లుకుంది. ఆ చెమ్మ చెలియలి కట్ట దాటబోతుంటే చూపుడు వేలితో అద్దుకుంది. మనసులో ఏదో ఉద్వేగం. ఆపుకుందామనుకున్నా ఆగని కన్నీటి ధారను ఇక ఆపలేకపోయింది. తల వంచుకుని కూర్చుండిపోయింది. డాక్టర్ […]

Continue Reading
Posted On :

ముందడుగు

ముందడుగు – ఝాన్సీ కొప్పిశెట్టి “శారద.. విడో ఆఫ్ శ్రీనివాస్” అలసటగా ఆఫీసు నుండి తిరిగి వస్తూ గేటుకి తగిలించి వున్న పోస్ట్ బాక్సులో నుండి తీసిన కవరు పైన పేరు చదివిన శారద మనసు ఒక్క క్షణం స్తబ్దు అయిపోయింది. మొట్ట మొదటిసారిగా తన పేరుతో జత చేయబడ్డ ‘విడో’ అనే కొత్త విశేషణం వంక విచిత్రంగా చూసింది. శారద విడో ఆఫ్ శ్రీనివాస్ అయి ఇరవై రోజులే అయ్యింది. వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ గా […]

Continue Reading

ఆక్రందన (కథ)

ఆక్రందన(కథ) – శ్రీపార్థి వస్తానన్న వాడు ఇంకా రాడే ముంచడు గదా ముష్టి వెధవ వస్తాడా రాడా! ఏమో… ఏమో…. ఈ బస్టాండు చూస్తే పాడుబడిన స్మశానంలా వుంది. చుట్టూ వున్న ఈ మనుషులు స్మశానంలో కాకుల్లా హడావుడిగా తిరుగుతున్నారు. ఎంతసేపని ఒంటరిగా ఈ చేసంచి పట్టుకొని కూచోను. ఈ కాకులన్ని నన్ను పొడుచుకు తినేలా చూస్తున్నాయి. కొంపదీసి రాడా ఏమిటి దరిధ్రుడు. కొంపదీసి ఏమిటి… కొంపే కూలిపోతుంది – కాలిపోతుంది – కడతేరిపోతుంది పైన సూర్యుడు […]

Continue Reading
Posted On :

పూలమ్మ (కథ)

పూలమ్మ (కథ) – ములుగు లక్ష్మీ మైథిలి సంధ్యా సమయం. అప్పుడే విచ్చుకుంటున్న మల్లె పూలను దండలుగా కట్టి, అమ్ముకోవడానికి వీధిలోకి వచ్చింది సీతవ్వ. అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు చేదోడు వాదోడుగా ఉండటానికి పూల వ్యాపారం మొదలుపెట్టింది. ప్రతీరోజూ ఇంటి ముందున్న మల్లె, కనకాంబరాలు, చామంతుల మొక్కలకు ప్రతీరోజూ నీరు పోసి, ఎరువు వేసి పెంచుతుంది. సాయంత్రం సమయానికి పూలు మాలలుగా కట్టటం కోసం మధ్యా హ్నం నుంచే  అన్ని రకాల పూలతో మాలల కట్టి […]

Continue Reading

కొడుకు

కొడుకు – వెంపరాల దుర్గా ప్రసాద్ సాగర్ భార్య మాట కాదనలేడు. చాలా సాత్వికమయిన స్వభావం. భార్య తాను గర్భవతి అయిన దగ్గర నుంచి, తన తల్లిని ఎలా వాడుకుందో తెలుసు. స్వాతి, భర్త సాగర్ ని లెక్క చేసేది కాదు. 7 వ నెల వచ్చేక పుట్టింటి వాళ్ళు తీసుకు వెళతారేమో అని, ఎదురు చూసి, ఒకరోజు పొరపాటున అడిగింది వర్ధనమ్మ. “మీ అమ్మ గారు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు?” ఎందుకు ? అని ఎదురు […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-16 నీళ్ళు

పేషంట్ చెప్పే కథలు – 16 నీళ్ళు -ఆలూరి విజయలక్ష్మి నీళ్ళు! నీళ్ళు! నీళ్ళ కోసం పేట పేటంతా గగ్గోలెత్తిపోతుంది. అప్పుడే రెండు రోజులుగా మంచినీళ్ళ ట్యాంకర్ కోసం చూసిచూసి ప్రాణం కడగట్టిపోతూంది. ఏ హార్న్ వినిపించినా టాంకర్ వస్తూందని ఆశగా చూసి, కాదని నిర్ధారణ కాగానే నిరాశతో తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. గౌరీ మాటిమాటికి నాలుకతో పేదాన్ని తడుపుకుంటుంది. ఎండి పగిలిన పెదాలు తడి తగలగానే మండుతున్నాయి. రెండు రోజులుగా స్నానం లేక ఒళ్ళంతా చీదరగా […]

Continue Reading

వీమా (కథ)-డా||కె.గీత

వీమా (వంగూరి ఫౌండేషన్ 2023 ఉగాది ఉత్తమ రచనల పోటీలో అత్యుత్తమ కథగా బహుమతి పొందిన కథ) (కౌముది ఏప్రిల్ 2023 ప్రచురణ) -డా.కె.గీత ఆఫీసు నించి వస్తూనే ఉయాల్లోంచి పాపని ఒళ్ళోకి తీసుకుని తల, చెవులు  నిమురుతూ తనలో తాను గొణుక్కుంటున్నట్లు ఏదో అనసాగేడు సాగర్. “అదేవిటి బట్టలు కూడా మార్చుకోకుండా…. ఇంకా ఏదో అనబోతూ గది గుమ్మం దగ్గిరే ఆగిపోయేను.  నా వైపు చూడకపోయినా సాగర్ ముఖంలోని మెలితిప్పుతున్న  బాధ గొంతులో వినిపించి వెనకడుగు వేసేను. […]

Continue Reading
Posted On :

ఆంతర్యం (కథ)

ఆంతర్యం (కథ) – లలితా వర్మ ఆఫీసు నుండి యిల్లు చేరి లోపల అడుగుపెట్టే సరికి ఘుమఘుమలాడే పకోడీ వాసన ముక్కు పుటాలను చేరి, అంత వరకూ ట్రాఫిక్ జామ్ లో, పొల్యూషన్ లో, పెట్రోల్ వాసనలు, దుమ్ము పీల్చి పీల్చి అలసిన ముక్కుకి స్వాంతన చేకూర్చింది.           తొందరగా ఫ్రెషప్పయి సోఫాలో కూలబడి టీ.వీ.రిమోట్ చేతిలోకి తీసుకున్నానో లేదో అమ్మ పకోడీ ప్లేటు అందించి పక్కనే కూర్చుని         […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-15 తపన

పేషంట్ చెప్పే కథలు – 15 తపన -ఆలూరి విజయలక్ష్మి “చిన్నపిల్లవి. నీకు గుండె నొప్పేమిటమ్మా?! ఫిగర్ కాపాడుకోడానికని మరీ నాజూగ్గా తినక శుభ్రంగా తిను” మందులచీటీ యిస్తూ రాగిణితో చెప్పింది డాక్టర్ శృతి. “మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మేడం. మీ పనయ్యేదాకా కూర్చుంటాను” దిగాలుపడిన ముఖంతో శృతి పనయ్యేదాకా కాచుకూర్చుంది రాగిణి. “మీరు మా వారితో ఒక విషయం చెప్పి ఒప్పించాలి మేడం!” రాగిణి మాటలు విని గలగలా నవ్వింది శృతి. “లవ్ […]

Continue Reading

అతను (కథ)

అతను (కథ) -డా. లక్ష్మీ రాఘవ గేటు ముందు కారు ఆగిన చప్పుడైతే వంటింట్లో నుండీ హాలు కిటికీ వైపు తొంగి చూసింది వర్ధని. కారు దిగి లోపలకు వస్తున్న వ్యక్తిని చూసి చట్టుక్కున పక్కకు జరిగి ఒక్క క్షణం నిలబడింది. వెంటనే త్వరగా వంటింట్లోకి వెళ్ళింది. మరు నిముషంలో కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీసిన వర్ధనిని చూస్తూ… “బాగున్నావా వర్ధినీ?” అనడిగాడు అతను. జవాబు చెప్పాలనిపించక తల ఊపింది… అతను సోఫాలో కూర్చుంటూ “బాబు […]

Continue Reading
Posted On :

అదే పాట (కథ)

అదే పాట (కథ) – కె. వరలక్ష్మి           “ఏంటే సుజాతా, నీకేవైనా బుద్ధీ గ్నానం ఉన్నాయా అసలుకి ? టైమెంతైందో చూసేవా, ఇప్పుడా డ్యూటీ కొచ్చేది!” అరుస్తోంది అమ్ములు.           ” ప్లీజ్ ప్లీజ్, అరవకే అమ్ములూ. ఒక్క అరగంటేగా ఆలస్యమైంది. డాక్టరుగారు విన్నాడంటే నా తలవాచిపోద్ది.”           “అంటే… నువ్ రాలేదని డాక్టరు గారి కింకా తెలీదనా? […]

Continue Reading
Posted On :

మరక మంచిదే! (కథ)

మరక మంచిదే! (కథ) – లలితా వర్మ ” యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!” పూజగదిలో నుండి శ్రావ్యంగా, మంద్రంగా, అలలు అలలుగా చెవికి సోకుతున్న అత్తగారి సరస్వతీ ప్రార్థన, అంతులేని మధురానుభూతిని కలిగించింది నిఖిలకి. కొద్దిగా తెరచి వున్న తలుపు సందు గుండా […]

Continue Reading
Posted On :

కుసుమనిరీక్షణం

కుసుమనిరీక్షణం – శింగరాజు శ్రీనివాసరావు ఎన్నిసార్లు వహ్నిత చెప్పి చూసినా నిరీక్ష మనసు మారడం లేదు. ఆ పేదపిల్ల, అనాకారి కుసుమతో సన్నిహితంగా తిరగవద్దు అంటే వినడం లేదు. నాలుగు ఇళ్ళలో పనిచేసే పనిమనిషి రాములమ్మ కూతురు కుసుమ. ఆ పిల్ల తండ్రి తాగుబోతు. రాములమ్మను రోజూ ఏదో ఒక వంక పెట్టి కొడుతుంటాడట. పనిమనిషి కూతురని కుసుమంటే ఒక రకమైన చిన్నచూపు వహ్నితకు. కుసుమది తన కూతురిది ఒకటే తరగతి. ఇద్దరూ కలసి ఈ సంవత్సరం […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-14 రాజీ

పేషంట్ చెప్పే కథలు – 14 రాజీ -ఆలూరి విజయలక్ష్మి “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా […]

Continue Reading

నిర్భయనై విహరిస్తా (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

నిర్భయనై విహరిస్తా..! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – బి.కళాగోపాల్ జలజకు హృదయమంతా కలచి వేయసాగింది. ఊరుతున్న కన్నీళ్లను మాటిమాటికీ తుడుచుకో సాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది. గుండె గూడుపట్లను కుదుపుతున్న దుఃఖాన్ని మోస్తూ ఆమె నిలువెల్ల శోకతప్తగా నిలబడింది. హాస్పిటల్ లో ఉరుకులు.. పరుగులు పెడుతున్న సిబ్బంది. […]

Continue Reading
Posted On :

వడగండ్ల వాన (కథ)

వడగండ్ల వాన -రుబీనా పర్వీన్ ‘డాడీ నువ్వు తొందరగా ఇంటికొచ్చేయ్‌’ అంది ఆద్య. ‘ఏమైంది తల్లీ! ఎందుకంత టెన్షన్‌ పడుతున్నావ్‌?’ ‘నువ్వొచ్చేయ్‌ డాడీ’ ఏడుపు గొంతుతో అంది. ‘అయ్యో… ఏడవుకురా. నువ్వేడుస్తుంటే చూడడం నా వల్ల కాదు’ ‘నేనేడవద్దంటే నువ్వు తొందరగా వచ్చేయ్‌’ ‘లీవ్‌ దొరకడం లేదు తల్లీ… దొరకగానే వచ్చేస్తా’ ‘లీవ్‌ లేదు. గీవ్‌ లేదు. జాబ్‌ వదిలేసి వచ్చేయ్‌’ ‘ముందు ఏడుపు ఆపు. ఏమైందో చెప్పు’ ‘నాకు భయమేస్తోంది. నువ్వు రాకపోతే మమ్మీ మనిద్దరిని […]

Continue Reading
Posted On :

క్షమయా ధరిత్రి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

క్షమయా ధరిత్రి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -కైకాల వెంకట సుమలత   చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాను…రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు.గుండె నిండిన వ్యధ తీరాలంటేపెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి […]

Continue Reading

ఎగిరే పావురమా! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఎగిరే పావురమా (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – మధుపత్ర శైలజ ఉప్పలూరి “మేడం! నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మావాళ్ళ దగ్గరకు పంపె య్యరూ! మా ఊరెళ్ళాక ఏవో చిన్నచిన్న పనులను చేసుకుంటూ బ్రతికేస్తాను. అమ్మో ఇన్నిసమస్యలు, బాధలు చుట్టుముడతాయని తెలిసుంటే అస్సలు చదువుకునేదాన్నే కాదు. “మన […]

Continue Reading

స్త్రీ కి స్త్రీ యే (కథ)

స్త్రీ కి స్త్రీ యే -డా. మూర్తి జొన్నలగెడ్డ          నమస్కార౦ డాక్టరు గారూ! అని రొప్పుకు౦టూ సైకిలుదిగాడు పక్కవీధిలో లేడీడాక్టరు దమయ౦తి గారి అసిస్టె౦టు.          ఏవిఁటి రమేష్! మ౦చి నీళ్ళేవైఁనా ఇమ్మ౦టావేఁమిటి? అన్నాను.          “అబ్బే పర్లేద౦డి. అర్జ౦టు సిజేరియన్ ఉ౦ది మిమ్మల్ని రమ్మ౦టు న్నారు” అని చెప్పి వొచ్చిన౦త వేగ౦గానూ వెళ్ళిపోయాడు.          మా ఇ౦ట్లో […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-13 పరుగు

పేషంట్ చెప్పే కథలు – 13 పరుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ!” “గుడ్ మార్నింగ్! నేనింకా యంగ్ లేడీలా కనిపిస్తున్నానా మీకు?” స్నిగ్ధంగా నవ్వింది డాక్టర్ శృతి. “మీరెంత పెద్ద వాళ్ళయినా నువ్వూ, హరితా నాకు చిన్నపిల్లలానే కనిపిస్తారమ్మా!” పండిపోయిన జుట్టు, అలిసిపోయిన కళ్ళు, ఆర్ద్రంగా వున్నా కంఠం… శ్రీపతిరావును చూస్తుంటే ఆయన రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న తన స్నేహితురాలు హరిత కళ్ళ ముందు నిలిచింది శృతికి. “హరిత ఫోన్ చేసింది. రిజర్వేషన్ […]

Continue Reading

అవమానం (కథ)

అవమానం -సి.వనజ భుజానికి బాగ్ తగిలించుకొని వడివడిగా నడుస్తోంది సింధు. మంటలు మండిస్తున్న ఎండకు వెరచి వంచుకున్న మొహంలోంచి అప్పుడప్పుడూ చిన్న నవ్వు వెలుగుతోంది. ఇంట్లో చిన్నతల్లి అల్లరీ, రవి తలపులూ కలగా పులగంగా సింధు పెదవుల మీద నవ్వు మొలకలవుతున్నాయి. అంతలోనే గుర్తొచ్చినట్టు చేతి గడియారం వంక చూసుకుంది సింధు. రెండవటానికి ఇంకా పది నిమిషాలుంది. నడవవలసిన దూరాన్ని అంచనా వేస్తూ తలెత్తి చూసింది. మలుపు వరకూ మరో ఫర్లాంగు పైన ఉంటుందేమో. ఆ మీద […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-12 కారుమేఘాలు

పేషంట్ చెప్పే కథలు – 12 కారుమేఘాలు -ఆలూరి విజయలక్ష్మి శ్రావణ మేఘాలు హడావిడిగా పేరంటానికి వెళ్తున్నాయి. క్రొత్త చీరలు, మోజేతికి తోరణాలు, పసుపు పూసిన పాదాలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చేతులలో పచ్చి శనగల పొట్లాలు, సన్నటి తుంపర చల్లగా స్పృశిస్తూంటే తనువులు పులకరించి హృదయాలను అనుభూతి అంచుల్ని తాకుతూండగా కబుర్ల మువ్వలు మ్రోగించు కొంటూ అడుగు ముందుకు కదుపుతున్నారు పేరంటాళ్ళు. వసుధ ఎలుగెత్తి ఏడుస్తున్న కొడుకుని సముదాయించడానికి నానా తంటాలు పడుతూంది. ప్రక్కవాటాలోని […]

Continue Reading

నా శరీరం నా సొంతం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

నా శరీరం నా సొంతం! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -తిరుమలశ్రీ రాత్రి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనేవుంది. బంగళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందట. దాని ప్రభావమే అయ్యుంటుంది. ఆ రోజు సెలవుదినం కావడంతో ఆలస్యంగా నిద్రలేచింది నీహారిక. బయటి వాతావరణం చూస్తూంటే చికాకుగా అనిపించింది. కాలకృత్యాలు తీర్చుకుని, ఇన్ స్టెంట్ […]

Continue Reading
Posted On :

ఇది ఏనాటి అనుబంధమో! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఇది ఏనాటి అనుబంధమో! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -జానకీగిరిధర్ బయట నుండి వస్తున్న తల్లిదండ్రులు భూమిక, శ్రీహరిలను చూడగానే, మూడేళ్ళ కార్తీక్ సంతోషంతో కేరింతలు కొడుతూ బుడి బుడి అడుగులు వేసుకుంటూ తల్లిని చేరుకున్నాడు.           కార్తీక్ పరుగుని చూస్తూ ఎదురెళ్ళి ఎత్తుకుని ముద్దాడుతూ […]

Continue Reading
Posted On :

సీతాకోక చిలుక‌లు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

సీతాకోక చిలుక‌లు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -అయ్యగారి శర్మ అగ్గిపుల్ల భ‌గ్గుమంది, ఆ అమ్మాయిల గుండెల్లో మంట‌లాగే! ఆ అగ్గిపుల్ల ఓ కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి నుంచి ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా కొవ్వొత్తులు వెలిగాయి. ఆ కొవ్వొత్తుల జ్వాల‌ల్లో ఓ ఉద్వేగం రెప‌రెప‌లాడింది. ఓ ఆవేద‌న జ్వ‌లించింది. […]

Continue Reading
Posted On :

ఒకజ్యోతి మరోజ్యోతికి (కథ)

 ఒకజ్యోతి మరోజ్యోతికి -ఆదూరి హైమావతి           ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్. పవిత్రమ్మ తెల్లారక ముందే లేచింది. కాలకృత్యాలు ముగించి కాఫీ కప్పు పట్టుకుని బాల్కనీలో కూర్చుంది. ఆమెభర్త పరమేశ్వర్రావు మార్నింగ్ వాక్ కోసం లేచాడు. లేచి ఆయనకూ ఒక కప్పు కాఫీ కలిపి ఇచ్చింది. ఆదివారం కనుక మిగతా వారంతా అప్పుడే లేవరు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.          “ఏం పవిత్రా! నాతో మార్నింగ్ వాక్ కు […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-6

ఓసారి ఆలోచిస్తే-6 పరిష్కారం -డి.వి.రమణి మొబైల్ మోగుతూ ఉంది కాసేపటి తర్వాత మళ్ళీ అలా తీసే వరకు, చేతిలో పని పక్కకి నెట్టి … “హలో  “ అన్నాను “…..”అటునించి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్టు ఉంది.. “ఎవరు” అన్నాను “నేనక్క హేమని” “ఏమైంది హేమా? ఇంటికి రా ముందు” గట్టిగా అన్నాను “అవటానికి ఏమి మిగల్లేదక్క నా తల రాత” వెక్కుతూ అంది “నువ్వు ఏమి కంగారు పడకు ముందు ఏడుపాపేయ్ …నువ్వు బయలుదేరు ఎలా ఉన్నదానివి […]

Continue Reading

ఇది అహంకారం కాదు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఇది అహంకారం కాదు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -పద్మావతి రాంభక్త “ఏమిటీ వ్యాపారంచేసే అమ్మాయా, బాబోయ్ వద్దు” “నూనె అమ్ముతుందా అసహ్యంగా, ఛీ.. అసలేవద్దు” పెళ్ళిసంబంధాలకు వచ్చిన వాళ్ళ దగ్గర ఈడైలాగ్లు వినీ వినీ అమ్మా నాన్నా నేను విసిగిపోయాం. “ఇవన్నీ నీకెందుకు, హాయిగా పెళ్ళిచేసుకుని ఒక ఇంటికి […]

Continue Reading

బరువైన బంధం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

బరువైన బంధం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -ప్రమీల శర్మ “అయ్యో! తాతగారూ… పడిపోతారు… జాగ్రత్త” చెయ్యి అందిస్తూ, మెట్ల మీద కాలు మడతపడి పడిపోబోయిన నారాయణకి ఆసరాగా నుంచుంది శారద.            “పర్వాలేదు తల్లీ! నాకేమీ కాదు. అలవాటైపోయింది. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు… […]

Continue Reading
Suguna Sonti

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర )

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర ) -అక్షర హింది లేఖిక ‘మన్నూ భండారీ’           మన్నూ భండారీ ‘భానుపురా మధ్య ప్రదేశ  1931  లో జన్మించి 2021 ‘గురుగ్రామ్’ లో గతించారు. ఆవిడ ప్రఖ్యాతి భారతీయ రచయిత్రి ఏ  కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, ఉపాధ్యాయిని, ప్లే రైట్ గా కూడా ఖ్యాతి సంపాదించారు. ప్రస్తుతం నేను అనువదించిన ‘ముక్తి’ అన్న కథలో మద్యోత్తర భారత దేశంలో […]

Continue Reading
Posted On :

అమ్మాయి గెలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

అమ్మాయి గెలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -శ్రీనివాస్ లింగం “శ్రీ గణేశ ! వేడచేరితినయ నిన్ను కార్యసిద్ది పొందు ధైర్యమొసగి పరమకరుణతోడ సరియగు వృత్తికై చక్కగన్శ్రమించు శక్తినిమ్ము” అనుచూ ఆ వినాయకునికి మ్రొక్కి చదువు ప్రారంభించింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు కదూ….. ఈమె పేరూ ఈనాటిది […]

Continue Reading

ఓసారి ఆలోచిస్తే-5

ఓసారి ఆలోచిస్తే-5 ధ్యేయం -డి.వి.రమణి “ఎం బిడ్డ ఇస్కూల్ నుండి లేట్ వచ్చినవ్ ?’ ప్రేమగా అడిగాడు వీర్రాజు “మాథ్స్ టీచర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు …” కాళ్ళు కడుక్కుంటూ జవాబిచ్చింది సత్యవతి. “ఇదిగో …అమ్మయొచ్చింది … చూడు ఏమి కావాలో ..” చుట్ట ఒకసారి పీల్చి అన్నాడు. “అదే మరి నాకు పని , మహారాణిగారొచ్చారు ఇంకా సేవలు మొదలు , ఇంట్లో పని అంటుకోదు … కూలికెళ్ళొచ్చి నేనే చెయ్యాలా ? ఆ అక్క […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-11 ప్రతిఫలం

పేషంట్ చెప్పే కథలు – 11 ప్రతిఫలం -ఆలూరి విజయలక్ష్మి సంధ్య అధరాలపై విరిసిన పూవులు నక్షత్రాలై ఆకాశం మీద పరుచు కుంటున్నాయి. తుంపర మెల్ల అల్లనల్లన జారుతున్న సన్నసన్నటి తుంపర మేల్ల మెల్లగా వీస్తున్న గాలితో కలిసి కదం కదుపుతూ సర్వజగత్తునూ పులకరింపజేస్తోంది. శ్రద్ధగా శబ్ధాన్నాలకించిన అశ్విని ఒక్క పరుగుతో వాకిట్లోకి వచ్చింది. “ఇంత ఆలస్యంగానా ఇంటికి రావడం?!” అశ్విని కంఠం మెత్తగా, మధురంగా ఉంది. స్కూటర్ ని ఆపిన రఘువీర్ ఆమెను గమనించనట్లు  నటించాడు. […]

Continue Reading

తల్చుకుంటే (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

తల్చుకుంటే (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -మంజీత కుమార్ “అబ్బా ఈ బస్సు ఎప్పుడూ లేటే?” తిట్టుకుంటూ బస్టాప్‌లో ఎదురుచూస్తోంది స్థిర. హైదరాబాద్‌లోని కొత్తపేటలో తల్లీదండ్రి పరమేశం, సావిత్రమ్మ, ఇద్దరు చెల్లెళ్లు … స్థిత, స్థిద్నతో కలసి ఉంటోంది స్థిర. చదువుకుంటూనే రేడియో జాకీగా ఉద్యోగం చేస్తూ .. తన […]

Continue Reading

గట్టి పునాది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

గట్టి పునాది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -ఉగాది వసంత సుముహుర్త ఘడియలు సమీపించగానే, “గట్టిమేళం !! గట్టిమేళం !!” సిద్ధాంతిగారు గట్టిగా గావుకేక పెట్టేరు, ఓ పక్క మంత్రోచ్చారణ గావిస్తునే. పెళ్లికుమారుడు నిద్రలో ఉన్నట్టుగా, తలవాల్చుకుని ఉండిపోవడం చూసి, “ఏంటి బాబు అమ్మాయితో జీవితాన్నితెగ ఊహించేసుకుంటూ, అసలు నిద్రపోకుండా, […]

Continue Reading
Posted On :

ప్రేమించి చూడు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ప్రేమించి చూడు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -జి.యస్.లక్ష్మి సరోజ ప్లేట్లో కొన్ని క్రీమ్ బిస్కట్లూ, రెండు కప్పులతో కాఫీ ఒక ట్రేలో పెట్టుకుని వెళ్ళి కూతురు సౌమ్య గదితలుపులు తట్టింది. అప్పటికప్పుడే గంట పైనుంచీ సౌమ్య, సౌమ్య ఫ్రెండ్ ఆద్య గదిలో కెళ్ళి తలుపు లేసుకున్నారు. ఆద్యకి మూణ్ణెల్ల […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-4

ఓసారి ఆలోచిస్తే-4 వివేకం -డి.వి.రమణి “నిజమేనా నువ్వు చెప్తున్నది? అలా అమ్మ చెప్పారా??? నేను నమ్మలేక పోతున్నా ” ఆశ్చర్యం నించి తేరుకుని అడిగింది సుధ… అంతకన్నా అమ్మ గురించి చెప్పలేకపోయాను … అంత మంది పిల్లలు పుట్టి చనిపోతే, నన్నెంత గారంగా పెంచిందో నాకు తెలుసు! అందరిలో తప్పు చేసింది అనేలా… చెప్పటం కూడా ఇష్టం లేదు. అమ్మకి, దూరపు బంధువు, ఏ మాత్రం ఇష్టం లేకుండా దూరపు బంధువుకి వయసులో 12 ఏళ్ళు పెద్ద, […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-10 చిరుదీపం

పేషంట్ చెప్పే కథలు – 10 చిరుదీపం -ఆలూరి విజయలక్ష్మి వర్షపుధారల్లో చీకటి, కాటుకలా కరుగుతూంది. మేఘగర్జనలకు ప్రకృతి ఉలికులికి పడుతూంది. అప్పుడప్పుడు విద్యుల్లతలు తళుక్కుమంటున్నాయి. గదిలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ బజర్ మోగింది. ఫోన్ తీసి నర్స్ చెప్పింది విని గబగబ కిందకి దిగింది శృతి. రిక్షాలోంచి ఒకామెని చేతులమీద మోసుకొస్తున్నారు. ఆమెతోపాటు వెల్లుల్లి, పసుపు కలగలిసిన వాసన గుప్పున వచ్చింది. దూరం నుంచి చూస్తే అసలు ప్రాణముందా అని అనుమానమొచ్చేలా వేలాడిపోతోంది. అరికాళ్ళు, చేతులనిండా పసుపు. […]

Continue Reading
Suguna Sonti

లాక్-డౌన్ నేపథ్యంలో (కథ)

లాక్-డౌన్ నేపథ్యంలో -అక్షర కరోనా కాలం-లాక్ డౌన్ నేపథ్యంలో, మన ఊహకి అందని అవాంఛిత సంఘటనలు మన పొరపాటు వల్ల ఐనా చాలానే జరిగాయి. అప్పుడు అవి కరోనా కష్ట కాలంలో తప్పని సరి పరిస్థితుల్లో జరిగినా, ఈ రోజుల్లో అవకాశం ఉన్నా, తెలిసీ మన అజాగర్త వల్ల, మేళుకువుగా లేనందు వల్ల జరగవచ్చు, జరుగుతున్నాయి కూడా. ఈ విషయమే పాఠకుల ముందు ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాయటం జరిగింది. కథ చదివి కనీసం ఒక […]

Continue Reading
Posted On :

మరో సమిథ (కథ)

మరో సమిథ -ఆదూరి హైమావతి  కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి “భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలాతెల్సుకోనూ” అంది భీతి గా. “ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ?నేనొస్తాగా “అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య. ఇద్దరూ నడుస్తూ మెయిన్ ఆఫీస్ లోనికెళ్ళారు. తనను పరిచయం చేసుకుని, తన పాప క్లాస్ ఎక్కడో అడగ్గా, ఆఫీస్ లో ఆ ఉద్యోగి ఒక […]

Continue Reading
Posted On :

పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – గొర్తివాణిశ్రీనివాస్ బయట ఆడుకుంటున్న పిల్లల్ని  గమనిస్తూ కూర్చుంది రమణి. వాళ్లలో ఎంత నిష్కల్మషత్వం! ఆటల్లోపడితే సమస్తాన్నీ మర్చిపోతారు. ఒక ఆట ముగిసేసరికి మరో సరికొత్త ఆటకు సిద్ధమైపోతారు. ఎప్పుడూ కొత్తదనాన్ని వెతుక్కుంటారు. ఏ ఆట ఆడినా అందులో పూర్తిగా లీనమైపోయి […]

Continue Reading

రాధ పెళ్ళి చేసుకుంది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

రాధ పెళ్ళి చేసుకుంది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పి. చంద్రశేఖర అజాద్ అతని పేరు మోహన్. పన్నెండు సంవత్సరాల వయసులో మొదటిసారి రాధను చూసాడు. అటు పట్నం, ఇటు పల్లెకు మధ్యగా వున్న ఆ ఊరికి వాళ్ల నాన్నకి బదిలీ అయింది. ఏడవ తరగతిలో చేర్చటానికి నాన్న […]

Continue Reading

ఆమె పేరు అపర్ణ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఆమె పేరు అపర్ణ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ సాయంత్రం.. నాలుగున్నర!నరసింహం మళ్ళీ ఆ ఇంటి మెట్లు ఎక్కుతూ ఒక క్షణం ఆగాడు! నెలకు రెండుమూడు సార్లు..ఆ ఇంటి మెట్లు ఎక్కి దిగుతూనే ఉన్నాడు ! విసుగు..కోపం.. చిరాకు ఒకదాని వెంట ఒకటి విరుచుకు పడుతున్నాయి.. సహనం.. […]

Continue Reading

గవ్వలు (తమిళ మూలం – హరన్ ప్రసన్న)

గవ్వలు తమిళ మూలం – హరన్ ప్రసన్న తెలుగు అనువాదం – రాజీ రఘునాథన్ మురళీధర రావు తన  మనోభావాల బారానికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతాడో అని అనిపించేటట్లు తూలుతూ నడుస్తున్నాడు. ఆయన సన్నటి శరీరం మీద అంత కంటే సన్నటి జంద్యం గాలిలో తేలుతుంది. పైన కప్పుకుని ఉన్న ఉత్తరీయాన్ని లాగి నల్లగా, ఎండిపోయి ఉన్న చను మొనని  కప్పుకున్నాడు.  బట్ట తలలో మిగిలి ఉన్న ఒకటీ రెండు తెల్ల వెంట్రుకలు పొడవుగా గాలికి వేలాడాయి. […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-3

ఓసారి ఆలోచిస్తే-3 అనురాగ స్పర్శ -డి.వి.రమణి బాల్కనీలో నిలబడి మార్నింగ్ వాక్ కి వోచ్చేవారిని గమనిస్తూ ఉండటం అలవాటు, కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాను. రకరకాలుగా వాళ్ళ మాటలు ఉంటాయి. పనిమనుషులతో ఇబ్బందులు , పిల్లల మీద , భర్త మీద చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు… ఒక్కడినే ఉంటూ ఉంటాను, కాబట్టి నా మీద, అరిచే వాళ్ళు, నా కోసం చూసేవాళ్ళు, తినాలి అనుకునే వాళ్ళు ఉండరు. ఒక కుక్నిపెట్టుకున్నాను, కానీ, […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-9 విరిగిన కెరటం

పేషంట్ చెప్పే కథలు – 9 విరిగిన కెరటం -ఆలూరి విజయలక్ష్మి తెల్లమబ్బులు, నీలిమబ్బులు కబాడీ ఆడుతున్నాయి. ఎంపైరింగ్ చేస్తున్న సంధ్య ఒంటరిగా, దీనంగా కూర్చున్న లేత రోజా రంగు మబ్బు వంక జాలిగా చూసింది. పిల్లల్లంతా అరుస్తూ, కొట్టుకుంటూ, నవ్వుతూ కేరింతలుకొడుతూ ఆడుకుంటున్నారు. ఒకవైపు కోకో, ఒకవైపు గోళీలు, మరో వైపు క్రికెట్, ఇంకోవైపు లాంగ్ జంప్, హైజంప్. ఉత్సాహం వెల్లువై ప్రవహిస్తూంది మైదానమంతా. ఈ ఉరవడిని ఉత్సుకంగా గమనిస్తున్నాయి రెండు కళ్ళు, నర్సింగ్ హోమ్ […]

Continue Reading

ప్రేమపాశం (కథ)

ప్రేమపాశం -డా.బి. హేమావతి మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం.           నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ […]

Continue Reading
Posted On :

పుత్రకామేష్టి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పుత్రకామేష్టి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – డి.కామేశ్వరి పెళ్లయి వెళ్ళాక  కరోనా ధర్మమాని రెండేళ్ల తరువాత  వచ్చిన మనవడిని చూసి సంబరపడిపోయింది అనసూయమ్మ.  పలకరింపులు  కబుర్లు భోజనాలు నిద్రలు అయ్యాక సావకాశంగా  కాఫీ కప్పుతో కూర్చుని “ఏమిటి  బామ్మా కబుర్లు”అంటూ చేయి పట్టుకు పలకరించాడు మనవడు చైతన్య . […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

గొంగళి పురుగులు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

గొంగళి పురుగులు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పద్మజ కుందుర్తి నా హాస్పటల్ పనులు త్వరగా ముగించి టౌన్ హాలుకు హడావిడిగా వచ్చేసాను. అప్పటికే సమయం సాయంత్రం నాలుగు గంటలు అయిపోయింది. ఆ రోజు ‘మహిళా దినోత్సవం’ కూడ కావటంతో గవర్నమెంట్ మహిళా ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్ లో […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! వానా వానా కన్నీరు (శీలా సుభద్రా దేవి కథ)

https://youtu.be/DI-Qs8rs63c శీలా సుభద్రా దేవి -జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.

Continue Reading

ఓసారి ఆలోచిస్తే-2

ఓసారి ఆలోచిస్తే-2 ఆలంబన -డి.వి.రమణి (“ఆలంబన “ అనగానే మనకి ఒక కొమ్మ పెరగటానికి ఆధారం గా నాటే కట్టెపుల్ల గుర్తొస్తుంది , నదిలో కొట్టుకు పోయేవాడికి ఒక చిన్న దుంగ దొరికితే ఒడ్డుకు రాగలుగుతాడు అలాగే కష్టం లో ఉన్న వాళ్లకి ఒక “ఆలోచన” ఒక “ఆలంబన” అవసరం అది ఇవ్వగలగటం కూడా ఒక వరం . డబ్బుతో కొనలేనివి ఇలాంటివి . మార్పు ఈ విధంగా ..రావాలి అనే నమ్మకం తో రాసిన కధ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-8 మేధో హత్య

పేషంట్ చెప్పే కథలు – 8 మేధో హత్య -ఆలూరి విజయలక్ష్మి భయంతో, వేదనతో అస్థిమితంగా చలిస్తున్నాయి కుమార్ కళ్ళు. శరీరమంతా సన్నగా కంపిస్తూంది. గుండె చప్పుడు పైకే వినిపిస్తున్నట్లుగా వుంది. ఉన్నట్టుండి గుప్పిళ్ళు బిగిస్తున్నాడు. అంతలోనే నిస్సత్తువగా, నిర్జీవంగా చూస్తున్నాడు. మళ్ళీ అంతలోనే ఏదో పెను భూతం తనను కబళించడానికి వెన్నంటి వస్తున్నట్లుగా ఒణికి పోతున్నాడు. బట్టలు నలిగి, మాసిపోయాయి. జుట్టంతా రేగిపోయి, నుదుటి మీద పడుతూంది. అతని ప్రక్కన కూర్చున్న విమల ఉబికి వస్తున్న […]

Continue Reading
Suguna Sonti

ఏది నిజం (కథ)

అంతు తెలియని కథ -అక్షర ముందు మాట           “అంతుతెలియని కథ” లోని విచిత్రమైన దుఃఖ దుస్సంఘటన నాకు బాగా కావల్సిన వారి కుటుంబంలో దాదాపు పది ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన సంఘటన. మనకి నమ్మశక్యం కాకపోయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని పాఠకులకి తెలియ చేయటానికి  ఆ సంఘటనని ఆధారంగా  చేసుకుని, కొంత ఊహించి రాసిన కథ. ఇక అసలు కథకు వద్దాము… *** అంతు తెలియని కథ […]

Continue Reading
Posted On :

పాఠం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పాఠం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పి.రాజేంద్రప్రసాద్ పెరట్లో ఓ వారగా పనమ్మాయి రత్తాలు అంట్లు తోముతోంది. ఆ రోజు ఆదివారం….మా పిల్లలకెవరికీ ఆఫీసుల హడావుడి లేదేమో ఉదయం తొమ్మిదయినా ఎవరూ పక్కల మీంచి లేవలేదు. వంటలూ, బాక్సులూ అంటూ రంధి లేదు.  పోనీలే వారానికో రోజు అని […]

Continue Reading

నీ జీవితం నీ చేతిలో (కథ)

నీ జీవితం నీ చేతిలో… – విజయ గొల్లపూడి “ఆశా! నీకు పెద్దవాళ్ళు ఏ ముహుర్తంలో ఈ పేరు పెట్టారో తెలియదు గానీ  నీకు పేరుకు మించి అత్యాశ ఎక్కువగా ఉంది.” “ఊ! చాల్లే గోపాల్, నీ వేళాకోళానికి అదుపు ఆపు ఉండటం లేదు.” “మరి లేకపోతే ఏమిటి, చెప్పు. నీకు ఏ విధమైన హక్కు ఉందని, నీ మేనల్లుడికి దక్కిన అదృష్టానికి సంతోషపడకుండా అతన్ని రోడ్డుకీడుస్తానంటావ్?” “ఏదో నా శ్రేయోభిలాషివి, నా ఆప్తమిత్రుడివి అని నమ్మి […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-1

ఓసారి ఆలోచిస్తే-1 ముందు మాట -డి.వి.రమణి పోరాటం అనేది ఈరోజు కొత్తది కాదు, మొదటిసారి వినటం లేదు … సృష్టి మొదలైనప్పటినించి అనాదిగా వస్తున్న ఈ పోరాటం అన్ని సమయాల్లో ఉన్నది. అన్ని విషయాల్లోనూ …దానికి జత చెయ్యవలసినది “ఆలోచన” ఎప్పుడైనా . ఒకప్పుడు ఎంతో మన్నించిన ఆచారాలు వ్యవహారాలు పలచపడి పోవటమే కాకుండా ,క్రమంగా కనుమరుగు అయిపోతుండటం ఆశ్చర్యమో? లేక సృష్టి నియమమో తెలీదు! “కుందేటి కొమ్ములాగా” అదృశ్యమైపోతున్నాయి. ఇంక, కుటుంబం అనేది మనిషికి మొదటి […]

Continue Reading