image_print

మెరుపులు- కొరతలు-12 యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట”

మెరుపులు-కొరతలు యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట”                                                                 – డా.కే.వి.రమణరావు మనకు ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే మన అంతరంగమంతా కల్లోలమైనప్పుడు ఒక్కోసారి బాధంతా మనకే ఉన్నట్టుగా, బయటి ప్రపంచం నింపాదిగా ఏ సమస్యా లేకుండానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిసృహ కూడా కలుగుతుంది. కానీ బయట కూడా ప్రతివాళ్లూ ఏదోవొక సమస్యను మోస్తూనే ఉంటారు అని చెప్పే కథ ఇది. కథనం పెద్దగానే వున్నా కథ చిన్నది, ఇలా ఉంటుంది. కథ ఉత్తమ పురుషలో చెప్పబడింది, కథ […]

Continue Reading

మెరుపులు- కొరతలు-11 మెర్సీ మార్గరెట్ కథ “వర్షం సాక్షిగా”

మెరుపులు-కొరతలు మెర్సీ మార్గరెట్ కథ “వర్షం సాక్షిగా”                                                                 – డా.కే.వి.రమణరావు ఒక క్రిస్టియన్ యువకుడు మరణించాక అతనికి చేయాల్సిన ఉత్తరక్రియల్లో అదే మతంలో రెండు విశ్వాసాలను అనుసరించే రెండు వర్గాలు విభేదించడం గురించి చెప్పడం ఈ కథ ఉద్దేశం. కథాంశం చాలా స్థూలంగా ఇది. కథ చెప్తున్న మనిషి గ్రేసి. ముందురోజు సాయంకాలం నుంచి మరుసటిరోజు సాయంకాలం వరకు జరిగిన సంఘటనలను కాలనుక్రమంలో వరుసగా గ్రేసి వర్ణించడమే కథ. కథా కాలమంతా సన్నగా వర్షం పడుతూనే ఉంటుంది. […]

Continue Reading

మెరుపులు- కొరతలు-10 డా.మనోహర్ కోటకొండ కథ “దేవకీ పరమానందం”

మెరుపులు-కొరతలు  డా.మనోహర్ కోటకొండ కథ “దేవకీ పరమానందం”                                                                 – డా.కే.వి.రమణరావు           పేదరికంలో ఉండి, చదువు మీద శ్రద్ధ ఉన్న ఒక కుర్రాడు అలాంటి ఇతర పేద, దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తుల సహాయంతో చదువుకుని డాక్టరై స్వంతవూర్లో ప్రాక్టీసు పెట్టి సేవ చెయ్యడం ఈ కథ సారాంశం. కథాంశం పాతదే. ఇంచుమించుగా ఇలాంటి కథతో సినిమాలు కూడా వచ్చాయి. కథాంశం పాతదే అయినా చెప్పిన పద్ధతి, చూపించిన కొన్ని తాత్విక […]

Continue Reading

మెరుపులు- కొరతలు-9 రాజా అంబటి కథ “గ్రీవెన్స్”

మెరుపులు- కొరతలు రాజా అంబటి కథ “గ్రీవెన్స్”                                                                 – డా.కే.వి.రమణరావు ఇదొక చిన్న కథ. విశాఖపట్నం జిల్లాలోని మారుమూల ప్రదేశాన్ని నేపధ్యంగా తీసుకుని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతున్న వర్ణవివక్షను చూపించిన కథ. జిల్లా ఆఫీసులోని సహృదయుడైన ఒక చిన్న ఉద్యోగి పరంగా ఈ కథ చెప్పబడింది. స్థూలంగా కథేమిటంటే, విశాఖపట్నం కలెక్టరాఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న విజయ్ అనే ఉద్యోగి కొండల్లోవున్న సురవరం అనే పల్లెనుంచి దొన్ను అనే వ్యక్తి రాసిన ఫిర్యాదును ఒకరోజు చూస్తాడు. ఆ […]

Continue Reading

మెరుపులు- కొరతలు-8 ఉమా నూతక్కి కథ “25వ గంట”

మెరుపులు- కొరతలు ఉమా నూతక్కి కథ “25వ గంట”                                                                 – డా.కే.వి.రమణరావు ఉద్యోగం చేస్తున్న ఒక గృహిణి మీద పడుతున్న అనేక బాధ్యతల వలన ఆమెకు తన స్వంత అభిరుచులకు అనుగుణమైన పనులు చేసుకోవడానికి సమయం దొరక్క పోవడం గురించి ఈ కథ ప్రస్తావిస్తుంది. అలాంటి స్త్రీకి రోజులో కనీసం తనకంటూ ఒక అదనపు గంట, 25వ గంట, ఉంటే బావుంటుందని ఈ కథ నిసృహగా సూచిస్తుంది. ఈ కథ సంప్రదాయ శిల్పంలో కాకుండా ఈ మధ్యకాలంలో […]

Continue Reading

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది ప్రాముఖ్యతలేని ఒక ఙ్ఞాపకం. ముఖ్యపాత్ర పొందిన ఒక తడిలేని అనుభూతిని నేరుగా పాఠకులకు అందేంచే ప్రయత్నం. ఇలా అమూర్తంగా, అనాసక్తిగా రాసినట్టు కనబడుతున్న కథలను ఆధునిక కథాసాహిత్యంలో వస్తున్న ఒక ధోరణిగా చూడాలి. అప్పుడే […]

Continue Reading

మెరుపులు-కొరతలు- 6 “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ

మెరుపులు- కొరతలు “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ                                                                 – డా.కే.వి.రమణరావు అన్నివిధాలా బావుండి భార్యపట్ల ప్రేమగా కూడా ఉండి ఒక చిన్న బలహీనతను అదుపులో పెట్టుకోలేని భర్తతో భార్య పడే ఇబ్బంది గురించిన కథ ఇది. పెళ్లైన మగవాళ్లలో చాలా సాధారణంగా కనిపించే ఈ బలహీనతను భార్యలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియని ఒక స్థితిగురించి చాలా క్లుప్తంగా చర్చిస్తుంది ఈ కథ. చిన్నదిగా రాసిన ఈ కథ సారాంశమిది. కథ ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ […]

Continue Reading

మెరుపులు- కొరతలు-5 అప్పు “డా. శైలకుమార్” కథ

మెరుపులు- కొరతలు అప్పు “డా. శైలకుమార్” కథ                                                                 – డా.కే.వి.రమణరావు మానవసంబంధాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపైన రాసిన కథ ఇది. ఈ అంశంమీద చాలాకాలంగా కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు వస్తున్నా ఈ కథ చెప్పిన విధానం సరళంగా, సూటిగా ఉండి తన ప్రత్యేకతను నిలుపుకోవడమేకాక ఇవ్వదలుచుకున్న సందేశాన్ని ప్రతిభావంతంగా ఇస్తుంది.      కథంతా ఒక చిన్న సెట్టింగులో తిరుగుతుంది. క్లుప్తంగా కథ ఇది.       ఈ కథను ‘అన్న’ అని పిలవబడే ముఖ్యపాత్ర చెప్తుంది. ఒక […]

Continue Reading

మెరుపులు- కొరతలు-4 అట్లా అని పెద్ద బాధా ఉండదు

మెరుపులు- కొరతలు అట్లా అని పెద్ద బాధా ఉండదు – దాట్ల దేవదానం రాజు కథ                                                                  – డా.కే.వి.రమణరావు తనచుట్టూ ఉన్న సమాజంలోని చెడుని చూసి భరించలేక దాన్ని సరిచేయడంకోసం వ్యక్తిగతంగా నిత్యం పోరాటం చేసి ఎదురుదెబ్బలు తిన్న ఒక సామాన్య యువకుడి కథ ఇది. అతని జీవితంలో కొంతకాలంపాటు జరిగిన కొన్ని వరస సంఘటనలు కథనంలో రచయిత దృక్కోణంలో చూపబడ్డాయి. స్థూలంగా ఇదీ కథ. ముగింపులో ప్రారంభిం చబడిన ఈ కథంతా దాదాపు ఫ్లాష్ బ్యాక్ లో […]

Continue Reading

మెరుపులు- కొరతలు-3 అసురవేదం

మెరుపులు- కొరతలు అసురవేదం -‘బహుశా’ వేణుగోపాల్ కథ                                                                  – డా.కే.వి.రమణరావు అడవిజంతువుల పట్ల మనుషుల స్వార్థపూరిత హింసాప్రవృత్తిని ఒక ‘అసురత్వం’గా ఈకథలో వర్ణించారు రచయిత బహుశా’ వేణుగోపాల్. ఈ సమకాలీన లక్షణాన్ని ఒక సంఘటనద్వారా వివరిస్తూ దానిని రామాయణంలోని ఒక ప్రధాన సంఘటనతో ప్రతీకాత్మకంగా పోలుస్తూ చెప్పిన కథ ఇది.  స్థూలంగా ఇదీ కథ. అడవినానుకుని ఉన్న ఒక ఇరవై గుడిసెల గూడెంలో మగాళ్లంతా పొగాకుబేరన్లకి మొద్దులు నరకడానికి తెల్లవార్ఝామున అడవికి బయల్దేర్తుండగా ఊరిబావిలో పడిన జంతువు […]

Continue Reading

మెరుపులు- కొరతలు-2 రుబీనా పర్వీన్ కథ ‘బుర్ఖా’

మెరుపులు- కొరతలు డా.కే.వి.రమణరావు కథ “బుర్ఖా”                                                                 – డా.కే.వి.రమణరావు తెలంగాణాలోని ఒక మారుమూల ప్రాంతం ఈ కథకు నేపథ్యం. ఇది ఉర్దు కలసిన తెలంగాణా మాండలీకం మాట్లాడే ముస్లిం పాత్రలమధ్య నడుస్తుంది. రచయిత్రి సర్వసాక్షి దృష్టికోణంలో చెప్పినా కథంతా ప్రధాన పాత్ర మెహర్ చుట్టూ తిరుగుతుంది. స్థూలంగా కథాంశం ఇది. మెహర్ బీద ముస్లిం కుటుంబంలోని పదో తరగతితోనే చదువాపేసిన అందమైన యువతి. ఆమె భర్త లతీఫ్ మంచి హస్తవాసిగలిగిన ఆరెంపి డాక్టరు. ఇద్దరు పిల్లలు. ఉండడానికైతే […]

Continue Reading

మెరుపులు- కొరతలు-1 డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”

మెరుపులు- కొరతలు డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”                                                                 – డా.కే.వి.రమణరావు ప్రచురణ: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (4 జూలై 2021) ఇది అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయులు నేపథ్యంగా రాసిన కథ. ప్రకృతి సంక్షోభం వచ్చినప్పుడు ఇళ్లను ఖాళీ చేయించే సమయంలో కలిగే ఆందోళనలమధ్య భార్యాభర్తలలో ఏర్పడుతున్న తాత్కాలిక అంతరాలు వెలికివచ్చే అంశంచుట్టూ అల్లిన కథ. స్థూలంగా కథాంశం ఇది. శశాంక్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర బే ఏరియాలో పనిచేస్తున్న ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అతని […]

Continue Reading